గల్లంతైన పిల్లల మృతదేహాలు లభ్యం | 2 dead bodys identified in godavari | Sakshi
Sakshi News home page

గల్లంతైన పిల్లల మృతదేహాలు లభ్యం

May 4 2015 10:10 AM | Updated on Sep 3 2017 1:25 AM

తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం బడుగువానిలంక వద్ద గోదావరిలోకి దిగి పిల్లలు గల్లంతైన ఘటనలో ఇద్దరి మృతదేహాలను వెలకితీశారు.



రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం బడుగువానిలంక వద్ద గోదావరిలోకి దిగి పిల్లలు గల్లంతైన ఘటనలో ఇద్దరి మృతదేహాలను వెలకితీశారు. గ్రామానికి చెందిన అనుదీప్ (7), వెంకట పవన్ (13) అనే ఇద్దరు బాలుర మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమయ్యాయి. గల్లంతైన మరో బాలిక సింధుశ్రీ(9) మృతదేహం కోసం గాలిస్తున్నారు.


కాగా వేసవి సెలవులకు లంకలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఆదివారం సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు.  మే 6 వ తేదీన పవన్‌ పుట్టిన రోజు కావడంతో అమ్మమ్మను, ఇతర బంధువులను ఆహ్వానించేందుకు వెళ్ళిన పవన్ గల్లంతుకావడంపై కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేసిన పవన్ తండ్రి సుదర్శనరావు రైసుమిల్లు కూలీగా పనిచేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement