ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ గత వారాంతంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 296 మంది వాహనచోదకుల్లో 54 మందికి జైలు శిక్షపడిందని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ గురువారం వెల్లడించారు.
హైదరాబాద్ : ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహ నాలు నడుపుతూ గత వారాంతంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 296 మంది వాహనచోదకుల్లో 54 మందికి జైలు శిక్షపడిందని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ గురువారం వెల్లడించారు.
ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బి.చెంగల్రాయనాయుడు ఎనిమిది మందికి ఐదు రోజులు, మరో 39 మందికి మూడు రోజులు శిక్ష విధించగా... నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివశంకర్ ప్రసాద్ ఒకరికి ఐదు రోజులు, మరో ఆరుగురికి ఒక రోజు చొప్పున జైలు శిక్ష విధించారు. వీరితో పాటు మిగిలిన వారికి రూ.2,600 వరకు జరిమానా విధించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మద్యం తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారి సంఖ్య 12,976కు, జైలు శిక్షపడిన వారి సంఖ్య 1,181కు చేరిందని అమిత్‌గార్గ్ వివరించారు.