'పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్‌ ఇస్తాం'

Aluri Sambashiva Reddy Comments About Controling Fees In Colleges And Private Schools - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని ప్రాథమిక విద్యా కమిషన్‌ కార్యదర్శి ఆలూరి సాంబ శివారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అన్ని జూనియర్‌ కాలేజీలు, ప్రైవేట్‌ పాఠశాలల్లో తనికీలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్‌ నిర్ణయిస్తామని, మెరుగయిన సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తామని తెలిపారు. ఫీజుల నియంత్రణ కోసం శాస్త్రీయ విధానం రూపొందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై కమిషన్‌లో ప్రత్యేక గ్రీవెన్సు సెల్‌ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top