బస్సును ఢీకొన్న ఆటో: ఆరుగురికి గాయాలు | 6 injured in bus-auto collisioned incident | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న ఆటో: ఆరుగురికి గాయాలు

Oct 2 2015 10:27 PM | Updated on Sep 3 2017 10:21 AM

బస్సును ప్రమాదవశాత్తు ఆటో ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు.

చోడవరం(విశాఖపట్టణం): బస్సును ప్రమాదవశాత్తు ఆటో ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు. వివరాలు.. విశాఖ జిల్లా అనకాపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింతలి నుంచి చోడవరం వైపు వెళుతోంది. రాత్రి 9 గంటల సమయంలో చోడవరం సమీపంలో ఎదురుగా మాడుగుల వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, మోటారు సైకిల్‌ను తప్పించబోయి ప్రమాదవశాత్తు బస్సు వెనుక భాగాన్ని ఢీకొంది.

దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో అందులో ఉన్న మాడుగుల మండలానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement