వజ్రాలు వెతికేందుకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
మద్దికేర: వజ్రాలు వెతికేందుకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండంలోని పెరవల్లి గ్రామంలో వజ్రాలు వెతికేందుకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కొనికళ్లు గ్రామానికి చెందిన వ్యక్తి వచ్చాడు. అయితే రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.