
సాక్షి, విజయనగరం: పశువుల పాకలోకి కొండచిలువ అనూహ్యంగా వచ్చింది. ఈ ఘటన జిల్లాలోని గంట్యాడ మండలం నీలావతి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుల్లిపల్లి శ్రీనివాస్ అనే రైతుకు పశువుల పాకలోకి దాదాపు 10 అడుగులు గల కొండచిలువ రావడాన్ని శనివారం ఉదయం గుర్తించారు. పశువులకు ప్రమాదమని భావించిన శ్రీనివాస్ ఇతర రైతుల సాయంతో దాన్ని బయటకు తీసి హతమార్చారు.