అదృశ్యమైన బాలిక శవమై.. | 5 years old girl found dead in pond | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన బాలిక శవమై..

Mar 13 2016 3:42 PM | Updated on Sep 17 2018 8:02 PM

పెద్ద కడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో శనివారం రాత్రి నుంచి కనిపించకుండాపోయిన ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని ఆదివారం పంట కాల్వలో గుర్తించారు.

పెద్దకడబూరు (కర్నూలు జిల్లా) : పెద్ద కడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో శనివారం రాత్రి నుంచి కనిపించకుండాపోయిన ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని ఆదివారం పంట కాల్వలో గుర్తించారు. గ్రామంలోని చిన్నలింగన్న దంపతుల కుమార్తె రేణుకమ్మ (5) శనివారం రాత్రి బహిర్భూమికని ఇంటి బయటకు వెళ్లింది. చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రి చాలాసేపు గాలించారు. అయినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఆదివారం గ్రామం మధ్యలో ఉన్న పంట కాల్వలో ఆమె మృతదేహం వెలుగు చూసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement