ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది.
ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు...సోమవారం వేకువ జామున మార్కాపురం తిట్టాయిగూడెం గ్రామంలో వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయలపాలయ్యారు. క్షతగాత్రుల గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
(మార్కాపురం)