ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న ధర్నా | AIDWA dharna at vishaka collectorate | Sakshi
Sakshi News home page

ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న ధర్నా

Sep 7 2015 11:53 AM | Updated on Sep 19 2019 2:50 PM

ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న ధర్నా - Sakshi

ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న ధర్నా

రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.

విశాఖ: రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఉల్లి ఎగుమతులను వెంటనే నిలిపివేయాలని, నిత్యవసర సరుకుల ధరలను పేదప్రజలకు అందుబాటులోకి తేవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని లేకపోతే రేషన్ షాపుల ద్వారా సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన త్రాసు పలువురిని ఆకర్షించింది. సంచి నిండా డబ్బులు తీసుకెళ్తే.. జేబు నిండా ఉల్లిపాయలు కూడా రావడం లేదనే ఉద్దేశంతో ఈ త్రాసును ఏర్పాటు చేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement