శ్రీవారి దర్శన టికెట్ల దందా కేసులో నలుగురి అరెస్టు | 4 arrested in Srivari Visiting Ticket Passes case | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శన టికెట్ల దందా కేసులో నలుగురి అరెస్టు

Jan 17 2014 4:28 AM | Updated on Sep 2 2018 3:42 PM

తిరుమలలో శ్రీవారి దర్శనాల దందా కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనాల దందా కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో తిరుపతికి చెందిన ఆరంబాకం కర్ణ(44), శంకు దామోదరం (35), ఒంగోలుకు చెందిన మాధవరావు (28), తిరుపతికి చెందిన పేట హరిబాబు(33) ఉన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారని ఎస్‌ఐ మల్లికార్జున్ తెలిపారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, దర్శన దళారులుగా అవతారం ఎత్తిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు మరికొందరిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement