రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | 3 injured in a road accident in east godavari district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Aug 9 2015 2:47 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, సెప్టిక్‌ క్లీనింగ్‌ ట్యాంకర్ ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి.

తూర్పుగోదావరి(కడియం): ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, సెప్టిక్‌ క్లీనింగ్‌ ట్యాంకర్ ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ సంఘటన కడియం మండలం వేమగిరి గట్టుపై ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా రాజమండ్రికి చెందినవారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement