లారీ, ఆటో ఢీ: ఇద్దరు వ్యక్తులు మృతి | 2 killed, 8 injured in lorry accident at kurnool district | Sakshi
Sakshi News home page

లారీ, ఆటో ఢీ: ఇద్దరు వ్యక్తులు మృతి

Aug 30 2013 9:04 AM | Updated on Sep 1 2017 10:17 PM

గోనెగన్ల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున లారీ, ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

గోనెగన్ల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున లారీ, ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ ప్రమాదంలో మరణించిన రెండు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే నల్లొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు బైపాస్ వద్ద బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఆ రెండు మృతదేహలను నల్లొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Advertisement
 
Advertisement
Advertisement