విశాఖ మార్గంలో 26 రైళ్ల రద్దు | 26 train services cancelled in vizag route | Sakshi
Sakshi News home page

విశాఖ మార్గంలో 26 రైళ్ల రద్దు

Oct 15 2014 2:45 PM | Updated on Sep 2 2017 2:54 PM

హుదూద్ తుఫానుకు అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నం మార్గంలో బుధవారం వెళ్లాల్సిన 26 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది.

హుదూద్ తుఫానుకు అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నం మార్గంలో బుధవారం వెళ్లాల్సిన 26 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్, విశాఖ నుంచి కాజీపేట వెళ్లే లింక్ ఎక్స్ప్రెస్, విశాఖ నుంచి రేణిగుంట వెళ్లే స్పెషల్ రైలు రద్దయ్యాయి. అలాగే, రేణిగుంట నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ రైలు, విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే స్పెషల్ రైలు కూడా రద్దయ్యాయి.

అలాగే, గురువారం నాడు వెళ్లాల్సిన సికింద్రాబాద్ - విశాఖ స్పెషల్ రైలు, ఈరోజు, రేపు తిరగాల్సిన భువనేశ్వర్ - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్, విశాఖ- సికింద్రాబాద్ గరీబ్రథ్, భువనేశ్వర్ - ముంబై కోణార్క్ ఎక్స్ప్రెస్, రేపటి చెన్నై -షాలిమార్ ఎక్స్ప్రెస్, షాలిమార్ - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రద్దయిన జాబితాలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement