breaking news
-
52 రోజుల బాబు జైలు జీవితం ఇలా..
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరైంది. చంద్రబాబు 52 రోజులపాటు జైలులో ఉన్నప్పటికీ ఆయన కోరిక మేరకు ఏసీతో సహా అన్ని సదుపాయాలు కల్పించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 24 గంటలపాటు ప్రత్యేక వైద్య బృందాన్ని కేటాయించారు. రోజూ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు కూడా ఇచ్చారు. ఇలా 52 రోజుల పాటు చంద్రబాబు జైలు జీవితం సాగింది. 53వ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టు నుంచి విడుదల వరకు ముఖ్య పరిణామాలు ఇలా.. ♦ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును సెపె్టంబర్ 9న అరెస్టు చేశారు. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ♦రిమాండ్ ఖైదీగా సెప్టెంబర్ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ♦ జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించారు. ఏ గదిలో ఉంచారో భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు. ♦ కోర్టు ఆదేశాలతో రోజూ ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు. ♦మొదట సెపె్టంబరు 22 వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. ♦ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. అన్నింటికీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే తీరులో చంద్రబాబు సమాధానం చెప్పారు. ♦ సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్. దీన్ని అక్టోబర్ 5 వరకు కొనసాగించారు. ♦ జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగింది. ♦ చంద్రబాబుకు ముందు నుంచే ఉన్న చర్మ సమస్య జైల్లో ఇంకా పెరిగిపోయిందని ఎల్లో మీడియా కథనాలు అల్లింది. ఆయనకు వైద్యులతో ప్రత్యేక వైద్య బందం ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ వసతి కచ్చిచారు. ♦ నిత్యం మూడుసార్లు వైద్య పరీక్షలతోపాటు ఒకసారి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు. ♦ చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు. అక్టోబర్ 5 నుంచి 19 వరకు ఏసీబీ కోర్టు జ్యుడిíÙయల్ రిమాండ్ పొడిగించింది. ♦ వారానికి రెండుసార్లు బాబుతో ములాఖత్ అయిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి. ♦ బాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా 5 కిలోలు బరువు తగ్గారంటూ విష ప్రచారం. ♦ చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉండేవారని, ఇప్పుడు 67 కిలోలు ఉన్నారని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విడుదల సమయానికి అర కిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నారు. ♦ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 1 వరకు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు. ♦ తన కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ అవసరమని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు. ఆయనకు జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు. ♦ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. -
చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది . స్కిల్ స్కాం కేసులో.. అదీ ఆరోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ క్రమంలో పలు షరతులు విధించింది. ‘‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్ గడువు ముగిశాక నవంబర్ 28వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ మరుక్షణమే రద్దు అవుతుంది’’అని తీర్పు కాపీలో జస్టిస్ మల్లికార్జున రావు స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం స్కిల్ స్కామ్ కేసులో.. అదీ కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. అలాగే నవంబర్ 10న ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేటికి రిమాండ్ ఖైదీగా 52 రోజులు పూర్తి చేసుకున్నారాయన. చంద్రబాబు మధ్యంతర బెయిల్ కోర్టు కాపీ కోసం క్లిక్ చేయండి -
విజయనగరం రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ
సాక్షి, విజయనగరం: విజయనగరం కంటకాపల్లి రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ జరపనున్నారు అధికారులు. బుధవారం, గురువారం విశాఖపట్నం డివిజనల్ మేనేజర్, వాల్తేర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఇప్పటికే అలమండ, కొత్తవలసల మధ్య ప్రత్యక్ష సాక్షుల్ని, అలాగే క్యాబిన్ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కోణంలోనే విచారణ అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విజయనగరం రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 52 మందిని క్షతగాత్రులుగా గుర్తించింది. వీరిలో ఎక్కువమంది స్వల్ప గాయాలతో బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు అలమండ పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలైన వారు, కళ్లు దెబ్బతిన్న వారు, ఎముకలు విరిగిన వారు 29 మంది విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేరారు. సోమవారం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లి వాళ్లను ఓదార్చారు. నేడు క్షతగాత్రులకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు వైద్యులు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన ఈ దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నెమ్మదిగా వెళ్తున్న పలాస-విశాఖ ప్యాసింజర్‌ను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన రాయగఢ-విశాఖ ప్యాసింజర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 13 మంది మృతి చెందారు. నిత్యం విశాఖకు రాకపోకలు సాగించే వందలాది మంది నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఆదివారం సెలవు నేపథ్యంలో రద్దీ చాలా తక్కువగా ఉంది. లేదంటే... ఎలా ఉండేదోనని ఆ ఘటనను తలచుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపమా? మానవ తప్పిదమా? విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణించే సమయంలో ముందు వెళ్లే రైలు పట్టాలు తప్పినా, ఆగిపోయినా వెనుక వచ్చే రైలు ఆగిపోయేలా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయాలి. అలాగే.. రైలు వేగం గంటకు 10, 15 కిలోమీటర్లకు పరిమితం కావాలి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్లినా వెనుక వచ్చిన రాయగడ ప్యాసింజర్ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టడంతోనే పెనుప్రమాదం జరిగింది. నేడు కూడా పలు రైళ్ల రద్దు కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. రిజర్వేషన్ చేయించుకున్న పలువురు ఆదివారం రాత్రి నుంచి స్టేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రంలోపే కంటపల్లి వద్ద ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్ల సమయాల్లో మార్పు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇవాళ(అక్టోబర్ 31న).. హావ్‌డా-సికింద్రాబాద్(12703) ఫలక్‌నుమా, హావ్‌డా-ఎస్ఎంవీ బెంగళూరు(12245) దురంతో, షాలిమార్-హైదరాబాద్(18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే.. తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(08531) పాసింజర్, తిరుపతి-విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 31న రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. -
Oct 31st 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions, Court Hearings And Political Updates 07:05 PM, అక్టోబర్ 31, 2023 52 రోజుల ప్రస్థానం ఇది - టైంలైన్ ►రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు ►సెప్టెంబరు 9న స్కిల్ స్కాంలో అరెస్టు, అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ ►రిమాండ్ ఖైదీగా సెప్టెంబరు పది అర్ధరాత్రి ఒంటిగంటన్నరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు ►జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా స్నేహా బ్లాక్ కేటాయింపు ►కోర్టు ఆదేశాల మేరకు ప్రతి రోజూ భోజనం, మందులు ఇంటినుంచే అందించే వెసులు బాటు ►సెప్టెంబరు 22 వరకు రిమాండ్, రెండురోజులపాటు సీఐడీ కస్టడీ విచారణ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు సీఐడీ అధికారులు విచారణ, తెలియదు, గుర్తులేదు అన్న చంద్రబాబు ►జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచిఉందని పచ్చమీడియా విపరీతమైన ప్రచారం ►సెప్టెంబరు 24న మరోసారి చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు, అక్టోబరు ఐదువరకూ రిమాండ్ కొనసాగింపు ►చంద్రబాబుకు చర్మ వ్యాధి ఉందంటూ పచ్చమీడియా విపరీత ప్రచారం, ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు ►కోర్టు ఆదేశాలమేరకు చంద్రబాబుకు టవర్ ఏసీ ఏర్పాటు ►చంద్రబాబుకు రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు ►ఒక వైద్య పరీక్షలో ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు ►చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు, అక్టోబరు 5నుండి 19వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు ►వారానికి రెండుసార్లు చంద్రబాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి, లోకేష్ ,బ్రాహ్మణి ►చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం, ఐదు కిలోలు బరువు తగ్గారంటూ ఆందోళన ►చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినపుడు 66 కిలోలు ఉండేవారని, ఇపుడు 67 కిలోలు ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు ►విడుదల సమయానికి మరో అరకిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నచంద్రబాబు ►అక్టోబరు 19 నుండి నవంబరు ఒకటి వరకూ చంద్రబాబు జ్యుడిషియర్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తన కుడికంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయాలని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు ►జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు 06:45 PM, అక్టోబర్ 31, 2023 రాజమండ్రిలో టిడిపి అతితో గందరగోళం ►రెండు గంటలయినా రాజమండ్రి దాటని చంద్రబాబు కాన్వాయ్ ►దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు కాన్వాయ్ ►భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు ►టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోటెత్తడంతో రాజమండ్రి అస్తవ్యస్తం ►చంద్రబాబు కాన్వాయ్‌కు పోటీగా వందలాది వాహనాలను తీసుకొచ్చిన టీడీపీ నేతలు ►వందలాది వాహనాలు రావడంతో స్తంభించిపోయిన రాజమండ్రి ►తెలుగుదేశం ప్రైవేట్ వాహనాల రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ ►దివాన్ చెరువు వద్ద వాహనాలను నిలపడానికి పోలీసుల ప్రయత్నం ►పోలీసుల ఆదేశాలను ధిక్కరించి ట్రాఫిక్‌కు అడ్డు తగులుతోన్న టిడిపి కార్యకర్తలు ►వేమగిరి,రావులపాలెం,పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్,గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు 06:20 PM, అక్టోబర్ 31, 2023 బాబు లాయర్ల పిటిషన్ కొట్టివేత ►చంద్రబాబు లాయర్ల పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు ►సీఐడీ అధికారుల కాల్‌డేటా స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►సీఐడీ తరపున వివేకానంద వాదనలు ►చంద్రబాబు తరపున దమ్మాలపాటి వాదనలు ►ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ►పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 05:49 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ సరే, నిజం గెలవాలి సంగతేంటీ? : మంత్రి కొట్టు సత్యనారాయణ ►విజయవాడలో మాట్లాడిన డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ పిసి ►చంద్రబాబుకు మధ్యంతర బెయిలు వచ్చింది కాబట్టి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటారా? ►టీడీపీ జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది...అలాంటి పార్టీ తెలంగాణాలో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం ఏమిటి? ►తెలంగాణాలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తేలిపోయినట్టేనా? ►సైబర్ సిటినీ తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబు తెలంగాణా ఎన్నికల్లో ఎందుకు చేతులెత్తేసారు? ►ఏపీలోనూ సొంతంగా పోటీ చేసే సత్తా లేక జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జాతీయ పార్టీగా అని ఎలా చెప్పుకుటుంది? ►ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు ఎంతవరకూ నిలబడుతుందని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.! ►మేముంటేనే మీరని జనసేన-టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.! ►చంద్రబాబును జైల్లో పెడితే రోడ్డుపై పడుకుని పవన్ కల్యాణ్ నానా విన్యాసాలు చేశారు 05:42 PM, అక్టోబర్ 31, 2023 షరతులు బేఖాతరు ►తూర్పుగోదావరి జిల్లా : మధ్యంతర బైలుకు సంబంధించి హైకోర్టు విధించిన షరతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ►జైలు బయటికి వచ్చిన వెంటనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ►నిబంధనలకు విరుద్ధంగా జైలు గేటు వరకు బారికెడ్లను తోసుకొంటూ వచ్చిన టిడిపి కార్యకర్తలు ►ర్యాలీగా రాకూడదని హైకోర్టు అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోకుండా జైలు బయట గేటు వద్ద నుండి కార్యకర్తల సమూహంతో రోడ్డుపైకి వచ్చిన చంద్రబాబు ►రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే రూటును బ్లాక్ చేసిన టిడిపి కార్యకర్తలు 04:40 PM, అక్టోబర్ 31, 2023 బయటకు రాగానే మైక్ అందుకున్న బాబు ►హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కేసిన చంద్రబాబు ►రాజకీయ ర్యాలీలు చేయొద్దని స్పష్టంగా చెప్పిన హైకోర్టు ►ర్యాలీల్లో ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు చెప్పినా.. పట్టించుకోని చంద్రబాబు ►తనకు సంఘీభావం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు ►ప్రత్యేకంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు : చంద్రబాబు 04:30 PM, అక్టోబర్ 31, 2023 కాసేపట్లో బెజవాడకు బాబు ►కాసేపట్లో విజయవాడకు బయల్దేరనున్న చంద్రబాబు ►రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లనున్న చంద్రబాబు ►రేపు సాయంత్రం తిరుమలకు వెళ్లాలని నిర్ణయం ►ఎల్లుండి ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్న చంద్రబాబు ►అనంతరం హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకోవాలని చంద్రబాబు యోచన 04:15 PM, అక్టోబర్ 31, 2023 జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల ►జైలు గేటు వద్ద తెలుగుదేశం నేతల కేకలు, అరుపులు ►జైలు ముందు చంద్రబాబు కోసం కుటుంబసభ్యులు, టిడిపి నేతలు ►చంద్రబాబును కలిసేందుకు నాయకుల పోటాపోటీ ►టిడిపి జెండాలు, ఫ్లెక్సీలతో జైలు ప్రాంగణాన్ని నింపేసిన టిడిపి నేతలు ►అందరిని పక్కకు జరిపి చంద్రబాబును అలింగనం చేసుకున్న అచ్చెన్నాయుడు 04:13 PM, అక్టోబర్ 31, 2023 తెలుగుదేశం నేతల ఓవరాక్షన్‌తో చంద్రబాబుకు మరిన్ని ఆంక్షలు ►రేపటి దాకా చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ►ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు ►రేపటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దు : హైకోర్టు ఆదేశాలు 04:03 PM, అక్టోబర్ 31, 2023 జైలుకు చంద్రబాబు కాన్వాయ్ ►రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్ ►జైలు లోపలికి వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ ►కాసేపట్లో విడుదల కానున్న చంద్రబాబు ►సెంట్రల్ జైలు దగ్గర భారీ స్థాయిలో మోహరించిన టీడీపీ శ్రేణులు ►చంద్రబాబును చూసేందుకు భారీగా రావాలని కార్యకర్తలకు టీడీపీ పిలుపు ►పలు చోట్ల వాహనాలను ఏర్పాటు చేసి మరీ జనాలను తెస్తోన్న టీడీపీ 04:00 PM, అక్టోబర్ 31, 2023 జైలులో జరుగుతున్న బెయిల్ ప్రక్రియ ►రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►చంద్రబాబును కలిసిన లోకేష్, బ్రాహ్మణి ►విజయవాడ వరకు ఎలా వెళ్దాం? ఏం చేద్దాం? ►బయటకు తీసుకొచ్చే విషయంపై చర్చలు ►బాబు బెయిల్ కాపీలను తీసుకుని లోనికి వెళ్లిన లాయర్లు ►జైల్లో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్న లాయర్లు 03:55 PM, అక్టోబర్ 31, 2023 జైలు వద్ద భారీగా మోహరించిన తెలుగుదేశం కార్యకర్తలు ► రాజమండ్రి జైలు వద్ద నెలకొన్న పరిస్థితిపై పోలీసులు సీరియస్ ► రాజకీయాలకు జైలును అడ్డా ఎలా చేస్తారని ఆగ్రహం ► రాజమండ్రి జైలు చుట్టూ భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ► జాతీయ రహదారి లాలాచెరువు నుంచి సెంట్రల్ జైలు వరకు రహదారిని మూసివేత ► జైలు వద్ద ఏ ఒక్కరు అతి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం ► శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోబోమంటున్న అధికారులు 03:45 PM, అక్టోబర్ 31, 2023 టిడిపి తీరే అంత.! తొలి రోజే నిబంధనలు ఉల్లంఘిస్తారా? ► రాజమండ్రి జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న తెలుగుదేశం శ్రేణులు ► చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు ► చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దృష్ట్యా తెలుగుదేశం కొత్త వ్యూహం ► రాజమండ్రికి భారీగా కార్యకర్తలను తరలిస్తోన్న తెలుగుదేశం నేతలు ► ప్రతీ నియోజకవర్గం నుంచి ఇంత మంది అంటూ లెక్కలేసుకొని మరీ తరలింపు ► రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ర్యాలీ చేయాలని ప్రణాళిక ► ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ► బెయిల్ ఊరేగింపు అడ్డు పెట్టుకుని ఏం చేయబోతున్నారు? 03:15 PM, అక్టోబర్ 31, 2023 నిబంధనలను పెంచండి : CID పిటిషన్ ► ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు మధ్యంతర బెయిల్లో మరో 5 నిబంధనలు చేర్చాలని పిటిషన్ 1. రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టొద్దు, 2. మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు 3. కేవలం వైద్యం కోసమే బెయిల్‌ను ఉపయోగించాలి 4. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడొద్దు 5. ఇద్దరు DSP స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలి ఈ ఐదు షరతులు చేర్చాలని కోరుతూ సీఐడీ పిటిషన్ 03:10 PM, అక్టోబర్ 31, 2023 బాబు జెడ్ ప్లస్‌కు ఏర్పాట్లు ► రాజమండ్రి జైలు నుంచి కరకట్ట నివాసం దాకా భద్రత ►రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి విజయవాడ కరకట్ట నివాసానికి వచ్చేందుకు ఏర్పాట్లు 03:01 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులోనూ చంద్రబాబుకు ఊరట ►మద్యం కేసులోనూ చంద్రబాబుకు హైకోర్టులో ఊరట ►చంద్రబాబును అరెస్ట్ చేయబోమని తెలిపిన ఏజీ ►హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని కోర్టుకు తెలిపిన ఏజీ ►అడ్వకేట్ జనరల్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు ►విచారణ నవంబర్ 21కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 03:00 PM, అక్టోబర్ 31, 2023 జైలుకు చేరిన రిలీజ్ ఆర్డర్ ►రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ ►కండిషన్స్ ను చంద్రబాబుకు చదివి వినిపించనున్న జైలు సూపరింటెండెంట్ ►కాసేపట్లో జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు 03:00 PM, అక్టోబర్ 31, 2023 రిలీజ్ ఆర్డర్ తీసుకున్న TDP నేతలు ►విజయవాడ : ACB కోర్టు దగ్గర బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో ఏసీబీ కోర్టుకు ష్యూర్టీలు సమర్పించాం ►వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చాం ►చంద్రబాబు రిలీజ్ ఆర్డర్లను జైలు అధికారులకు కోర్టు మెయిల్ చేశారు ►పర్సనల్ ఆర్డర్ కూడా మేం తీసుకున్నాం ►రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా హైకోర్టు బెయిల్ ఆర్డర్, ఏసీబీ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందాయి ►సుప్రీం కోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం రావాల్సి ఉంది ►మరో గంటన్నరలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావొచ్చు 02:50 PM, అక్టోబర్ 31, 2023 రిలీజ్ ఆర్డర్ ఇది ►చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ACB కోర్టు రిలీజ్ ఆర్డర్ ►CrPL No.7951/2023 ప్రకారం చంద్రబాబును విడుదల చేయాలని ఉత్తర్వులు ►ప్రస్తుతం రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691గా ఉన్న చంద్రబాబు 02:30 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులోనూ బెయిలివ్వండి : చంద్రబాబు లాయర్లు ►హైకోర్టులో చంద్రబాబు లాయర్ల లంచ్ మోషన్ పిటిషన్ ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ ►మద్యం కేసులో చంద్రబాబు ఏ3 02:30 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు వచ్చింది కండీషనల్ బెయిలే : సజ్జల ►కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు చంద్రబాబుకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది ►టీడీపీ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదు ►స్కిల్ కేసులో షెల్ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా? ►వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తే చంద్రబాబు బయటకు వస్తారా? ►చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలి ►స్కిల్ కేసులో రూ.240 కోట్లు దారి మళ్లాయి ►రాజమండ్రి నుంచి రోడ్ షో చేస్తామంటున్నారు ►రోడ్ షోతో జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ►లయన్ ఈజ్ బ్యాక్ అని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది ►చంద్రబాబు ఏమైనా వీర యోధుడా? ►చంద్రబాబు ఇంతకాలం వ్యవస్థల్ని మ్యానేజ్ చేశారు ►చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంటే విజయయాత్ర ఎందుకు? ►చంద్రబాబు విషయంలో ప్రభుత్వానికి కక్షసాధింపు లేదు ►చంద్రబాబు బయట ఉంటేనే పొలిటికల్ ఫైట్ నడుస్తుంది ►నిజం గెలిచిందని ఉపన్యాసాలు చేస్తుంటే జనం ఏమనుకుంటారు? 01:43 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ ప్రాసెస్ ఎక్కడివరకు వచ్చిందంటే.? ►విజయవాడ : ఎసిబి కోర్టులో హైకోర్టు ఇచ్చిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీని అందజేసిన చంద్రబాబు న్యాయవాదులు ►ACB కోర్టుకు ష్యూరిటీలు సమర్పించిన టిడిపి నేతలు దేవినేని ఉమ, బోండా ఉమ ►చెరో రూ. లక్ష పూచీకత్తు సమర్పించిన టీడీపీ నేతలు ►మధ్యంతర బెయిల్ ఆర్డరుతో పాటు అఫిడవిట్లని ఏసీబీ కోర్టుకు సమర్పించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►తదుపరి ఆదేశాలను రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా పంపుతామన్న ఏసీబీ కోర్టు ►ప్రొసీజర్ అంతా పూర్తయితే ఈ సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం 01:35 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ వచ్చినా ఆగని ములాఖత్‌లు ►రాజమండ్రి జైల్లో మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబుతో నారా లోకేశ్ ములాఖత్ ►లోకేశ్‌తో పాటు చంద్రబాబును కలవనున్న బ్రాహ్మణి ►జైల్లో చంద్రబాబును కలవనున్నతెలుగుదేశం ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి 01:25 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ షరతులతో మాత్రమే : వెల్లంపల్లి ►కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నందునే ►ప్రపంచంలో ఉన్న రోగాలన్ని చంద్రబాబుకు ఉన్నట్టు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు ►చంద్రబాబుకు ఇచ్చింది కండీషన్డ్ బెయిల్ మాత్రమే.. ►తిరిగి చంద్రబాబు మరలా జైలుకు వెళ్లాల్సిందే ►చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు ►అనారోగ్య కారణాలతో చంద్రబాబు కు మద్యంతర బెయిల్ వచ్చింది చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు ►కాసాని జ్ఞానేశ్వర్ ను ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి మోసం చేసారు ►కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు ►బిసిలను మరోసారి చంద్రబాబు మోసం చేశాడు ►తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా జెండా పీకేసిన వ్యక్తి చంద్రబాబు ►2024 లో ఏపిలోనూ టిడిపి జెండా పీకేస్తారు ►పవన్ టీడీపీతో కలిసినా ప్రయోజనం లేదు తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్టు ►విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చుకదా.. ఎందుకు వెళ్ళలేదు..? ►లోకేష్ అసమర్ధుడని వాళ్ళ క్యాడర్ భావిస్తుంది ►ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరికి చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉంది ►బిజెపి అధ్యక్షురాలిగా టిడిపి కి స్పోక్ పర్సన్ పురందేశ్వరి కొనసాగుతున్నారు ►అమిత్ షా వద్దకు లోకేష్ ను పురందేశ్వరి తీసుకెళ్లలేదా ►చంద్రబాబు ను కాపాడడానికి పురందేశ్వరి కంకణం కట్టుకున్నారు ►చంద్రబాబును జైలు నుంచి తేవాలన్నదే పురందేశ్వరి లక్ష్యం 01:15 PM, అక్టోబర్ 31, 2023 నిజం గెలవాలి యాత్ర అబద్ధమేనా? ►చంద్రబాబు విడుదలతో మారిన తెలుగుదేశం వ్యూహం ►నిజం గెలవాలి యాత్రను నిలిపివేసే యోచనలో భువనేశ్వరీ ►చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉంది: నారా భువనేశ్వరి ►నిజం గెలవాలి యాత్ర పై ఇంకా ఆలోచించలేదు : నారా భువనేశ్వరి 01:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబు బెయిల్ అనగానే పవన్ కళ్యాణ్‌లో తెగ ఉత్సాహం ►యూరప్ నుంచే ప్రెస్ నోట్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు విడుదల కోసం ఎదురుచూస్తున్నామన్న పవన్ శ్రీ @ncbn గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Hd1xjBsOCS — JanaSena Party (@JanaSenaParty) October 31, 2023 12:55 PM, అక్టోబర్ 31, 2023 విడుదల ఎప్పుడంటే..! ►ACB కోర్టు ద్వారా జైలుకు అందనున్న హైకోర్టు ఉత్తర్వులు ►జైలు అధికారులకు కోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత ప్రారంభం కానున్న ప్రొసీడింగ్స్ ►చంద్రబాబు NSG సెక్యూరిటీ పరిధిలో ఉండడంతో SPకి సమాచారం ఇవ్వనున్న జైలు అధికారులు 12:45 PM, అక్టోబర్ 31, 2023 నవంబర్ 28న మళ్లీ జైలుకు ►చంద్రబాబు బెయిల్ గడువు నవంబర్ 28 వరకు ►నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాయంత్రం 5గంటల్లోగా సరెండర్ కావాలి 12:40 PM, అక్టోబర్ 31, 2023 ష్యూరిటీలు సమర్పించిన బొండా, దేవినేని ►చంద్రబాబు బెయిల్ కోసం బొండా, దేవినేని ష్యూరిటీలు విజయవాడ కోర్టులో షూరిటీ సమర్పించిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు 12:32 PM, అక్టోబర్ 31, 2023 జైలు నుంచి చంద్రబాబు ఎక్కడికంటే.? ► సాయంత్రం రాజమండ్రి నుంచి అమరావతికి చంద్రబాబు ► రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన అమరావతికి చంద్రబాబు ► అమరావతి నుంచి రేపు లేదా ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ► తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత హైదరబాద్ కు చంద్రబాబు ► ఆ తర్వాత హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స ► హైదరాబాద్‌లోనే స్కిన్ డాక్టర్‌తో ట్రీట్మెంట్ 12:28 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ ఇచ్చింది ఎందుకంటే.. : మంత్రి అంబటి ►చంద్రబాబు బెయిల్ పై అంబటి రాంబాబు స్పందన ►కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు ►స్కిల్ స్కాంలో చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారు ►కంటి ఆపరేషన్ చేయించుకొన్న తర్వాత జైలుకు రావాల్సిందే ►కేసు దర్యాప్తు కొనసాగుతోంది ►రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదు ►తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు ►ఇతర పార్టీ కోసం పార్టీని తాకట్టుపెట్టడం అనైతికం ►కాసాని జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది ►చంద్రబాబును నమ్ముకున్న ఎవరికైనా వెన్నుపోటు తప్పదు 12:20 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులో బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ ►మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారన్న సీఐడీ అధికారుల కేసు పై హౌస్ మోషన్ పిటిషన్ ►పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు 12:15 PM, అక్టోబర్ 31, 2023 తొలిరోజే షరతుల ఉల్లంఘనకు ప్రణాళిక ►రాజమండ్రి చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి ►కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్ ►బెయిల్ రావడంతో సాయంత్రం 4గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ►ఎయిర్ పోర్టు వరకు భారీ ర్యాలీకి టీడీపీ ఏర్పాట్లు ►హైకోర్టు సూచించినా.. దానికి విరుద్ధంగా ర్యాలీకి ఏర్పాట్లు చేస్తోన్న టిడిపి 12:10 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్ కేవలం అనారోగ్య కారణాల వల్లే ►కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు ►నవంబర్ 28, 2023 మంగళవారం రోజున సా.5 గంటలకు సరెండర్ కావాలని ఆదేశం ►నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామన్న కోర్టు ►ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదన్న కోర్టు ►మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న కోర్టు 12:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్లో షరతులు ఇవే ►చంద్రబాబుకు ఐదు షరతులతో మధ్యంతర బెయిల్ 1. రూ.లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరి షూరిటీలు సమర్పించాలి 2. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవచ్చు 3. చికిత్స, ఆస్పత్రి వివరాలు సరెండర్ సమయంలో సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు సమర్పించాలి 4. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు 5. నవంబర్ 28, 2023 సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి సరెండర్ కావాలి 12:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్‌కు ష్యూరిటీలు వీళ్లే ►హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు ఇవ్వనున్న ఇద్దరు ►రూ.లక్ష బాండ్, 2 ష్యూరిటీలను ఇవ్వనున్న బోండా ఉమ, దేవినేని ఉమ ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న బోండా ఉమ, దేవినేని ఉమ 12:00 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్ ►ఐదు షరతులతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ►సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ►హైకోర్టు ఉత్తర్వులు ఏసీబీ కోర్టు ద్వారా రాజమండ్రి జైలుకు ►బెయిల్ కాపీతో రాజమండ్రి జైలుకు రానున్న చంద్రబాబు లాయర్లు ►ప్రొసీడింగ్స్ పూర్తైన తర్వాత ఎస్పీకి సమాచారమివ్వనున్న జైలు అధికారులు ►జైలు దగ్గరికి రానున్న జిల్లా పోలీసులతోపాటు NSG బృందం ►ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు 11:45 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్‌పై పురందేశ్వరీ స్పందన ►చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం ►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచి పరిణామం : పురంధేశ్వరి 11:38 AM, అక్టోబర్ 31, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని.. సీఐడీ అధికారుల కేసుపై లంచ్ మోషన్ పిటిషన్ ►సీఐడీ నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన హైకోర్టు ►మధ్యాహ్నాం 2గం.15కి పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు ►టీడీపీ అడ్డగోలు మద్యం వ్యవహారాలపై కేసు ►తన హయాంలో కావాల్సిన కంపెనీలకు దోచిపెట్టిన చంద్రబాబు ►కావాల్సిన డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులు ►క్విడ్‌ప్రోకోలో భాగంగా ఎక్సైజ్ పాలసీనే మార్చేసిన నాటి ప్రభుత్వం ►రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు ►ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం ►ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్.. అనుమతించిన న్యాయస్థానం ►ఏ–1గా ఐఎస్ నరేష్, ఏ–2గా కొల్లు రవీంద్ర, ఏ–3గా చంద్రబాబు 11:12 AM, అక్టోబర్ 31, 2023 స్కిల్డ్ దొంగ చంద్రబాబే! ►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు ►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి ►2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం ►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం ►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం ►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం ►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ►ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ►ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో కొనసాగుతున్న చంద్రబాబు ►తాజాగా.. ఇవాళ నాలుగువారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు 11:12 AM, అక్టోబర్ 31, 2023 బాబు బెయిల్‌పై అంబటి సెటైర్ ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ►కంటి శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని కోర్టు హెచ్చరిక ►నిజం గెలిచి కాదు.. చంద్రబాబుకి కళ్లు కనిపించట్లేదని కోర్టు బెయిల్ ఇచ్చిందన్న అంబటి ►ఎక్స్‌లో బాబు బెయిల్‌పై అంబటి సెటైర్ నిజం గెలిచి కాదు బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్! — Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023 11:01 AM, అక్టోబర్ 31, 2023 నవంబర్ 10న చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►నవంబర్ 10వ తేదీన వాదనలు వింటామన్న ఏపీ హైకోర్టు ►మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కాసేపటి కిందట తీర్పు ►నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు ►కంటి సర్జరీ కోసమే బెయిల్ ఇచ్చినట్లు వెల్లడి ►చంద్రబాబుకు కోర్టు పలు షరతులు ►రాజకీయ, మీడియా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు ►కేవలం ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి ►నవంబర్ 24వ తేదీ సాయంత్రం సరెండర్ కావాలి ►కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు ►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక 10:39 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు ►స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు ►నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీల్ని సమర్పించాలని ఆదేశం ►నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ ►కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ►షరతులు ఉల్లంఘిస్తే మరుక్షణమే బెయిల్ రద్దవుతుందని హెచ్చరిక 10:15 AM, అక్టోబర్ 31, 2023 కాసేపట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు ►స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు ►కంటికి శస్త్రచికిత్స అవసరం అంటూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►ఇప్పటికిప్పుడు శస్త్రచికిత్స అవసరం లేదని సీఐడీ తరపు లాయర్ల వాదన ►ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్లు ►చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికలు కోర్టుకు సమర్పించిన సీఐడీ ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, పైగా బరువు పెరిగారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సీఐడీ లాయర్లు 09:52 AM, అక్టోబర్ 31, 2023 సీడీఆర్ పిటిషన్ తీర్పు నేడు ►సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు కేస్ అప్ డేట్ ►సీఐడీ అధికారుల కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డ్ ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఉందంటూ బాబు లాయర్ల వాదన ►ఇతర వ్యక్తుల డైరెక్షన్లోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వాదన ►కాల్ డేటా పిటిషన్ అసలు విచారణ అర్హత లేదని వాదించిన సీఐడీ తరపు న్యాయవాదులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలుగుతుందన్న సీఐడీ లాయర్లు ►అరెస్ట్‌లో ఎవరి ప్రమేయం లేదని సీఐడీ లాయర్ల వాదన ►వాదనలు పూర్తి.. నేడు తీర్పు వెల్లడించనున్న ఏసీబీ జడ్జి 09:22 AM, అక్టోబర్ 31, 2023 ఇంటి భోజనంతో బరువు పెరిగిన చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►బాబు ఆరోగ్యంపై ప్రతిరోజూ హెల్త్ బులెటిన్ విడుదల ►మరోవైపు చంద్రబాబు ఆరోగ్యాన్ని సాకుగా చూపించి మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు న్యాయవాదులు ►హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ వెలువడనున్న తీర్పు ►చంద్రబాబుకు రోజూ ఇంటి భోజనం ►జైల్లో చంద్రబాబు బరువు పెరిగారని స్పష్టం చేసిన అధికారులు ►జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం 67.5 కిలోలు ఉన్నారని వెల్లడి ►చంద్రబాబు కుడి కంటి క్యాటరాక్ట్ సర్జరీ అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►ప్రస్తుతం ఇమ్మెచ్యూర్డ్ కాటరాక్ట్ ఉందని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన రిపోర్టును సమర్పించిన జైలు అధికారులు 08:45 AM, అక్టోబర్ 31, 2023 లోకేష్ బేబీని వదలని ఆర్జీవీ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ అండ్ కోను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న దర్శకుడు రాం గోపాల్ వర్మ ►తాజాగా నారా లోకేష్‌ను బేబీ అంటూ టీజింగ్ ►సీఎం జగన్‌పై నారా లోకేష్ ఎక్స్‌లో అడ్డగోలు వ్యాఖ్యలు ► గుడ్ నైట్ బేబీ అంటూ సింపుల్‌గా లోకేష్‌కు రిప్లై ఇచ్చిన ఆర్జీవీ 08:32 AM, అక్టోబర్ 31, 2023 నారా వారి లిక్కరు స్కామ్ ►చంద్రబాబుపై లిక్కర్ స్కామ్ కేసు నమోదు చేసిన సీఐడీ ►గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపనల నేపథ్యంలో కేసు నమోదు ►ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు ►ఐపీసీ సెక్షన్ 166,167,409,120(B), రెడ్ విత్ 34 మరియు సెక్షన్ 13(1)(d) రెడ్ విత్ 13(2) పిసి యాక్ట్, 1968 గా కేసు నమోదు ►కేసులో A-3 గా చంద్రబాబును చేర్చిన సీఐడీ అధికారులు ►చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు మెమో రూపంలో తెలిపిన సీఐడీ అధికారులు ►మద్యం షాపులు, మద్యం కంపెనీల కు అక్రమ దారుల్లో లబ్ది చేకూర్చిన చంద్రబాబు ప్రభుత్వం ►మద్యం షాపులు (a4) ప్రివిలైజ్ ఫీజు తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రతి ఏటా రూ.1,300 కోట్లు ప్రభుత్వానికి నష్టం ►2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి దాదాపు రూ.2900 కోట్ల ఆదాయం ►తెలంగాణలో ఉన్న ప్రివిలైజ్ ఫీజు.. ఏపీలో తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ►అప్పట్లో లిక్కర్ సిండికేట్ తో కుమ్మక్కై తగ్గించేసిన చంద్రబాబు ప్రభుత్వం ►టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి సంస్థ ఎస్పీ వై ఆగ్రో ఇండస్ట్రీకి లబ్ది చేకూరుస్తూ వడ్డీ తగ్గింపు ►హైకోర్టు ఆదేశాలని అమలు చేయకుండా ఏకపక్షంగా వడ్డీ తగ్గింపు ►కేబినెట్ ఆమోదం లేకుండానే వడ్డీ తగ్గించిన చంద్రబాబు ప్రభుత్వం ►ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత హడావిడిగా లిక్కర్ కంపెనీలకు భారీగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►టీడీపీ నేతల లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►త్రిసభ్య కమిటీ సిఫార్సులు కి విరుద్ధంగా లిక్కర్ కంపెనీలకు అనుమతులు ►మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందిన పీఎంకే డిస్టీలరీస్‌కి అనుమతి ►మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టీలరీస్‌కి అనుమతి ►అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►2019 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొన్ని బ్రాండ్ల కు హడావుడిగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►సరఫరా కంపెనీలకు భారీ లబ్ది చేకూర్చేందుకు అనుమతులు ►అన్ని వ్యవహరల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించిన సీఐడీ ►బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన సీఐడీ ►ఈ కేసులో ఏ-1గా అప్పటి ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాస నరేష్, ఏ-2గా మాజీమంత్రి కొల్లు రవీంద్ర, ఏ-3గా చంద్రబాబు నాయుడు ►రెండు బేవరేజ్ లు, మూడు డిస్టిలరీలకి లబ్ది చేకూర్చడానికి క్విడ్ ప్రోకి పాల్పడినట్లు ఆరోపణలు ►2012 లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీని 2015 లో మార్చి అడ్డుకోలుగా ఈ కంపెనీలకి మేలు చేసినట్లు ఆధారాలు 07:57 AM, అక్టోబర్ 31, 2023 స్కిల్ స్కాంలో బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ ► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ పై విచారణ వాయిదా ► విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు ► ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు అనుబంధ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►కంటికి శస్త్రచికిత్స అవసరమని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి ► వాదనలు పూర్తి, ఇవాళ తీర్పు 07:35 AM, అక్టోబర్ 31, 2023 పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►కాసాని జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ►మరి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? ►ట్వీట్‌తో పవన్‌కు చురకలంటిన మంత్రి అంబటి రాంబాబు ►టీటీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చంద్రబాబు ఆదేశం ►నారా లోకేష్ కనీసం స్పందించలేదని రాజీనామా లేఖలో కాసాని విమర్శలు జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ! పవన్ ఎప్పుడు పరిపక్వమౌతాడో ?@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 30, 2023 07:13 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ ►పదుల కొద్దీ పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►వరుసగా ఎదురు దెబ్బలు.. ఎక్కడా దక్కని ఊరట ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ ►ఆపై ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు ►తాజాగా వెలుగులోకి మరో అవినీతి బాగోతం ►కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ►మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చినందుకు చంద్రబాబుపై మరో కేసు నమోదు ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►చంద్రబాబుకు లేని రోగాలను అంటగడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు ►తెలంగాణ బరి నుంచి ఓటమి భయంతో తప్పుకున్న తెలుగుదేశం ఇదీ చదవండి: IRR Case.. తోడు దొంగల రింగ్ 06:59 AM, అక్టోబర్ 31, 2023 ఖేల్ ఖతం.. దుకాణం బంద్ ►తెలంగాణలో టీడీపీ బిగ్ షాక్ ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►నారావారి తీరుపై రాజీనామా లేఖలో తీవ్ర అసంతృప్తి వెల్లగక్కిన కాసాని ►తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పకపోతే ఎలా?: కాసాని ►బాలకృష్ణ తెలంగాణలో నేనుంటా అన్నడు.. ఇప్పుడు ఏమైందో తెలియదు ►లోకేశ్ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థంకాదు.. 20సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ►లోకేష్ ఎవరికి దొరకరు ►హైదరాబాద్ లోనే ఉన్నా లోకేష్ పట్టించుకోలేదు ►లోకేష్ ఇక్కడ పెత్తనం ఎందుకు చేస్తున్నారు ►తెలంగాలో పోటీ చేయవద్దని లోకేష్ ఎలా చెబుతారు ? ►ఆంధ్రాలో టీడీపీకి బీజేపీ కావాలట.. తెలంగాణలో వద్దట.. ఇదేం పద్ధతి.. ►పార్టీలో చేరినప్పుడు రామ్మోహన్‌రావుకు రూ.11 లక్షలు ఇచ్చా.. ►కాంగ్రెస్‌కు ఓటేయాలని పార్టీలోని కమ్మ వాళ్లు ప్రచారం చేస్తున్నారు 06:43 AM, అక్టోబర్ 31, 2023 మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు అనుబంధ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►చంద్రబాబు కంటి శస్త్రచికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ ►పిటిషన్‌పై సోమవారం కొనసాగిన విచారణ.. ఇరువైపులా వాదనలు వినిపించిన లాయర్లు ►రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసు అని బాబు తరపు లాయర్ల వాదన ►52 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు.. సీఐడీ దర్యాప్తును సాగదీస్తోంది: బాబు లాయర్లు ►అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలి: బాబు లాయర్లు ►న్యాయస్థానం ఇచ్చిన గత ఆదేశాల మేరకు చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాం: సీఐడీ తరపు లాయర్లు ►పిటిషనర్‌కు జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం:సీఐడీ తరపు లాయర్లు ►కంటికి శస్త్రచికిత్స తక్షణం అక్కర్లేదు: సీఐడీ తరపు లాయర్లు ►చంద్రబాబుకున్న సాధారణ అనారోగ్య సమస్యలను పెద్దవి చేసి చూపుతున్నారు: సీఐడీ తరపు లాయర్లు ►వైద్య నివేదిక ప్రకారం బరువు విషయంలో పెద్ద తేడా లేదు: సీఐడీ తరపు లాయర్లు ►మధ్యంతర బెయిలు ఇవ్వొద్దు: సీఐడీ తరపు లాయర్లు ►పిటిషన్‌పై సోమవారం ముగిసిన వాదనలు ►తీర్పు రిజర్వ్.. నేడు వెల్లడించనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:24 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుపై సీఐడీ మరో కేసు ►వెలుగులోకి నారావారి లిక్కర్ స్కామ్ ►చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ► గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ ► అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై కేసు ► మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో A-3 గా చంద్రబాబు ► చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపిన సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు ► పిటిషన్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు ► కేసుకు FIR నంబర్ - 18/2023 కేటాయింపు 06:15 AM, అక్టోబర్ 31, 2023 జైల్లో చంద్రబాబు @52వ రోజు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► రేపటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు ఇదీ చదవండి: ఫైబర్ నెట్ కుంభకోణం సూత్రధారి బాబే -
నారా వారి లిక్కరు స్కాం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో ఏ–3గా చంద్రబాబు పేరును చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్–1988ల ప్రకారం 166, 167, 409, 120 (బి), రెడ్‌విత్ 34, 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్లతో సీఐడీ ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ శ్రీనరేష్, ఏ–2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. డిస్టిలరీస్, బేవరేజెస్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. అయినవారి కోసం అడ్డదారులు..: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కి, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కి చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసింది. టర్నోవర్‌పై 8 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా 6 శాతం పన్నులను తీసేసింది. 6 నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులనూ బేఖాతరు చేసింది. ఈ విధంగా రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కోకి పాల్పడినట్లు సీఐడీ తన ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని కోర్టుకు వివరించింది. కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా నిర్ణయాలు.. నిజానికి.. ఎక్సైజ్ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి, లైసెన్సులకు ప్రయోజనం చేకూర్చేలా క్రిడ్ ప్రో కో జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతటితో ఆగక.. అందుకు సంబంధించిన వాస్తవాలపై లోతుగా అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ఎల్ఓఐ ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. డీటీ నోటిఫికేషన్ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు. సరఫరాదారులు కుట్రపూరితంగా, లైసెన్స్‌లతో కుమ్మక్కై, కొన్ని ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారు. తద్వారా కార్పొరేషన్‌కు తప్పుడు అంచనాలు ఇచ్చారు. అలాగే, 2015–2019 కాలానికి సంబంధించిన వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా, పరిమాణాల వెరిఫికేషన్ కోసం ఎలాంటి యంత్రాంగం లేదు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. అంతేకాక.. అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్‌తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు స్పష్టమైంది. అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఉల్లంఘన ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే విషయం తేటతెల్లమైంది. దీంతో తగిన ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ వివరించింది. కేబినెట్ ఆమోదం లేకుండా నచ్చినట్లు పాలసీ..: 2015–2017 ఎక్సైజ్ సంవత్సరాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, కొనుగోళ్ల వార్షిక లైసెన్సు రుసుం కంటే పది రెట్లు మించి ఉంటే మాత్రమే ప్రివిలేజ్ రుసుం విధించే థ్రెషోల్డ్ టెండర్ పరిమితిని పెంచాలని మొదట ప్రతిపాదించారు. కానీ, అది అమల్లోకి రాలేదు. తెలంగాణలో అమలులో ఉన్న ఈ ఫీజులు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. షాపుల కోసం పాలసీని కూడా తమకు నచ్చినట్లు ఎటువంటి చర్చలు లేకుండా, ఆర్థిక చిక్కుల గురించి ఆలోచించకుండా కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఖరారు చేసేశారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా నిర్ణయాలు.. ఇక ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధిచేకూర్చింది. వాయిదా పద్ధతిలో లైసెన్స్ ఫీజు చెల్లించడానికి అనుమతించింది. ఈ ఫీజులో బకాయిలపై వడ్డీని కేవలం 18 శాతం (రూ.15 కోట్లు) మాత్రమే వసూలుచేయడానికి అనుమతించింది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, లైసెన్స్ ఫీజు బకాయిలపై అంతకుముందు కాలానికి చెల్లించాల్సిన వడ్డీని కూడా సడలించింది. నిజానికి ఇలా వడ్డీని వదిలేయడానికి, పరోక్షంగా మాఫీ చేయడానికి, తర్వాత చెల్లించేలా అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవు. డిస్టిలరీ మంజూరుకు అనుమతి.. ఇక 2014 నవంబర్‌లో జీఓ నెంబర్ 993 ప్రకారం.. రెవెన్యూ (ఎక్సైజ్–2) డిపార్ట్మెంట్ ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, మరో మూడు ప్రైవేటు డిస్టిలరీస్‌కు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది సరఫరాదారులు..డిస్టిలరీలపై ప్రేమ.. కుట్రలో భాగంగా కొంతమంది సరఫరాదారులు, డిస్టిలరీలపై టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమితమైన ప్రేమ కనబర్చింది. వారితో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించింది. వాటికి మార్కెట్ డిమాండ్ లేకపోయినా ఉన్నట్లుగా చూపించింది. వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా ధ్రువీకరణకు ఎలాంటి యంత్రాంగం కూడా లేదు. దీనివల్ల 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు జరిగాయి. బ్రాండ్లకు అడ్డగోలు అనుమతులు.. మరోవైపు.. 2019లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా, ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకపోయినా సరే అనేక బ్రాండ్లకు ఆమోదం తెలిపి తద్వారా వాటి సరఫరాదారులకు ఎక్కడలేని ప్రయోజనం చేకూర్చింది. వ్యక్తులు, సంస్థలకు ప్రయోజనాలను అందించడంవల్ల రాష్ట్ర ఖజానాకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. లోతుగా విచారణ జరపాలి : సీఐడీ ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, లైసెన్సీలకు చట్టవిరుద్ధంగా ఆర్ధిక లాభం చేకూర్చడంపై విచారణ జరగాల్సి ఉందని సీఐడీ ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరపాలని, బాధ్యులైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. -
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చారు. ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి వివరాల కోసం చదవండి చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు: ఏపీబీసీఎల్ ఎండీ మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీబీసీఎల్ ఎండీ పేర్కొన్నారు. రెండు బేవరేజ్‌లు, మూడు డిస్ట్రిలరీల కోసం 2012లో మద్యం పాలసీనే మార్చేశారు. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారు. 8 శాతం వ్యాట్ కాకుండా 6 శాతం పన్నులు తీసేశారని APBCL ఎండీ ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం కంపెనీల అనుమతుల పూర్తి కథేంటీ? 40 ఏళ్ల అనుభవం అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకుగానూ ఏకంగా 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. లిక్కర్లో చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు వినూత్నం, విశేషం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్.. ఇవన్నీ చంద్రన్న కానుకలే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. బాబు హయాంలో మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. ► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో తన దగ్గరి నేత రుణం తీర్చుకున్నారు. ► SPY బ్రాండ్ ఎవరిదో అందరికీ తెలుసు. ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే ► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. చంద్రబాబు పాలన అయిపోగానే దాన్ని అమ్మేశారు. ► PMK డిస్టిలరీ పార్టీలోని ఓ సీనియర్ నేత వియ్యంకుడిందని తెలుగుదేశంలోనే ప్రచారం ఉంది ► శ్రీకృష్ణా డిస్టిలరీ కూడా రాయలసీమ టిడిపి నేతకు చెందినది ► 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. ► చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు ► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. ► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. ► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది. ► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు. ► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు పదవి నుంచి దిగిపోయే కొద్ది ముందు ఇచ్చారు. ► టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతి ఇచ్చింది. -
Oct 30th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions, Court Hearings And Political Updates 18:24 PM, అక్టోబర్ 30, 2023 Big Breaking : చంద్రబాబుపై మరో కేసు నమోదు ► విజయవాడ : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన CID ► గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన CID ► అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై కేసు ► మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో A-3 గా చంద్రబాబు ► చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ACB కోర్టుకు తెలిపిన సిఐడి అధికారులు ► ACB కోర్టులో కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు ► పిటిషన్ ను అనుమతించిన ACB కోర్టు ► కేసుకు FIR నంబర్ - 18/2023 కేటాయింపు 17:48 PM, అక్టోబర్ 30, 2023 చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు దుష్ప్రచారం: సజ్జల ►టీడీపీ డ్రామాలు ప్రజలు పట్టించుకోవడం లేదు ►చంద్రబాబు అరెస్ట్ భావోద్వేగానికి అవకాశం ఉండే అంశం కాదు ►ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపింది ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు ►సీఎం జగన్‌పై తప్పుడు కేసులు పెట్టినప్పుడు న్యాయపరంగానే పోరాడాం ►ప్రజాకోర్టులో సీఎం జగన్ తిరుగులేని విజయం సాధించారు ►2019లో 151 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చారు ►చంద్రబాబు జైలులో ఉండటం దారుణం అన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది ►వేర్వేరు కారణాలతో చనిపోయినా చంద్రబాబు కోసమే మృతిచెందినట్టు ప్రచారం చేస్తున్నారు ►టీడీపీ స్టేక్ హోల్డర్స్ అంతా కలిసి నిన్న హైదరాబాద్‌లో ఈవెంట్ చేశారు ►ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేదు ►ఏదో మ్యూజికల్ ఈవెంట్‌కు రిహార్సల్ చేసినట్లు ప్రదర్శన చేశారు ►స్కిల్ స్కామ్ కేసు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు ►టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలీ ఈవెంట్‌తో అందరికీ తెలిసింది 16:45 PM, అక్టోబర్ 30, 2023 ప్రచారం ఎక్కువ.. బాబు చేసింది తక్కువ : మల్లాది విష్ణు ► విజయవాడ : చంద్రబాబు ముద్దాయిగా జైల్లో ఉంటే టీడీపీ నేతలు దుర్మార్గపు రాజకీయలు చేస్తున్నారు ► చంద్రబాబు చేసిన అవినీతి కుంభకోణాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు ► హైటెక్ సిటీ ని ప్రారంభించింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ► ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది దివంగత మహానేత వైఎస్ఆర్ ► కులాల పేరుతో సమాజాన్ని విడదీయడం చాలా పెద్ద నేరం ► మా కులం వాడే అని టిడిపి నేతలు సర్ది చెప్పుకోవడం దారుణం ► సమాజంలో అందరూ బాగుండాలి అందరికీ మేలు జరగాలని సిద్ధాంతం వైఎస్ఆర్సిపి పార్టీది ► మంత్రి అంబటి రాంబాబు పై దాడి హేయం. ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం , ఇన్సైడ్ ట్రేడ్ కుంభకోణం, అస్సైన్డ్ భూములు కుంభకోణాలలో తప్పు చేయలేదని కోర్టు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలరా.? ► చంద్రబాబు కులానికి సంబంధించిన మద్దతుదారులు దీనికి సమాధానం చెప్పాలి 16:23 PM, అక్టోబర్ 30, 2023 బాబు, బాలకృష్ణ, భువనేశ్వరీ.. అంతా వెన్నుపోటులో భాగమే : డిప్యూటీ సీఎం నారాయణస్వామి ► చంద్రబాబు డైరెక్షన్ లో సోనియా గాంధీ నాడు నడిచారు, వైఎస్ జగన్‌పై నాడు కేసులు పెట్టించారు ► పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు ► బాలకృష్ణ, భువనేశ్వరి తో పాటు నందమూరి కుటుంబాన్ని బాబు మోసం చేసారు ► నిజాలు రాయడాన్ని ఎల్లోమీడియా ఎప్పుడో మరిచిపోయింది ► చంద్రబాబు తప్పులు, అవినీతి పై వార్తలు రాసే దమ్ము వాళ్ళకి ఉందా? ► నిజం గెలిచింది కాబట్టే.. చంద్రబాబు జైలులో ఉన్నాడు.. ► ఏది నిజమో.. ఏది అబద్దమో భువనేశ్వరి తెలుసుకుని.. ప్రజలకు చెప్పాలి 16:12 PM, అక్టోబర్ 30, 2023 బీసీలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదే : మంత్రి కారుమూరి ► ఏలూరులో మంత్రి కారుమూరి నాగేశ్వరావు ప్రెస్ మీట్ ► దాచుకుని దోచుకుని పంచుకున్నారు కాబట్టి చంద్రబాబు జైలుకు వెళ్లారు ► బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ► కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని తెలంగాణలో వందల కోట్లు ఖర్చుపెట్టించి చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపాడు ► కాసాని జ్ఞానేశ్వర్‌ను ఖర్చు పెట్టించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ► ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో తెలంగాణలో చేతులెత్తేసిన వ్యక్తి చంద్రబాబు ► హైదరాబాదులో చంద్రబాబు సామాజిక వర్గం వారే సమావేశం పెట్టారు ► పేదల ఉద్యోగాలు కబ్జా చేసి వారి సామాజిక వర్గానికి ఇవ్వబట్టే అంతమంది వచ్చారు 16:02 PM, అక్టోబర్ 30, 2023 భువనేశ్వరీ నిజం గురించి మట్లాడడం హస్యాస్పదం : మంత్రి కొట్టు సత్యనారాయణ ► నిజం గెలవాలని భువనేశ్వరి అనడం హాస్యాస్పదంగా ఉంది ► భువనేశ్వరి నిజం గెలవాలని బస్సు యాత్ర అంటున్నారు... ► ఇది న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా ఉంది ► చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా? ► లోకేష్ వల్లే చంద్రబాబుకు ప్రాణహాని ఉంది ► జనసేన-టీడీపీ కూటమి ఎన్నికల లోపు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి ► సీటు ఎవరికి ఇస్తారో తెలియక టీడీపీ, జనసేన నేతలు మదన పడిపోతున్నారు ► పవన్ తన ఆర్థిక లాభం కోసం బాబు కాళ్లు పట్టుకున్నారు ► దీనికి కాపు సామాజిక వర్గం సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది 15:42 PM, అక్టోబర్ 30, 2023 స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ ► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ పై విచారణ వాయిదా ► విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు 15:42 PM, అక్టోబర్ 30, 2023 స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ ►బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు ►బాబు మధ్యంతర బెయిల్‌పై రేపు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు ►కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ►చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు ►చంద్రబాబు తరపున వర్చువల్‌గా వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూథ్రా ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి 13:17 PM, అక్టోబర్ 30, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణకు లంచ్ బ్రేక్ ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ►బాబు తరఫున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్, లూథ్రాలు ►చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి ►చంద్రబాబు రెండో కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది ►మధ్యాహ్నానికి విచారణ వాయిదా ►లంచ్ బ్రేక్ తర్వాత కొనసాగనున్న వాదనలు 13:01 PM, అక్టోబర్ 30, 2023 భువనేశ్వరి అలా ఒప్పుకున్నట్లేనా?: మంత్రి సత్యనారాయణ ►నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్ర ►అబద్ధాలతో నిజం గెలవాలని అనడం హాస్యాస్పదం ►న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా భువనేశ్వరి తీరు ►నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. కుంగిపోయి చనిపోయేలా చేసిన చంద్రబాబు ►సొంత తండ్రికి అంత జరిగినా స్పందించని భువనేశ్వరి ►ఇవాళ చంద్రబాబు జైలుకు వెళ్తే భువనేశ్వరి పోరాటమా? ►చంద్రబాబుని జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా? ►చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎన్టీఆర్ గారిదే తప్పు అనేది పోనీ భువనేశ్వరి గారు చెప్పగలరా? ►లోకేష్ వల్లే చంద్రబాబుకి ప్రాణహాని ►టీడీపీ-జనసేన పొత్తు.. రెండు అక్రమ పార్టీల కలయిక ►పశ్చిమ గోదావరిలో రెండు పార్టీల మధ్య సీటు కొట్లాట ►ఆర్థిక లాభం కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న పవన్ ►కాపు సామాజిక వర్గం సిగ్గుపడేలా పవన్ తీరు ►ఎన్నికలోపు జనసేన-టీడీపీ కూటమి.. ముక్కలు ముక్కలు ►తాడేపల్లిగూడెంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్ 12:52 PM, అక్టోబర్ 30, 2023 కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాదనలు ►చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు ►మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్ వాదనలు ►చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ విజ్ఞప్తి పరిశీలించండి ►కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు ►కాబట్టి బెయిల్ ఇప్పించండి ►కోర్టులో చంద్రబాబు నాయుడి తరఫు లాయర్ల వాదనలు 12:07 PM, అక్టోబర్ 30, 2023 ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ►చంద్రబాబు రెగ్యులర్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ ►కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ►చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు ►చంద్రబాబు తరపున వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ్ లూథ్రా 11:28 AM, అక్టోబర్ 30, 2023 ఏపీ హైకోర్టులో బాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏసీబీ కోర్టులో బెయిల్ నిరాకరణ ►హైకోర్టులో పిటిషన్లు వేసిన చంద్రబాబు లాయర్లు ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కాసేపటి కిందట ప్రారంభమైన విచారణ 11:25 AM, అక్టోబర్ 30, 2023 జనసేన వద్దు బాబోయ్: బీజేపీ కార్యకర్తలు ►తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై పార్టీ కేడర్ ఆగ్రహం ►సోమవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ►జనసేన వద్దు బాబోయ్ అంటున్న కార్యకర్తలు ►ఏ ప్రాతిపదికన.. పొత్తులో భాగంగా సీట్లు ఇస్తారని ప్రశ్న ►జనంలేని జనసేతో పొత్తు అవసరమా? అని అభ్యంతరం ►నిన్న శేరిలింగంపల్లి సీటు ఇవ్వొద్దంటూ కార్యకర్తల నిరసన ►ఇవాళ బీజేపీ కార్యాలయం వద్ద కూకట్పల్లి బీజేపీ కార్యకర్తల ఆందోళన ►కూకట్పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని నినాదాలు 11:18 AM, అక్టోబర్ 30, 2023 పవన్ కల్యాణ్.. పీకే కాదు కేకే మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ ►టీడీపీని కమ్మ వాళ్లే నాశనం చేస్తున్నారు ►అంత బలంగా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా.. ►అసెంబ్లీలో నేను భువనేశ్వరిని తప్పుగా మాట్లాడలేదు ►భువనేశ్వరి గురించి మాట్లాడింది ఆ సామాజిక వర్గం లీడరే ►పవన్ కళ్యాణ్ PK కాదు.. KK ►పవన్ కిరాయి కోటి గాడు ( KK ) ►కిరాయి తీసుకుంటాడు కాబట్టే కాపులపై జరిగిన దాడుల్ని ఖండించడు ►ముద్రగడ మీద దాడి జరిగినప్పుడు కనీసం ఖండించాడా? ►ప్రగల్భాలు పలికే పవన్.. చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీద పడుకుంటాడు 10:32 AM, అక్టోబర్ 30, 2023 నారా లోకేష్‌కు కౌంటర్లు ►ఏపీ ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తోందంటూ లోకేష్ వ్యాఖ్యలు ►న్యాయ వ్యవస్థను కించపర్చడమేనంటున్న నేతలు ►స్కిల్ స్కామ్‌లో.. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో నోట్‌ఫైల్స్‌పై చంద్రబాబు సంతకం ►మొత్తం 13 నోట్ ఫైళ్లపై సంతకం ►సీమెన్స్ తిరుగులేని సాక్ష్యం ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు, తమకు సంబంధం లేదంటూ ఈ-మెయిల్ పంపిన సీమెన్స్ ►స్కిల్ స్కామ్‌లో నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటన ►మరోవైపు చంద్రబాబుకు ఐటీ నోటీసులు ►వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబే దిట్ట అంటూ లోకేష్‌కు కౌంటర్లు 09:55 AM, అక్టోబర్ 30, 2023 చెప్పేవన్నీ అబద్దాలే! ►పదుల కొద్దీ పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు ►తెలంగాణ బరి నుంచి ఓటమి భయంతో తప్పుకున్న తెలుగుదేశం.! ►చంద్రబాబుకు లేని రోగాలను అంటగడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు 08:59 AM, అక్టోబర్ 30, 2023 .@pawankalyan రాజకీయాలకు కాదు.. సినిమాలకు మాత్రమే పనికి వస్తాడు. ఆయన పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు.. కనీసం పార్టీ జెండా మోసే వాళ్లు కూడా లేరు. అలాంటివాళ్లు పొత్తులతో కలిసి వచ్చినా సీఎం @ysjagan కు వచ్చే నష్టమేమీ లేదు. - ఓ సామాన్యుడి అభిప్రాయం#PublicVoice#CMYSJagan… pic.twitter.com/O71XUOSb8s — YSR Congress Party (@YSRCParty) October 30, 2023 08:39 AM, అక్టోబర్ 30, 2023 మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం 08:27 AM, అక్టోబర్ 30, 2023 టీడీపీ లేకుంటే నా వల్ల కాదు! ►తెలంగాణ ఎన్నికల వేళ ఇటలీకి జంప్ అయిన పవన్..!! ►అమిత్ షాను కలిసినా.. టీడీపీతో పొత్తు కుదరకపోవడంతో నైరాశ్యంలో పవన్? ►తెలంగాణలో బీజేపీతో పొత్తు అంటూనే.. ఇటలీకి జంప్ అయిన పవన్ ►తిరుపతి ఉప ఎన్నికల వేళ ఫాం హౌజ్‌కు పరిమితమైన పవన్ ►తెలంగాణ ఎన్నికల వేళ ఇప్పుడు ఇటలీకి.. ►తెలుగుదేశంతో పొత్తు లేకుంటే తాను సహకరించబోనని బీజేపీకి సంకేతాలిస్తున్న పవన్ 07:55 AM, అక్టోబర్ 30, 2023 ఇవాళ్టి సుప్రీం జాబితాలోని బాబు కేసు ►సుప్రీంకోర్టులో ఇవాళ్టి కేసుల జాబితా విడుదల ►జాబితాలో లేని చంద్రబాబు కేసు ►అయోమయంలో యెల్లో మీడియా కథనాలు! ►నవంబర్ 8న క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తామని ఇది వరకే ప్రకటించిన కోర్టు ►ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 9కి విచారణ వాయిదా ►17a కేసు, ఫైబర్ నెట్ కేసు ఒకేసారి పరిశీలించే అవకాశం 07:55 AM, అక్టోబర్ 30, 2023 చంద్రబాబు, లోకేష్‌లపై టీటీడీపీ ఆగ్రహం ►టీ - టీడీపీ ఏకగ్రీవ తీర్మానం ►తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ తీర్మానం ►తీర్మానాన్ని చంద్రబాబుకు పంపనున్న కాసాని జ్ఞానేశ్వర్ ►చంద్రబాబు, లోకేష్ నిర్ణయంపై తెలంగాణ టీడీపీ తీవ్ర ఆగ్రహం ►వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టొద్దని అంతర్గతంగా చర్చ ►ఈ కారణాలతో పోటీకి దూరంగా ఉంటున్నాము అని ప్రజలకు ఎలా చెబుతామని ఆందోళన ►ఇప్పుడు పోటీ చేయకపోతే తెలంగాణలో ఇక పార్టీ కార్యాలయం మూసుకున్నట్టేనని ఆవేదన ►కేవలం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేందుకే పోటీ నుంచి తప్పుకున్నామన్న కారణం కనిపిస్తోందంటున్న పార్టీ సీనియర్లు 07:34 AM, అక్టోబర్ 30, 2023 ఏపీ హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ►ఏపీ హైకోర్టు రోస్టర్‌లో సమూల మార్పులు ►కొత్త జడ్డీల రాకతో మార్పులు చేసిన సీజే ►జస్టిస్ మల్లికార్జునరావుకు బెయిల్ పిటిషన్ల విచారణ ►ప్రజా ప్రతినిధుల కేసులు కూడా మల్లికార్జునకే! ►నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సోమవారం విచారణ 07:32 AM, అక్టోబర్ 30, 2023 ఎరైటీ తమ్ముళ్లు.. జనం నవ్వులు ►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వెరైటీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న టీడీపీ ►చంద్రబాబు అరెస్టును ఏమాత్రం పట్టించుకోని సాధారణ జనం ►అయినా తమ్ముళ్ల ఎరైటీ నిరసనలు ►పల్లెం కొట్టడం, కొవ్వొత్తి వెలిగించడం, చేతులకు సంకెళ్లు, మరికొన్ని చోట్ల వేడుకలు ►చేపట్టిన ప్రతీ కార్యక్రమం అట్టర్ ప్లాప్ ►తాజాగా.. కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమానికి అదే రీతిలో స్పందన ►కనీసం క్యాంప్ కార్యాలయం వద్ద కూడా నిరసన కార్యక్రమం నిర్వహించని టీడీపీ శ్రేణులు 07:19 AM, అక్టోబర్ 30, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ►నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు సీజే బెంచ్ ►తన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ చేయకుండా అడ్డుకునే ఎత్తుగడ ►పార్టీతో, లీగల్ సెల్‌తో సంబంధం లేని మూర్తితో కన్సెంట్ వకాలత్ దాఖలు ►మూర్తి వెనుక ఓ ఎల్లో మీడియా చానెల్ ఓనర్, ఒక విశ్రాంత న్యాయమూర్తి ►నిబంధనల ప్రకారం నడుచుకునే జడ్జిగా జస్టిస్ జ్యోతిర్మయికి పేరు ►మూర్తి సతీమణి తనకు తెలిసి ఉండటంతో నైతిక విలువలకు లోబడి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►అందుకే ఆమె ముందు నాట్ బిఫోర్ అస్త్రం ►ఆమె నైతిక విలువలనే అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు ►ఆమె తప్పుకుంటే ఆయన వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ, జస్టిస్ అడుసుమిల్లి ముందుకు వెళ్లేలా ప్లాన్ ►అయితే ఊహించని విధంగా ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ జ్యోతిర్మయి ►ఈ కేసును సీజే ముందుంచాలని ఆదేశం ►దీంతో కంగుతిన్న చంద్రబాబు న్యాయవాదులు 07:15 AM, అక్టోబర్ 30, 2023 వివిధ కోర్టులో పెండింగ్‌లో బాబు పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్‌ల పిటిషన్ ► స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్ల వాదన ►డేటా భద్రపర్చడం అంటే.. బహిర్గత పర్చడమే!. అది అధికారుల వ్యక్తిగత భద్రతకు మంచిది కాదని సీఐడీ తరపు న్యాయవాదుల వాదన ►వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్ 31కి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►విచారణ నుంచి తప్పుకుని సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన న్యాయమూర్తి ► నేడు అక్టోబర్ 30(సోమవారం) విచారణ ►ఏపీ హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా ►ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు ►సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8వ తేదీన ►సుప్రీంలో నవంబర్ 9వ తేదీన ఫైబర్‌నెట్ స్కామ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వేసిన సీఐడీ ►విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 10కి వాయిదా 07:12 AM, అక్టోబర్ 30, 2023 జైల్లో బాబు.. సానుభూతి కోసం కుటుంబ సభ్యులు ►పదుల కొద్ది పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►ముందు క్వాష్, తర్వాత బెయిల్, ఆ తర్వాత ఏసీ, మళ్లీ వైద్యం, ఆ తర్వాత కాల్ డాటా ►చేతిలో లాయర్లున్నారన్న ధీమాతో కింది నుంచి పైదాకా అన్నికోర్టుల్లో పిటిషన్లు ►లేని భయాలు, సాకులు చూపుతూ ACB కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు 07:00 AM, అక్టోబర్ 30, 2023 జైల్లో చంద్రబాబు @51వ రోజు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► నవంబర్ 1 వరకు జైల్లోనే చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 51వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
విజయనగరం రైలు ప్రమాదం.. అప్డేట్స్
విజయనగరం రైలు ప్రమాద ఘటన.. సహాయక చర్యల అప్డేట్స్ విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఓ ప్యాసింజర్ రైలు.. ఆగి ఉన్న మరో ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది. ఆపై పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లి మరింత బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 54 మందికి గాయాల అయ్యాయని అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుండగా.. ఈ సాయంత్రం లోపే ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. 17:40 PM సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. ట్వీట్ ద్వారా ప్రశ్నించిన సీఎం జగన్ ►రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైంది? ►ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరిన సీఎం జగన్ ►దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది ►ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి ►నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది ►ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది ►బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు? The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain. A running train collided with another stationed train, both of which were running in the same direction. This horrifying accident gives rise to certain obvious questions:… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 17:24 PM రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ట్వీట్ ►విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. ►వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ►ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. ►వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ►వారికి మంచి వైద్యం అందించాలి ► మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలి 16:06 PM సీఎం జగన్ ఏరియల్ వ్యూ ►విజయనగరం: ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ వ్యూ ►విజయనగరం నుంచి విశాఖ వెళ్తూ పరిశీలించిన సీఎం జగన్ 16:05 PM విజయనగరం ప్రమాదస్థలిలో ట్రాక్ టెస్టింగ్ సక్సెస్ ►పునరుద్ధరణ జరిగిన మార్గాల్లో విజయవంతంగా రైళ్లు నడిపిన అధికారులు ►డౌన్‌లైన్‌లో గూడ్స్.. అప్‌లైన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ పరిశీలన పూర్తి 14:22 PM విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం జగన్ ►ప్రమాద ఘటనకు సంబంధించిన ఫోటోలను పరిశీలించిన సీఎం ►అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం ►ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం ►ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్ ►రెండు వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లి పరామర్శించిన సీఎం ►వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం 14:08 PM విజయనగరం చేరుకున్న సీఎం జగన్ ►విజయనగరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ ►విజయనగరం రైల్వే ప్రమాద ఘటన బాధితులకు కాసేపట్లో పరామర్శ ►ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫొటోల ప్రదర్శన ►ఘటన గురించి సీఎం జగన్‌కు వివరిస్తున్న అధికారులు ►రైల్వే అధికారుల విజ్ఞప్తితో ఘటనా స్థలికి వెళ్లని సీఎం జగన్ ►నేరుగా ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్ 13:23PM విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ►విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి ►రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులకు పరామర్శ 12:44PM బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స ►రైలు ప్రమాద బాధితులకు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు ప్రభుత్వం దే బాధ్యత ►విజయనగరం ప్రమాద ఘటన సహాయక చర్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందన ►బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది ►మృతులు కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థికసాయం ఇస్తాం ►తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ. 2లక్షలు ►సాధారణ గాయాలైనవాళ్లకు రూ. 50 వేల సాయం ►ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది ►రైల్వే అధికార్ల సమన్వయంతో పనిచేస్తున్నాం ►ట్రాక్ పునః నిర్మాణ పనులు కాసేపట్లోనే పూర్తి అవుతాయి 12:30PM సీఎం జగన్ పర్యటనలో మార్పు ►సీఎం జగన్ విజయనగరం పర్యటనలో మార్పు ►కంటకాపల్లి ప్రమాద ఘటన స్థలం వద్ద పర్యటన రద్దు ►రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం ►ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు ►యుద్ద ప్రాతిపదినక ట్రాక్ పునురుద్ధరణ పనులు ►ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే... ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడి ►రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్ ►నేరుగా పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం జగన్ ►ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులకు పరామర్శ :::జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి 12:18PM విజయనగరం బయల్దేరిన సీఎం జగన్ ►విజయనగరం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►విశాఖకు.. అక్కడి నుంచి విజయనగరం ప్రమాద స్థలికి ►కాసేపట్లో రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన ►గాయపడిన వారిని పరామర్శించనున్న సీఎం జగన్ 12:05PM విజయవాడ డివిజన్లో హెల్ప్‌లైన్ డెస్క్ ►విజయవాడ రైల్వే జంక్షన్ పై రాయగడ రైలు ప్రమాద ప్రభావం ►విజయవాడ నుండి వెళ్ళే పలు రైళ్లు రద్దు ►విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు ►27 రైళ్లు రద్దు, 28రైళ్ళను మళ్లించిన రైల్వే అధికారులు ►విజయవాడ రైల్వే జంక్షన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు ►ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్న హెల్ప్ డెస్క్ ►ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు ►అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ టౌన్, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, భీమవరం టౌన్, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరుకు సంబంధించి నెంబర్లు ►ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం అయినా సంప్రదించవచ్చొన్న రైల్వే అధికారులు ►ఇప్పటివరకు తమవాళ్లు లేదా రైలు ప్రమాదంలో ఉన్నట్టు తమకి ఒక్క ఫోన్ ఫోన్ రాలేదంటున్న అధికారులు 11:48AM బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది: సీపీఎం రాఘవులు ►విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి లో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీపీఎం నేత రాఘవులు ►గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోంది.. వైద్యులకు అభినందనలు ►ఒడిశా బాలాసోర్ తరహా ఘటన మళ్లీ పునరావృతం అయ్యింది ►రైల్వే శాఖకు శిక్ష వేయాలి ►మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 50 లక్షలు పరిహారం ఇవ్వాలి ►క్షతగాత్రులకు 25 లక్షలకు పరిహారం ఇవ్వాలి ►ఆదివారం కాకుండా మిగతా పని దినాల్లో అయితే వందల్లో చనిపోయే వారు ►రైల్వే సిగ్నలింగ్ లో లోపాలు వున్నాయి ►సిబ్బంది కొరత వలనే రైల్వే లో ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. 11:29AM కాసేపట్లో విజయనగరానికి సీఎం జగన్ ►కాసేపట్లో విజయనగరం పర్యటనకు సీఎం జగన్ ►విశాఖకు.. అక్కడి నుంచి కంటకాపల్లికి ►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన ►చికిత్స పొందుతున్న వాళ్లకు పరామర్శ ►నేటి ఎస్.ఐ.పీ.బీ సమావేశం త్వరగా ముగించుకున్న సీఎం జగన్ ►పలు పెట్టుబడులు, వివిధ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదం 11:10AM విజయనగర ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం: ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ►విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలు ►వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ►కంటకాపల్లి-అలమండ మధ్య నెమ్మదిగా వెళ్తున్న పలాస రైలును ఢీ కొట్టిన రాయగడ రైలు ►విజయనగర రైలు ప్రమాదం మానవ తప్పిదవల్లేనన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆఫీసర్ ►ప్రమాదంపై ఓ మీడియా ఛానెల్తోఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ విశ్వజిత్ సాహూ ►రాయగడ ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగింది ►రెడ్ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు ►ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందన్న అధికారి సాహూ ►అయితే దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టీకరణ ►ఈ ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ రావు కూడా మృతి 10:26AM చురుగ్గా రైల్ ట్రాక్ పునఃనిర్మాణ పనులు ►విజయనగరం రైల్వే ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపాదికన చర్యలు ►140 టన్ ల బాహుబలి క్రేన్‌తో ధ్వంసమైన బోగీలు తొలగింపు ►ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ►ట్రాక్ పునఃనిర్మాణ పనులు, బాధితుల సౌకర్యాల పై ఘటనా స్థలం లో సమీక్ష చేసిన ఇంచార్జ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు ప్రమాదంలో దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది ►సహాయక చర్యల పై జిల్లా అధికార యంత్రాంగాన్ని అర్ధరాత్రే అప్రమత్తం చేసిన సీఎం జగన్ ►సీఎం ఆదేశాలతో ఘటనా స్థలం వద్ద 40 అంబులెన్సులులు సిద్దం ►గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించిన అధికార్లు ►మృత దేహాలను హుటాహుటిన గుర్తించి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ కి తరలింపు ►ప్రత్యేక వైద్యులను కేటాయించి త్వరితగతిన పోస్టుమార్టం ►బంధువులకు మృతదేహాలు అప్పగించి, వారి గ్రామాలకు ఉచిత రవాణా ఏర్పాటు ►వైద్య సేవలకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు ►ఇవాళ మధ్యాన్నం విజయనగరానికి సీఎం జగన్ ►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలించి, క్షతగాత్రులకు పరామర్శ 10:23AM క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ►రైలు ప్రమాదంలో సహాయ చర్యల్లో వెయ్యి మంది రైల్వే సిబ్బంది ►మంచినీరు మందులు... ఆహర పదార్థాలతో నిన్న రాత్రి.. ఈరోజు ఉదయం విశాఖ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు ►ఐదుగురు విశాఖ వాసులకు విజయనగరం జిజిహెచ్ లో చికిత్స ►విశాఖలోని అపోలో ఒకరు.. కింగ్ జార్జ్ ఆసుపత్రలో మరొకరికి వైద్యం 10:18AM నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి ►విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భువనేశ్వరి 10:12AM రైలు ప్రమాద ఘటనపై రాహుల్ గాంధీ స్పందన ►విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి ►ఫేస్బుక్లో పోస్ట్ ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ►క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాహుల్ గాంధీ 09:58AM విజయనగర ప్రమాదం.. రాజమండ్రి స్టేషన్లో హెల్ప్‌డెస్క్ ►విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదం ►రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు ►రద్దయిన, మళ్లించిన రైళ్ళ వివరాలపై ప్రయాణికులకు సమాచారం ఇస్తున్న రైల్వే సిబ్బంది ►ప్రమాద ఘటనలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మృతులు గాని గాయపడిన వారిపై సమాచారం లేదని తెలిపిన రైల్వే అధికారులు 09:40AM విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల పేర్లు రావు, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, విశాఖపట్నం చింతల కృష్ణం నాయుడు పిల్ల నాగరాజు కంచుభరకి రవి (30), గోడికొమ్ము (గ్రామం), జామి (మండలం), విజయనగరం గిడిజాల లక్ష్మి (35), ఎస్పీ రామచంద్రాపురం, జీ సిగడాం మండలం, శ్రీకాకుళం కరణం అప్పలనాయుడు (45), కాపు సంబాం (గ్రామం), గరివిడి (మండలం), విజయనగరం చల్లా సతీష్ (32), ప్రదీప్ నగర్, విజయనగరం శ్రీనివాస్ టెంకల సుగుణమ్మ రెడ్డి ససీతంనాయుడు మజ్జి రాము ఎం. శ్రీనివాస్ విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు గార్డు ►మరో మృతదేహాం గుర్తించాల్సి ఉంది ►త్వరగతిన విజయనగరం ప్రభుత్వాసుప్రతిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం 09:17AM ►విజయనగరం ఘోర రైలు ప్రమాదం.. 13కి చేరిన మృతుల సంఖ్య 09:04AM బాధితుల్ని తక్షణమే ఆదుకునేలా ఏపీ సర్కార్ చర్యలు ►విజయనగరం రైలు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల్ని సత్వరమే ఆదుకునేలా ఏపీ ప్రభుత్వం అన్ని రకాలచర్యలు ►క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ►మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం ప్రకటన ►మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం ►తక్షణమే అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు ►బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర రైల్వే మంత్రికి ఫోన్లో వివరించిన సీఎం జగన్ 08:54AM ఘటనాస్థలానికి వెళ్లనున్న సీఎం జగన్ ►విజయనగరం జిల్లా కంటాకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం ►ఘటన గురించి తెలియగానే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ►రైల్వే శాఖ మంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన సీఎం జగన్ ►సీఎం జగన్ ఆదేశాలతో ఘటనాస్థలానికి వెళ్లిన మంత్రి బొత్స.. సహాయక చర్యల పర్యవేక్షణ ►నేడు ఘటనా స్థలానికి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►ప్రత్యేక విమానంలో విశాఖకు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఘటనాస్థలానికి ►అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్న సీఎం జగన్ ►క్షతగాత్రుల్లో ఏపీ వాసులే అధికం 08:50AM రైలు ప్రమాదం రీత్యా పలు రైళ్ల రాకపోకలు మళ్లింపు ►చెన్నై-సంత్రగచి(22808) ఎక్స్‌ప్రెస్ ►హైదరాబాద్-షాలిమర్(18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►త్రివేండ్రం-షాలిమర్(22641) ఎక్స్‌ప్రెస్ ►ఆగర్తల-బెంగళూరు(12504)ఎక్స్‌ప్రెస్ ►సంత్రగచీ-తిరుపతి(22855)ఎక్స్‌ప్రెస్ ►షాలీమర్-చెన్నై(12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►ధన్‌బాద్-అలెప్పీ(13351) బొకరో ఎక్స్‌ప్రెస్ ►హతియా-బెంగళూరు(12835)ఎక్స్‌ప్రెస్ ►మంగళూరు-సంత్రగాచీ(22852) ఎక్స్‌ప్రెస్ ►బెంగళూరు-హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్ ►బెంగళూరు-జశిద్ది(22305) ఎక్స్‌ప్రెస్ ►కన్యాకుమారి-హౌరా(22503) ఎక్స్‌ప్రెస్ ►చెన్నై-హౌరా(12840) ఎక్స్‌ప్రెస్ వాస్కోడిగామా-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ 08:35AM ఘటనా స్థలంలో ముమ్మురంగా సహాయ చర్యలు ►రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికంగా కొనసాగుతున్న పనులు ►ప్రమాదానికి గురైన పలాస పాసింజర్ 11 భోగిలను అలమండ రైల్వే స్టేషన్ కు తరలించిన సిబ్బంది ►ప్రమాదానికి గురైన రాయగడ పాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి రైల్వే స్టేషన్ కు తరలించిన రైల్వే సిబ్బంది ►వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రకటన ►ఘటనా స్థలం నుంచి దూరంగా వెళ్లాలని.. రైల్వే పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలకు అధికారుల విజ్ఞప్తి 08:21AM కంటకాపల్లి - అలమండ మధ్య జరిగిన జరిగిన రైలు ప్రమాదంతో సోమవారం రద్దైన రైళ్ల వివరాలు ► కోర్బా - విశాఖపట్నం (18517) ఎక్స్‌ప్రెస్ ►పారాదీప్ - విశాఖపట్నం (22809) ఎక్స్‌ప్రెస్ ►రాయగడ - విశాఖపట్నం (08503)ప్యాసింజర్ స్పెషల్ ► పలాస - విశాఖపట్నం (08531) ప్యాసింజర్ స్పెషల్ ► విశాఖపట్నం - గునుపుర్ (08522)ప్యాసింజర్ స్పెషల్ ►గునూపుర్ - విశాఖపట్నం (08521) ప్యాసింజర్ స్పెషల్ ► విజయనగరం - విశాఖపట్నం (07469) మెము స్పెషల్ ► విజయవాడ - విశాఖపట్నం (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ► గుంటూరు - విశాఖపట్నం (12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ► కాకినాడ - విశాఖపట్నం (17267) మెము ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం - కాకినాడ (17268) మెము ఎక్స్‌ప్రెస్ ► రాజమండ్రి- విశాఖపట్నం (07466) మెము స్పెషల్ ►విశాఖపట్నం - రాజమండ్రీ (07467) మెము స్పెషల్ ►కోరాపుట్ - విశాఖపట్నం (08545) స్పెషల్ ►విశాఖపట్నం - కోరాపుట్ (08546) స్పెషల్ ► పలాస - విశాఖపట్నం (08531) స్పెషల్ ► చెన్నై - పూరి (22860) ఎక్స్‌ప్రెస్ ►రాయగడ - గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్ 08:09AM ట్రైన్ లోకో పైలట్ ఎం ఎస్ రావులు మృతి ►విజయనగరం రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన రాయగడ ట్రైన్ ఇంజన్ ►ఇంజన్లో మృతదేహం.. లోకో పైలట్ ఎంఎస్ రావుగా గుర్తింపు ►తోటి ఉద్యోగి మరణంతో దిగ్భ్రాంతిలో రైల్వే ఉద్యోగులు 07:59AM ఆయా స్టేషన్ల నుంచి బయల్దేరి.. దారి మళ్లిన రైళ్ల వివరాలివే.. ►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - సంత్రగచి (22808) ఎక్స్‌ప్రెస్ ►29న హైదరాబాద్ లో బయల్దేరిన హైదరాబాద్ - శాలిమర్ (18046)ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►28న త్రివేండ్రం లో బయల్దేరిన త్రివేండ్రం - షాలిమర్ (22641) ఎక్స్‌ప్రెస్ ►28న అగర్తల లో బయల్దేరిన ఆగర్తల - బెంగళూరు (12504) ఎక్స్‌ప్రెస్ ►29న శాలిమార్ లో బయల్దేరిన షాలిమర్- హైదరాబాద్ (18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►29న సంత్రాగచి లో బయల్దేరిన సంత్రగచీ - తిరుపతి (22855) ఎక్స్‌ప్రెస్ ►29న షాలిమర్ లో బయల్దేరిన షాలిమర్ - చెన్నై (12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - షాలిమర్ (12842) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►29న Dhanbad లో బయల్దేరిన Dhanbad - అలెప్పీ (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ ►29న హతియ లో బయల్దేరిన హతియా - బెంగళూరు (12835) ఎక్స్‌ప్రెస్ ►28న మంగుళూరు లో బయల్దేరిన మంగుళూరు - సంత్రగాచి (22852) ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన bengaluru- హౌరా (12246) దురంతో ఎక్స్‌ప్రెస్ ►29న తిరుపతి లో బయల్దేరిన తిరుపతి - హౌరా (20890) ఎక్స్‌ప్రెస్ ►29న సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన సికింద్రాబాద్- హౌరా (12704) ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - హౌరా (12864) ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - జశిద్ది (22305) ఎక్స్‌ప్రెస్ ►28న కన్యాకుమారి లో బయల్దేరిన కన్యాకుమారి - హౌరా (22503) ఎక్స్‌ప్రెస్ ►29న చెన్నయ్ లో బయల్దేరిన చెన్నయ్ - హౌరా (12840) మెయిల్ ►29 న వాస్కోడగామ లో బయల్దేరిన వాస్కొడగమ - షాలిమార్ (18048) ఎక్స్‌ప్రెస్ లు వయా Kharagpur - ఝార్సుగుడ - రాయ్ పూర్ - విజయవాడ మీదుగా రాకపోకలు ఈ 19 రైళ్లు ఇవాళ (సోమవారం) విశాఖపట్నం మీదుగా నడవవు 07:42AM ►కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు ►రైలు ప్రమాదంలో 54 మంది క్షత గాత్రులయ్యారు ►క్షతగాత్రులంతా ఏపీకి చెందినవారే ►క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం ►32 మందికి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స ►విశాఖ ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రిలో ఒకరిని, మెడికవర్ ఆసుపత్రిలో ఇద్దరిని చేర్పించాం ►నలుగురి పరిస్థితి విషమంగా ఉంది :::విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి 07:40AM విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు నెంబర్లు 0891 2746330, 08912744619 ►ఎయిర్టెల్ 81060 53051 8106053052 ►బీఎస్ఎన్ఎల్ 8500041670 8500041671 07:32AM ►రైలు ప్రమాదం నేపథ్యంలో విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హెల్ప్ లైన్ ►జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన ►కేజీహెచ్ క్యాజువాలిటీ 8912558494 ►కేజీహెచ్ డాక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ 8341483151 ►కేజీహెచ్ కేసు క్వాలిటీ 8688321986 ►ప్రయాణికుల క్షతగాత్రుల వైద్య సహాయం కోసం ఈ ఫోన్లను సంప్రదించాలని సూచన 06:31AM ►ఘటనా స్థలానికి చేరుకున్న బాహుబలి క్రేన్. చెల్లా చెదురు అయిన బోగీలను తొలగించే పనులు మరింత ముమ్మరం 06:02AM ►క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ►రాత్రంతా కొనసాగుతూనే ఉన్న మూడు లైన్ ల ట్రాక్ పనులు, పునరుద్ధరణ పనులు ►అలమండ ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు ►మృతుల సంఖ్య, వివరాలని అంచనా వేస్తున్న అధికారులు ►విశాఖ, భువనేశ్వర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ►పదికి చేరిన మృతుల సంఖ్య ►మృతుల సంఖ్య పెరిగే అవకాశం నేడు పలు రైళ్ల రద్దు విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. Bulletin 6-: pic.twitter.com/qr2o319M04 — Ministry of Railways (@RailMinIndia) October 29, 2023 బాధితుల కోసం సహాయక కేంద్రాలు విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్ రూం) ఏర్పాటుచేశారు. విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను కలెక్టర్ మల్లికార్జున అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను పంపారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు విజయనగరం కలెక్టరేట్: 94935 89157 విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102 కేజీహెచ్: 89125 58494, 83414 83151 వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151 అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986 రైల్వే ఆధ్వర్యంలో.. భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్ ఫ్రీ) వాల్తేరు టెస్ట్ రూం: 89780 80805 సీనియర్ సెక్షన్ ఇంజినీర్ : 89780 80815 వాల్తేరు డివిజన్: 08942286245, 08942286213 అలమండ, కంటకాపల్లి: 89780 81960 విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006 శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245 ఏలూరు: 08812232267 సామర్లకోట: 08842327010 రాజమహేంద్రవరం: 08832420541 తుని: 08854252172 విశాఖ రైల్వేస్టేషన్లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671. ప్రమాదం ఎందుకు జరిగింది? విజయనగరం ఘోర ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రైలు ఢీకొన్నట్లు వివరిస్తున్నారు. కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాదం తరువాత సహాయక చర్యలు చేపట్టిన యంత్రాంగం.. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బొగ్గు రవాణా రైలు, ట్యాంకరు రైలును ఆ ప్రాంతం నుంచి తరలించారు. అలాగే పలాస రైలులో ప్రమాదానికి గురైన బోగీలు మినహాయించి మిగిలిన బోగీలను తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కంటకాపల్లిలో నిలిపివేశారు. ఆయా రైళ్లలో ప్రయాణికులను రోడ్డు మార్గంలో తరలించారు. ప్రమాదానికి సిగ్నల్ సమస్య కారణమా? లేదంటే మానవ తప్పిదమా? అనేది తేలాల్సి ఉంది. ఏం జరిగింది.. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. ప్రమాద ధాటికి రైలు ఇంజన్ సహా ఐదు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహం నెలకొంది. బాలేశ్వర్ తరహాలోనే.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్యాసింజర్ రైళ్ల ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజినుపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్సు రైలు వెళుతోంది. ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్, గూడ్సు రైళ్లలో కలిపి ఐదు బోగీలు నుజ్జయ్యాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని సాయం రూ.2 లక్షలు విజయనగర రైలు ప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from the PMNRF for the next of kin of each deceased due to the train derailment between Alamanda and Kantakapalle section. The injured would be given Rs. 50,000. https://t.co/K9c2cRsePG — PMO India (@PMOIndia) October 29, 2023 ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోనూ ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. All injured shifted to hospitals. Ex-gratia compensation disbursement started - ₹10 Lakh in case of death, ₹2.5 Lakh towards grievous and ₹50,000 for minor injuries. — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 29, 2023 సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటన గురించి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో ఆదివారం రాత్రి ఆయన ఫోన్లో మాట్లాడారు. ఘటనాస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపామని, ప్రమాద విషయం తెలియగానే సహాయకబృందాలు అక్కడకు చేరుకున్నాయని వివరించారు. సహాయక చర్యల్ని స్థానిక కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. -
రౌడీమూకపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసు శాఖ 14 మంది నిందితులను గుర్తించడంతోపాటు ఏడుగురిని 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులకు అధికార వైఎస్సార్సీపీతో ఏమాత్రం సంబంధం లేదని, వారిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు విపక్ష టీడీపీ – జనసేన వేసిన ఎత్తుగడలు పారలేదు. పరారీలో ప్రధాన నిందితుడు ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకల దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడ్డవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసు శాఖ దాడి దృశ్యాల వీడియో ఫుటేజీని పరిశీలించి 14 మంది నిందితులను గుర్తించింది. కావలి – తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బండి విల్సన్, పుట్టా శివకుమార్‌రెడ్డి, షేక్ ఖాజావలి, కుప్పాల వంశీ, షేక్ కలీమ్ చోటు, షేక్ ఇలియాజర్, షేక్ బాజీలను అరెస్ట్ చేసినట్టు ఆదివారం ప్రకటించారు. 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తోపాటు మిగిలినవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాతోపాటు అన్ని చోట్లా విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలోనే నేర చరిత్ర.. రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. కావలి ప్రాంతంలో ఈ ముఠా ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం, సెటిల్మెంట్లు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. అమాయకులను మోసగిస్తున్న నిందితులపై గతంలోనే పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచారు. బండి విల్సన్‌పై 14 కేసులు, శివకుమార్‌రెడ్డిపై 8 కేసులు ఉండటం గమనార్హం. మిగిలిన ఐదుగురిని వీరి అనుచరులుగా గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 341, 332, 307, 323, 427 రెడ్‌విత్ 34 సీఐపీ సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రాజకీయ రాద్ధాంతం డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని అధికార వైఎస్సార్ సీపీతోపాటు అంతా ఖండించినా టీడీపీ – జనసేన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన నిందితులతో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా లోకేశ్ సహా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం కావడంతో విపక్ష నేతలు తోక ముడిచారు. ఆర్టీసీ యూనియన్ల హర్షం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించిన విధానం, ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ సంఘాలకు ఎండీ భరోసానిచ్చారు. సుధీర్ ముఠా మోసాలపై ఫిర్యాదు చేయాలి వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించాం. కావలికి చెందిన ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కుమారుడి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడంతో పరారయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తాం. రూ.1.5 కోట్ల విలువైన రెండు వాహనాలను జప్తు చేశాం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సుధీర్ ముఠా చేతిలో మోసపోయిన వారు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. – తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ, నెల్లూరు జిల్లా -
Vizag: రేవ్ పార్టీలో దారుణం.. మద్యం మత్తులో అమ్మాయి కోసం..
సాక్షి, విశాఖపట్నం: అచ్చుతపురంలో రేవ్ పార్టీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం నుంచి పార్టీ చేసుకోవడానికి కొంత మంది యువతీ యువకులు వచ్చారు. మద్యం మత్తులో అమ్మాయి కోసం జరిగిన గొడవలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని స్విమ్మింగ్ పూల్‌లో ముంచి స్నేహితులు హత్య చేశారు. మృతుడు సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది? -
Oct 29th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates 07:39PM, అక్టోబర్ 29, 2023 అట్టర్ ప్లాప్ అయినా కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం ►చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు ►లోకేష్ పిలుపును పట్టించుకోని ప్రజలు, టీడీపీ క్యాడర్ ►ఇళ్లల్లో నుంచి బయటికి రాని ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ►వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్న చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు ►ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయినా మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు ►ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామా 07:27PM, అక్టోబర్ 29, 2023 నారా లోకేష్ ట్వీట్‌కు ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్ ►లోకేష్‌ను చూసి జాలి పడాలా.. నవ్వాలా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు ►నేనొక ఫిలిం మేకర్ని సినిమాలు తీయడం నా పని ►నేను నీలాగా జనాలకు సేవ చేయడానికి పుట్టాను.. తిరుగుతున్నాను.. చస్తాను అని ఎప్పుడైన చెప్పానా? ►నన్ను క్రిటిసైజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సేవ తప్పితే ఏ టాపిక్నీకు దొరకలేదా? ►నేను నీ ప్లేస్‌లో ఉంటే ఏం చెప్తానో తెలుసా.. అతను హిట్ ఇచ్చి చాలా రోజులు అయ్యింది.. పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు.. ఏవో ట్వీట్స్ పెడతాడు.. అతనికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని చెప్పొచ్చు కదా ►ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎట్లా? ►నా లైఫ్ ఓపెన్ బుక్ ►నీలాగా ఎక్కడో స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫోటోలను దాచేసి అలాగ నేనెప్పుడూ చెప్పను ►చంద్రబాబు గారు ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఇన్స్టిబిలైజ్ అయ్యిందేమో చూసుకో ►నీ ఫాదర్‌ని దేవుడు కూడా కాపాడ లేడు.. నిన్ను చూస్తే బాధ కలుగుతుంది ►లండన్‌కో.. ఎక్కడికో వెళ్లి రెస్ట్ తీసుకొని మనసుకు శాంతిపరుచుకుంటే మంచిది నువ్వు ►హయిరాన పడి ఏది పడితే అది మాట్లాడితే రాంగ్ సిగ్నల్ వెళుతుంది.. నీ మంచి కోసం నేను చెప్తున్నా 04:40PM,అక్టోబర్ 29, 2023 చంద్రబాబు, లోకేష్‌లపై మంత్రి అమర్నాథ్ ఫైర్ ►లోకేష్ తండ్రితో ములాఖత్ అయిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్లున్నారు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుల్లో టీడీపీ వాదనల ఫలితాలు అందరూ చూశారు ►రుజువులు మీకు ఎందుకు చూపిస్తారు.. కోర్టులకు ఇస్తారు ►మీ తండ్రి 13 చోట్ల సంతకాలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా చూపించాం ►సీమెన్స్ సంస్థ మాకు, ఆ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది ►130 నుంచి 140 మంది వాంగ్మూలం కూడా ఇచ్చారు ►రూ. 370 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము మీ తండ్రి చంద్రబాబు కొట్టేశారు ►దొంగ దొరికిన తర్వాత ఎంతకాలమైనా జైల్లో ఉంటారు ►17-ఏ గురించి మాట్లాడతారు గానీ తప్పు చేయలేదని అనడం లేదు ►లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి ►లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది ►దొంగలకు పోలీసుల కాల్ డేటాతో ఏం సంబంధం? ►వ్యవస్థలను మేనేజ్ చేసుకునే అలవాటు మాకు లేదు ►వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకే అలవాటు ►గత ఎన్నికల్లో ప్రజలు చీ కొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు ►చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించలేకపోయాడు ►పొత్తు లేకుండా ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఎప్పుడూ లేదు 12:00 PM, అక్టోబర్ 29, 2023 మాట తప్పడం బాబుకు మాములే.. ►హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబు నైజం ►ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని బాబు. హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబు నైజం....ఇచ్చిన మాట మీద నిలబడడం సీఎం వైయస్ జగన్ నైజం.#EndofTDP pic.twitter.com/Tcep4wtr2W — YSR Congress Party (@YSRCParty) October 29, 2023 10:30 AM, అక్టోబర్ 29, 2023 చంద్రబాబు పిటిషన్లపై రేపు విచారణ ►చంద్రబాబుు పిటిషన్లపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ►సోమవారం విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు 8:30 AM, అక్టోబర్ 29, 2023 చంద్రబాబు @జైలు 50వ రోజు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 50వ రోజు కొనసాగుతున్న చంద్రబాబు ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ప్రతీరోజూ మూడుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు ►చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టామన్న జైలు అధికారులు ►జైలు లోపలే కాకుండా బయట కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు ►నిరంతరం సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్న జైలు అధికారులు, పోలీసులు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు సహకరించాలంటూ భువనేశ్వరికి లేఖలు రాసిన జైలు అధికారులు 8:00 AM, అక్టోబర్ 29, 2023 ఇటలీకి పవన్ జంప్.. ►ఒక వైపు సమన్వయ కమిటీ మరోవైపు పవన్ ఇటలీకి జంపు ►నేటి నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు ►సమన్వయ కమిటీని పట్టించుకోకుండా ఇటలీకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ ►పవన్ చేసింది ఎప్పుడూ పార్ట్ టైం పాలిటిక్స్ అంటున్న జనసేన నాయకులు ►కొన్ని షూటింగ్స్, మరికొన్ని ట్రిప్పుల మధ్యలో విరామం వస్తేనే పాలిటిక్స్ ►మీకు ఖాళీ ఉన్నప్పుడే జనం గుర్తుకు వస్తారా? ►మీరు బిజీగా ఉంటే ప్రజలను, పార్టీని పట్టించుకోరా? ►ఇంతటి దానికే జైలుకు ముందుకెళ్లి పొత్తు ప్రకటన చేస్తారా? ►రాజకీయాల పట్ల ప్రజా సమస్యల పట్ల మీకున్న అవగాహన, నిబద్ధత ఇదేనా? 7:45 AM, అక్టోబర్ 29, 2023 పరాకాష్టకు చేరిన లోకేష్ పిచ్చి పనులు.. ►చంద్రబాబుకు మద్దతుగా నేడు రా.7 నుంచి 7.05 గంగల మధ్య కళ్లకు గంతలు కట్టుకోవాలని సూచన ►అలా ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి నిజం గెలవాలి అని గట్టిగా నినదించండి: నారా లోకేష్ ►ఇప్పటికే పలుమార్లు నవ్వుల పాలైన లోకేష్, తెలుగుదేశం ►చప్పట్లు కొట్టాలని ఒకసారి, ప్లేట్స్ కొట్టాలని మరోసారి, ఆ తర్వాత వాహనాల సైరన్లు మోగించాలని.. ఇలా పిచ్చి పనులతో నవ్వుల పాలవుతున్న టీడీపీ శ్రేణులు ►జనమంతా నవ్వుకుంటున్నా తనకేంటన్న ధోరణిలో లోకేష్ ►చంద్రబాబు బోలెడు తప్పులు చేశారన్న ఆధారాలు బయటపడ్డ తర్వాత ఇంకెవరి కళ్లకు గంతలు కడతారు? ►చంద్రబాబు తప్పు చేయకపోతే 50 రోజులు జైల్లో ఎందుకుంటారు? ►ఇన్నాళ్లు మీరు ప్రజల కళ్ళకు గంతలు కట్టారని ఒప్పుకుంటారా లేదా? ►మీకు అనుకూలంగా ఉన్నన్నాళ్ళు వ్యవస్థలన్నీ బాగున్నట్టా? ►మీకు అనుకూలంగా తీర్పులు రాకపోయేసరికి కళ్లకు గంతలు కట్టాలని పిలుపునిస్తారా? 7:20 AM, అక్టోబర్ 29, 2023 హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ►ఏపీ హైకోర్టు రోస్టర్‌లో సమూల మార్పులు ►కొత్త జడ్డీల రాకతో మార్పులు చేసిన సీజే ►జస్టిస్ మల్లికార్జునరావుకు బెయిల్ పిటిషన్ల విచారణ ►ప్రజా ప్రతినిధుల కేసులు కూడా మల్లికార్జునకే. ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సోమవారం విచారణ. 7:15 AM, అక్టోబర్ 29, 2023 పాపం.. బతకనివ్వండి ప్లీజ్.. రాజకీయం కోసం రోగాలంటగడతారా? ► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా ► ఒకసారి ఎవరి వర్షన్ ఏంటో మీరే చూడండి. ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ 7:05 AM, అక్టోబర్ 29, 2023 బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. జరిగిందిలా ►సుప్రీంకోర్టులో నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు ►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ 7:00 AM, అక్టోబర్ 29, 2023 నేటి సమన్వయం నెక్ట్స్ లెవల్.! ► నేటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ► 29,30,31న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు ► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి? ► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి? ► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు ► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు ► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు. దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం ►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆరుగురి అరెస్ట్
కావలి/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో పోలీసులు శనివారం ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఆరుగురిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఏఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కాగా దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ16జెడ్0702) డ్రైవర్ బి.రామ్‌సింగ్ కావలి ట్రంక్‌రోడ్డు వద్ద కారును పక్కకు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. స్థానికులతో పాటు అక్కడే ఉన్న కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో అతడు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అనంతరం తన స్నేహితుడైన దేవరకొండ సుధీర్‌తో పాటు మరికొందరికి ఫోన్ చేశాడు. వారంతా కారు, ద్విచక్రవాహనాల్లో బస్సును వెంబడించి మద్దూరుపాడు వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్ రామ్సింగ్ను బస్సు నుంచి కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్న కావలి రూరల్ సీఐ ఎం.రాజేశ్ ప్రయాణికులు రోడ్డుపై ఉండటాన్ని గమనించి వివరాలు ఆరా తీశారు. గాయపడిన డ్రైవర్ రామ్సింగ్ను చికిత్స నిమిత్తం వెంటనే కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో మాట్లాడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. దాడి ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, విల్సన్, శివారెడ్డి, మల్లి, కిరణ్ సహా మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ హిమవతి నేతృత్వంలో కావలి డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. కావలిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన కాగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కావలిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి. దాడికి నిరసనగా ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నట్టు పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రయ్య, ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు, అప్పారావు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం సమర్పిసా్తమన్నారు. అంతకుముందు విజయవాడలో చికిత్స పొందుతున్న రామ్సింగ్ను ఈయూ నేతలు పరామర్శించారు. -
చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే!
సాక్షి, గుంటూరు: 371 కోట్ల రూపాయలు లూటీ చేసిన స్కిల్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ స్కాం ఆద్యంతం అబద్ధాలతో ముందుకు తీసుకెళ్లారాయన. సాక్ష్యాలతో దొరికినా సిఐడీ అధికారులకు అబద్ధాలే చెప్పారాయన. న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపితే..ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు అబద్ధాలపై అబద్ధలు పేర్చుకుపోయారు. బాబు ఆరోగ్యంపైనా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయనకు మాయరోగాలన్నీ అంటించారు. ఇన్ని అబద్ధాలతో కోట కట్టేసి ఇపుడు నిజం గెలవాలని భువనేశ్వరి చేత యాత్ర చేయిస్తున్నారు. నిజం గెలవాలంటున్నారు నారా భువనేశ్వరి. నిజమే నిజమే గెలవాలి. అబద్ధం ఎప్పుడూ గెలవకూడనే కూడదు. కాకపోతే దురదృష్ట వశాత్తూ అబద్ధాలతోనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితమంతా నెట్టుకొచ్చేశారని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు నాయుడికి నిజానికి అసలు సంబంధంమే లేదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయ నేతలు. 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమాంతం భోంచేసిన అతి పెద్ద అవినీతి ఘట్టంలో చంద్రబాబు నాయుడి పాత్రకు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయస్థానం భావించింది కాబట్టే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ► నిజానికి స్కిల్ వ్యవహారంలో సిమన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్ ను నమ్మించారు. అది అబద్ధం ► మనం 10 శాతం నిధులు పెడితే సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందని మంత్రివర్గాన్ని నమ్మించారు. అది అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అది అబద్ధం ► సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుణ్ని సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుముందు హాజరు పరిస్తే తనను 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని ఫిర్యాదు చేశారు. అది అబద్ధం ► 48 రోజులకు పైగా జైల్లో ఉండి..ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని సాకులు చెబుతున్నారు. అది అబద్ధం ► చంద్రబాబు నాయుణ్ని ములాఖత్ లో కలిసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి నా భర్త జైలుకెళ్లాక అయిదు కిలోల బరువు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అది అబద్ధం ఆయన ఒక కిలో బరువు పెరిగారన్నది నిజం. ► జైల్లో సరఫరా అవుతోన్న నీళ్లు కలుషితంగా ఉన్నాయని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం ► తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. అది అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. అది అబద్ధం ► తన భర్త కు సరియైన భద్రత లేదని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం. అత్యంత పటిష్ఠమైన భద్రతను చంద్రబాబుకు ఏర్పాటు చేశారన్నది నిజం. ► ఇపుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారు . అది అబద్ధం. చంద్రబాబుకు జైలును మించిన సురక్షితమైన చోటు మరోటి లేదని వారు అంటున్నారు. ► అసలు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది అబద్ధం. 371 కోట్ల రూపాయలకు ఎలా రెక్కలు వచ్చాయో.. ఎలా షెల్ కంపెనీలు దాటుకుంటూ హవాలా మార్గంలో చంద్రబాబు నాయుడికి అవి చేరాయో ఈడీ అధికారులు మొత్తం రూట్ ని కనిపెట్టారు. ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. హవాలా మార్గంలో చంద్రబాబుకు నిధులు సేకరించిన బాబు పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లతో పాటు షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన మనోజ్ పార్ధసానికి సిఐడీ నోటీసులు ఇవ్వడంతోనే వారు పరారయ్యారు. కిలారు రాజేష్ అయితే నెల రోజులకు పైగా అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత అమాంతం సిఐడీ ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. ఏం అడిగినా తెలీదు గుర్తులేదు అని దాటవేశారు. రెండో రోజు విచారణకు వచ్చేటపుడు కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని రావలసిందిగా సిఐడీ అధికారులు ఆదేశించారు. అంతే తాను విచారణకు రాలేనని ఆ డాక్యుమెంట్లు తీసుకురాడానికి కొంత సమయం పడుతుందని దసరా తర్వాత తిరిగి విచారణకు హాజరవుతానని చెప్పి రాజేష్ మాయమయ్యాడు. పెండ్యాల శ్రీనివాస్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఆయన ఎందుకు పారిపోయాడో మాత్రం సిఐడీ అధికారులకు తెలుసు. అతగాణ్ని విచారిస్తే షెల్ కంపెనీల ద్వారా తలరించిన 241 కోట్ల రూపాయల నిధులు ఏయే ఖాతాల్లో జమ చేశారో తెలుస్తుంది. ఆ భయానికే చంద్రబాబు నాయుడే శ్రీనివాస్ ను దేశంలో లేకుండా బయటకు పంపేశారని సిఐడీ అనుమానిస్తోంది. స్కిల్ స్కాం ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడి అపకీర్తి కిరీటంలో ఎన్నో అవినీతి రాళ్లు పొదిగి ఉన్నాయి. అమరావతి ల్యాండ్ స్కాం, అసైన్డ్ ల్యాండ్స్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం వంటివి క్యూలో నిలబడ్డాయి. చంద్రబాబును ఎప్పుడు విచారిద్దామా అని దర్యాప్తు సంస్థలు కాచుక్కూర్చున్నాయి. వీటిలోనే కొన్నింటికి పీటీ వారంట్లు జారీ చేసింది అందుకే. న్యాయస్థానాల అనుమతి రాగానే ఒకటొకటిగా పాపాలు బద్దలు అవుతాయి. అబద్ధాల పుట్టలు పేలిపోతాయి...అని న్యాయ రంగ నిపుణులు అంటున్నారు. అన్ని కేసుల్లోనూ స్కిల్ స్కాం తరహాలోనే అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ పోయి పెద్ద కోట కట్టేశారు. ఆ కోటకు ఇంతకాలానికి బీటలు వారాయి. ఇక అది కుప్పకూలడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. బెయిల్ ఎంతకీ రాకపోయే సరికి చంద్రబాబుకు ఆ రోగం ఉంది ఈ సమస్య ఉంది అని రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చివరకు 73 ఏళ్ల వయసున్న నేతని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు నాయుడికన్నా వయసులో చాలా పెద్ద వారు అయిన నేతలు మాజీ ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఉన్న సంగతిని టిడిపి నేతలు కానీ..భువనేశ్వరి అండ్ కో కానీ తెలివిగా విస్మరిస్తున్నారు. అబద్ధాల చంద్రబాబును కాపాడుకోడానికి భువనేశ్వరి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా నిజం గెలిచి తీరుతుందని.. అపుడు చంద్రబాబు శాశ్వతంగా జైల్లోనే ఉండక తప్పదని పాలక పక్ష నేతలు అంటున్నారు. -
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే...
తూర్పు గోదావరి: స్కూలుకని బయలుదేరిన కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోవడం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. మండపేట సత్యశ్రీ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందడం పట్టణంలో విషాదాన్ని నింపింది. స్థానిక సంఘం కాలనీకి చెందిన కోనె మహేష్ సత్యశ్రీ రోడ్డులోని ఎస్ఎస్వీవీ మున్సిపల్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరి ఉదయం కాలనీ నుంచి సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరాడు. బైపాస్ రోడ్డు దాటి కోళ్ల ఫారాల మలుపు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపడం, రోడ్డు బెర్ములు కిందికి కుంగిపోయి ఉండటం వలనే ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు. స్కూల్‌కు వెళుతున్న బాలుడు రోడ్డుపై మృతిచెంది ఉండటం దారిన వెళ్లే వారిని కలచివేసింది. మహేష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి శ్రీనివాస్ భవన నిర్మాణ కారి్మకుడిగా పనిచేస్తూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చోటా డాన్ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ !
తాడిపత్రిలో చీకటి మాటున మట్కా మాఫియా రాజ్యమేలుతోంది. ఒకప్పటి జూదరులు ఇప్పుడు బుకీలుగా అవతారమెత్తి చోటా మట్కా డాన్‌తో కలిసి అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి వారిని రొంపిలోకి లాగుతున్నారు. అత్యాశకు పోయిన సామాన్యులు జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: మట్కా మహమ్మారి అంకెల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. మట్కా తగిలితే రూపాయికి రూ.80 ఇస్తామని ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది కూలీనాలీచేసుకునే వారు, వ్యాపారులు, చిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు మట్కాను ఎంచుకుంటున్నారు. పోలీసులు మట్కాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా టీడీపీ నేతల అండదండలున్న నిర్వాహకులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. కేరళ నుంచి వలస వచ్చి స్థిరపడిన వ్యక్తి ఈ ప్రాంతానికి మట్కాను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి కుమారుడైన రషీద్ మట్కా పగ్గాలు చేపట్టాక అనతికాలంలోనే డాన్‌గా ఎదిగాడు. టీడీపీకి చెందిన జేసీ సోదరుల (మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి – మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి)ఆశీస్సులుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. తెరపైకి చోటా డాన్ రజాక్ మట్కా డాన్ రషీద్ కరోనాతో మృత్యువాతపడ్డాక పట్టణంలో మట్కా కొన్నాళ్లు మరుగున పడింది. తన అన్న (ఎల్లో డాన్) వారసత్వాన్ని అబ్దుల్ రజాక్ కొనసాగించడంతో మట్కా తిరిగి పుంజుకుంది. గతంలో బళ్లారికి చెందిన రిజ్వాన్‌ను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ టీం అప్పట్లో అబ్దుల్ రజాక్‌ను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వినాయక్ మేత్రాని అనే మట్కా నిర్వాహకుడిని కూడా పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే రిజ్వాన్, వినాయక్ మేత్రాని అనే వీరిరువురు సౌత్ ఇండియాలోనే మట్కా కంపెనీల్లో నంబర్ వన్ షేర్‌హోల్డర్స్. వీరిలో రిజ్వాన్‌కు తాడిపత్రికి చెందిన అబ్దుల్ రజాక్ మట్కా పట్టీలు ఇచ్చేవాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మట్కా డాన్ మకందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా కుటుంబం మొత్తం తాడిపత్రిలో మట్కా పురుడు పోసుకున్నప్పటి నుంచి మట్కా నిర్వహిస్తుండడం విశేషం. వీరి కుటుంబంలో మహిళలే మట్కా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవల మకందర్ ఖాజా తండ్రి మునీర్బాషాతో పాటు ఖాజా సతీమణి షేక్ నూరీని అరెస్టు చేశారు. పోలీసులనే టార్గెట్ చేసి.. తాడిపత్రి పచ్చ మట్కా మాఫియాలో కీలక సూత్రధారి రషీద్ సోదరుడు అబ్దుల్ రజాక్‌ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కాను పూర్తిస్థాయిలో ఆపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ కుటుంబం ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసింది. సీఐ హమీద్‌ఖాన్ తమను వేధిస్తున్నాడంటూ మొసలి కన్నీరు కార్చింది. తెరవెనుక ‘పచ్చ’ కుట్ర మట్కా మాఫియాను ఇన్నాళ్లూ పెంచి పోషించిన ‘పచ్చ’ నేతలకు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ చర్యలు మింగుడుపడడం లేదు. ఈయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ‘పచ్చ’ నేతలు బురదజల్లేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటా డాన్ అబ్దుల్ రజాక్ భార్యతో పోలీసు శాఖలోని కీలక అధికారులపై ఆరోపణలు చేయిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, ప్రైవేటు కేసుల పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేసి మట్కాను సాగించాలని పథకం రచిస్తున్నారు. మట్కారాయుళ్లపై కొరడా ఎన్నడూ లేని విధంగా తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లపై కొరఢా ఝళిపిస్తున్నారు. అర్బన్ సీఐగా పి.హమీద్‌ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఆరా తీసి వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోని వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ గౌతమి ఉత్తర్వుల మేరకు మట్కా నిర్వాహకులు బుక్కపట్నం శివకుమార్, చుక్కలూరు చాంద్‌బాషా, మక్తుం పాల మాబు, దూదేకుల కుళ్లాయప్ప, ఉదయగిరి మాబున్నీ, దిగువపల్లి పుల్లయ్య, తుంగ రామాంజులరెడ్డిలపై ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఆన్లైన్లో మట్కా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వాహకులు మట్కాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొందరు మట్కా నిర్వాహకులు స్వయంగా యాప్ డెవలపర్స్.. మిలాన్డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించి యాప్‌ల ద్వారా అండ్రాయిడ్ ఫోన్లకు లింక్‌లను పంపి గుట్టుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను సదరు ఆండ్రాయిడ్ యూజర్ రూ.10 వేలు నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారుకు ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఉపయోగించి మట్కా నిర్వహించుకోవాలి. రూ.100కు రూ.8వేలు చెల్లిస్తామంటూ అమాయకుల బతుకులను నాశనం చేస్తున్నారు. ఉపేక్షించేది లేదు మట్కా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు జరిపి, 33 కేసులు నమోదు చేశాం. మట్కా, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకలించాలని సీఐ, ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఆన్లైన్ మట్కాను కూడా నిర్మూలిస్తాం. – సీఎం.గంగయ్య, డీఎస్పీ, తాడిపత్రి -
Oct 28th 2023 : చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates 16:56 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు క్షేమంగా ఉన్నారు : డాక్టర్లు ► కోర్టు సూచనల మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అధికారులు ► రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 : చంద్రబాబు నాయుడు, తండ్రి పేరు ఖర్జూరనాయుడు ఆరోగ్య నివేదిక ► ఆరోగ్య పరిస్థితి అన్ని రకాలుగా నిలకడగా ఉంది : డాక్టర్లు 17:36 PM, అక్టోబర్ 28, 2023 నిజాలు చెప్పడానికి వచ్చిందట.. అబద్దాల భువనేశ్వరీ : YSRCP ► వచ్చే వారంలో రెండో విడత నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర ► ఉత్తరాంధ్రలో ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన ► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో యాత్ర ► కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి ► ఇప్పటివరకు అన్నీ అబద్దాలతో కొత్త రికార్డు సృష్టిస్తోన్న భువనేశ్వరీ 17:05 PM, అక్టోబర్ 28, 2023 రాజకీయ వ్యభిచారి చంద్రబాబు : బాపట్లో మంత్రి జోగి రమేష్ ► జైల్లో ఉన్న చంద్రబాబును లోకేష్ కలిసొచ్చి మీరు ఏం పీకారని మమల్ని అడుగుతున్నాడు ► 40 ఏళ్ల చరిత్ర అని చెప్పిన చంద్రబాబు తప్పు చేసి జైలు జీవితం గడుపుతున్నాడు ► చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ కి పండగలాగా ఉంది ► రాజకీయ వ్యభిచారం అనేది చంద్రబాబుతోనే పుట్టింది ► ఆ రోజుల్లో చంద్రబాబు రాజకీయ వ్యభిచారి ఎన్టీఆర్ అని చెప్పారు ► వందల పేజీల అవినీతి చిట్టా ఉంది కాబట్టే బాబుకు బెయిల్ రాలేదు ► పాపం పండింది కాబట్టే చంద్రబాబు అరెస్టు అయ్యాడు ► వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటివరకు బతికిందే చంద్రబాబు : మంత్రి జోగి రమేష్ 16:45 PM, అక్టోబర్ 28, 2023 పచ్చమీడియా.. కళ్లు తెరవండి ► విశాఖ భీమిలిలో మాట్లాడిన మంత్రి సిదీరి అప్పలరాజు ► పచ్చమీడియా.. కొంచెం కళ్లు తెరిచి భీమిలీలో ఉన్న జనాలను చూడండి ► జనాలు లేని సభలు చూడాలంటే భువనేశ్వరి సభలకు వెళ్ళండి ► దొరికిన దొంగ చంద్రబాబు ► బీసీలను చంద్రబాబు దారుణంగా అవమానించారు ► నిప్పు తుప్పు అనే చంద్రబాబు జైల్ లో చిప్ప కూడు తింటున్నారు ► చంద్రబాబు తప్పు చేయలేదని టిడిపి నేతలు కూడా చెప్పడం లేదు ► నిన్నటి వరకు కుర్రాడినని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు బెయిల్ కోసం మాట మార్చి వయస్సు అయిపోయిందని అంటున్నారు ► తోకలు తోలు తీస్తానని నిన్నటిదాకా చంద్రబాబు బెదిరించారు ► బీసీలు జడ్జిలు గా పనికి రారని లేఖలు రాశారు 16:15 PM, అక్టోబర్ 28, 2023 రేపట్నుంచి సమన్వయం నెక్ట్స్ లెవల్.! ► ఏపీ : రేపటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ► ఈ నెల 29,30,31 న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు ► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి? ► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి? ► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు ► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు ► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు 15:58 PM, అక్టోబర్ 28, 2023 హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ► ఏపీ హైకోర్టులో రోస్టర్ విధానంలో భాగంగా న్యాయమూర్తుల బెంచ్‌లో మార్పులు ► కొత్తగా నలుగురు జడ్జిలు ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించటంతో వారికి రోస్టర్ విధానంలో బెంచ్ లు కేటాయింపు ► బెయిల్ పిటిషన్ల మీద విచారణ చేపట్టనున్న జస్టిస్ మల్లికార్జునరావు బెంచ్ ► క్వాష్ పిటిషన్ల మీద విచారణ చేయనున్న జస్టిస్ భానుమతి బెంచ్ 14:56 PM, అక్టోబర్ 28, 2023 పాపం.. బతకనివ్వండి ప్లీజ్.. రాజకీయం కోసం రోగాలంటగడతారా? ► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా ► ఒకసారి ఎవరి వర్షన్ ఏంటో మీరే చూడండి. ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ మీరే కదా, నిన్న మొన్నటిదాకా.. వయస్సు అనేది చంద్రబాబుకు ఒక నెంబర్ మాత్రమే అని రాసింది..! 14:36 PM, అక్టోబర్ 28, 2023 ఇంకా ఇన్ని భ్రమలా? ► తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : కాసాని ► బీజేపీతో పొత్తుల విషయంపై క్లారిటీ రాలేదు : కాసాని ► రేపు ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తాం : కాసాని ► తెలంగాణలో టీడీపీ బలంగానే ఉంది : కాసాని ► నాకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు : కాసాని ► కాసాని తీరుపై విస్మయపోతున్న రాజకీయ వర్గాలు ► ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.! ► అసలు ఒక్క చోట కూడా పోటీ చేయదని ఇప్పటికే లోకేష్ సంకేతాలిచ్చారు.! ► ఆ విషయం తెలిసి కూడా ఇంకా దొంగాట ఎందుకు కాసాని.? ► ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పడంలో మీ ఉద్దేశ్యమేంటీ? ► అసలు జైల్లో ఉన్న చంద్రబాబు, బయట ఉన్నలోకేష్ మీకిచ్చిన బ్రీఫింగ్ ఏంటీ? 14:27 PM, అక్టోబర్ 28, 2023 డామిట్.. కథ ఎందుకు అడ్డం తిరుగుతోంది? ► తెలుగుదేశంలో ఉన్నది విజన్ కాదు.. కోడి బుర్ర అని స్పష్టం చేస్తోన్న దృష్టాంతాలు ► ఓటుకు కోట్లు కేసులో ఓ మత పెద్దను పట్టుకుని రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన పచ్చ గ్యాంగ్ ► ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ హామీలిచ్చి రికార్డు చేయించుకుని పట్టుపడ్డ చంద్రబాబు ► గుడిలో విగ్రహాలను కూల్చి ఏపీ సర్కారుకు చెడ్డ పేరు తేవాలనుకున్న కుట్రలో సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన తెలుగు తమ్ముళ్లు ► ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడతాను అన్నప్పుడే తెలుగుదేశం వాళ్లు భయపడ్డారు.. చినబాబు గురించి బాగా తెలుసుకాబట్టి.! ► చేసిన పనికి ఎదురు తన్నిన పరిణామాలు, కిక్కురుమనకుండా తిరిగొచ్చేసిన లోకేష్ ► నాట్ బిఫోర్ వెనక కథ నడిపి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్ ► ఇంత గుడ్డిగా చేయడం, దొరికిన తరవాత అన్యాయం జరిగిపోయిందనడం మీ విజనా? ► మీ రాజకీయ అధికారం కోసం ఇంకెన్ని అక్రమాలు చేస్తారు? ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తారు? ► మీ కక్కుర్తి కోసం దేనికైనా దిగజారుతారా? 14:08 PM, అక్టోబర్ 28, 2023 బ్రోకర్ పని చేసి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్ ► సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర చేసిన తెలుగుదేశం ► నాట్ బిఫోర్ గేమ్‌లో తెర వెనక ప్లాన్ చేసిన పచ్చ టీవీ ఛానల్ ఓనర్ ► అందర్నీ మేనేజ్ చేస్తానంటూ వెళ్లి అడ్డంగా పట్టుబడ్డ పచ్చ టీవీ ఛానల్ ఓనర్ ► హై ప్రొఫైల్ లాబీయిస్ట్‌గా బిల్డప్ ఇచ్చి దొరికిపోయిన పచ్చ టీవీ ఛానల్ ఓనర్ 13:48 PM, అక్టోబర్ 28, 2023 నారా వారి అబద్ధాల ఫ్యాక్టరీ ►సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం ►పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ►స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం. ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం. ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 12:55 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది విశాఖ సామాజిక సాధికార యాత్ర సమావేశంలో సీదిరి అప్పలరాజు కామెంట్స్ ►నారా భువనేశ్వరి సభకు, వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలకు వచ్చే జనాన్ని చూడండి. ►లోకేష్ యాత్రను మొదటి పేజీలో వేసుకోలేని స్థితిలో పచ్చ మీడియా ►చంద్రబాబు తప్పు చేయలేదు బెయిల్ ఇవ్వండి అనడం లేదు.. బాగోలేదు గనుకే బెయిల్ ఇవ్వండి అంటున్నారు ►చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది ►బాబు బయటకు ఉంటే ప్రజలకు ప్రమాదం ►చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారు.. ఇక బయటకు రాలేరు 12:32 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు పిటిషన్.. అత్యంత తొందరపాటు చర్య ►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి(అక్టోబర్ 17న) ►స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యే ►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది ►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి ►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు ►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు ►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది ►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు ►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు ►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం ►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య ►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు ►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం ►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు ►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే ►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు ►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ►ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ►ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు ►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది ►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు ►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు ►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు ►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు ►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది ►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి ►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది ►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది ►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? ►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది ►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది ►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. ►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. ►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి ►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి ►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది ►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు ►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు ►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి ►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 12:02 PM, అక్టోబర్ 28, 2023 బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. జరిగిందిలా ►సుప్రీంకోర్టులో నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు ►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ 11:26 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబుతో ములాఖత్‌లో కాసాని ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన కుటుంబ సభ్యులు ►నారా భువనేశ్వరి, నారా లోకేష్‌తోపాటు తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా ►అసలు తెలంగాణలో పోటీ చేయమంటారా? వేరే దారి చూస్కోమంటారా? అని బాబును నిలదీయనున్న కాసాని 11:19 AM, అక్టోబర్ 28, 2023 ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను? ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 11:01 AM, అక్టోబర్ 28, 2023 ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది వాళ్లే! ►ప్రాణహాని ఉందని చంద్రబాబు నాయుడు ఏసీబీ జడ్జికి లేఖ రాయడం హాస్యాస్పదం ►పాపం పండింది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు ►ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది ఆయన సంతానమే! ► కన్నతండ్రిపై చెప్పులు విసిరినప్పుడు తండ్రి ప్రేమ భువనేశ్వరికి కనపడలేదా..? నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు పై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్ 10:32 AM, అక్టోబర్ 28, 2023 నిజం గెలవాలితో ఏం ఒరగదు ►నిజం గెలవాలి పేరుతో ఓదార్పు యాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి ►భర్త చంద్రబాబు తప్పుల్ని ఒప్పుకోకుండా.. పచ్చి అబద్ధాలతో కొనసాగుతున్న యాత్ర ►నిజం గెలవాలి యాత్రపై మేకపాటి రాజారెడ్డి వ్యంగ్యాస్త్రాలు ►యాత్ర వల్ల అనారోగ్య సమస్యలు తప్ప.. ఆమెకి ఒరిగేది ఏమి లేదని ఎద్దేవా ►చంద్రబాబు అవినీతి చేశాడని ప్రజలకు తెలిసిపోయింది ►ఆయన చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. 10:10 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబుతో కాసాని.. తాడోపేడోనా? ►ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి ►ములాఖత్ కోసం 11 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ►టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ కు హాజరయ్యే అవకాశం ►తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్ సూచన ►అదే జరిగితే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపిన కాసాని ►అయినా వినని చినబాబు అండ్ కో ►ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న కాసాని ►నేటి చంద్రబాబు భేటీతో మరింత స్పష్టత వచ్చే అవకాశం 09:17 AM, అక్టోబర్ 28, 2023 దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం ►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం 09:00 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు న్యాయవాదులకు బిగ్ ఝలక్ ►ఏపీ హైకోర్టులో తన ట్రేడ్‌మార్క్ అస్త్రం ‘నాట్ బిఫోర్’ ప్రయోగం ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ►తన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ చేయకుండా అడ్డుకునే ఎత్తుగడ ►పార్టీతో, లీగల్ సెల్‌తో సంబంధం లేని మూర్తితో కన్సెంట్ వకాలత్ దాఖలు ►మూర్తి వెనుక ఓ ఎల్లో మీడియా చానెల్ ఓనర్, ఒక విశ్రాంత న్యాయమూర్తి ►నిబంధనల ప్రకారం నడుచుకునే జడ్జిగా జస్టిస్ జ్యోతిర్మయికి పేరు ►మూర్తి సతీమణి తనకు తెలిసి ఉండటంతో నైతిక విలువలకు లోబడి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►అందుకే ఆమె ముందు నాట్ బిఫోర్ అస్త్రం ►ఆమె నైతిక విలువలనే అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు ►ఆమె తప్పుకుంటే ఆయన వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ, జస్టిస్ అడుసుమిల్లి ముందుకు ►అయితే ఊహించని విధంగా ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ జ్యోతిర్మయి ►సోమవారం విచారణకు వచ్చేందుకు వీలుగా ఈ కేసును సీజే ముందుంచాలని ఆదేశం ►దీంతో కంగుతిన్న చంద్రబాబు న్యాయవాదులు 08:12 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబును వెంటాడుతున్న చేసిన పాపాలు ► అధికారంలో ఉండగా అవినీతి భాగోతాలు ►స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ►కేసులు.. కిందిస్థాయి నుంచి సుప్రీం కోర్టు దాకా పలు పిటిషన్లు.. ములాఖత్‌లతో బాబు బిజీ బిజీ ►జైల్లోనే రాజకీయ మంత్రాంగం చేస్తోన్న చంద్రబాబు ►పార్టీలో ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ములాఖత్‌లో సుదీర్ఘ చర్చలు ►లోకేష్ ఏం చేయాలి? భువనేశ్వరీ ఏం చేయాలన్నదానిపై లోపలి నుంచే బాబు సూచనలు ►నవంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న తెలుగుదేశం శ్రేణులు 07:55 AM, అక్టోబర్ 28, 2023 వివిధ కోర్టులో పెండింగ్‌లో బాబు పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్‌ల పిటిషన్ ► స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్ల వాదన ►డేటా భద్రపర్చడం అంటే.. బహిర్గత పర్చడమే!. అది అధికారుల వ్యక్తిగత భద్రతకు మంచిది కాదని సీఐడీ తరపు న్యాయవాదుల వాదన ►వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్ 31కి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►విచారణ నుంచి తప్పుకుని సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన న్యాయమూర్తి ►అక్టోబర్ 30(సోమవారం) సీజే బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ►కంటికి అత్యవసరంగా ఆపరేష్ అవసరం ఉందని వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నో ►ఏపీ హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా ►ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు ►సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8వ తేదీన ►సుప్రీంలో నవంబర్ 9వ తేదీన ఫైబర్‌నెట్ స్కామ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వేసిన సీఐడీ ►విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 10కి వాయిదా 07:15 AM, అక్టోబర్ 28, 2023 జైల్లో బాబు.. సానుభూతి కోసం కుటుంబ సభ్యులు ►పదుల కొద్ది పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►ముందు క్వాష్, తర్వాత బెయిల్, ఆ తర్వాత ఏసీ, మళ్లీ వైద్యం, ఆ తర్వాత కాల్ డాటా ►చేతిలో లాయర్లున్నారన్న ధీమాతో కింది నుంచి పైదాకా అన్నికోర్టుల్లో పిటిషన్లు ►లేని భయాలు, సాకులు చూపుతూ ACB కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు 06:58 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు అవినీతిపరుడు విజయనగరంలో మంత్రి ధర్మాన కామెంట్స్ ►స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి ►సొమ్ము చంద్రబాబు పీఏ, లోకేశ్ పీఏ ఖాతాల్లోకి వెళ్లాయి ►విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది 06:54 AM, అక్టోబర్ 28, 2023 బాబు భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవు : జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం ►బాబు భద్రత కట్టుదిట్టంగా ఉంది ►మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీ లేఖగా గుర్తించాం ►జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తాం ►శ్రీనివాస్ అనే ఖైదీని రిమాండ్ కు తీసుకునే సమయంలో బటన్ కెమెరా స్వాధీనం చేసుకున్నాం ►చంద్రబాబు జైలుకు వచ్చిన విజువల్స్ బయటకు రావడంపై దర్యాప్తు పూర్తి చేశాం రాజమండ్రి సెంట్రల్ జైలులో తన ప్రాణాలకి ముప్పు ఉందని ఆరోపిస్తూ ఏసీబీ గౌరవ జడ్జికి చంద్రబాబు రాసిన లేఖపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. జైలులో బాబుకి పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతని కల్పిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన డీఐజీ.. ఆయనని చంపబోతున్నట్లు మావోయిస్టులు రాసిన లేఖ కూడా… pic.twitter.com/uo4YLUTTmu — YSR Congress Party (@YSRCParty) October 27, 2023 ►జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్స్ ఉన్నాయి ►జైల్లోకి ఎలాంటి గాంజా ప్యాకెట్లు విసిరి వేయలేదు ►ప్రతి గంటకు ఒకసారి జైలు చుట్టూ గార్డింగ్ చేస్తున్నాం ►సెంట్రల్ జైలు చుట్టూ పోలీస్ భద్రత ఉంది ►బీపీవో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నాం ►సెక్యూరిటీ అంశాలు బహిరంగంగా చర్చించలేం ►చంద్రబాబును ఏ రూమ్ లో పెట్టామనేది చెప్పలేం ►చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి భయాందోళన అవసరం లేదు ►చంద్రబాబు కంటి సమస్యపై భువనేశ్వరికి రెండు సార్లు సమాచారం ఇచ్చాం ►చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెప్పిన తరువాత బయట చెప్పాల్సిన అవసరం లేదు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ప్రతి ఖైదీ భద్రత, ఆరోగ్యం మా బాధ్యత. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఖైదీలందరికీ మూడు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇస్తున్నాం. - జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్… pic.twitter.com/SptXh0Dv8i — YSR Congress Party (@YSRCParty) October 27, 2023 06:51 AM, అక్టోబర్ 28, 2023 నేడు బాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ►చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ►ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్న భువనేశ్వరి, లోకేష్ ►క్రమం తప్పకుండా వారం వారం ములాఖత్ అవుతున్న నారా ఫ్యామిలీ ►జైల్లోనూ కుటుంబ సభ్యులతో బాబు రాజకీయాల ప్రస్తావన ►ములాఖత్ తర్వాత బయటకు వచ్చి.. బాబు భద్రత, ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా అబద్ధాలు ప్రచారం 06:43 AM, అక్టోబర్ 28, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @49 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► నవంబర్ 1 వరకు జైల్లోనే చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 49వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
బెయిల్ కోసం బాబు అడ్డదారులు.. ‘నెవర్ బిఫోర్’
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసి జైలుపాలైన చంద్రబాబు ఇప్పుడు దాని నుంచి ఎలాగైనా బయటపడాలని బెయిల్ కోసం అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం గతం నుంచి తాను అనుసరిస్తున్న తన ట్రేడ్‌మార్క్ అస్త్రం ‘నాట్ బిఫోర్’ ను ఆయన మరోసారి బయటకు తీశారు. తమ పార్టీకి, తమ లీగల్ సెల్‌కు ఏ సంబంధం లేని జీవీఎల్ మూర్తి అనే న్యాయవాదిని తెరపైకి తెచ్చారు. ఆయనతో తన తరఫున చంద్రబాబు కన్సెంట్ వకాలత్ (అప్పటికే దాఖలు చేసిన కేసులో వకాలత్ వేసిన న్యాయవాది అనుమతితో మరో న్యాయవాది కూడా వకాలత్ దాఖలు చేయడం) దాఖలు చేయించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది జి.బసవేశ్వరరావు వకాలత్ వేసి ఉండగానే.. మూర్తితో వకాలత్ దాఖలు చేయించడం గమనార్హం. సాధారణంగా ఇలా వకాలత్ దాఖలు చేసిన కేసులో ఏ మాత్రం సంబంధం లేని మరో న్యాయవాది వకాలత్ దాఖలు చేసేందుకు ఏ న్యాయవాది ఒప్పుకోడు. కాగా చంద్రబాబు తరఫున వకాలత్‌లు దాఖలు చేసిన బసవేశ్వరరావు గానీ, మూర్తి గానీ వాదనలు వినిపించకపోవడం ఇందులో అసలు ట్విస్టు. శుక్రవారం జరిగిన విచారణకు మూర్తి రాలేదు కూడా. దీన్ని బట్టి చంద్రబాబు ఇక్కడ మూర్తిని ఓ నిర్దిష్ట ప్రయోజనం నిమిత్తం వాడుకోవాలని నిర్ణయించి, ఆయనతో వకాలత్ దాఖలు చేయించారని ఇట్టే అర్థమైపోతోంది. మూర్తి వెనుక ఉంది వారే.. జీవీఎల్ మూర్తితో వకాలత్ దాఖలు చేయించడం ద్వారా నిబంధనలకు అనుగుణంగా, ముక్కుసూటిగా నడుచుకుంటారనే పేరున్న న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ముందు తన బెయిల్ పిటిషన్‌ను రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. జస్టిస్ జ్యోతిర్మయి ముందు ఎవరు ‘నాట్ బిఫోర్’ న్యాయవాదులు ఉన్నారో ముందుగానే తెలుసుకుని, అందుకనుగుణంగా మూర్తితో వకాలత్ దాఖలు చేయించారు. వాస్తవానికి ఈ మూర్తిది కూడా చంద్రబాబు సామాజికవర్గమే. పెద్దగా ప్రాక్టీస్ ఉన్న న్యాయవాది కాదు. చిన్న చిన్న కేసులు, ఉద్యోగ వివాదాలకు సంబంధించిన కేసులను వాదిస్తుంటారు. ఎప్పుడూ టీడీపీ కేసులను కూడా వాదించింది లేదు. కాగా ఎల్లో మీడియాకు చెందిన ఓ న్యూస్ చానెల్ యజమానికి మూర్తి అత్యంత సన్నిహితుడు. జస్టిస్ జ్యోతిర్మయి ముందు మొత్తం నలుగురు న్యాయవాదులు ‘నాట్ బిఫోర్’గా ఉన్నారు. ఈ నలుగురిలో ముగ్గురు న్యాయవాదులు తమ ఉచ్చులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమవాడే అయిన మూర్తిని చంద్రబాబు అండ్ కో విజయవంతంగా తమవైపు తిప్పుకుంది. ఎల్లో మీడియా న్యూస్ చానెల్ యజమాని, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి.. ఈ విషయంలో మూర్తిని ఒప్పించారు. అంతేకాకుండా చంద్రబాబు అండ్ కో ఆయనకు భారీ మొత్తంలో ఫీజును ఆశగా చూపింది. జస్టిస్ నిమ్మగడ్డ లేదా జస్టిస్ అడుసుమిల్లి.. ప్రస్తుతం హైకోర్టుకు దసరా సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసులను విచారించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, జస్టిస్ జ్యోతిర్మయిలు వెకేషన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ జ్యోతిర్మయి విచారణ నుంచి తప్పుకుంటే చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు లేదా జస్టిస్ అడుసుమిల్లి రవీంద్ర బాబు ముందుకు వస్తాయి. చంద్రబాబు అండ్ కో కూడా ఇదే ఉద్దేశంతో మూర్తితో వకాలత్ దాఖలు చేయించి తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అయితే జస్టిస్ నిమ్మగడ్డ లేదా జస్టిస్ అడుసుమిల్లిల్లో ఎవరికి చంద్రబాబు కేసును అప్పగించాలన్నది పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సెలవులు కావడంతో సీజే అందుబాటులో లేరు. సోమవారం నుంచే హైకోర్టు తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఎప్పుడైతే జస్టిస్ జ్యోతిర్మయి ఈ వ్యాజ్యాలను సోమవారం నాడు విచారణకు వచ్చేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారో అప్పుడే చంద్రబాబు అండ్ కో గతుక్కుమంది. అప్పటికే ఆన్లైన్లో ఉన్న చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు హాలులో ఉన్న మరో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వెంటనే జోక్యం చేసుకున్నారు. సోమవారం అనే పదాన్ని ఉత్తర్వుల నుంచి తొలగించాలని జస్టిస్ జ్యోతిర్మయిని కోరారు. కేసును తగిన బెంచ్ ముందు ఉంచేందుకు వీలుగా ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొనాలన్నారు. లేకపోతే రిజిస్ట్రీ ముందు తాము సీజే అనుమతి కోసం అభ్యర్థించలేమన్నారు. అయితే వారి అభ్యర్థన పట్ల న్యాయమూర్తి జోతిర్మయి సుముఖత వ్యక్తం చేయలేదు. రిజిస్ట్రీ ముందు అత్యవసర విచారణ నిమిత్తం అభ్యర్థించేందుకు ‘సోమవారానికి విచారణ వాయిదా’ అనేది ఎంత మాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పారు. చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చునని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో చేసేదేమీ లేక చంద్రబాబు న్యాయవాదులు ఉసూరుమంటూ కోర్టు బయటకు వచ్చారు. ఆ వెంటనే రిజిస్ట్రార్ వద్దకు వచ్చారు. చంద్రబాబు బెయిల్‌ను మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా సీజే అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రార్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినా వారి పప్పులు ఉడకలేదు. 19 నుంచే వ్యూహానికి పదును.. కాగా వాస్తవానికి చంద్రబాబు అండ్ కో ‘నాట్ బిఫోర్’ అస్త్రాన్ని తన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రయోగించాలని గతంలోనే నిర్ణయించింది. అయితే దానిని ఈ నెల 19న నుంచే అమలు చేయడం ప్రారంభించింది. 19న చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం వేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ సురేష్‌రెడ్డి ముందుకు వచ్చాయి. చంద్రబాబు అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాదులు లూథ్రా, దమ్మాలపాటి గట్టిగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని, సుప్రీంకోర్టు చంద్రబాబు చేసిన మధ్యంతర బెయిల్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించలేదని జస్టిస్ సురేష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ పట్ల సానుకూలంగా స్పందించని నేపథ్యంలో తాను కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వలేనని జస్టిస్ సురేష్‌రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దీంతో భోజన విరామం తర్వాత వ్యూహాన్ని మార్చేసిన చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెకేషన్ కోర్టు ముందు పోస్ట్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. ఇందుకు జస్టిస్ సురేష్‌రెడ్డి అంగీకరించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పలుకుబడితో ముందే తెలుసుకుని.. కాగా చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యూహం ఎందుకు మార్చుకున్నారంటే వెకేషన్ కోర్టుల్లో ఎవరెవరు జడ్జీలు ఉండబోతున్నారో తమ పలుకుబడిని ఉపయోగించి ముందుగానే తెలుసుకోగలిగారు. ఆ వెకేషన్ కోర్టులో జస్టిస్ జ్యోతిర్మయి కూడా ఉన్నారని నిర్ధారించుకున్నారు. వాస్తవానికి వెకేషన్ కోర్టులో ఏ న్యాయమూర్తులు ఉండబోతున్నారనది చివరి నిమిషం వరకు బయటకు వచ్చే అవకాశం ఉండదు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు అండ్ కో వెకేషన్ కోర్టులో ఎవరెవరు ఉండబోతున్నారో ముందుగానే తెలుసుకుంది. దానికి అనుగుణంగానే తమ వ్యూహాలకు పదును పెట్టింది. జస్టిస్ జ్యోతిర్మయి ముందు ఎవరెవరు నాట్ బిఫోర్‌గా ఉన్నారో తెలుసుకోగలిగింది. నలుగురు న్యాయవాదులు ఉన్నట్లు తెలుసుకుని, అందులో తమ సామాజిక వర్గానికే చెందిన జీఎల్ఎన్ మూర్తితో ఆట మొదలుపెట్టింది. అయితే ఆటలో చివరకు ఓటమే ఎదురైంది. నైతిక విలువలకు కట్టుబడ్డ జస్టిస్ జ్యోతిర్మయి కాగా మూర్తి సతీమణి ఇందిరా ప్రియదర్శిని కింది కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. న్యాయాధికారి కావడంతో ఎంతో కాలంగా ఆమె జస్టిస్ జ్యోతిర్మయికి తెలుసు. తనకు మూర్తి సతీమణితో పరిచయం ఉన్న నేపథ్యంలో హైకోర్టులో మూర్తి తన ముందు దాఖలు చేసే కేసులను విచారించకూడదని నైతిక విలువలకు కట్టుబడి జస్టిస్ జ్యోతిర్మయి నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా మూర్తిని తన నాట్ బిఫోర్ జాబితాలో చేర్చారు. అయితే ఆమె నైతిక విలువలనే చంద్రబాబు ఓ అవకాశంగా మలుచుకున్నారు. ఆమె ముందు తన బెయిల్ పిటిషన్ రాకుండా చేసేందుకు మూర్తితో చంద్రబాబు విజయవంతంగా వకాలత్ దాఖలు చేయించారు. మూర్తి వకాలత్ వేస్తే ఆ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ జ్యోతిర్మయి నిరాకరిస్తారని తెలిసే ఆ పని చేశారు. నిబంధనల ప్రకారం వెళితే చంద్రబాబుకు బెయిల్ దొరకడం కష్టమని ఆయన తరఫు న్యాయవాదులకు బాగా తెలుసు. అందుకే తమకే సొంతమైన ‘నాట్ బిఫోర్’ అస్త్రాన్ని బయటకు తీశారు. మూర్తి దాఖలు చేసిన కేసును విచారించనని జస్టిస్ జ్యోతిర్మయి ఓపెన్ కోర్టులో చెప్పడంతో చంద్రబాబు అండ్ కో తమ పాచిక పారిందని సంతోషించారు. అయితే ఇంతలోనే సీజే అనుమతి తీసుకుని చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లలో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ జస్టిస్ జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ కో బిత్తరపోయింది. -
‘మణప్పురం’ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్రమ మార్గంలో సంపాదన గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్‌లోన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్‌లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్‌కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్‌లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది. దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్‌లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్‌కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు. ఆడిట్‌తో గుట్టురట్టు వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు. -
Oct 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand Petitions Court Hearings And Political Updates 09:00PM, అక్టోబర్ 27, 2023 మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదు: జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశాం ►జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. ►మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. ►అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ►కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్ చేస్తున్నాం. ►మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలింది. ►చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. 15:00 PM, అక్టోబర్ 27, 2023 సోమవారం హైకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్.! ► సోమవారం హైకోర్టు సీజే బెయిల్ పిటిషన్‌ను విచారిస్తారన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారించే విధంగా తాము విజ్ఞప్తి చేసుకుంటామని చెప్పిన చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసును బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఏ కోర్టు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసిన న్యాయమూర్తి ►చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లూథ్రా 14:50 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల్లో అక్రమాలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్ల పై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ లాయర్లు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్ లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►ఏ34గా ఉన్న నారాయణ అకౌంట్ లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరఫు న్యాయవాది 14:40 PM, అక్టోబర్ 27, 2023 జైలు నుంచి రాసిన లేఖలో చంద్రబాబు ఏం కోరారంటే..! ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►జైల్లో నన్ను చంపాలని కొందరు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారు ►నన్ను చంపాలని మావోయిస్టులు లేఖ రాసినట్లు నాకు తెలిసింది ►అసంబద్ధ సంఘటనలను ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►తన భద్రత, ఆరోగ్యం పై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ ►తన హత్య కోసం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చంద్రబాబు అనుమానం ► ఆకాశ రామన్న ఉత్తరంలో సంచలన విషయాలు ఉన్నాయన్న చంద్రబాబు ►నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శృంగవరపుకోటకు చెందిన ఓ నిందితుడు పెన్ కెమెరాతో జైలులో ఖైదీల ఫోటోలు తీస్తున్నాడు ►కొందరు ఆగంతకులు జైలులోకి గంజాయి ప్యాకెట్లను విసిరేశారు ►జైలులో మొత్తం 2200 మంది ఉన్నారు, వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు నిందితులు ►2019 జూన్ 25వ తేదీన నా సెక్యూరిటీని తగ్గించారు ►2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది ►2023 ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మరోసారి రాళ్ళదాడి జరిగిందని చంద్రబాబు ఆరోపణ ►అంగళ్లులో పోలీసులపై టిడిపి కార్యకర్తలు చేసిన దాడిని మాత్రం ప్రస్తావించని చంద్రబాబు ►అల్లర్లు జరిగేలా తాను ఎలా రెచ్చగొట్టిన విషయాన్ని దాచిపెట్టిన చంద్రబాబు ►ప్రతీ బహిరంగసభలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఎలాంటి మాటలు మాట్లాడాడో బయటకు చెప్పని చంద్రబాబు 14:35 PM, అక్టోబర్ 27, 2023 కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►ఏపీ : హైకోర్టులో స్కిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ ►ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 14:20 PM, అక్టోబర్ 27, 2023 పిటిషన్లే పిటిషన్లు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్య రెండు పిటిషన్ల దాఖలు ►రెండు పిటిషన్లను నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి ►టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీ కోరడంపై పిటిషన్లు 14:05 PM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు కోసం పిటిషన్ల వెల్లువ ►కోర్టులను ప్రభావితం చేసేలా పిటిషన్లతో వెల్లువెత్తుతున్న చంద్రబాబు మనుష్యులు ►చంద్రబాబు అరెస్ట్ అక్రమ నిర్బంధమని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు 13:45 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డాటా పిటిషన్ ►చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడీ కాల్ డేటా అంశంపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ ►కాల్ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు ఉద్దేశ్యాలు సరిగా లేవని తెలిపిన CID 13:45 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►వర్ల రామయ్య లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరణ ►టీడీపీ అకౌంట్స్, ఫండ్స్ వివరాలు సీఐడీ కోరటాన్ని.. సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ 13:25 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై వాదనలు ఇలా.. ►కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై తీర్పు చేసిన ఏసీబీ కోర్టు ►ఈనెల 31వ తేదీన తీర్పు వెల్లడించిన ఏసీబీ న్యాయమూర్తి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకం ►చంద్రబాబును విచారించిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుంది ►దర్యాప్తు అధికారికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు బయటకి రావు ►మా పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదు ►కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారులు వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదు ►చంద్రబాబు ఏ తప్పు చేయలేదు.. చంద్రబాబు అరెస్టు అక్రమం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ►చంద్రబాబు ని అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు ►ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్ లు, వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి లేదు ►చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటిషన్లు వేస్తున్నారు ►చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకి అరెస్టు చేసినట్లు చెప్పారు ►సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ►ఇదే విషయాన్ని హైకోర్టు సమర్ధించింది ►ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్దం ►దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయి ►అందువల్ల కాల్ డేటా రికార్డు పిటీషన్ కొట్టివేయాలి 13:15 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల కేసు.. ఏసీబీ కోర్టులో వాదనలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ తరపు న్యాయవాదులు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►గురునానక్ కాలనీలోని ఎస్బీఐలో ఉన్న ఏ34 గా ఉన్న నారాయణ అకౌంట్లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరపు న్యాయవాది ►మధ్యాహ్నం నుండి వాదనలు కొనసాగే అవకాశం 12:20 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా పిటిషన్ తీర్పు రిజర్వ్ ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►తీర్పు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన 12:06 PM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్‌పై మొదలైన వాదనలు ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ►మొదలైన వాదనలు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 12:00 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►చంద్రబాబు ను అరెస్టు చేసి జైలుకు పంపించటం అక్రమ నిర్భమేనని వాదన ►హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించిన హైకోర్టు 11:45 PM, అక్టోబర్ 27, 2023 నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►జైలు అధికారుల ద్వారా లేఖ పంపిన చంద్రబాబు ►జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో ప్రస్తావన ►తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు ►మావోయిస్టులు తనను చంపాలని లేఖ రాసినట్లు నాకు తెలిసింది(లేఖలో చంద్రబాబు) ►అసంబద్ధ సంఘటనల్ని ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►ఈ నెల 25న లేఖ రాసిన చంద్రబాబు 11:22 AM, అక్టోబర్ 27, 2023 ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ ►ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ►ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గురువారం రాత్రి హాజరైన మంత్రి అంబటి ►అంబటి బస చేసిన హోటల్‌ను ముట్టడించి చంద్రబాబు నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు ►అంబటి కాన్వాయ్‌పైకి 10 మంది కుర్రాలు కర్రలతో దూసుకొచ్చిన వైనం ►పోలీసుల ఎంట్రీతో తమ్ముళ్ల పరుగులు 10:58 AM, అక్టోబర్ 27, 2023 ప్లీజ్ ప్లీజ్.. సోమవారం దాకా వద్దు ►స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►నాట్ బిఫోర్ మీ అనేసిన వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►బిత్తరపోయిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు సీజే సోమవారం విచారణ చేపడతారని చెప్పిన న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టేలా తాము విజ్ఞప్తి చేసుకుంటామన్న లాయర్లు ►విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం హైకోర్టు రిజిస్ట్రార్‌కే వదిలేసిన న్యాయమూర్తి 10:50 AM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్.. నాట్ బిఫోర్ మీ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ ►బాబు తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్ లూథ్రా ►నాట్ బిఫోర్ మీ అనేసిన న్యాయమూర్తి ►వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని వెల్లడి ►ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి ►మరో జడ్జి ముందుకు వెళ్లనున్న చంద్రబాబు పిటిషన్ 10:46 AM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్లో బాబు లాయర్ల వాదన ఇది ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ చంద్రబాబు లాయర్లు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సీఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదన ►సీఐడీ తరపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు ►కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై నిన్న(అక్టోబర్ 26, గురువారం) కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడి న్యాయవాదులు ►అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడీ ►ఇరువర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డ్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న విచారణ 10:23 AM, అక్టోబర్ 27, 2023 అత్యవసర విచారణ లేదు ►అనారోగ్యం పేరుతో హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ►వెంటనే విచారించాలంటూ హౌజ్‌మోషన్ ద్వారా హైకోర్టును కోరిన చంద్రబాబు లాయర్లు ►అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న వెకేషన్ బెంచ్ 09:05 AM, అక్టోబర్ 27, 2023 నిజం గెలవాలి అంటున్న భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 08:17 AM, అక్టోబర్ 27, 2023 బాబుకి కంటి సర్జరీ అవసరం లేదు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని జైలు అధికారులకు చెప్పిన చంద్రబాబు ►చంద్రబాబు పరీక్షించిన రాజమండ్రి జిజిహెచ్ వైద్యులు ►ఇప్పటికిప్పుడు కంటి సర్జరీ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ వైద్యుడు ►ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలియజేసిన జైలు అధికారులు 07:15 AM, అక్టోబర్ 27, 2023 తాత అవినీతి గురించి దేవాన్ష్‌కు చెప్పలేదా భువనేశ్వరమ్మా? ►తాత చంద్రబాబు ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడట! ►కానీ, స్కిల్ అవినీతితో అరెస్టై జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదట ►తాత విదేశాలకు వెళ్లారని భువనేశ్వరి చెబుతోందట ►నన్నపనేని రాజకుమారి ఈ ప్రశ్న అడగడం.. దానికి భువనేశ్వరి ఇలాంటి సమాధానం ఇవ్వడం ►‘నిజం గెలవాలి’ యాత్రలో తిరుపతిలో ఇలాంటి విచిత్రమైన డిబేట్ నడిచింది మరి! ► చంద్రబాబు అరెస్టు తర్వాత దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రమే అండగా నిలిచారని భువనేశ్వరి చెబుతుండడం గమనార్హం 07:03 AM, అక్టోబర్ 27, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ► గతంలోనే పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు ► ప్రతివాదుల్ని మెన్షన్ చేయకపోవడంతో మళ్లీ పిటిషన్ వేయాలని జడ్జి సూచన ►జడ్జి సూచనతో తిరిగి ఫైల్ చేసిన చంద్రబాబు లాయర్లు ►పిటిషన్‌పై గురువారం(26వ తేదీన) ఏసీబీ కోర్టులో విచారణ.. శుక్రవారానికి వాయిదా ► పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన ► పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు 06:55 AM, అక్టోబర్ 27, 2023 హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ► నేడు విచారణ చేపట్టనున్న దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ►న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా లిస్టింగ్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరణ ► హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ►ఈ నెల 19న విచారణ జరిపి వెకేషన్ బెంచ్‌కు కేటాయించిన హైకోర్టు ధర్మాసనం ►చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు అధికారుల్ని ఆదేశించిన కోర్టు 06:42 AM, అక్టోబర్ 27, 2023 వివిధ కోర్టులో బాబు పిటిషన్ల పరిస్థితి ఇది ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న 06:35 AM, అక్టోబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @48 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 48వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
కర్ణాటక: చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 12 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని చిక్‌బళ్లాపూర్ ఎస్పీ నగేష్ పరిశీలించారు. ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. చదవండి: వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి -
వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు.. భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: వాషింగ్ మెషీన్లలో తరలిస్తున్న రూ.1.30 కోట్లు హవాలా డబ్బు గుట్టు రట్టయ్యింది. విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదుగా అనుమానిస్తున్న విశాఖ పోలీసులు.. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. డబ్బు ఎవరిదానే దానిపై పోసులు ఆరా తీస్తున్నారు. ఓ ప్రముఖ కంపెనీ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. చదవండి: బతుకమ్మలను చూసేందుకు వెళ్తూ.. -
నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు
సాక్షి, అమరావతి: అడుగడుగునా కుంభకోణాలతో ప్రజా ధనాన్ని దోచేసి అడ్డంగా దొరికిపోయి జైలులో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆడుతున్న సరికొత్త నాటకం ‘నిజం గెలవాలి’ యాత్ర. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొన్న దగ్గర నుంచి చంద్రబాబు ఎన్నెన్నో డ్రామాలాడారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకొంటూ, అవినీతి తప్పితే మరే దృష్టీ లేకపోయినప్పటికీ, పైకి విజన్ ఉన్న నాయకుడిగా కలరింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్న ఆయన.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, పేదల నుంచి అసైన్మెంట్ భూములను కొల్లగొట్టడం వంటి పలు వ్యవహారాల్లోనూ చంద్రబాబు అన్ని నిబంధనలనూ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. వీటిపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. టిడ్కో గృహాల నిర్మాణం, అమరావతిలో తాత్కాలిక కట్టడాల వ్యవహారంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ పలు అక్రమాలను వెలికితీసింది. తెలంగాణ సర్కారును దెబ్బతీసేందుకు చేసిన ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు రాత్రికి రాత్రి మకాం హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అమరావతి రాజధాని పేరుతో అనేక అక్రమాలకు తెరతీశారు. అదేమంటే.. దాడులు చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఎవరు? సీబీఐ ఎవరు అంటూ దర్యాప్తు సంస్థల పైనే çహూంకరించేవారు. అవినీతిలో బాబు ‘స్కిల్’ ఇది 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.371 కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ. 3,300 కోట్లతో ఒక నకిలీ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. ఈ కార్యక్రమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ విస్పష్టంగా ప్రకటించింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు చెల్లించింది. ఇది తప్పని ఆరి్థక శాఖ అధికారులు చెప్పినా బాబు పట్టించుకోలేదు. ఆ నిధులను ఫోర్జరీ డాక్యుమెంట్లు, షెల్ కంపెనీల ద్వారా తరలించేశారు. వాటిలో రూ.241 కోట్లు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నివాసానికే చేరినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై బాబు సీఎంగా ఉండగానే జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేసి, కొందరిని అరెస్టు కూడా చేసింది. ఇటీవల మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులు.. చంద్రబాబు ప్రమేయాన్ని బట్టబయలు చేశారు. 18 నోట్‌ఫైళ్లపై ఆయన సంతకాలు పెట్టినట్లు గుర్తించారు. అన్ని ఆధారాలతో ఆయన్ని అరెస్టు చేశారు. ఆధారాలు బలంగా ఉండటంతో ఆయన కూడా తాను నేరం చేయలేదని ఏ కోర్టులోనూ చెప్పడంలేదు. ఎంతసేపూ అరెస్టులో సాంకేతిక కారణాలంటూ కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలను కోర్టులు పట్టించుకోవడంలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు భూదోపిడీ కథ ఇదీ.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు బినామీ లింగమనేని రమేశ్‌కు చెందిన భూములు, బాబు సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, మంత్రి నారాయణకు చెందిన భూములను ఆనుకొని వెళ్ళేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అదే అలైన్‌మెంట్‌ను సింగపూర్ కన్సల్టెన్సీతో ఖరారు చేయించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు, బినామీల భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేశ్ కరకట్ట నివాసాన్ని, హెరిటేజ్ ఫుడ్స్‌కు, నారాయణ బినామీలకు భూములు ఇచ్చారు. పార్టీలోనే అనుమానాలు ఇప్పటివరకు 155 మందికిపైగా చంద్రబాబు కోసం మృతి చెందారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, వీరంతా బాబు అరెస్టయ్యారన్న బాధతో చనిపోయారన్నది వాస్తవం కాదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. దీనిపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు కోసం మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని సామాన్య ప్రజానీకమూ చెబుతున్నారు. అందువల్లే ముందుగా పేర్లు ప్రకటిస్తే విమర్శలు వస్తాయన్న భయంతోనే జాబితా బయటపెట్టలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరిని పరామర్శించాలి, యాత్ర ఎక్కడి వరకు, ఎన్ని రోజులు చేయాలన్న విషయాలపై పార్టీ అధిష్టానానికే స్పష్టత లేదు. సాధారణ మరణాలను బాబు అరెస్టుకు ముడిపెట్టి, ఓ తప్పుడు కార్యక్రమాన్ని చేపట్టడం వల్లే ఇప్పుడీ అవస్థలు వచ్చాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. ఈ యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంటే ఏం చేయాలోనని పారీ్టలో ఆందోళన నెలకొంది. ఫైబర్‌నెట్‌లో బాబు ‘సెట్టింగ్’ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టులోనూ బాబు అవినీతి వెల్లడైంది. రూ.330 కోట్ల మొదటి దశ ప్రాజెక్టును తన బినామీ వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పటివరకూ బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. టెండర్ల టెక్నికల్ కమిటీలో హరికృష్ణకు స్థానం కల్పించారు. ఎల్1 గా వచ్చిన కంపెనీకి కాకుండా టెరాసాఫ్ట్‌కు టెండరు కట్టబెట్టారు. ఇలా చేయడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా బాబు పట్టించుకోలేదు. 80 శాతం ప్రాజెక్టు పనులు నాసి రకంగా చేశారు. అలా కొల్లగొట్టిన నిధుల్లో రూ.144 కోట్లు చంద్రబాబుకు చేరినట్లు గుర్తించారు. అసైన్మెంట్ పేరుతో పేదలను దోచిన బాబు బ్యాచ్ అమరావతి ప్రాంతంలో అసైన్మెంట్ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులను బాబు బ్యాచ్ భయపెట్టి, వాటి ద్వారా వందల కోట్లు దండుకున్న మోసమిది. అమారావతి పరిధిలో అసైన్డ్ భూములకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వదని చంద్రబాబు ప్రభుత్వం తొలుత ప్రచారం చేసింది. దాంతో ఆందోళన చెందిన అసైన్డ్ రైతుల వద్దకు బాబు బ్యాచ్ తమ ఏజెంట్లను పంపింది. అతి తక్కువ ధరకు దాదాపు 617 ఎకరాల అసైన్డ్ భూములు హస్తగతం చేసుకుంది. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. భూ సమీకరణ ప్యాకేజీ ద్వారా ఈ బ్యాచ్ రూ.3,737 కోట్లు కొల్లగొట్టింది ఇలా అన్నింటా అడ్డంగా దొరికిపోతున్న చంద్రబాబు.. ఇప్పుడు నిజం గెలవాలంటూ ప్రజల్లో మరో ఎత్తుగడతో వస్తున్నారు. బాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందారంటూ కొందరు టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అసలు వాస్తవమేంటంటే.. నిజం గెలిచింది కాబట్టే ఆయన జైలుకు వెళ్లారు. కానీ, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు కొత్త డ్రామాకు తెరలేపారు. చంద్రబాబు జైలుకు వెళ్లగానే, ఆయన కుమారుడు లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిపివేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయన మళ్లీ పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపించడంలేదు. చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలూ కనిపించడంలేదు. దీంతో బాబు సతీమణి భువనేశ్వరితో యాత్ర చేపట్టారు. బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో బాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతోంది. భవనేశ్వరి మంగళవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. అయితే, ఈ ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమంలో అన్నీ దాపరికాలే. యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు కూడా యాత్ర సమాచారం, రూట్ మ్యాప్ వంటివి ప్రజలకే కాదు.. ఆ పార్టీ నాయకులకే తెలియవు. ఇప్పటివరకు షెడ్యూలే విడుదల చేయలేదు. మొదటిరోజు పాకాల మండలం నేండ్రగుంటలో ఒక పరామర్శ, ఆ తర్వాత కుదిరితే ఎక్కడైనా ఒక దళితవాడలో సహపంక్తి భోజనం, సాయంత్రం చంద్రగిరి మండలంలోని ఆగరాల వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులు చూచాయగా కార్యక్రమాలు గురించి మాట్లాడుకుంటున్నా ఇంతవరకు స్పష్టత లేదు. -
పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, పల్నాడు జిల్లా: జంగమహేశ్వరం గ్రామంలో దారుణం జరిగింది. బరితెగించిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త కునిరెడ్డి కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు. జంగమహేశ్వపురం వైఎస్సార్సీపీ పార్టీలో కృష్ణారెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకుల కోసం మూడు స్పెషల్ టీంలను పోలీసులు రంగంలోకి దింపారు. -
అనంతపురంలో టీడీపీ నేత రౌడీయిజం
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, చంద్ర దండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు రౌడీయిజానికి దిగారు. ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డిని ఫోన్లో బెదిరించిన ప్రకాష్.. టీడీపీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ రెచ్చిపోయారు. ఆర్అండ్బి అతిథి గృహంలో జరిగిన ఇంజనీర్ల మీటింగ్ లో దౌర్జన్యానికి దిగిన ప్రకాశ్ నాయుడు కాళ్లతో డోర్‌ను తన్ని ఇంజనీర్లపై దాడికి యత్నించాడు. దౌర్జన్యం చేసి రివర్స్ కేసు పెట్టేందుకు టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. -
ప్రొద్దుటూరులో 300 కిలోల బంగారం సీజ్
ప్రొద్దుటూరు క్రైం: బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు సోదాలు జరిపి సుమారు 300 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారు నగలతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని రెండు వాహనాల్లో తిరుపతికి తరలించారు. ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19 నుంచి ఆదాయపన్నుశాఖ అధికారులు జరిపిన తనిఖీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అధికారులు బంగారం దుకాణాలతో పాటు యజమానులు, వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక దుకాణంలో సుమారు 200 కిలోలు, మరో రెండు దుకాణాల్లో 100 కిలోల వరకు లెక్కలు చూపని బంగారం లభించడంతో దాన్ని సీజ్ చేశారు. కాగా ఐటీ అధికారులు ఈ వివరాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. పండుగ సమయంలో స్తంభించిన వ్యాపారం కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా బంగారు నగలు విక్రయించడంతో పాటు అక్రమంగా బంగారం దిగుమతి చేసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లటంతో ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19న సుమారు 40 మంది ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో లెక్కలు లేని బంగారం లభించడంతో పట్టణంలోని బంగారం దుకాణాల్లో జీరో వ్యాపారం జరుగుతోందన్న విషయం బయటపడిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా సుదీర్ఘంగా సోదాలు జరగలేదని వ్యాపారులు పేర్కొన్నారు. వేలాది బంగారం దుకాణాలున్న ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. తనిఖీలు తమవరకు ఎక్కడ వస్తాయో అనే భయంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలు దుకాణాలు మూసివేయడంతో నిరాశ చెందారు.