రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | 2 died in road accidnet at vizayanagaram district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Jun 10 2017 12:10 PM | Updated on Sep 5 2017 1:17 PM

ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

విజయనగరం: ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కె.ఎల్‌.పురం బ్రిడ్జి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న లెంక మధు, వర్మ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఎల్‌.కె.వి. రంగారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement