వడదెబ్బతో 15మంది మృతి | 15 people died with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో 15మంది మృతి

May 31 2015 3:50 AM | Updated on Sep 3 2017 2:57 AM

జిల్లాలో ఎండ వేడిమి తట్టుకోలేక శనివారం పదకొండు మంది మృతిచెందారు. శుక్రవారం రాత్రి నలుగురు మరణించారు.

సాక్షి నెట్‌వర్క్: జిల్లాలో ఎండ వేడిమి తట్టుకోలేక శనివారం పదకొండు మంది మృతిచెందారు. శుక్రవారం రాత్రి  నలుగురు మరణించారు. పుత్తూరు మండలంలో చెరువురాజుపాళెం పంచాయతీ దిగవగుళ్లూరుకు చెందిన కే గురవమ్మ (55), తిరుమలకుప్పం దళితవాడకు చెందిన పద్మావతి (75), తడుకు పంచాయతీ విద్యుత్ సదాశివపురం గ్రామానికి చంద్రయ్య (45)వడదెబ్బతో శనివారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని పల్లమాల గ్రామానికి చెందిన పల్లమాల పోలమ్మ (45), వేణుగోపాలపురం పంచాయితీ పరిధిలోని కుమ్మర వెంకటాపురం గ్రామానికి చెందిన ధరాచెంగమ్మ (55), నారాయణవనం మండలంలోని అరణ్యంకండ్రిగ పంచాయతీ చిత్తూరు కండ్రిగ ఆదిఆంధ్రవాడకు చెందిన చంద్రయ్య(47), పిచ్చాటూరు వుండలంలోని కారూరు హరిజనవాడకు చెందిన ఇందిర(28), నగరి మండలం దామరపాకం గ్రామానికి చెందిన జాంబవతి (62), శ్రీకాళహస్తి పట్టణంలోని 14వవార్డుకు చెందిన శ్రీనివాసులు(65), శ్రీకాళహస్తి మండలంలోని మాధవిగిరి పల్లెకు  చెందిన నర్సవ్ము(76), చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ఏ.నారాయణ(66) శనివారం వడదెబ్బ సోకడంతో మృతిచెందారు తరలించేలోపు మృతి చెందారు.

 మదనపల్లె పట్టణంలోని గాంధీపురానికి చెందిన గాయత్రి(20, శ్రీరంగరాజపురం మండలంలోని కటికపల్లె పంచాయతీ పరిధిలోని కనికాపురం గ్రామానికి చెందిన కే.వసంతమ్మ(55), వరదయ్యపాళెం హైస్కూల్ గిరిజన కాలనీకి చెందిన టి.రావుయ్యు (57), బెరైడ్డిపల్లె మండలంలోని వెంగంవారిపల్లె గ్రామానికి చెందిన సత్తార్‌సాబ్(70) వడదెబ్బతో శుక్రవారం రాత్రి మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement