టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతల స్కెచ్‌! | Daggubati Vs Sudhakar Internal Clashes In Anantapur TDP Goes Far Away | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతల స్కెచ్‌!

Jun 5 2025 11:44 AM | Updated on Jun 5 2025 1:22 PM

Daggubati Vs Sudhakar Internal Clashes In Anantapur TDP Goes Far Away

సాక్షి,  అనంతపురం: అర్బన్‌ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్‌ సుధాకర్‌ నాయుడు వైరం ఊహించని మలుపు తిరిగింది. టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతలే కుట్రపన్నడం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధిష్టానం అప్రమత్తమైంది. 

అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత సుధాకర్‌ నాయుడి హత్యకు ఎమ్మెల్యే అనుచరులు స్కెచ్‌ వేయడం పోలీసుల నిఘాలో బయటపడింది. ఇంట్లోకి చొరబడి మరీ సుధాకర్‌ను హత్య చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు  ప్లాన్ వేశారు. అయితే.. 

గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలపై జిల్లా ఎస్పీ జగదీష్‌ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఈ విషయం కూడా వెలుగు చూసింది.  దీంతో అప్రమత్తమైన పోలీసులు సుధాకర్‌ నాయుడు హత్య కుట్రను భగ్నం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ ఎపిసోడ్‌తో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇద్దరిని అమరావతికి పిలిపించుకుని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement