కృష్ణా జిల్లాలోని విజయవాడలో చోరీ కేసులో నిందితుడైన రమేష్ అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో చోరీ కేసులో నిందితుడైన రమేష్ అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకునేందుకు పెనమలూరు పోలీసులు యత్నించగా రమేష్ ఈ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
అయితే పోలీస్ స్టేషన్లోనే రమేష్ మృతిచెందడంటూ అతని తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అతడి మృతికి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు వారు ఆందోళనకు దిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.