టాటా ఏస్, లారీ ఢీ: ఒకరి మృతి | 1 killed in lorry accident at ysr distirct | Sakshi
Sakshi News home page

టాటా ఏస్, లారీ ఢీ: ఒకరి మృతి

Apr 15 2016 11:54 AM | Updated on Sep 3 2017 10:00 PM

వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం పాలంపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం, మినీలారీ ఢీకొన్నాయి.

చెన్నూరు: వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం పాలంపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం, మినీలారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వీరపునాయునిపల్లె మండలానికి చెందిన వీరంతా ఒంటిమిట్టలోని రామాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement