పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం తాగుబోతులు వీరంగం సృష్టించారు.
ముగ్గురి అరెస్టు
తిరుపతి (అలిపిరి): పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం తాగుబోతులు వీరంగం సృష్టించారు. శ్రీవారి ఆలయం ముందున్న వరాహస్వామి ఆలయం వద్ద ఆరుగురు యువకులు మద్యం సేవించి, మాంసం (చేప) భుజించి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు వెళ్లేలోపు పరుగులు తీశారు.
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరగడం తిరుమలలో సంచలనం సృష్టించింది. మద్యం సేవించిన ఆరుగురిలో ముగ్గురిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.