పురుగుల మందు తాగి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది.
నంద్యాల(కర్నూలు): పురుగుల మందు తాగి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం జరిగింది. వివరాలు.. నంద్యాల పట్టణానికి చెందిన వసుంధర(30) అనే మహిళ శనివారం పురుగుల మందు తాగింది. ఈ క్రమంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. కాగా, మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.