శ్రీకాకుళం జిల్లాలో కుటుంబకలహాలతో ఒకే కుటుంబంలోని ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు.
నందిగామ: శ్రీకాకుళం జిల్లాలో కుటుంబకలహాలతో ఒకే కుటుంబంలోని ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. వివరాలు..జిల్లాలోని నందిగామ మండలంలోని హరిదాసుపురానికి చెందిన కవిటి ఆనందరావు(55),వెంకమ్మ(70) అనే ఇద్దరు మంగళవారం ఉదయం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై వారిని టెక్కిలి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.