13 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం | 13 Gas Cylinders seized during vigilance raids | Sakshi
Sakshi News home page

13 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

Jul 14 2015 4:56 PM | Updated on Sep 3 2017 5:29 AM

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు.

బుచ్చిరెడ్డిపాలెం : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. అక్రమనిల్వలపై అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేశారు.

కాగా గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 13 వంటగ్యాస్ సిలిండర్లు, 60 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానురాలిపై నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement