వరంగల్ మున్సిపాలిటికి అమీర్ ఖాన్ ప్రశంస! | Aamir Khan's appreciation for Warangal Municipality | Sakshi
Sakshi News home page

వరంగల్ మున్సిపాలిటికి అమీర్ ఖాన్ ప్రశంస!

Mar 17 2014 4:12 PM | Updated on Sep 2 2017 4:49 AM

వరంగల్ మున్సిపాలిటికి అమీర్ ఖాన్ ప్రశంస!

వరంగల్ మున్సిపాలిటికి అమీర్ ఖాన్ ప్రశంస!

తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా మున్సిపాలిటి సాధించిన విజయాన్ని దేశప్రజల దృష్టికి అమీర్ ఖాన్ తీసుకువచ్చారు.

దేశం ఎదుర్కొంటున్న శిశు మరణాలు, అత్యాచార ఘటనల సమస్యలను ఎత్తి చూపుతూ.. ప్రజలకు సత్యమేవ జయతే టెలివిజన్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే.  మార్చి 16 తేదిన ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో చెత్త చెదారాన్ని శుభ్రం చేయడంపై.. మున్సిపల్ కార్పోరేషన్ నిర్లక్ష్య విధానాలను, నిధుల దుర్వినియోగం తదితర అంశాలను ఆమీర్ ఖాన్ ప్రస్తావించారు. చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డుల్లో కాల్చడం వల్ల వచ్చే చర్మ సమస్యలపై, అనారోగ్య సమస్యలపై సంబంధిత పలువురు నిపుణులతో మాట్లాడించారు. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా మున్సిపాలిటి సాధించిన విజయాన్ని దేశప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఏడు రోజుల్లో వరంగల్ నగరాన్ని శుభ్రపరిచడమే కాకుండా చెత్త చెదారాన్ని రీసైక్లింగ్ చేస్తూ .. మున్సిపాలిటీకి రెవెన్యూ తెచ్చిపెట్టేలా కృషి చేసిన డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బి జనార్ధన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ ల సేవలను ప్రశంసించారు. 
 
పరిశుభ్రమైన నగరంగా చేయడానికి తాము తీసుకున్న చర్యలను, ప్రణాళికలను బి జనార్ధన్ రెడ్డి, వివేక్ యాదవ్ లు ఈ కార్యక్రమంలో వెల్లడించారు. వరంగల్ పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చిన ఇద్దరు అధికారులను అమీర్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement