breaking news
-
మహానాడు కాదు.. అది ‘వెన్నుపోటు’ నాడు: లక్ష్మీపార్వతి
వికారాబాద్: కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రస్తుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్‌ను తిట్టడానికే సరిపోయింది’’ అంటూ లక్ష్మీపార్వతీ దుయ్యబట్టారు.‘‘టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. నాడు-నేడు పేరుతో వైఎస్ జగన్ స్కూళ్లను అభివృద్ధి చేస్తే.. మేమే చేశామని చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటున్నారు. పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్‌కి వారసుడు అవుతారు’’ అంటూ లక్షీపార్వతి ప్రశ్నించారు.‘‘వైఎస్ జగన్ అన్ని రంగాల్లో పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువెళ్లారు. కరోనాలో ప్రజలను ఆదుకున్న తీరు.. జగన్‌ను ప్రపంచమే మెచ్చుకుంది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన పీడ. మహానాడు కాదు అది.. వెన్నుపోటు నాడు. మహానాడు అట్టర్ ఫ్లాప్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెద్ద పరిశ్రమలు అడ్రస్ లేకుండా చేశారు. జిందాల్ కంపెనీ రాకుండా చేశారు. అవకాశం కోసం చంద్రబాబు, లోకేష్ పని చేస్తారు. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్‌ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు...అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్‌గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్‌ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
పులివెందుల: కొనసాగుతున్న ‘కూటమి’ వేధింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ వేధింపులు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 13 మందిని పోలీసులు ఇంకా కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్సీపీ నేతల్ని స్టేషన్లు మార్చి తిప్పుతున్నారు. పులివెందుల నుంచి వేముల, వేముల నుంచి కడపకు తరలించారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి పచ్చ తోరణాలు కట్టి టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. తిరిగి ఎదురు కేసు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.నిన్న(బుధవారం) సాయంత్రం అరెస్ట్ చేసి ఇంతవరకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టలేదు. వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి అకస్మాత్తుగా కడప తరలించారు. కోర్టుకు పెట్టకుండా మళ్లీ కడపకు తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఏ తప్పూ చేయని వారిపై చేయిచేసుకున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 13 మంది వైఎస్సార్సీపీ నాయకులను రెండు గ్రూపులుగా చేసిన పోలీసులు.. 8 మందిని కడపకు తరలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌తో పాటు మరో నలుగురిని వేముల స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. -
మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై ఖాకీల ఓవరాక్షన్
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ ఎంపీపై అమానవీయ చర్యకు పోలీసులు దిగారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఆయనను పోలీసులు హింసిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో మాజీ ఎంపీని విచారించాలన్ని హైకోర్టు చెప్పింది. అయితే, ఆ మేరకు విచారణ కొనసాగడం లేదు.జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ ఆయనను పోలీసులు లాకప్‌లోనే ఉంచుతున్నారు. ఇది హైకోర్టు ధిక్కరణే అని న్యాయవాదులు అంటున్నారు. నందిగం సురేష్‌కు ఖాకీలు సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. తుళ్లూరు పోలీసుల తీరుపై మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్యారోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు(Chandrababu) చేప్పేవన్నీ అబద్ధాలే. చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు. ఎంతో దూరదృష్టితో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఐదు కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు. వైద్య విద్య చదివేవారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి జగన్ అడుగులేశారు.. .. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రయివేటీకరణ(AP Medical Colleges Privatization) చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో ఫీజుబులిటీ రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి రూ.5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. రూ.500 కోట్ల విలువైన ఆస్తిని రూ.5 వేలకు ఇవ్వటం ఏంటి?. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదల్చుకున్నారు?. చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డెక్కారు. పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదు. కరోనా సమయంలో జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరు గారి పోయాయి. ఇప్పుడు పీపీపీ పద్దతి అంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు?. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మళ్ళీ డోలీల బాధ తప్పటం లేదు. మేము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం అని రజిని అన్నారు. ఇదీ చదవండి: కడిగిన ముత్యంలా మా నాన్న బయటకు వస్తారు -
బాబూ.. ఎంత అదిరిందో వారినే అడగాల్సింది!
ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. సూపర్ సిక్స్ అంటూ కొన్ని ఎన్నికల హామీలను ప్రకటించిన తరువాత ఆయన ‘‘అదిరిందా తమ్ముళ్లూ.. అదిరిందా’’ అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఇప్పుడు కడపలో జరిగిన మహానాడులోనూ వాటిని ప్రస్తావించారు. అలాగే.. పాలన అదురుతోందా? రాజమండ్రిలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం కదా. ప్రజలంతా అదిరిపోతున్నారా? అని కార్యకర్తలను అడగాలి కదా! కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు!. ఎందుకు జరుగుతోందో? ఏమి సాధించాలని అనుకుంటున్నారో తెలియకుండా సాగిన మహానాడు బహుశా ఇదేనేమో!.సాధారణంగా మహానాడు కార్యక్రమాల్లో విధానాలపై చర్చ జరిగేది. పాలనలోని మంచిచెడు గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడలా కాదు.. స్వోత్కర్ష, గప్పాలు కొట్టుకోవడం, అతిశయోక్తులతో ప్రసంగాలు ఒకవైపు, అంతా లోకేశ్ మయం అన్నట్లుగా మరోవైపు ఈ సభ జరిగింది. లోకేశ్ నా తెలుగు కుటుంబం అని సొంత లోగోని ఏర్పాటు చేసుకోవడం, ఆయన కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకుంటున్న ఆరు శాసనాలు ప్రచారం కోసం ఈ సభలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ పెత్తనం చేస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని అంటూనే పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని చెప్పడం ద్వారా ఆయన మనసులోని మాట చెప్పకనే చెప్పినట్లయింది.జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒకటికి, రెండుసార్లు అనడం ద్వారా లోకేశ్‌కు బ్రేక్ వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆలోచన వచ్చింది కానీ, దానికి పవన్ కళ్యాణ్, జనసేన కేడర్ సుముఖంగా లేరని చెబుతున్నారు. పవన్ స్థాయి తగ్గినట్లవుతుందని వారి బాధ. దీనిని గమనిస్తే, వారిద్దరి మధ్య ఇంకా డీల్ కుదరలేదేమో అన్న సందేహం వస్తుంది. ఈ సంగతి పక్కన బెడితే చంద్రబాబు స్పీచ్ అంతా ఎప్పటి మాదిరి అసత్యాలు, అర్ధసత్యాలు, జగన్ ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో పేలవంగా సాగింది. రాజమండ్రిలో ఆయన చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం, గ్యాస్ సిలిండర్ల పథకం అరకొర అమలు మినహా మిగిలిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో వివరించాలి కదా!. పోనీ ఫలానా అభివృద్ది సాధించామని చెప్పగలిగారా? నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు, స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్ లో ప్రధానంగా ఉన్నాయి.ఇవి కాకుండా షణ్ముక వ్యూహం అంటూ, ఎన్నికల ప్రణాళిక పేరుతో దాదాపు 200 హామీలు ఇచ్చారు. జూన్‌లో తల్లికి వందనం, ఆగస్టులో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తామని అంటున్నారే తప్ప, ఈ సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదో, అది తమ వైఫల్యమో కాదో చంద్రబాబు మాట మాత్రం చెప్పలేకపోయారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో రాసినప్పటికీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిసి మూడు విడతలుగా ఇస్తామని అంటున్నారు. వేరే హామీలలో వలంటీర్ల కొనసాగింపు, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. ఎల్లో మీడియాలో కవరేజీకి అవసరమైన డైలాగులు మాత్రం చెప్పారనిపిస్తుంది. రాష్ట్రం దశ, దిశ మార్చే విధంగా అవసరమైన విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం ఏమిటి?.గత మహానాడు అనండి, పార్టీ సభ అనండి.. లేదా తాము విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన విధానాలు కాకుండా కొత్త విధానాలు ఏం తీసుకువస్తారు?. అంటే మేనిఫెస్టోలోని అంశాలన్నిటినీ గాలికి వదలివేసినట్లేనా!. కార్యకర్తల ద్వారా రాజకీయ పాలన చేస్తారట. ఈ ఏడాది కాలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సాగించిన అరాచకాలు, ఎమ్మెల్యేలు చేసిన దందాలు సరిపోలేదని భావిస్తున్నారా? లేక అవినీతి పథకాలతో కార్యకర్తల జేబులు నింపుతారా!. గతంలో జన్మభూమి కమిటీల మాదిరి వారు ప్రజలపై పెత్తనం చేస్తూ సంపాదించుకోవచ్చని చెబుతున్నారా?. ఆ డబ్బుతో ఎన్నికలలో గెలవవచ్చన్నది వీరి ఉద్దేశమా?.గత ముఖ్యమంత్రి జగన్ ఆయా స్కీములలో కులం, మతం, పార్టీ, ప్రాంతం ఏవీ చూడవద్దని అధికారులకు చెబితే, ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు మాత్రం సంకుచిత ధోరణితో టీడీపీ కార్యకర్తలకే పనులు చేయమని చెప్పడం సముచితమేనా!. వైఎస్సార్సీపీ పాలనలో అవినీతి జరిగిందని.. గాడి తప్పిన నేతలను, అధికారులను శిక్షిస్తామని ఆయన అంటున్నారు. అవినీతిని సహించబోమని, అవినీతిపై పోరాడిన పార్టీ తెలుగుదేశం అని ఆయన చెబితే సభికులు చెవిలో పూలు పెట్టుకుని విని ఉండాలి. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై, కొందరు అప్పటి మంత్రులపైన అవినీతి కేసులు ఆధార సహితంగా వచ్చాయి కదా!. అప్పటి దర్యాప్తు అధికారులు చూపించిన ఆధారాలు సరైనవా? కావా? అన్నవాటిపై చంద్రబాబు కానీ, మరే టీడీపీ నేత అయినా మాట్లాడారా!. అవన్ని ఎందుకు టీడీపీ ఖాతాలోకి అక్రమ సొమ్ము చేరిందని ఆరోపణలు వచ్చాయి.అలాగే కేంద్ర ప్రభుత్వ సీబీటీడీనే చంద్రబాబు కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రకటించిందా? లేదా?. ఆదాయ పన్ను శాఖ ఎందుకు నోటీసు ఇచ్చింది?. వాటి గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా!. కాకపోతే ఆయనకు మేనేజ్ మెంట్ స్కిల్ ఉంది కనుక ఆ కేసులు ముందుకు వెళ్లకుండా చూడగలిగారు. జగన టైమ్ లో హత్యా రాజకీయాలు జరిగాయట. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, పార్టీ రంగు పులిమి రాజకీయం చేసిన సంగతి ఆయన ఆత్మకు తెలియదా!. మాచర్ల వద్ద హత్యకు గురైన ఒక టీడీపీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం సరైనదేనా?. అది కొలమానం అయితే ఈ మహానాడులో ప్రసంగాల ప్రకారం వెయ్యి మందికి పైగా హత్యలకు గురయ్యారని చెప్పారు కదా!. మరి ఆ వెయ్యి మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?. నిజానికి మాచర్ల హత్య కూడా వ్యక్తిగత కక్షలతో జరిగినదే. కాని రాజకీయ లబ్దికోసం టీడీపీ గేమ్ ఆడిందని అంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు?. ఎందరు పోలీసుల వేధింపులు ఎదుర్కుంటున్నారు.మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోరాల మాటేమిటి!. తెనాలిలో దళిత, ముస్లిం యువకులు ముగ్గురిని పోలీసులు బహిరంగంగా అరికాళ్లపై ఇష్టారాజ్యంగా కొట్టడమే టీడీపీ ప్రభుత్వ విధానమా?. ఇక అక్రమ కేసుల సంగతి సరే సరి. ఇన్ని చేస్తూ జగన్ ప్రభుత్వంలో అది జరిగింది.. ఇది జరిగింది అంటూ అసత్యాలు, అర్ధ సత్యాలు వల్లే వేస్తున్నారు. ఇక లోకేష్ చెబుతున్న ఆరు శాసనాలు మరీ విడ్డూరంగా ఉన్నాయనిపిస్తుంది. తెలుగు జాతి విశ్వ ఖ్యాతి అంటూ పేర్కొన్న అంశంలో 1984లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి మళ్లీ సీఎం పదవి చేపట్టారని అన్నారు. బాగానే ఉంది. మరి 1995లో స్వయంగా అల్లుడు అయిన చంద్రబాబే ఎందుకు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతిడిని చేశారు కదా? చంద్రబాబును అప్పట్లో ఎన్టీఆర్ ఎన్ని విధాలుగా దూషించారన్నది కూడా విశ్వ విఖ్యాతమైనవే కదా!.తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేసే యువగళం అన్నారు. అభ్యంతరం లేదు. వారిష్టం. స్త్రీ శక్తి మూడో శాసనమని తెలిపారు. ఎన్టీఆర్ మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇస్తే, చంద్రబాబు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చారట. అదేమిటో? మరి ఆడబిడ్డ నిధి, ఈ ఏడాది తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు? పేదల సేవలో సోషల్ ఇంజినీరింగ్ అనేది మరో శాసనమట. వృద్దులకు రూ.నాలుగు వేలు ఫింఛన్ ఇస్తున్నారు. దాంతోనే పేరికం పోతుందా!. పీ-4 పేరుతో పేదలను పెట్టుబడిదారులకు వదలి వేయడం తెలుగుదేశం పాలసీగా మారింది కదా!.2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఉండే విలువ ఎంతో తెలియదు. అన్నదాతకు అండగా ఉండటం మరో శాసనం అని చెప్పారు. వారికి ఇవ్వవలసిన రూ.ఇరవై వేలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? చివరి శాసనం కార్యకర్తే అధినేత అని పేర్కొన్నారు. వారిని సొంతకాళ్లపై నిలబడేలా ఆర్థికంగా బాగు చేస్తారట. అంటే ప్రభుత్వ సొమ్మును వారికి దోచిపెడతామని పరోక్షంగా చెప్పడమే కదా అని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నిటినీ మించి టీడీపీ పేదల పార్టీ అట. ఆ పేదల పార్టీకి ఒక్క రోజులో సుమారు రూ.22 కోట్ల విరాళం వచ్చిందట. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది.1987 మహానాడు విజయవాడ కృష్ణా తీరంలో జరిగింది. అందులో ఒక హుండీ పెట్టారు. విరాళాలు ఇవ్వదలిచిన వారు అందులో వేయవచ్చని ప్రకటించారు. ఆ హుండీ వద్దకు ఎవరూ వెళ్లినట్లు కనిపించలేదు. కాని తెల్లవారే సరికల్లా భారీ మొత్తాలు వచ్చాయని ప్రకటించేవారు. ఇందులో మతలబు ఏమిటని అప్పట్లో కథనాలు వచ్చాయి. మరి ఇప్పుడు నిజంగానే అభిమానులు, పార్టీ నేతలు విరాళాలు ఇస్తుంటే మంచిదే. ఏది ఏమైనా వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన కడపలో మహానాడు పెట్టి చంద్రబాబు, లోకేశ్‌లు తమ అహం చల్లబరుచుకుని ఉండవచ్చు కానీ, రాయలసీమకు గానీ, రాష్ట్ర ప్రజలకు కానీ.. ఈ మహానాడు వల్ల ఒరిగింది ఏమిటి అన్న దానికి జవాబు దొరుకుతుందా?. అందుకే జగన్ ఒక మాట అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తే హీరోయిజం కాని, కడపలో మహానాడు పెడితే హీరోయిజం ఏముందని అడిగారు. దానికి ఎవరు సమాధానం ఇవ్వగలరు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహానాడు ఎఫెక్ట్.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్ స్పీచ్.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు -
పదే పదే లోకేశ్ పాట!
సాక్షి, అమరావతి: కడప టీడీపీ మహానాడు ఆద్యంతం తన కుమారుడు లోకేశ్‌ని తన వారసుడిగా చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడ్డారు. లోకేశ్ బాగా చదువుకున్నవాడని, అన్ని విషయాలు తెలిసినవాడంటూ ఆయన గురించే తన ప్రతి ప్రసంగంలోనూ చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయనే భవిష్యత్తు నాయకుడని పరోక్షంగా చెప్పారు.మాములుగా అయితే మహానాడులో ఎప్పుడూ వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీగా జరిగేది. కానీ, ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. లోకేశ్‌ని గొప్పవాడిగా చూపించే క్రమంలో సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి ఆయనతో చెప్పించారు. మొదటి రోజు చర్చంతా ఆయన చెప్పిన అంశాలపైనే జరిగేలా చూశారు. ఈ శాసనాలు లోకేశ్ ఆలోచనలని, వీటి ద్వారా టీడీపీకి వచ్చే 40 ఏళ్ల వరకూ రూట్ మ్యాప్ రూపొందించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తాను మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఈ శాసనాలు లోకేశ్ రూపొందించాడని, ఇవి అతని ఘనతేనని, వాటిని అందరూ పాటించాలని చెప్పుకొచ్చారు.నిజానికి ఈ శాసనాల్లో ఏమాత్రం కొత్తదనంలేదు. యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తలకు మేలు చేయడం, తెలుగుజాతిని గొప్పగా నిలబెట్టడమే ఈ శాసనాలు. ఏ రాజకీయ పార్టీ అయినా వీటి గురించే చెప్పడం సాధారణమైన విషయం. ఎందుకంటే సమాజంలో ఉన్నది ఈ వర్గాలే. ఏం చేసినా ఆ వర్గాల కోసమే చేయాలి. అలాంటప్పుడు ఇందులో లోకేశ్ గొప్పదనం ఏమిటో పార్టీ శ్రేణులెవరికీ అర్థంకాలేదు. ఏదో ఒక కొత్త పదం వాడాలి కాబట్టి శాసనాలు అనే పదం వాడినట్లు కనబడుతోంది తప్ప అందులో కొత్త అర్థంకానీ, కొత్త విషయం కానీ లేదని వారంటున్నారు. లోకేశ్ కోసం డిమాండ్ల డ్రామా.. మరోవైపు.. లోకేశ్‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని పలువురు నేతలు అదే పనిగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్జెంటుగా తనకు ఉన్నత పదవి కావాలని కోరుకుంటున్న లోకేశ్ అది కుదరకపోవడంతో తెలంగాణలో కేటీఆర్ తరహాలో ఇక్కడ తాను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకుంటారని సీనియర్ నేతలు చెబుతున్నారు. అంటే.. ఆయన పదవి వ్యవహారం ఎప్పుడో నిర్ణయమైపోయింది. కానీ, ఇప్పుడు అందరి ఆమోదంతో దాన్ని ఇచ్చినట్లు చూపించాలి కనుక సీనియర్ నాయకులతో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్లు చేయించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ వంటి వారిని లోకేశ్ దూరం పెట్టడంతో వారు ఆయన్ను ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు మహానాడులో ఆయనకు అనుకూలంగా డిమాండ్లు చేసినట్లు కనబడుతోంది. మరోవైపు.. మహానాడులో అడుగడుగునా లోకేశ్ ఫొటోలను అత్యంత ప్రాధాన్యంగా ముద్రించారు. రామ్మోహన్‌తో రాజకీయ తీర్మానం.. యనమలకు ఝలక్.. చివరిగా.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. రాజకీయ తీర్మానాన్ని ఎప్పుడూ సీనియర్ నేతతో చేయించడం ఆనవాయితీ. గతంలో యనమల రామకృష్ణుడు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే వారు. కానీ, ఇప్పుడు రామ్మోహన్‌తో ఈ తీర్మానం చేయించి సీనియర్ల అవసరంలేదని చెప్పకనే చెప్పారు.తేలిపోయిన తీర్మానాలు.. ఇక రెండో రోజు రాజకీయ తీర్మానం సహా 15 అంశాలపై తీర్మానాలు చేసినా వాటిలో ఏమాత్రం పస లేకుండాపోయింది. వీటిలో ఒక్కటి తెలంగాణ తీర్మానం ఉండగా మిగిలినవన్నీ ఏపీకి సంబంధించినవే. తెలుగుజాతి–విశ్వఖ్యాతి, రాష్ట్రం–విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రాభివృద్ధి కేంద్ర సహకారం, అభివృద్ధి వికేంద్రకరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి–రాయలసీమ డిక్లరేషన్, అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ, యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, సమగ్ర సాగనీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి వంటి తీర్మానాలు చేసి వాటిపై అసత్యాలు, మాయమాటలు చెబుతూ నేతలు ప్రసంగించారు. -
వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే..: జేసీ ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రి టౌన్: సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బుధవారం వైరల్‌గా మారాయి. ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయనన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి.. అదీ ఇదీ అని 15 వేలు ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవని, ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ చెప్పారు. ‘రోడ్లు బాగా లేకుండాలేవు. నీళ్లు తక్కువేమీ లేవు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ బాగా చేశాం. అయినా ప్రజలకు కావాల్సింది ఏమిటంటే.. నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి. ఒక్కనికీ బుద్ధిలేదు. ఈ జనాలకు బుద్ధిలేద’ని ప్రభాకర్‌రెడ్డి ఆవేశంగా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని దాదాపు 43 కిలోమీటర్ల మేర పెన్నానదిలో ఇసుకను ఇష్టమొచ్చినట్లు ఎవ్వరు పడితే వాళ్లు తవ్వుకుని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తాము కూడా ఈసారి ఓపెన్‌గానే ఇసుక అమ్ముదామనుకుంటున్నానని జేసీ వ్యాఖ్యానించారు. -
ఎన్నికల హామీలు.. మేనిఫెస్టో అమలే హీరోయిజం: వైఎస్ జగన్
మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లకు పైగా కోవిడ్‌తో ఇబ్బందులు ఎదురైనా సాకులు చెప్పలేదు. మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. ⇒ మా పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేశాం.. అది ప్రతి ఇంట్లో ఇంకా బతికే ఉంది ⇒ ఇవాళ్టికీ ప్రతి గడపకూ మా కార్యకర్తలు, నేతలు తలెత్తుకుని గర్వంగా వెళ్లగలరు.. ప్రజల ఆశీర్వాదం పొందగలరు ⇒ కోవిడ్ విపత్తులోనూ సాకులు వెతుక్కోకుండా ప్రతి హామీని నెరవేర్చాం.. ⇒ ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకే రెడ్‌బుక్ బెదిరింపులు.. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంసాక్షి, అమరావతి: మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. తెలుగు డ్రామా పార్టీ (టీడీపీ) కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడులో సీఎం చంద్రబాబు ఫోజులిస్తూ.. బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హీరోయిజం అంటే.. కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం కాదు..! హీరోయిజం అంటే.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం అని చంద్రబాబుకు చురకలంటించారు. ‘‘సత్తా అంటే కడపలో మహానాడు నిర్వహించడం కాదు.. ఆ కార్యక్రమంలో జగన్‌ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది?’’ అని నిలదీశారు. ‘ఇదిగో మా మేనిఫెస్టో.. వీటిని నెరవేర్చామని రాష్ట్రంలో ఏ ఇంటికైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి ఆశీర్వాదం కోరే ధైర్యం ఉందా చంద్రబాబూ? గడప గడపకూ తిరిగే సాహసం చేయగలరా?’ అని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా మాకు ఇవ్వాల్సిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్లు, అన్నదాతా సుఖీభవ, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని చిన్న పిల్లలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, రైతన్నలు, నిరుద్యోగులు నిలదీస్తారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ సాకులు వెతుక్కోకుండా చిత్తశుద్ధితో 99 శాతం హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఇవాళ్టికీ తమ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి మేం వైఎస్సార్సీపీ వాళ్లం అని తలెత్తుకుని గర్వంగా చెప్పే ధైర్యం ఉందని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలు, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిమాణాలపై చర్చించి పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికే ఉంది..ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి బతికే ఉంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. రెండు ప్రభుత్వాల మధ్య తేడాను ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. చిన్న హామీలనూ ఎగ్గొట్టారు..చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. కడపలో మహిళలు చంద్రబాబు ఎప్పుడు ఉచిత బస్సు అని చెబుతారా..! విశాఖ వెళ్లి వద్దామా..! అని ఎదురు చూస్తున్నారు. మరో చిన్న హామీ ఉచిత గ్యాస్. కనీసం ఆ గ్యాస్ సిలిండర్లు కూడా సరిగా ఇవ్వలేకపోయారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు..ఈరోజు రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కలియగ రాజకీయాలు ఎలా ఉన్నాయో సాక్షులుగా ఉన్న మీరే నా కన్నా బాగా చెబుతారు. రాజకీయాల్లో విలువలుండాలి. విశ్వసనీయతకు అర్ధం తెలుసుండాలి. అప్పుడే రాజకీయ వ్యవస్ధలో తులసి మొక్కలా నిలబడతాం. చంద్రబాబు తన పాలనలో రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు సహా అనేక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను చంద్రబాబు తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద గెలిపించుకునే పరిస్థితి లేకపోయినా.. వారంతా వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులని తెలిసినా.. ముఖ్యమంత్రిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిసినా.. తానే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇది నిదర్శనం.కోవిడ్ ఇబ్బందుల్లోనూ..అప్పుడు మన ప్రభుత్వం జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తే.. కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్‌ను చూశాం. రాష్ట్ర చరిత్రలో అలాంటి విపత్తు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. మరోవైపు అనుకోని ఖర్చులు పెరిగాయి. అన్ని రకాలుగా ఇబ్బందికర పరిస్థితులున్నా ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. సీఎంవో మొదలు ప్రతి కార్యాలయంలోనూ హామీలను డిస్ప్లే చేశాం. ప్రతి రోజూ వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకున్నాం. అలా మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం హామీలను అమలు చేసిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. పాలన ఎలా ఉండాలో చూపాం..అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం కాబట్టే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. 86 నుంచి 88 శాతం స్ధానాలను మనమే గెలిచాం. దాదాపు 120 చోట్ల క్లీన్ స్వీప్ చేయగా తాడిపత్రి, దర్శి రెండు చోట్ల మాత్రమే మనకు తక్కువ వచ్చాయి. తాడిపత్రిలో వాళ్లకు 18, మనకు 16 రావడంతో మన ఎమ్మెల్యే వాళ్లను లాగుదామన్నారు. కానీ నేను స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయించి అక్కడ ఎన్నిక సవ్యంగా జరిపించా. వైఎస్సార్ సీపీ హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డాం. ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి పాలన ఎలా చేయాలో చూపించాం. మీ అందరికీ హ్యాట్సాఫ్..ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలు చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా ఇదే చేయమని తన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో.. విలువలు, విశ్వసనీయత అనే పదానికి అర్థం చెబుతూ మన పార్టీలో చిన్న పదవుల్లో ఉన్నవారైనా.. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తికి గట్టి గుణపాఠం నేర్పారు. రాజకీయాలంటే నీ మాదిరిగా కాదు.. మమ్మల్ని చూసి నేర్చుకో..! అని చంద్రబాబుకు గుణపాఠం చెప్పారు. అందుకు మీ అందరికీ నా హ్యాట్సాఫ్.విద్య, వైద్యం, వ్యవసాయం నిర్వీర్యం...⇒ ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. ఇంగ్లీషు మీడియం పడకేసింది. గోరుముద్ద నాసిరకంగా మారి తినలేని పరిస్థితిలో ఉంది. మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఇప్పిస్తూ ఒక పీరియడ్‌గా ఏర్పాటు చేస్తే వీళ్లు వస్తూనే దాన్ని ఎత్తేశారు. సీబీఎస్ఈ, నాడు–నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు.. అన్నీ ఆగిపోయాయి. అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. ఏడాది కావస్తోంది. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజులు సున్నా. మన హయాంలో క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ఇవాళ ఫీజులు గురించి పట్టించుకునే నాథుడు లేడు. పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు మానిపిస్తున్న దుస్థితి నెలకొంది. ⇒ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 1,000 ప్రొసీజర్లను మన హయాంలో 3,000కు తీసుకుని పోయి ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అందుబాటులోకి తెచ్చాం. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. అలాంటి పాలన మనం అందిస్తే.. ఇవాళ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.300 కోట్లు చొప్పున ఏడాదిగా దాదాపు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూడటం ఆపేశారు. ఇవాళ పేదలు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారు.⇒ ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్బీకేలు, ఈ–క్రాపింగ్, ఉచిత పంటల బీమాను గాలికి వదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ ముగిసేలోగా రైతులకు తోడుగా నిలిచి సాయం చేసే కార్యక్రమం నిలిచిపోయింది. ఏడాదిగా రైతు భరోసా ఎగ్గొట్టారు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు లభించడం లేదు. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే కాదు.. జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.10 వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో, పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. రైతుల కష్టం దళారీల పాలవుతోంది.వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా నిలదీస్తారు..ఇవాళ టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి వీళ్లు చెప్పిన మాటలు ఇవాళ్టికీ ప్రజలకు గుర్తున్నాయి. అందుకే వాళ్లు ఏ ఇంటికైనా వెళ్లి ఆశీర్వదించమని కోరితే.. చిన్న పిల్లల నుంచి ప్రశ్నించడం మొదలవుతుంది. తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. అదే ఇంట్లో నుంచి వాళ్ల అమ్మ, చిన్నమ్మ వచ్చి ఆడబిడ్డ నిధి కింద నాకు ఇస్తామన్న రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లకు పెన్షన్ అన్నావ్.. మరి మా రూ.48 వేల సంగతేంటని ఆ తల్లుల అమ్మలు, అత్తలు నిలదీస్తారు. కండువా కప్పుకున్న ప్రతి రైతూ ఎన్నికలప్పుడు మాకు అన్నదాతా సుఖీభవ కింద రూ.26 వేలు ఇస్తానన్నావ్.. వాటి సంగతేంటని ప్రశ్నిస్తారు. అదే ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న 20 ఏళ్ల యువకుడు నిరుద్యోగ భృతి కింద నాకు ఇస్తానన్న రూ.36 వేలు పరిస్థితి ఏమిటని నిలదీస్తాడు.వడ్డీతో సహా చెల్లిస్తాం...మన హయాంలో నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ద్వారా సమస్యలు చెప్పి ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వారే! నాడు ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. స్పందనలో అత్యధికంగా ఫిర్యాదులు చేసిందీ వాళ్లే. కానీ ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీతో సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు. రాష్ట్రం కూడా బాగు పడుతుంది.జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీటఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నాడు మనం అధికారంలోకి వస్తూనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు పూర్తిగా ప్రజల ఆరోగ్యం, వారికి మంచి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ఈసారి జగన్ 2.0లో అలా ఉండదు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు.. కార్యకర్తలకూ ప్రాధాన్యం ఉంటుంది. కార్యకర్తలు అన్నింటికన్నా పైస్థాయిలో ఉంటారు. ఆ విధంగా వారి బాగోగులన్నీ చూసుకుంటాం.వారెక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం..ఇప్పుడు మన పార్టీ కార్యకర్తల ప్రతి కష్టం, వారికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నా. మీ అందరికీ ఒకటే చెబుతున్నా. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో వారి పేర్లు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తాం. చేసిన వాళ్లే కాదు... వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారినీ వదిలిపెట్టం. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు నిర్వర్తించడానికే యూనిఫాం ఇచ్చారు. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే అక్రమ కేసులు..రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు పాలనా వైఫల్యాలు, అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు.. ఆ గొంతు వినపడకుండా భయోత్పాతం సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవరిదో తెలుసు. చంపిన వాళ్లు ఎవరో కూడా తెలుసు. టీడీపీలో గ్రూపు తగాదాలే దీనికి కారణమని ఎస్పీ స్వయంగా చెప్పారు. కానీ రెండు రోజుల తర్వాత మన పార్టీ ఇన్ఛార్జ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారు. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏ మాత్రం బేస్‌లేని పాత కేసు బయటకు తీశారు. గతంలో ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే అదే అధికారులతో తప్పుడు ఫిర్యాదు చేయించి, తప్పుడు సెక్షన్లతో కేసు పెట్టి అరెస్టు చేశారు. 2023లో టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటన విషయంలో ఇప్పుడు 127వ ముద్దాయి కింద మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే మీద కేసు పెట్టారు. ఇలా చట్టం, రాజ్యాంగం దారుణ ఉల్లంఘనకు గురవుతోంది. గతంలో జరిగిన ఘటనల్లో మనవాళ్లను ఇరికించి జైల్లో పెట్టే కార్యక్రమం రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతోంది.3 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టారుఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గమూ చంద్రబాబు ప్రభుత్వంపై సంతృప్తిగా లేదు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ రాకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే 2.6 లక్షల మంది వలంటీర్లు, 15 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు, 9,800 రేషన్ వాహనాల (ఎండీయూ) మీద ఆధారపడ్డ 20 వేల మందితో కలిపి మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టారు. మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యోగస్తుల్లో విషం నింపి, ఇవాళ వారినీ మోసం చేశాడు. వారికి మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చిన పాపాన పోలేదు. వేతనాల సవరణ (పీఆర్సీ) ప్రస్తావన లేదు. మూడు డీఏలు పెండింగ్. అందుకే ఇవాళ ఉద్యోగులు చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామా అని తల పట్టుకుంటున్నారు.విచ్చలవిడిగా అవినీతిమరోవైపు ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియా, సిలికా, క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలు, రాజధాని పనులు.. ఇలా దేన్నీ వదల కుండా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో స్కామ్‌లు చేస్తున్నారు. ఇలాంటివి మన హయాంలో లేవు కాబట్టే బటన్ నొక్కి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)తో రూ.2.73 లక్షల కోట్లు ప్రజలకు పారదర్శకంగా అందించాం. ఆరోజు జగన్ చేశాడు... ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే కారణం ఇదే! నేను ఆశపడింది ఒక్కటే... నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో బతికే ఉండాలని ఆశ పడ్డా. అందుకే ఎక్కడా రాజీ పడలేదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నా. ఇవాళ చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కడం లేదంటే.. ప్రతి దాంట్లోనూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం చేస్తున్నాడు కాబట్టే. అందుకే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 13 శాతం ఆదాయాలు పెరిగితే.. మనకు కేవలం 3 శాతమే పెరిగాయి. అలా ఎందుకు జరుగుతోందంటే.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం టీడీపీ గజదొంగల ముఠా జేబుల్లోకి పోతోంది. ఏ మంచి చేయని, అన్నీ అబద్ధాలు, మోసాలు చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారికి డిపాజిట్లు రాని పరిస్థితులు ఖాయం. -
చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత ఫైర్
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచనల్లో కార్పోరేటర్లు, ధనవంతులు తప్ప సామాన్యులు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. సామాన్యుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. ‘ఏపీ ప్రజలకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. గతంలో సోమవారం పోలవరం అని వారం వారం చంద్రబాబు తిరిగారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మంగళం పాడుతుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు. పోలవరం ఎత్తు తగ్గించి , పునరావాసం ఎగ్గొడుతుంటే ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. ప్రజల్ని ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు చంద్రబాబుపోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని మోదీ విమర్శించారు. పోలవరం పై చంద్రబాబు మహానాడులో తీర్మానం చేయాలి. బనకచర్ల - గోదావరి మీద ఉన్న శ్రద్ధ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పై లేదు. పోలవరమే ఇంతవరకూ పూర్తికాలేదు. 80 వేల కోట్లతో బనకచర్ల - గోదావరి ఎప్పటికి పూర్తిచేద్దామని అడుగుతున్నాను. కాంట్రాక్టర్లకు , రాజకీయ నాయకులకు లాభం చేకూర్చేందుకు బనకచర్ల - గోదావరి టెండర్లకు తొందరపడుతున్నారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి. జూన్ 2 నాటికి 2 లక్షల 20 వేల టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ఇస్తామన్నారు.ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి. టిడ్కో ఇళ్లు పూర్తిచేయలేదు కానీ...భారీ అంతస్తులు భవనాలకు అనుమతిలిచ్చామని పేపర్లలో ప్రకటనలిస్తున్నారు. 22ఏ పేరుతో రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
‘చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయం’
సాక్షి,తాడేపల్లి: పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారంటూ’ చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్న చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు పొడవడం.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారు?. హత్యకు గురైన వారు, చేసినవారు టీడీపీ వారేనని స్వయంగా ఎస్పీ చెప్పారు. గ్రామంలోని రెండు టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్యపోరులోనే హత్యలు జరిగాయని ఎస్పీ చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్లో వైసీపి నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారు. హత్య కేసులోని ముద్దాయిల్లో ఒక్కరైనా వైఎస్సార్సీపీ జెండా పట్టుకున్నారా?. ఏనాడైనా ఫ్యాను గుర్తుకు ఓటేశారా?. ముద్దాయి కొత్త కారు కొంటే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దాన్ని ప్రారంభించారు. అదే కారులో వెళ్ళి చంద్రబాబును కలిశారు. అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ అని ఎలా చెప్తారు?.అంతులేని పాపాలను మూట కట్టుకుంటున్నారు. శిశుపాలుడులాగా పాపాలు చేస్తూ పోతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు. అదే వెన్నుపోటు త్వరలోనే లోకేష్.. చంద్రబాబును పొడుస్తాడు. పార్టీనీ, సీఎం కుర్చీని లాక్కోబోతున్నారు. చంద్రబాబు అక్కచెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?. ఏనాడైనా వారు చంద్రబాబు ఇంటి గడప తొక్కారా?. హైదరాబాద్, కుప్పం, అమరావతిలో వందల కోట్లతో ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే అక్కచెల్లెళ్ళు ఎవరైనా వచ్చారా?. రాజమహల్, జైపూర్ ప్యాలెస్ లాంటి ఇళ్లు కట్టుకుని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు?. కొత్త ఇంట్లో పాలు పొంగించేది ఇంటి ఆడపిల్లలే. మరి ఏనాడైనా ఆ ఆడపిల్లలు చంద్రబాబు ఇంటికి ఎందుకు రావటం లేదు?. నారా లోకేష్ తన తాత ఖర్జూరనాయుడు అని ఎందుకు చెప్పుకోలేక పోతున్నారు?. ఇలాంటివేమీ మేము అడగ దలచుకోలేదు.రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే విచారణ ఉండదు. పిఠాపురంలో దళితులను వెలేస్తే విచారణ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని దియేటర్లపై విచారణ చేస్తున్నారు. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ నిర్ణయం తీసుకుంటే ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ విషయం తెలీదు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఆ విషయం తెలియదురాష్ట్రంలో ఇంటిలిజెన్స్ ఏం పని చేస్తోంది?. పోలీసులందరినీ వైఎస్సార్సీపీ నేతలను వేధించటానికి మాత్రమే ప్రభుత్వం వాడుకుంటోంది. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులను వాడటం లేదు. అందుకే చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సినిమాల విషయంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మా నిర్ణయాలు తప్పయితే ఈ సంవత్సరకాలంగా ఎందుకు అమలు చేస్తున్నారు?.పవన్ సినిమా వచ్చే ముందు ధియేటర్లలో విచారణ చేయటానికి సిగ్గు లేదా?’ అని వ్యాఖ్యానించారు. -
అధికారం ఉంది కదా అని అడ్డంగా నడుస్తున్నారా?
ఏపీలోని సినిమా థియేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు కొనసాగడం గమనార్హం. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనకు సంబంధించిన వారి థియేటర్లలోకి తనిఖీలు పేరుతో వెళ్లినా అక్కడ తూతూ మంత్రంగానే సోదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులకు తనిఖీల ఆదేశాలు వెళ్లాయి.మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ నేపథ్యంలో తనిఖీలు షురూ చేశారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ పవన్ ద్వంద్వ వైఖరి అనేది ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.కూటమి నేతల థియేటర్లలో తనిఖీలు ఏవి?డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు సరే కానీ, ఇక్కడ ఎవరి థియేటర్లని తనిఖీలు చేయాలనే ఆదేశాలు కూడా ఆఫ్ ద రికార్డు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టీ\డీపీ, జనసేన నేతల థియేటర్ల వైపు అదికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ ఆ థియేటర్లకు పొరపాటున వెళ్లినా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ లీజుకు తీసుకున్న థియేటర్లలోనే తనిఖీలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. మరి అప్పట్నుంచి థియేటర్లలో ఎందుకు తనిఖీలు చేపట్టలేదనేది ప్రధాన ప్రశ్న. థియేటర్లలో పారిశుధ్యం బాగా లేదని, తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని, కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.బంద్ కుట్ర చేసింది జనసేన నేతని తేలినా..సినిమా థియేటర్ల బంద్ డ్రామాకు తెరలేపింది జనసేన నేత అని తేలినా, థియేటర్లలో తనిఖీలు మాత్రం ఆగడం లేదు. కక్ష గట్టి థియేటర్లలో తనిఖీలు చేసేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల థియేటర్లలోనే తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల చేతుల్లో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ, జనసేన నేతల థియేటర్లలో తనిఖీలు చేపట్టకుండా కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.సినిమా వాళ్ల పట్ల, సినిమా పట్ల ప్రభుత్వ జోక్యం ఏమిటని గతంలో ఊగిపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం రగిలిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘రగులుతోంది మొగలి పొద’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నటుడు పవన్. అధికారం ఉంది కదా అని అడ్డంగా వెళ్లిపోయినా నడుస్తుందని మన డిప్యూటీ అనుకుంటున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
రాసిపెట్టుకోండి.. రిటర్న్ గిఫ్ట్‌లు ఇద్దాం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలూ సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో.. వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలవుతోంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవ్వరిదో తెలుసు, చంపిన వాళ్లు ఎవ్వరో తెలుసు. టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పారు. ఇప్పుడు మన పార్టీ ఇన్‌ఛార్జి పిన్నెల్లిమీద కేసులు పెట్టారు. ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే.. తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్లు పెట్టి మాజీ మంత్రిని కాకాణిని అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు ఆర్కేమీద కేసు పెడుతున్నారు.ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోంది అని అన్నారాయన. రిటర్న్ గిఫ్ట్ తప్పదుఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీ సమా రిటర్న్ గిఫ్ట్(return Gifts)లు ఇస్తాం. చేసినవాళ్లే కాదు, వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించనవారినికూడా సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా సరే చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానిక వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు చేయడానికి వీరికి యూనిఫాం ఇచ్చింది’’ అని జగన్ అన్నారు.ఇదీ చదవండి: తెలుగు డ్రామా పార్టీ.. మహానాడుపై జగన్ సెటైర్లు -
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్ అన్నారు... చంద్రబాబు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లు, రేషన్ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్సీ లేదు. మూడు డీఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, రాజధాని పనులు.. లిక్కర్ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్ అన్నారు.క్లిక్ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన -
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్ ఉండి ఉంటేనా.. -
మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోపై గుసగుసలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్‌తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను కొందరు సోషల్ పోస్ట్ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా! -
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు(TDP Mahanadu) కార్యక్రమ ప్రాంగణం.. కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. నిన్న మొదటి రోజు.. అందునా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న టైంలోనే పసుపు దండు అక్కడి నుంచి వెళ్లిపోళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ.. బుధవారం రెండోరోజూ అంతకు మించి దృశ్యాలే కనిపించాయి. రెండో రోజు.. కడప మహానాడు ప్రాంగణం వైపు వెళ్లే రోడ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. ఉదయం 11గం.లకే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. స్థానిక కార్యకర్తలు సైతం కనీసం అటువైపు తిరిగి చూడలేదు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కిందపడిపోయినా.. తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రతినిధుల సభ సందర్భంగా నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందే వచ్చిన ఆ కొద్దిమంది కూడా వెనుదిరి వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో భోజనాల దాకా అయినా ఉండాలని నేతలు నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.కావాలనే కడపలో మహానాడును నిర్వహించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడమే ఈ అసంతృప్తికి కారణం. మరోవైపు.. టీడీపీ అనుకూల మీడియాలు పోటెత్తిన పసుపు దండు అంటూ లేని హడావిడిని చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరిరోజైన రేపు(గురువారం) ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆ ప్లాన్ ఘోరంగా అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఇదీ చదవండి: మహానాడు కాదు కాస్త దగానాడుగా.. -
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల హక్కులను గౌరవించకుండా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. యువకులపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి ‘తెనాలిలో దళిత, మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్ విక్టర్, దోమా రాకేశ్, షేక్ బాబూలాల్ అలియాస్ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్ల మీద లాఠీలతో దారుణంగా కొట్టారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్.. బాధితుల కాళ్లను తొక్కిపట్టగా, మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాఠీలతో దాడి చేశారు. మిగిలినవారు ఈ దాడిని వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ కొత్తవి అందజేశారు. వీడియో వైరల్ అయ్యాకే విషయం వెలుగులోకి... ఘోర ఘటనపై మాట్లాడడానికి కూడా ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు. వీడియో వైరల్ అయ్యాకే దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో ఈ ఉదంతం చెబుతోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇలాంటి ఎన్నో దారుణ, అమానవీయ దాడులు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు నోరు విప్పలేని పరిస్థితులు ఉండటం వల్ల వెలుగులోకి రావడం లేదు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కేవలం కాగితంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది మానవ హక్కులను కాలరాసే చర్య... తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల దాడి మానవ హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి చేయడమే. పోలీసులు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను సమరి్పంచాలే తప్ప... వాళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి, శిక్షించే పని చేపట్టకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కొట్టడం, హింసించడానికి చోటే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అవే గొప్పలు.. అదే విద్వేషం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిందేమీ లేకపోవడంతో సీఎం చంద్రబాబు.. ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విషం కక్కడానికే సమయమంతా వెచ్చించారు. మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ.. కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పంథాను కొనసాగించింది. సూపర్ సిక్స్ హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్క దాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని లేనివి ఉన్నట్లు మహానాడులో చిత్రీకరించారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్ సిక్స్ శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి.. ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్‌తో చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్ సిక్స్ శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకువస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఇచ్చిన హామీలకే దిక్కు లేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేశ్ శాసనాలంటూ సరికొత్త పద ప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి, మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు.. ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వం అంటూ అదే పనిగా విషంచంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలంతా గత ప్రభు త్వం, జగన్ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడేదో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్ కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సివస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఇక రాష్ట్రానికి తాను చేసేదేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్రహింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతున్నట్లు అర్థమవుతోంది. పార్టీ కార్యకర్తల మనసుల్లో విద్వేషం నింపి వారిని పగతో రగిలేలా చేయడం కోసమే గత ప్రభుత్వంపై అభాండాలు మోపడాన్ని చంద్రబాబు ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాన్ని మహానాడులోనూ కొనసాగించారు. ఇందులో భాగంగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని సీఎం ఎలా చెబుతారని ప్రజలు మండిపడుతున్నారు.తండ్రీ కొడుకులపై పొగడ్తలు ఎన్టీఆర్ హయాంలో సంస్కరణలు అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని అభివృద్ధి చేశామని, 2014–19లో ఇరగదీశామని ఇంకా పాత కథలు చెప్పుకోవడానికే చంద్రబాబు సహా నేతలంతా ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు పార్టీ నేతలంతా చంద్రబాబును, ఆయన కొడుకు, మంత్రి లోకేశ్‌ను పొగడటానికే పోటీపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంది నేతలు భూ ప్రపంచంలో చంద్రబాబు, లోకేశ్ అంత గొప్ప వారు ఎవరూ లేరన్న రీతిలో కీర్తించారు.‘మహా’కష్టాలు» నేలకూలిన కటౌట్లు.. పరుగులు తీసిన కార్యకర్తలు» మధ్యాహ్న భోజనాల దగ్గర తోపులాట » పార్టీ శ్రేణులు లేక బోసిపోయిన ప్రాంగణం » నిర్వాహకులపై బాబు సీరియస్ » మీడియాపై లోకేశ్ ఆంక్షలు సాక్షి ప్రతినిధి, కడప/కడప రూరల్: తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేలకొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడటంతో పార్కింగ్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే ఇద్దరు వీఆర్వోలు గాయపడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంత మంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు. ‘ఏమి ఏర్పాట్లో.. ఏమి కమిటీలో.. కనిపిస్తూనే ఉంది’ అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కాగా, మధ్యాహ్నం భోజన సమయానికి మహానాడు ప్రాంగణం సగం ఖాళీ కాగా, సాయంత్రానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు నిర్వాహకులపై సీరియస్ అయినట్లు సమాచారం. చివరగా మాట్లాడిన చంద్రబాబు.. చివరి వరకూ ఉండాలని, దీనిని బుధవారం నుంచైనా పాటించాలని కోరడం గమనార్హం. మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు. లోకేశ్ అక్కడికి రాగానే.. కెమెరాలు ఆఫ్ చేయాలంటూ ఆదేశించారు. ఎవరైనా కెమెరా ఆన్ చేస్తే లాక్కొవాలంటూ పోలీసులకు సూచించారు. ఫొటోలు కూడా తీయనివ్వలేదు. మంత్రి లోకేశ్ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్‌చాట్ నిర్వహించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ అధికారులకు డ్యూటీలు వేశారు. జిల్లా సర్వోన్నతాధికారి డ్యూటీ పాస్‌లు ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు ఎల్లో ట్యాగు తగలించుకొని కనిపించారు. కాగా, మహానాడుకు ముందే కరోనా పాజిటివ్ కేసులు రిమ్స్‌లో నమోదు అయితే, అబ్బే అలాంటిదేమీ లేదని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. -
‘సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లో సైతం..’
తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దళితులపైన దాడులు కామన్‌గా మారాయని, వారిపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారన్న ఆయన, తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై థర్డ్ డిగ్రీ దారుణమన్నారు. ఈరోజు(మంగళవారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జూపూడి. సంక్షేమానికి అర్థం చెప్పిన వైఎస్ జగన్ పాలన2019–24 మధ్య శ్రీ వైఎస్ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శ«ంగా నిల్చారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. పేదలకు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఒక్క అమరావతిలోనే 50 వేల మంది కోసం ఏకంగా 900 ఎకరాలు కేటాయించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులు ప్రపంచాన్ని ఏలగలరన్న నమ్మకం కలిగించారు. నాడు– నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో సమూల మార్పులు, కొత్తగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, మారుమూల గ్రామాల్లో కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదే ఇప్పుడుక్ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.1.5 లక్షల కోట్లకుపైగా అప్పు చేసినా, ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అరాచకాలపై మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ నిలదీస్తే, కూటమి పార్టీలకు ఇప్పటికీ సమాధానం చెప్పే ధైర్యం లేదు.వేధిస్తున్నామని మహానాడులో ఒప్పుకున్నారుఎన్నికల్లో గెల్చేందుకు అడ్డగోలుగా హామీలు గుప్పించిన టీడీపీ కూటమి, అ««ధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజలను దారుణంగా వంచించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు.ఈ ఏడాదిలో మేము చాలా తక్కువ మందినే కొట్టాము. తక్కువ మందినే జైల్లో పెట్టాం. అందుకే రెడ్ బుక్ ఓపెన్ చేశామని సిగ్గు లేకుండా మహానాడులో చెప్పుకుంటున్నారు. శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకుని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుముకొని.. మహానాడు పేరుతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు’. నిజానికి కూటమి ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేదు. సూపర్ సిక్స్ హామీల అమలు ఊసెత్తడం లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తుందని చెప్పడం ప్రజలను మోసం చేయడమే.పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారురాష్ట్రంలో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. కూటమి నాయకులు తమకు గిట్టని వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. రాజ్యాగం కల్పించిన మాట్లాడే హక్కు, జీవించే హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. నోరెత్తితే కొట్టడం, కేసులు పెట్టడం, ప్రాణాలు తీసేయడానికి కూడా వెనుకాడటం లేదు. కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కట్ట కట్టి బంగాళాఖాతంలో విసిరేసే రోజు త్వరలోనే వస్తుంది.తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై నడిరోడ్డు మీద పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ తాజాగా వెలుగులోకి వచ్చింది. కొట్టొద్దని వేడుకుంటున్నా పోలీసులు లాఠీలతో యువకుల అరికాళ్లపై చితకబాదారు. ఒక సీఐ ఒక యువకుడి కాళ్లను బూటు కాలితో తొక్కి పెట్టగా, మరో సీఐ ఆ యువకుడి అరికాళ్లపై కొట్టడం.. మరో ఇద్దరిని కూడా అదే విధంగా అరికాళ్లపై లాఠీలతో చితకబాదడం, రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. పైగా ఎస్సీ నా కొడకల్లారా అంటూ పోలీసులు దుర్భాషలాడారు.స్థానిక సమస్యల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడన్న కారణంతో రాజమండ్రికి చెందిన పులి సాగర్ అనే దళిత యువకుడ్ని పోలీసులు స్టేషన్‌కి పిలిపించి కొట్టి బెదిరించారు. అంతటితో ఆగకుండా విద్యావంతుడైన ఆ యువకుడ్ని అర్థనగ్నంగా లాకప్‌లో నిలబెట్టారు. అక్కడ మహిళా కానిస్టేబుల్ ని కాపలాగా ఉంచి మానసికంగా వేధించారు. సాగర్‌ను ఉద్దేశించి బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు.గుంటూరు జిల్లా కంతేరులో కల్పన అనే దళిత ఎంపీటీసీని చీర మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్థరాత్రి 20 మంది పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి లాక్కెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందన్న కారణంతో పాలేటి కృష్ణవేణి అనే మహిళను హైదరాబాద్‌లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆమెను కలిసే అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్‌కే తాళాలు వేశారు. ఇదంతా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగ ఫలితమే.సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలో.మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తెనాలిలో దళిత యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొడుతుంటే, వారి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఏకంగా దళితులను అంతం చేస్తున్నారు. 1989 యాక్ట్ ప్రకారం దళితులను లక్ష్యంగా చేసుకుని మానసికంగా శారీరకంగా వేధించడం చట్ట ప్రకారం నేరం. ఈ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలుంటాయి.తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను కొట్టిన పోలీసులను తక్షణం సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేయాలి. లేదంటే వారిపైన వైయస్సార్సీపీ తరఫున ప్రైవేటు కేసు పెడతాం. ప్రజలిచ్చిన అధికారాన్ని పాలన వరకే పరిమితం చేస్తే మంచిది. ప్రతీకార రాజకీయాలకు వాడితే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జూపూడి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. -
‘మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’
ప్రకాశం జిల్లా: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అని కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు ఆదిమూలపు.ఈ మేరకు మంగళవారం మాట్లాడిన ఆదిమూలపు సురేష్.. ‘దళిత యువకులపై పోలీసులు పాశవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రెడ్ బుక్ ర్యాజ్యాగం శ్రుతిమించి అమలు చేస్తున్నారు. నడిరోడ్డు పై కర్రలు విరిగే దాకా పోలీసులు కొట్టడం చూస్తుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తోంది. ఆత్మగౌరవం దెబ్బతినేలా, సభ్య సమాజం తలదుంచుకునేలా పోలీసులు తీరు ఉంది. తెనాలి ఘటనపై హోంమంత్రి బాధ్యత వహించాలి. తక్షణమే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ను, మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తాం. కూటమి ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు. పోలీస్ స్టేషన్ లు ఒక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నాయి’ అని మండిపడ్డారు ఆదిమూలపు సురేష్.కాగా, ముగ్గురు దళిత, మైనారిటీ యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి.. ఇద్దరు పోలీసు అధికారులు లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలాకా గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. యువకుల అరికాళ్లపై పోలీసులు కర్కశంగా లాఠీలతో చితకబాదారు. -
థియేటర్లకు పవన్ మళ్లీ వార్నింగ్
విజయవాడ: కూటమి ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్.. థియేటర్లు తమ బంద్ నిర్ణయాన్ని విరమించినా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ మేరకు థియేటర్లకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్.సినిమా హాళ్లలో ధరలపై విచారణ జరపాలంటూ ఆదేశించారు ఈ మేరకు మంత్రి దుర్గేష్ తో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. సినిమాహాళ్ల బంద్ నిర్ణయంపై సైతం విచారణ జరిపించాలని ఆదేశించారు. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ ధరలపై విచారణకు ఆదేశించారు.తన శాఖకు సంబంధం లేకపోయినా విచారణకు ఆదేశించడం గమనార్హం. దీనిలో భాగంగా పవన్ కల్యాణ్ కార్యాలయం మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో సినిమా టికెట్ల ధరల పెంపునకు రావొద్దని హెచ్చరించింది. ఒకవేళ టికెట్ల ధరలు పెంచాలంటే ఫిలిం చాంబర్ ద్వారా రావాలని ఆదేశాల్లో పేర్కొంది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని ఆదేశాల్లో డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర ఫిలిం డెవలప్ మెంట్ పాలసీ తేవాలని నిర్ణయించారు. గతంలో సినిమా రంగంపై ప్రభుత్వం జోక్యం ఏంటంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వరుస పెట్టి ఇండస్ట్రీని వేధింపులకు గురి చేయడం చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీని లొంగదీసుకుని విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఏంటనే విమర్శ వినిపిస్తోంది. గతంలో టికెట్ల ధరలను నియంత్రించిన సందర్భంలో సైతం అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. ఇలా పవన్ ద్వంద్వ వైఖరి ఏమిటనే విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు. అప్పుడు ఆ రకంగా ఊగిపోయారు.. ఇప్పుడు ఈ రకంగా లొంగదీసుకోవాలని చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
పరాకాష్టకు రెడ్ బుక్ పాలన: విడదల రజిని
సాక్షి, గుంటూరు: గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలే.. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా’’ అంటూ విడదల రజిని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు.‘‘రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరింది. నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో మర్డర్ జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలుగుదేశం వారే చంపారని చెబుతున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ప్రకటించారు...డబుల్ మర్డర్లకు ఉపయోగించిన కారు వెనక జూలకంటి బ్రహ్మారెడ్డి అనే స్టిక్కర్ కూడా ఉంది. చనిపోయిన వారు చంపిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారి అయినప్పుడు ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏంటి సంబంధం?. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై అక్రమంగా కేసు బనాయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ మారుస్తున్నారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పై పెట్టిన అక్రమ కేసును తొలగించాలి. లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని విడదల రజిని హెచ్చరించారు.కట్టుకథలతో కేసులో ఇరికించారు..మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో ఇద్దరు మర్డర్ అయ్యారు. చంపింది తెలుగుదేశం నాయకులు.. చనిపోయింది తెలుగుదేశం నాయకులే అని పల్నాడు SP ప్రకటించాడు. కట్టుకథలతో అద్భుతంగా ఫిర్యాదు ఇచ్చారు. అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని కేసులో ఇరికించారు. -
టీడీపీకి నిజమైన వారసులు ఎవరు?: శైలజానాథ్
సాక్షి అనంతపురం : టీడీపీది మహా నాడు కాదు... దగా నాడు అంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించింది చంద్రబాబే.. టీడీపీకి వారసుడు ఎవరు?. అసలు వారసుడు బాలకృష్ణ దబిడి.. దిబిడి అంటూ తిరుగుతున్నారంటూ శైలజానాథ్ వ్యాఖ్యానించారు.జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలి. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. 1.30 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదు’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు.పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పుజెప్పుతున్నారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా?. టీడీపీలో సీనియర్లకు మంగళం పాడారు. చంద్రబాబును కూడా మారుస్తారేమోనని అనుమానంగా ఉంది. టీడీపీలో ఎన్టీఆర్‌నే గద్దె దించారు? చంద్రబాబు ఎంత?’’ అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. -
షాడో సీఎం లోకేష్.. సకల శాఖ మంత్రిగా నియామకం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీలో ఒకప్పటి క్రియాశీలక నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబే తీసుకుంటున్నారా? లేక ఆయన ఇంకెవరైనా ఉన్నారా? అనే సందేహమూ వ్యక్తమైంది ఆయన్నుంచి!. అలాగే.. అమరావతి కోసం మరిన్ని భూములు సేకరించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్నీ తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం.. అదే సందర్భంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం!. వాస్తవానికి వడ్డే టీడీపీకి పెద్ద వ్యతిరేకి కాదు.. వైఎస్సార్సీపీ మద్దతుదారు కూడా కాదు. వయసు కారణంగా సీరియస్ రాజకీయాలు చేయని ఈయన అప్పుడప్పుడు కొన్ని అంశాలపై మాత్రం స్పందిస్తున్నారు. తాజాగా ఆయనకు చంద్రబాబు తెలివిపై అనుమానం వచ్చింది. ఆయనతో సంబంధం లేకుండా ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు. అదెవరో చెప్పడానికి ఆయన సిద్ధపడలేదు కానీ.. బాబుగారి సుపుత్రుడు, మంత్రి లోకేశ్ అన్నది బహిరంగ రహస్యమే!. ఇటీవలి పరిణామాలు, మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి!. చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడుపుతున్నది నారా లోకేశ్(Nara Lokesh) అన్నది తాజా కథనాల సారాంశం. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం మొదలైంది కూడా లోకేశ్ నేతృత్వంలోనే అనేది అందరికీ తెలిసిన విషయం. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో పేరుతో చెత్త ఏరివేత వంటివి ముఖ్యమంత్రి చూసుకుంటుంటే.. లోకేశ్ ఏమో తన శాఖతో సంబంధం లేని కార్యక్రమాలకూ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం వడ్డే వంటి వారికి అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి!. గుంతకల్లు సమీపంలోని బేతేపల్లి వద్ద 22 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెన్యుబల్ ఎనర్జీ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన చేయడం పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉండగా ఆమోదం పొందింది. ఇప్పుడు శంకుస్థాపన దశకు చేరుకుంది. అది వేరే సంగతి. ఈ ఇంధన ప్రాజెక్టుకు లోకేష్ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేదు. అయినా ఇంత భారీ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుకు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో శంకుస్థాపన జరుగుతుంది. అందులోను చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. కాని అక్కడకు ఆయన వెళ్లలేదు. అదే టైమ్ లో కర్నూలు వద్ద స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ పేరుతో జరిగిన ఒక చిన్న ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఉపన్యాసం చేశారు. ఊళ్లలో చెత్త ఎత్తుతున్నారా? అన్న ప్రశ్నలతోపాటు రోడ్లపై కూరగాయలు అమ్మే వారిని, బడ్డీ కొట్ల వారిని పలకరిస్తూ కాలక్షేపం చేయడం అందరిని విస్తుపరచింది. కొద్దిరోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమ యూనిట్‌కు కూడా లోకేశే భూమి పూజ చేశారు. ఈ మధ్యకాలంలో లోకేశ్ తన ఇంటిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారట!. ఇందులో రాష్ట్రం అంతటి నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారట. మంగళగిరిలో తన పేరు మీద ‘‘మన ఇల్లు- మన లోకేశ్’’ ఒక కార్యక్రమాన్ని కూడా నడుపుతున్నారు. ఆర్థిక శాఖ విషయాల్లోనూ లోకేశ్ జోక్యం పెరుగుతోందని, నిధుల విడుదల వంటివి కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో టెండర్ల ఖరారు, ఇతర వ్యవహారాలు కూడా లోకేశే చూసుకుంటున్నారని సచివాలయం వెళ్లివచ్చిన ఒక ప్రముఖుడు చెప్పారు. సచివాలయంలో, పార్టీ కార్యాలయంలోనూ లోకేశ్ హవానే నడుస్తోందంటున్నారు. ఇక ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భార్య నారా బ్రాహ్మణితో ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.చంద్రబాబు మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదు. డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి హోదాలోని పవన్ కల్యాణ్ సైతం పన్నెత్తు మాట అనలేకపోతున్నట్లు ప్రచారం. తాను ఉప ముఖ్యమంత్రి కాకుండా పవన్ అడ్డుపడ్డారని లోకేశ్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కొన్ని సందర్భాల్లో చెప్పినా అది మొక్కుబడి మాట మాత్రమే. చంద్రబాబు తన కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడితో లోకేశ్‌ను డిప్యూటీ చేసినా పవన్ చేసేదేమీ ఉండదు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఎవరైనా తనను కలిసేందుకు వస్తే చినబాబు (మంత్రి లోకేశ్)ను కలవమని చెబుతుండే వారు. విపక్షంలో ఉండగా లోకేశ్ ‘యువగళం’ యాత్రలో పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా సొంతం పలు హామీలు గుప్పించారు కూడా. అయితే.. 2024లో అనూహ్యంగా అధికారం దక్కడంతో ఆయన రెడ్ బుక్ అమలుకు ఒక ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. లోకేష్ హోం మంత్రి కాకపోయినా ఆ శాఖ మొత్తం ఆయన అధీనంలోనే ఉందని అంటారు. లోకేశ్‌ను ఇప్పటికే కొంతమంది సకల శాఖల మంత్రిగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజా మహానాడులో లోకేష్‌ను పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా చేయవచ్చన్నది ఒక టాక్. అదే జరిగితే ప్రభుత్వంతో పాటు, పార్టీ కూడా పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే ఒక బ్రాండ్ అని లోకేశ్ చెబుతుండొచ్చు. కానీ.. ఆ పేరుతో ఆయన తన సొంత బ్రాండ్‌ను నిర్మించుకుంటున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో చంద్రబాబుపై కుటుంబపరమైన ఒత్తిడి ఉందని అంటారు. కానీ ఆయన ఎందువల్లో ఆ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనే భయమూ ఉండి ఉండవచ్చు. పవన్ కల్యాణ్‌ను గుడ్ హ్యూమర్లో ఉంచడానికి చంద్రబాబు,లోకేష్ లు ప్రయత్నిస్తున్నారు. దానికి పవన్ కూడా సంతృప్తి చెంది.. ప్రభుత్వపరంగా ఏ అరాచకం జరుగుతున్నా, ఎన్ని తప్పులు చోటు చేసుకుంటున్నా నోరు మెదపడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు అధికారికంగా పట్టాభిషేకం జరగలేదు కాని, అటు ప్రభుత్వం, ఇటు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని చంద్రబాబును నామమాత్రంగా చేశారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడడం విశేషం.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.