గుట్టు చప్పుడు కాకుండా ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 50 కిలోల శ్రీగంధం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నూనెపల్లి (కర్నూలు జిల్లా) : గుట్టు చప్పుడు కాకుండా ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 50 కిలోల శ్రీగంధం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నూనెపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న మేఘనా ట్రావెల్స్‌కు చెందిన వాల్వో బస్సులో 50 కిలోల శ్రీగంధం దుంగలను గుర్తించిన పోలీసులు ప్రయాణికులను విచారించిన అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.