ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో ఉల్లి గోదాంపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు.
ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా) : ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో ఉల్లి గోదాంపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా 750 బస్తాల్లో నిల్వ ఉంచిన 350 క్వింటాళ్ల ఉల్లిపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని అమృత్‌నగర్ గ్రామంలో జరిగింది.
టౌన్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఖాజా హుస్సేన్ ఉల్లి ధరలను సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశ్యంతో.. అక్రమంగా దాచి ఉంచి అధిక ధరలకు అమ్ముతున్నాడనే సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు సోమవారం దాడులు నిర్వహించి 350 క్వింటాళ్ల ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు.