దారుణం : మహిళపై యాసిడ్‌ దాడి | Acid Attack On Women In Gajuwaka | Sakshi
Sakshi News home page

దారుణం : మహిళపై యాసిడ్‌ దాడి

Dec 4 2019 10:29 PM | Updated on Dec 5 2019 5:30 PM

Acid Attack On Women In Gajuwaka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. గాజువాకలోని సమతానగర్‌లో తన చెల్లితో మాట్లాడుతున్న ఒక మహిళప్తె గుర్తుతెలియని మరో మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది. కాగా వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన శిరీష తన చెల్లిని చూడడానికి విశాఖలోని గాజువాకకు వచ్చినట్టు సమాచారం. శిరీషకు పెళ్ళికి ముందు వేరే వ్యక్తితో పరిచయం ఉండేది. తరచూ ఆ వ్యక్తితో కలిసి తిరుగుతున్నవిషయం ఆమె భర్తకు తెలిసింది. ఈ నేపథ్యంలో భర్త అక్కకు సర్ధి చెప్పమని శిరీషను గాజువాకలోని చెల్లి ఇంటికి పంపించాడు. సమతానగర్ లో మేడ మీద శిరీష, ఆమె చెల్లి,వివాహేతర సంబంధం వున్న వ్యక్తి కలిసి మాట్లాడుకుంటుండగా ఆకస్మాత్తుగా మరో మహిళ ఒక్కసారిగా శిరీషపై యాసిడ్‌తో దాడి చేసినట్లు తెలిసింది.

30 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన శిరీషకు చికిత్స నిర్వహించిన డాక్టర్లు  ప్రాణాపాయం లేదని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. దాడి చేసిన మహిళ ఎవరనేది ఆరా తీస్తున్నారు. దీంతో పాటు వివాహేతర సంబంధం వున్న వ్యక్తి ఎవరనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement