breaking news
-
‘కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం సడుస్తోంది’
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం.. కుప్పంలో మాత్రం బ్లడ్ బుక్ రాజ్యాంగంతో మరింత అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.‘ కుప్పంలో 32 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పోలీసులు ఒత్తిడి చేసి మరీ వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. కుప్పంలో మేం ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. మేము పోలీసులపై దాడి చేసినట్లు తప్పుడు కేసులు పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం’అని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. -
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్‌లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్‌కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మద్యం మత్తులో రెచ్చిపోయిన సీమరాజా.. పోలీసులకే హుకుం!!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో అహర్నిశలు పని చేసే సీమరాజా.. ఇప్పుడు అధికారం అండతో రెచ్చిపోతున్నాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి కొందరు అమాయకులపై దాడి చేశాడు. పైగా వాళ్ల మీదనే గంజాయి కేసు పెట్టాలంటూ ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సీమరాజా మరికొందరు ఫుల్‌గా మద్యం సేవించి కారులో వెళ్తున్నారు. చిట్వేలి మండలం గొల్లపల్లిలో కారు హరన్ కొడుతున్నా తప్పుకోలేదని కోపంతో ఊగిపోతూ కొందరు యువకులపై అంతా కలిసి దాడికి దిగారు. ఆపై ఆ యువకులను నేరుగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెల్లి వాళ్లపై గంజాయి కేసులు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. తమ తప్పేం లేకున్నా తమపై దాడికి దిగారని, ఇష్టానుసారం చితకబాదారని బాధితులు వాపోతున్నారు.తాను వైఎస్సార్సీపీవాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు సీమరాజా. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పని చేసేది టీడీపీ కోసమేనని తన వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు. మరోవైపు సీమరాజాతో పాటు కిర్రాక్ ఆర్పీపైనా మాజీ మంత్రి అంబటి రాంబాబు మే మొదటి వారంలో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. -
టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతల స్కెచ్!
సాక్షి, అనంతపురం: అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ సుధాకర్ నాయుడు వైరం ఊహించని మలుపు తిరిగింది. టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతలే కుట్రపన్నడం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధిష్టానం అప్రమత్తమైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత సుధాకర్ నాయుడి హత్యకు ఎమ్మెల్యే అనుచరులు స్కెచ్ వేయడం పోలీసుల నిఘాలో బయటపడింది. ఇంట్లోకి చొరబడి మరీ సుధాకర్‌ను హత్య చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ వేశారు. అయితే.. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఈ విషయం కూడా వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సుధాకర్ నాయుడు హత్య కుట్రను భగ్నం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ ఎపిసోడ్‌తో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇద్దరిని అమరావతికి పిలిపించుకుని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తోంది. -
పెల్లుబికిన ప్రజా వ్యతిరేకత
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీస్తూ బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి, కదంతొక్కి విజయవంతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సరిగ్గా ఏడాది క్రితం, జూన్ 4న చంద్రబాబు నాయుడు గొప్ప వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారు. మోసపు హామీలు, ఆయన తప్పుడు ప్రకటనలతో ప్రజలకు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్రాన్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. అందుకే జూన్ 4ను మనం వెన్నుపోటు దినంగా పాటించాలని పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి.. తమ వేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన కాదు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మౌనంగా ఉండబోమంటూ శక్తివంతమైన సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నిరసన ద్వారా చాటిచెప్పారు. మోసపోయిన ప్రజల బాధ, నిరాశ, ఆగ్రహం, పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఈ ర్యాలీలు ప్రతిబింబించాయి. ప్రజల హక్కులు, న్యాయం, గౌరవం కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ జనంతో కలిసి పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల తరఫున నిలదీస్తూ నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేను హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. -
‘వెన్నుపోటు దినం’ సక్సెస్‌పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘వెన్నుపోటు దినం’ సక్సెస్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సంవత్సరం క్రితం చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ, హామీని కానీ అమలు చేయలేదు. తనను నమ్మిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. అందుకే ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. మోసం చేస్తే మౌనంగా ఉండరనే శక్తివంతమైన సందేశాన్ని ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు...బాధిత ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల న్యాయబద్దమైన హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Exactly a year ago, on June 4, Chandrababu Naidu came to power with grand promises, but not a single one has been fulfilled. Instead, he has betrayed the very people who believed in him. His false statements, broken assurances, and blatant backstabbing have pushed the state into… pic.twitter.com/H5Q80sjqrd— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 -
కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత..
అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)ని రక్షించాలని కోరుతూ మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి సంఘీభావం తెలిపారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గొంచితండాలో పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో.. వారికి, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి రెన్యువల్ చేసేదాకా పోరాటం కొనసాగిస్తానని తలారి రంగయ్య స్పష్టం చేశారు. -
బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం: సజ్జల
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ ఇవాళ(బుధవారం, జూన్ 4) చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏడాది గడిచినా అమలు కాలేదు. ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఇవాళ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్సీపీ కష్టాల నుంచే పుట్టింది. మా హయాంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. మూడేళ్లలోనే జరిగింది. అధికారంలోకి రాగానే మేం తొలి ఏడాదిలోనే 99 శాతం హామీలు అమలు చేశాం. కోవిడ్ రెండేళ్లలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిగిలిన మూడేళ్లలోనే 10, 15 ఏళ్ల అభివృద్ధి చూపించాం. విద్య, వైద్య, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. కానీ.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం అయ్యాయి. తొలి ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో(రూ.లక్షా 50వేల కోట్లకు పైగా) చంద్రబాబు అప్పులు చేశారు. ఆ అప్పు ఏం చేశారో తెలియదు. ఏడాదిలోనే రైతులను సంక్షోభంలోకి నెట్టేశారు. పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తేశారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది’’ అని సజ్జల అన్నారు. -
ఏపీకి ట్రబుల్ మేకర్‌గా చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమం కంటే ఎక్కువే అందిస్తానంటూ ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా.. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాడు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమయ్యారు. జగన్ అందించిన నవరత్నాలను పూర్తిగా నాశనం చంద్రబాబు చేశారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారు. చంద్రబాబువి మోసపూరితమైన హామీలు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. మరి ఇప్పుడు ఏడాది పాలనకే రూ.లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారు. అలాంటప్పుడు ఏపీ ఇప్పుడేం అవుతుంది?. రైతులు, వలంటీర్లు, ఎండీయూ వాహనదారులు.. ఇలా అందరినీ దగా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం దుర్మార్గం. .. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. తెనాలిలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను పోలీసులు రోడ్లమీద కొట్టడం దారుణం. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం.... విజయవాడ నగరాన్ని చెత్త నగరంగా మార్చింది కూటమి ప్రభుత్వమే. బుడమేరుకు వరద వస్తుందని తెలిసి కూడా ప్రజలకు ఎలాంటి సమాచారం అందించలేదు. శాతవాహన కాలేజీకి ప్రిన్సిపల్ కిడ్నాప్ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోనే సంచలనగా మారింది. ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్, ఇంటింటికి రేషన్ ఇవన్నీ గోవిందా!. అప్పట్లో ఎన్టీఆర్‌ను ఎలా మోసం చేశారో.. ప్రజలను కూడా చంద్రబాబు ఇవాళ అలాగే మోసం చేశారు. ఈ రోజు వెన్నుపోటు దినం.. వంచన దినం. కాపుల ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఇసుక కొట్టేసిన కూటమి నేతలు హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రమంతా అవినీతిమయంగా మారింది అని వెల్లంపల్లి అన్నారు. డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సంవత్సర కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ సిక్స్‌లో ఇప్పటిదాకా ఎన్ని హామీలు నెరవేర్చారు?. చంద్రబాబే స్వయంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని.. పథకాలు ఇవ్వలేనని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. మల్లాది విష్ణు ఆధ్వరంలో ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. -
అప్పుడు.. మళ్లీ ఇప్పుడు.. అధికారం కోసమే బాబు వెన్నుపోటు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఏడాది కాలంలో చేసిన అప్పులకు చంద్రబాబులో జవాబుదారితనం లేదని.. కానీ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో ఆయన ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీనిని బట్టే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అర్థమవుతోంది. అప్పుడు చంద్రబాబు అధికారంకోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ఉచిత హామీలు పేరుతో ఏడాది కాలంగా ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చిన లక్షా 51వేల కోట్ల రూపాయాల అప్పులకు జవాబు చెప్పే పరిస్థితిలో ఆయన లేరు. కానీ, ప్రజలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాగ్ కూడా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపింది. .. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ విలాసాలకు హెలికాప్టర్లను, విమానాలను కొనుగోలు చేశారు. సాయంత్రం కాగానే హైదరాబాద్‌కు, పగలు అమరావతికి తిరుగుతున్నారు. సెకీతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యూనిట్ కు సోలార్ ఎనర్జీ 2.49 పైసలు ఒప్పందం చేసుకుంటే పెద్ద రాద్దాంతం చేసిన ఎల్లో మీడియా.. ఇవాళే చంద్రబాబు సర్కారుకు యూనిట్ కు 4.60 పైసల కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుని 11వేల కోట్లు అవినీతికి పాల్పడింది. ఏడాది కాలంలో ఎన్నికోట్లు ఉచిత గ్యాస్ కు ఖర్చు చేశారో వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు సరైన ధర లేక పొలాల్లో మామిడి పంట విడిచి పెట్టేశారు. పొగాకు, మిర్చి , టమోటో రైతులుది ఇదే పరిస్థితి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల్ని టార్గెట్ చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పార్టీకి చెందిన దళిత నేతలు ను తప్పుడు కేసులతో అరెస్ట్ చేయిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి 26 లక్షలు మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఎంతో సక్రమంగా ఫలితాలు పారదర్శకంగా ప్రకటించారు. కానీ, ఇవాళ పదో తరగతి పరీక్షలు ఫలితాలు తప్పడు తడకగా ప్రకటించి విద్యార్ధులు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హయంలో పదో తరగతి పరీక్షలు ఫలితాల్లో తప్పిదాలు జరిగితే.. నాటి మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడితో రాజీనామా చేయించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పదో తరగతి తప్పుడు ఫలితాలు పై కొడుకు మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయించాలి అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. వెన్నుపోటు దినం నిరసనల్లో అనీషా రెడ్డి, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజల ఉసురుతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది
సాక్షి,గన్నవరం: పథకాలు అడిగితే ఖజానా ఖాళీ అంటారు. లోకేష్, పవన్, చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడటానికి ప్రజల సొమ్ముతో తిరుగుతారు. అమ్మఒడి అడిగితే ఇవ్వరు. ప్రశ్నిస్తే నోరుమెదపరని కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు.వెన్నుపోటు దినం కార్యక్రమంలో పేర్నినాని మాట్లాడుతూ.. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు. వైఎస్ జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు. 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు.ఉచిత బస్సు తుస్సు మంది. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి.పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు.పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది.. రూపాయి లేదని చెబుతారు. ప్రజల సొమ్ముతో విలాస జీవితం గడుపుతారు. భార్య పిల్లల్ని చూసేందుకు, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు. చికెన్‌లో కమిషన్ అడుగుతారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు లిక్కర్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు.ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు.రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు.దేవుడి ఆస్తి ని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారు. అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులు కు మాత్రమే అంటున్నారు. ప్రధాని మోదీని,ఆయన సతీమణినీ తిట్టిన చంద్రబాబుకు పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి. గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చ కు రమంటే పారిపోయాడు. వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు.2019లో ఇళ్ల దొంగపట్టాలు చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? తప్పు ఉంటే ఎమ్మార్వోని జైల్లో వేయాలన్నారు. వంశీపై తప్పుడు కేసు పెట్టాడు. ఆస్తి తగాదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు. వంశీపై 11 కేసులు పెట్టారు. మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు. వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది. ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. -
ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం మొదలైంది: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయం పై పేద ప్రజలు పక్షనా పోరాటాలు కొనసాగిస్తాం.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పూరించిన సమరశంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం అయ్యింది అని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి నీచ చరిత్ర చంద్రబాబుది: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక పథకం అందించలేకపోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన. ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్షా 55,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక పథకం అందిచలేకపోయింది. .. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్‌కి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి అయితే.. మిగిలిన పది శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కూటమి వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా
సాక్షి,నగరి: ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తామని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో నగరి నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను,మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు.పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు.పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’అని హెచ్చరికలు జారీ చేశారు. -
అవకాశవాదమే పవన్ సిద్ధాంతం!
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ద్వారా తనదైన రాజకీయ క్రీడ సాగిస్తోందా? కొంతకాలం క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అవుననే అనిపిస్తోంది. బీజేపీ అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఈ అవకాశవాదాన్నే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరుణ తనపై ఉంటే రాజకీయాల్లో ఢోకా ఉండదన్న ధీమాతో పవన్ అనుకుంటున్నారు. అలాగే తమిళనాట పవన్ సినిమా గ్లామర్ తనకు ఓట్లు తెచ్చిపెడుతుందని బీజేపీ కూడా భావిస్తోంది. అన్నాడీఎంకేతో పెట్టుకున్న పొత్తుతో తమిళనాడులో పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడ. పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండాను భుజాన వేసుకుని తిరుగుతుండడం చూస్తుంటే, భవిష్యత్తులో ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి కొత్త ప్లాన్ అమలు చేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. గత అనుభవాల రీత్యా టీడీపీ రాష్ట్రంలో బీజేపీను అంటిపెట్టుకుని ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయినా వచ్చే కాలంలో బీజేపీ, జనసేనలు ఏపీలో కూడా సొంత అజెండాతో ముందుకు వచ్చి టీడీపీని వెనక్కి నెట్టినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి దీనికి ప్రాతిపదిక కనిపించక పోవచ్చు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్లి జమిలి ఎన్నికలపై మాట్లాడి వచ్చారు. దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బాగుకు జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓకే కానీ.. పవన్ గతంలో దీనికి పూర్తి వ్యతిరేక భావజాలమున్న పార్టీలతో కలిసి పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై ఒకసారి మంచిదని.. ఇంకోసారి అవి మోడీ నియంతృత్వ ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రజలు వీటిలో దేన్ని నమ్మాలి? ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు కనుక వారి భావజాలానికి మద్దతు ఇస్తున్నారు. గతంలో పవన్, చంద్రబాబు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీలతో కలిసి పోటీ చేశారు. ఆ పార్టీలు బీజేపీ సిద్దాంతాలకు పూర్తి వ్యతిరేకం. జమిలి ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, రాష్ట్రాల హక్కులను హరించడానికే ఈ ప్రతిపాదన అని కమ్యూనిస్టులు విమర్శిస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలతో కలిసి పోటీచేసి ఓడిపోయిన తర్వాత మొత్తం ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్ బీజేపీని బతిమలాడుకుని వారితో కలిశారు. సినీ నటుడు కనుక ఎందుకైనా పనికి వస్తారులే అని బీజేపీ కూడా ఓకే చేసింది. చంద్రబాబు నాయుడు అయితే జమిలి ఎన్నికలు మంచిదేనని 2004 కి ముందు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు అనేవారు. ఆ తర్వాత కాలంలో ఆయన కూడా కమ్యూనిస్టులతోను, టీఆర్ఎస్తోను జత కట్టారు.అప్పుడు ఫలితం దక్కకపోవడంతో తిరిగి బీజేపీ చెంతకు చేరారు. 2014లో అధికారంలోకి వచ్చినా, 2018 నాటికి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు.ఆ సమయంలో ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, బీజేపీ విధానాలన్నిటిని తీవ్రంగా దుయ్యబట్టేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్,తదితర బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి జమిలి ఎన్నికలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన రాగం ఆలపించారు. పశ్చిమ బెంగాల్ లో షర్మిష్ట అనే యూట్యూబర్‌ను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మళ్లీ ప్రస్తావించారు. ఏపీలో సోషల్ మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తుంటే పవన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తిరుమల లడ్డూపై అపచారపు మాటలతో సహా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణే సనాతన ధర్మం కాదు కదా.. అసలు ధర్మమే పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో సనాతనం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదు. అవకాశవాదమే తమ సిద్దాంతంగా వీరు మలచుకుని రాజకీయాలు చేస్తూ కొంత సఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఏవో కొత్త ఆశలు కలిగి ఉండాలి. ప్రధాని మోడీ ఈయనకు పిలిచి మరీ చాక్ లెట్ ఇచ్చిన ఉత్సాహం ఎటూ ఉంది. దాంతో ఆయన తమిళనాడు వెళ్లి డీఎంకేకి వ్యతిరేకంగా ప్రచారం ఆరంభించారు. జమిలి ఎన్నికలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు ఇవ్వాలని కోరారు. కరుణానిధి జమిలిని సపోర్టు చేశారని, ఇప్పుడు అందుకు విరుద్దంగా ఆయన కుమారుడు ఎలా వెళతారని పవన్ ప్రశ్నించడం ఆశ్చర్యమే. అందుకే పవన్ పై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. తన తండ్రి కమ్యూనిస్టు ని పవనే చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు బీజేపీతో ఎలా స్నేహం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే,ఆయనను గౌరవించి ఎందుకు ఆ పార్టీలో చేరలేదని మరొకరు ప్రశ్నించారు. స్టాలిన్ ను విమర్శించే ముందు తను చేసిందేమిటో గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే తమిళనాడు ప్రజలకు ఈ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చన్నది ఆయన విశ్వాసం కావచ్చు. అలాగే ఈవీఎంల గురించి పవన్ మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2019లో ఈవీఎంల వల్ల కూడా వైసీపీ గెలిచి ఉండవచ్చని చెప్పిన ఈయన 2024లో మాత్రం ఈవీఎంలను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. బహుశా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మాదిరి మాటలు మార్చిన వారు ,ఎప్పుడు ఏది అవసరమైతే దానిని మాట్లాడేవారు దేశ రాజకీయాలలో మరొకరు ఉండకపోవచ్చు. జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం చదివినట్లు అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఆ విషయం వేరే చెప్పనవసరం లేదు. అదే సందర్భంలో సనాతన ధర్మంపై అడిగిన ప్రశ్నకు ఈ భూమి సనాతన ధర్మానిది అని, భారతీయ సంస్కృతిలోనే ఉందని ఆయన అన్నారు. వినడానికి, చెప్పడానికే బాగానే ఉంటుంది. కాని ఆచరణలో పవన్ ధర్మంగా ఉంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. సడన్ గా సనాతని వేషం దాల్చి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అపచారపు మాటలు ,అబద్దాలు చెప్పాలని ఏ ధర్మం చెబుతుందో ఆయనకే తెలియాలి. కులం, మతం అన్ని విషయాలలో పవన్ ఎన్ని అసత్యాలు చెప్పారో పలు వీడియోలు తెలియ చేస్తాయి. కొందరు ఇస్లాం, క్రిస్టియానిటిపై దాడి చేయరట. హిందూ మతంపైనే దాడి చేస్తారట. ఎల్లో మీడియాలోనే ఈ కథనం వచ్చింది. ఇది చదివితే ఏమనిపిస్తుంది.అన్ని మతాలు సమానం.. ఎవరూ ఎవరిపై దాడి చేయవద్దని చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి అచ్చంగా బీజేపీ భాషను అరువుకు తీసుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంతకాలం సహిస్తాం...హిందువులకు ఉన్నది ఒకటే దేశం..అదే ముస్లింలపై దాడి జరిగితే ఊరుకుంటారా..అంటూ యుద్దం చేయాలన్నట్లుగా మాట్లాడిన ఆయన, తదుపరి ఒకటి,రెండు రోజులకే ఏమని అన్నారు.. భారతదేశం శాంతి కోరుకుంటుంది.. సంయమనంగా ఉంటుంది..అని మాట మార్చేశారే. పనిలో పని ఆయన 1985, 1986 ప్రాంతంలో కశ్మీర్లో షూటింగ్ లలోపాల్గొన్నట్లు ఏదో కూడా చెప్పారు కదా! దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వచ్చిన వార్తలు చూస్తే నవ్వు వస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టింది 1971లో అయితే 15 ఏళ్లకే ఎప్పుడు సినిమాలలో నటించారని నెటిజన్లు ప్రశ్నించారు. ఇలా అనేక విషయాలలో రెండు నాలుకల దోరణి అవలంభించే పవన్ కళ్యాణ్ కు పెద్దగా సిద్దాంత, రాద్దాంతాల పని ఉండదన్న భావనతో బీజేపీ ఈయనను తన గేమ్ లో ఒక పావుగా మార్చుకుని ప్రచారానికి వాడుకున్నట్లు ఉంది.ఆంధ్ర ప్రజల మాదిరి తమిళ ప్రజలు ఈ మాటలకు బోల్తా పడతారా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Vennupotu Dinam: నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం
సాక్షి, గుంటూరు: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చి.. ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏడాదిగా ఆ హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’(Vennupotu Dinam)గా పాటించాలని నిర్ణయించి నిరసనలకు దిగింది.👉చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటుకూటమి ప్రభుత్వత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనవెన్నుపోటు దినంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలుకూటమి సర్కార్ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజాగ్రహంచంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు👉ప్రకాశం జిల్లా:చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజుఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజు ఈరోజుఅప్పుడు మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారుచంద్రబాబు గతంలో కూడా చెప్పిన హామీలను నెరవేసిన ఘనత ఎప్పుడూ లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారుచంద్రబాబు మారాడు మారాడు అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ మారడుచంద్రబాబు ఎప్పటికీ మారకపోవడం, వెన్నుపోటు ఆయన రక్తంలోనే ఉందిఅందుకే ఈరోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 👉నంద్యాల జిల్లా డోన్‌లో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంవెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందిఅధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారుగత ప్రభుత్వంలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు.కరెంట్ బిల్లులు పెంచబోమని చెప్పి ఇష్టం వచ్చినట్లు పెంచి, సూపర్ సిక్స్ అంటూ పిల్లల నుంచి ముసలి వారి వరకు మోసం చేసారు.సంపద సృష్టిస్తాం అని చెప్పి చివరకు పథకాల హామీలలో చేతులు ఎత్తేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు 👉వైఎస్ఆర్ జిల్లాపులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ. 1500, రైతన్నలకు ఏడాదికి ూ. 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేదు👉తిరుపతి జిల్లా :నేడు వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినానికి పిలుపు.కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదుప్రజలను వెన్నుపోటు పొడిచారు చంద్రబాబునాయుడు.చంద్రబాబునాయుడు చేసిన మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చిన మాజీ మంత్రి రోజా.ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలిరెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచెయ్యాలికూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాముకూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది.విద్యార్థులను, మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వంఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదుపవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదుపదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలికూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం👉పశ్చిమగోదావరి జిల్లా:వైఎస్ జగన్ పిలుపు మేరకు భాగంగా తణుకులో వెన్నుపోటు దినం మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజలు👉పశ్చిమగోదావరి జిల్లా:పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు వెన్ను పోటు దినంపాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జీ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్‌కు వినతిపత్రంవెన్నుపోటు దినం ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎస్ఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేవర్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శిప్రధాన కార్యదర్శి కర్ర జయ సరిత, పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, వైసీపీ శ్రేణులు👉పశ్చిమగోదావరి జిల్లా:పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంఅంబేద్కర్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా:రావులపాలెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆగ్రహం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం పేరిట పెద్ద ఎత్తున నిరసనపెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు రావులపాలెం పార్టీ కార్యాలయం నుంచి రావులపాడు జంక్షన్ మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ..👉ఎన్టీఆర్ జిల్లాతిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీర్యాలీలో పాల్గొన్న నాలుగు మండలాల పార్టీ శ్రేణులు..బొసబొమ్మ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సర్కిల్ కార్యాలయం వైఎస్సార్ విగ్రహానికి నల్లగట్ల స్వామిదాస్ నివాళులు చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు👉అనకాపల్లి జిల్లా: అనకాపల్లిలో ప్రారంభమైన వెన్నుపోటు దినం కార్యక్రమం పాల్గొన్న అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు👉విశాఖ .. ఈస్ట్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెన్నుపోటు దినంగురజాడ కళాక్షేత్రం నుంచి జిల్లా పరిషత్ వరకు నిరసన కార్యక్రమం ఈస్ట్ ఇంచార్జి మళ్లీ అప్పారావుభారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు👉గుంటూరు:గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంపాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతన మహేష్ ,గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు👉విజయవాడతూర్పు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంభారీ ర్యాలీ నిర్వహించిన వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు👉గన్నవరంఎమ్మార్వో ఆఫీస్ ముందు బైటాయించి నిరసన తెలుపుతున్న పేర్ని నానిముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారుజగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారుజగన్ చెప్పిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు ఉచిత బస్సు తుస్సు మందిసంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారురోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయిపనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదుపథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉందిరూపాయి లేదని చెపుతారులోకేష్ పవన్ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారులోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడనైకి ప్రజల సొమ్ముతో తిరుగుతాడుఅమ్మ ఓడికి ఇవ్వలేదు ఒక్కరు నోరు మెదపరుదోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారుచికెన్లో కూడా కమిషన్ అడుగుతారుMla లు MLC లు బ్రాందీ యాపరంలో మునిగి తెలుతున్నారు ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారురాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారుదేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారుఅన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులకు మాత్రమే అంటున్నారుమోడీని, మోడీ భార్యని తిట్టి. మోడీకి చంద్రబాబు, పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలిగన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చకు రమంటే పారిపోయాడు వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు 2019లో పట్టాలు దొంగపట్టాలను ఇప్పుడు చంద్రబాబుకి గుర్తుకు వచ్చింది తప్పు ఉంటే MROని జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టాడు ఆస్తి తగదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు వంశీ పై 11 కేసులు పెట్టారు మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు.. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది👉ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన వెన్నుపోటు దినంమైలవరం పట్టణంలో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంభారీగా హాజరైన కార్యకర్తలు అభిమానులు నాయకులుకూటమి పాలనను నిరసిస్తూ నినాదాలు👉అనంతపురం:చంద్రబాబు మోసాలపై ఉరవకొండలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉరగాద్రి ఫంక్షన్ హాల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన.👉అనంతపురం: రాయదుర్గంలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంవినాయక సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉గన్నవరంవైఎస్సార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నానివెన్నుపోటు కార్యక్రమానికి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్‌కు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు👉విశాఖ:పశ్చిమ నియోజకవర్గంలో వెన్నుపోటు నిరసనగాజువాక డిపో వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకులు సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ 👉కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ..పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు సబ్ కలెక్టర్‌కు మెమోరాండం అందజేత 👉అన్నమయ్య జిల్లా:రాజంపేటలో పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూటమి పాలనపై నిరసనగా విశేషంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొంటున్నారు👉తిరుపతి: ఈ ప్రభుత్వంపై ప్రజలు పూరిస్తున్న మొదటి శంఖారావంచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాంమాపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాంప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అమ్మకు వందనం, నిరుద్యోగులకు 3వేల రూపాయలు ఇవ్వలేదుఏడాది కాలంలో పార్టీ నాయకులపై 2666 పై కక్ష్య సాధింపు చర్యలు చేశారు796 మందిపై హత్య ప్రయత్నం చేశారు 380 మందిని అరెస్ట్ చేయించారుఅక్క చెల్లెమ్మలు తో ఈరోజు నుంచి పోరాటాలు ప్రారంభం అయ్యాయితిరుపతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తాం , వారికి అండగా నిలుస్తాముడాక్టర్ శిరీష, మేయర్ కామెంట్స్వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారుఅమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారుసంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందిభూమన అభినయ్ రెడ్డి ఈరోజు తిరుపతి లో ఈ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారురాష్ట్రంలో మొదటిగా ప్రభుత్వంపై గళం విప్పిన నియోజకవర్గం తిరుపతి కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటాం👉శ్రీసత్యసాయి జిల్లా:పెనుకొండలో చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం కార్యక్రమంమాజీమంత్రి, జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భారీ ర్యాలీపార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ. నిరసన ప్రదర్శన.👉వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో..పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం చేయలేదు 👉అనంతపురం జిల్లా:కళ్యాణదుర్గం మండల కేంద్రంలో చంద్రబాబు మోసాల పై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విన్సెంనెట్ పెరర్ విగ్రహం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉అనంతపురం గుంతకల్లులో చంద్రబాబు మోసాలపై గుంతకల్లులో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి.👉శ్రీ సత్య సాయి జిల్లాలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపీ నేతలు వెన్నపూస రవీందర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ పార్టీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులుప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుండి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీమునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వనున్న మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు👉శ్రీ సత్యసాయి జిల్లా: చంద్రబాబు మోసాలపై పుట్టపర్తి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ👉అనంతపురంలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అనంతపురం నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన👉తిరుపతి, సత్యనారాయణపురంలో.. సత్యనారాయణ పురం సర్కిల్ నుంచి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ కార్యక్రమం. పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు👉విజయనగరం జిల్లా, బొబ్బిలిలో..బొబ్బిలిలో మొదలైన ర్యాలీబొబ్బిలి వైయస్సార్సీపి ఆద్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ.అబద్దపు హామీల కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన.హాజరైన మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు.👉అనకాపల్లి. నర్సీపట్నంవెన్నుపోటు కార్యక్రమంనకు ఆటంకాలు పెడుతున్న కూటమి ప్రభుత్వం.నర్సీపట్నం లో నిరసనకు బైక్ ర్యాలీ కి నెల రోజులముందు దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్.నిన్నటి వరకు సమాధానం చెప్పని పోలీస్.నిన్న సాయంత్రం బైక్‌లతో కాకుండా పాదయాత్ర కు మాత్రమే అనుమతి అంటూ నోటీసులు ఇచ్చిన పోలీస్.ర్యాలీ కి వస్తున్న ప్రజలపై కేసులు రాస్తూ భయాందోళన కలిగిస్తున్న పోలీసులు.👉అనంతపురం:మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంచంద్రబాబు సర్కార్ మోసాలపై యాడికిలో నిరసన కార్యక్రమం ఏర్పాట్లు ఏర్పాట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్రమత్తమైన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టు అనుమతిఅయినా, అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం 👉విజయనగరం జిల్లా: శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణనేడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలుకూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నిరసనలుచీపురుపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంపాల్గొననున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వంఆర్బీఐ సెక్యురిటీల వేలం ద్వారా అప్పుల సమీకరణచంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులుఇప్పటివరకు లక్ష 51 వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వంప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వంఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటునమ్మించి.. నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంసూపర్ సిక్స్ సహా 143 హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో నాడు ఇంటింటా బాండ్లు పంపిణీఏడాదిలో రూ.1,51,604 కోట్లు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయని సర్కారుహామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్‌బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనంటీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాటఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపుఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలుతక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్లకు, అధికారులకు ఆ హామీల డిమాండ్ పత్రాలు ఇవ్వనున్న నేతలు -
ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి: వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా తయారైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తెనాలి ఘటన సహా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇవాళ తెనాలిలో తన పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు.‘‘తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. వారిలో ఒకరు జూనియర్ అడ్వకేట్, మరొకరు పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్, మూడో యువకుడు మెకానిక్. ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, మిగతా ఇద్దరూ మంగళగిరికి చెందినవారు. మంగళలగిరికి చెందిన యువకులను తెనాలి పోలీసులు అరెస్టు చేశారు...ఆ యువకులను తీవ్రంగా గాయపరచటమే కాకుండా దారుణంగా అవమానపరిచారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ కేసు పెట్టారు. ఈ కేసు తర్వాతనే వారిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు కోర్టుల అధికారాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాల రాయటమే’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అదే తెనాలిలో ఒక మార్వాడీ యువకుడు పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో కూడా ఎస్ఐ రమేష్ బాబు ఒక ఇంట్లోకి చొరపబడి మహిళపై దాడి చేశాడు. వారి అనుమతి లేకుండా సీసీటీవీ పుటేజీ తీసుకెళ్లారు. అదేమని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మనుషులు కిడ్నాప్ చేస్తే సరైన చర్యలే తీసుకోలేదు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Today, I visited Tenali and raised a serious concern about the growing high-handedness of the police under the @ncbn Garu-led government.In Tenali, three Dalit and minority youths were brutally assaulted by the police without any legal basis—one a junior advocate, another a… pic.twitter.com/vuvKiJidBn— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2025 -
కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు.‘‘తుని సభ సమయంలో రైలు తగులపడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మీద దాడి చేసి, ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య తదితరులంతా హైదరాబాదులో సమావేశం అయ్యాం. ముద్రగడ పద్మనాభం ఒంటిరి కాదు. ఆయన వెనుక మా కాపుజాతి అంతా ఉంది. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. కోర్టు సైతం కేసులను కొట్టేసింది. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘దీనిపై మేమంతా సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా?. అలా వచ్చి ఉంటే వారంత అసమర్థులు మరెవరు ఉండరు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. తనది డేగ కన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా?. చంద్రబాబుది డేగ కన్ను కాదు, గుడ్డికన్ను. తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని.. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. నడిరోడ్డులో యువకులపై పోలీసుల థర్డ్ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మా హయాంలో ప్రతీ వర్గానికి సంక్షేమం అందింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)లో ప్రతి వ్యవస్థ నీరుగారింది. ఫీజురీయింబర్స్‌మెంట్ కింద 3,600 కోట్ల రూపాయిలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాళా తీసింది. రైతు భరోసా లేదు. ఉచిత పంటల బీమా, ఈ-క్రాప్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం(Vennupotu Dinam) నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్ పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: ప్రశ్నించడమే ఆ యువకుల తప్పా? -
నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: వైఎస్ జగన్
సాక్షి, తెనాలి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని.. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్‌బుక్‌తో వేధించి హింసిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యం. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారు. రాకేష్ హైదరాబాద్‌లో జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు తెనాలిలోనే ఉండడం లేదు. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. రాకేష్‌ను చూడడానికి అతని స్నేహితులు వచ్చారు. వాళ్లు కూడా మంగళగిరి నుంచి వచ్చారు. జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్. బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా ఉంది. ఐతా నగర్లో సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గోవడ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవపడుతున్న కానిస్టేబుల్‌ను వీళ్లు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్‌ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్పా?. ఏప్రిల్ 24న కానిస్టేబుల్‌ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. తెనాలి పీఎస్‌లో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్ 26న ఐతానగర్లో నడిరోడ్డు మీద పడేసి ముగ్గురిని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నా పోలీసులు వదల్లేదు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసికొట్టారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారు. ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్ సీఐ, మరో పీఎస్ సీఐ కూడా ఉన్నారు. ఇద్దరూ వీఆర్వో సమక్షంలో పంచనామా రాసుకున్నారు. అరెస్ట్ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురి మీద రౌడీషీట్ తెరిచారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది అర్థమవుతోంది. పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా.. ఎల్లో మీడియా బ్యాచ్ దారుణంగా కథనాలు ఇచ్చింది. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లంటూ పరువు తీస్తూ కథనాలు ఇచ్చాయి. కేసులు ఎవరి మీదా అయినా ఉండొచ్చు. ఆ వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా?. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా?. ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఇది ధర్మమేనా?. పరువు, ప్రతిష్టలు తీసే హక్కు పోసులకు ఉందా?. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు? అని జగన్ ప్రశ్నించారు. -
తెనాలి: వైఎస్ జగన్ భద్రతలో లోపాలు
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. మళ్లీ అదే.. అదే నిర్లక్ష్యం వహిస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగా వ్యవహరించింది. భారీగా జనసందోహం వస్తారని తెలిసి కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం.. అరకోర సిబ్బందిని కేటాయించినా వాళ్లు పట్టిపట్టనట్లుగా వ్యవహారించడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది.పోలీసుల చేతిలో హింసకు గురైన బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ తెనాలి వెళ్లారు. మార్గమధ్యంలో.. చింతలపూడి చెక్ పోస్టు నుంచి జగన్ కాన్వాయ్‌కు ఆటంకాలు కలిగాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను పోలీసులు కావాలనే నిలవరించలేదని స్పష్టమైంది. ఇక.. తెనాలిలోకి ఎంటరయ్యాక కూడా రోప్ పార్టీ కనిపించలేదు. దీంతో కార్యకర్తలే జగన్ వాహనానికి రక్షణగా నిలిచి ముందుకు తీసుకెళ్లారు. చివరకు ఐతా నగర్‌లోని జాన్ విక్టర్ ఇంటి వద్దకు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. మరోవైపు.. జగన్ వచ్చేదాకా కూడా ఆ ఇంటి వద్ద ఒక్క పోలీసు సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు.. జగన్ తెనాలి పర్యటనలో భద్రతాలోపాలపై వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వం, పోలీసులపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ధైర్యం బాబు, పవన్‌తో సహా ఎవరికీ లేదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రి కావడంతో ఆ రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. విప్లవాత్మక మార్పులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ శెభాష్ అనిపించుకున్నట్లే.. లోకేశ్ కూడా విద్యాశాఖను ముందు తీసుకెళతారని అనుకున్నారు. కానీ ఏడాది తిరక్కుండానే ప్రశంసల మాటెలా ఉన్నా.. తీవ్ర నిరాశకైతే గురి చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న అభిప్రాయం ఇది. ఉపాధ్యాయులు పరీక్ష పత్రాలు దిద్దిన తీరు, ఫెయిల్ అయిన వారిలో అరవై శాతం మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తున్న చేసుకోవడం, ఏకంగా 11 వేల పత్రాల వాల్యుయేషన్‌లో తప్పులు దొర్లినట్లు స్పష్టం కావడం చూస్తూంటే.. మంత్రిగా లోకేశ్ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యావేత్తలే వ్యాఖ్యానిస్తున్నారు. హడావుడిగా పరీక్ష పత్రాలు దిద్దాల్సి రావడం వల్ల ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యారని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ తోడవడంతోనే ఇంత స్థాయిలో తప్పులు దొర్లాయని వీరు విశ్లేషిస్తున్నారు. విద్యా వ్యవస్థలో తానేదో రికార్డు సృష్టించానని చెప్పుకునేందుకు లోకేశ్ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించడంతో ఈ గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి తన కుమారుడు కాకపోయి ఉంటే ఈపాటికి చంద్రబాబు నాయుడు ఆ మంత్రికి ఎంత స్థాయిలో క్లాస్ పీకి ఉండేవారు చెప్పలేం. కొడుకు కావడంతో ఏమీ అనలేని పరిస్థితి. పైగా లోకేశ్ ఇప్పుడు సర్వశాఖల మంత్రిగా పెత్తనం కూడా చెలాయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘రెడ్‌బుక్’ అంటూ వైఎస్సార్సీపీ నేతలను, టీడీపీ విధానాలను వ్యతిరేకించేవారిని వేధించి, జైళ్లలో పెట్టేందుకు లోకేశ్ చూపుతున్న శ్రద్ధలో ఏ కొంచెం తన మంత్రిత్వ శాఖపై చూపి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడిది కాదేమో!. లోకేశ్ బహుశా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖను ఎంచుకుని ఉండవచ్చు కానీ.. వచ్చిన అవకాశాన్ని ఆయన ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారన్నది వాస్తవం. పైగా గత ప్రభుత్వంలో జగన్ ఈ రంగంలో చేసిన మంచిని కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తూండటం వల్ల విద్యా రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. 👉విపక్షంలో ఉండగా టీడీపీ ఉపాధ్యాయులను రకరకాలుగా రెచ్చగొట్టింది. ప్రభుత్వ టీచర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని అపార్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు మేలని భావించారు. కానీ.. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంగ్లీషు మీడియంను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ మాధ్యమం ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించాలనుకున్న జగన్ సంకల్పానికి గండికొట్టేశారు. కింది తరగతుల నుంచే ప్రవేశపెట్టిన ఐబీ కరిక్యులమ్, టోఫెల్ తదితరాలను తీసేశారు. 👉విశేషం ఏమిటంటే ఇదే చంద్రబాబు, పవన్ , లోకేశ్‌లు తమ పర్యటనలలో కొన్నిసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి జగన్ టైమ్ లో జరిగిన మార్పులు చూసి ఆశ్చర్యపోవడం!. ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్దుల తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చి అందులో రూ.వెయ్యి టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తే టీడీపీ, జనసేనలు తప్పు పట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలు ఒకొక్కరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని బీరాలు పలికాయి కూడా. అధికారమైతే వచ్చింది కాని ‘అమ్మ ఒడి’ పథకం అసలుకే మోసం వచ్చింది. ఇవన్ని ఒక ఎత్తు.. టెన్త్ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడేలా వాల్యుయేషన్ జరగడం మాత్రం ఇంకో ఎత్తు. లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది కరెక్టా? కాదా? అనేదానిపై లోకేశ్ వివరణ ఇవ్వాలి. నిజమైతే.. తప్పు చేసిన టీచర్లు ఎంత బాధ్యులో, మంత్రిగా లోకేశ్ కూడా అంతే బాద్యుడు అవుతారు!. 👉గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్నిచోట్ల పశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దాని కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. లోకేశ్‌ను రాజీనామా చేయాలని అడిగే ధైర్యం చంద్రబాబు, పవన్‌తోసహా కూటమి నేతలలో ఎవరికి ఉండకపోవచ్చు. అంతమాత్రాన తన తప్పు ఏమిటో తెలుసుకుని సరిదిద్దుకోవడం పోయి గత ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్దులకు ఉపశమనం కలుగుతుందా?. 👉ఎంతసేపు రెడ్ బుక్ గోలే కాదు.. తన శాఖలో జరుగుతున్న పరిణామాలను నారా లోకేష్ అర్థం చేసుకోవాలి. కొద్దికాలం క్రితం తమకు విద్యా శాఖకు సంబందించి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. తప్పు లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వ్యక్తి కాదు కాబట్టి. పేద విద్యార్దుల బాధలు తెలిసిన వారు కాదు కాబట్టి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన లోకేష్ ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుకున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అయినా లోతుగా అధ్యయనం చేసి ఉండాల్సింది. 👉టెన్త్ లో 66 వేల మంది మార్కుల వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి ఏటా ఎంతో కొంతమంది ఇలా దరఖాస్తులు పెట్టుకుంటారు. కొన్ని తప్పులు జరిగితే సరి చేస్తారు. కాని ఈసారి విద్యార్ధులు విభ్రాంతి చెందేలా పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు.. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన గంగిరెడ్డి మోక్షిత పదో తరగతిలో ఫెయిల్ అయినట్లు ఫలితాలలో తెలిపారు. ఆమె తల్లిదండ్రులు వెరిఫికేషన్ పెడితే ఆమెకు సోషల్‌లో 84 మార్కులు వచ్చినట్లు తేలింది. అంతకుముందు సోషల్ సబ్జెక్టులో 21 మార్కులే వచ్చాయని ప్రకటించారు. ఇంత దారుణంగా వ్యత్యాసం ఉంటే విద్యార్ధుల భవిష్యత్తు ఏమి కావాలి. మరో విద్యార్ధికి వెరిఫికేషన్‌లో హిందీలో నాలుగు ప్రశ్నలకు రాసిన జవాబులకు సున్నా మార్కులు వేసేశారట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మరో విద్యార్ధికి ఇంగ్లీష్‌లో తొలుత 34 మార్కులు వచ్చాయని షీట్ లో తెలిపారు. తీరా వెరిఫికేషన్ కు వెళితే 93 మార్కులు వచ్చాయని వెల్లడైంది. 👉గతంలో ఏదో ఒకటి, రెండు మార్కులు, లేదంటే ఓ పది మార్కుల వరకు తేడా వస్తే వచ్చేవేమో! కాని ఈసారి ఇలా ఇంత తేడాతో ఉంటే ఆ విద్యార్ధుల భవిష్యత్తు ఏమవ్వాలి? ఎవరైనా తొందరపడి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు?. విశేషం ఏమిటంటే గతంలో జగన్ టైమ్ లో ఏ చిన్న తప్పు జరిగినా జగన్ రాజ్యంలో.. జగన్ ఇలాకాలో ఘోరాలు అంటూ రాసినా.. ఇప్పటికీ అదే పద్దతిలో దౌర్బాగ్యకర రీతిలో వార్తలు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు దినపత్రిక ఇప్పుడు ఈ వాల్యుయేషన్ అవతకతవకల విషయంలో మాత్రం ఎక్కడా అసలు మంత్రి లోకేశ్ ప్రస్తావన కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యంలో ఇలా జరుగుతోందని కాని రాయకుండా జాగ్రత్తపడింది. అంతవరకు అయితే ఒక రకం. .. ప్రభుత్వ తప్పులను కూడా వెనకేసుకు వచ్చేలా వార్తలు ఇచ్చే నీచానికి ఈ ఎల్లో మీడియా పాల్పడుతుండడం దురదృష్టకరం. 2022లో జవాబు పత్రాలలో వత్యాసం 20 శాతం ఉండగా, ఇప్పుడు 16.8 శాతం మాత్రమేనని నిస్పిగ్గుగా సమర్దించుకునే యత్నం చేశారు. ఇలాంటి వార్తల విషయంలో వాస్తవాలకు అనుగుణంగా కథనాలు ఇస్తే విద్యార్దులకు ఉపయోగం. కాని, ఇలాంటి వాటిలోకూడా దిక్కుమాలిన రాజకీయం చేయడం వల్ల ఏమి ఉపయోగం?. చంద్రబాబు పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయందని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి జగనే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, దానిని గాడిన పెడుతున్నామని లోకేశ్ ఎదురు దాడి చేశారు. ఏ రకంగా జగన్ పాడు చేసింది..తాను ఏ విధంగా బాగు చేసింది చెప్పుకోకుండా, ఏవో శాతాల అంకెలు చెబితే అందులోని డొల్లతనం బయటపడుతూనే ఉంది. ఎంత సేపు రెడ్ బుక్‌తో గుండెపోటు తెప్పించానని, వారిని జైల్లో వేశా, వీరిని జైల్లో వేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. తన శాఖలో ఏమి జరుగుతోంది?. ఏ రకంగా పిల్లలకు మేలు చేయవచ్చు?. అంశాలపై లోకేశ్ దృష్టి పెడితే మంచిది. వెరిఫికేషన్, రీవ్యాల్యుయేషన్‌కు వెళ్లిన వారంతా వైఎస్సార్సీపీ వారనో, మరొకటనో చెప్పి, వారిని కూడా రెడ్ బుక్ పేరుతో భయపెట్టకుండా ఉంటే అదే పదివేలు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పల్లా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ కార్మికులపై టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ రావు(Palla Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలామంది పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పల్లా వ్యాఖ్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మండిపడ్డారు. ఊసరవెల్లి రాజకీయాలను పక్కనపెట్టి కార్మికులకు క్షమాపణలు చెప్పాలంటూ పల్లాను డిమాండ్ చేశారు. పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?. అంత ప్రేమ ఉంటే.. మహానాడులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎందుకు చర్చించలేదు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కార్మికులకు క్షమాపణలు చెప్పాలి. సొంత గనులు లేక స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వస్తున్నాయి. ఇకనైనా తన ఊసరవెల్లి రాజకీయాలను పల్లా పక్కనపెడితే మంచిది’’ అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ జేఏసీ(Vizag Steel Plant JAC) నాయకులు అన్నారు. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)లో ఘోస్ట్ ఉద్యోగులు ఉన్నారు. పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారు. 400 మంది కార్మిక నాయకులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే నాలుగేళ్లలో ప్లాంట్ మూసేయాల్సి ఉంటుంది’’ అని పల్లా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమను అవమానపరిచేలా ఉన్నాయంటూ కార్మికులు పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉర్సా భూముల వ్యవహారం.. మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి సవాల్ -
బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
తెనాలి: జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు. అక్కడి పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తమ కొడుకును పోలీసులు ఎంతగా హింసించింది ఫొటోలు, ఆస్పత్రి రిపోర్టులతో జగన్‌కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా.. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అంతకు ముందు..జగన్ రాక సందర్భంగా తెనాలిలో అభిమానం పోటెత్తింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా.. ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆపై యువకులు, మహిళలతో కలిసి ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది.తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్‌లో ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు.అన్నం పెట్టకుండా హింసించారుతమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. ‘‘పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు. అరెస్ట్ చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్‌గా కొడతారా?. అన్నం కూడా పెట్టకుండా మూడు రోజులు చిత్రహింసలు పెడతారా?. స్టేషన్‌కు వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.