52 రోజుల బాబు జైలు జీవితం ఇలా.. | 52 days of Chandrababu Naidu jail life is like this | Sakshi
Sakshi News home page

52 రోజుల బాబు జైలు జీవితం ఇలా..

Nov 1 2023 3:32 AM | Updated on Nov 1 2023 12:30 PM

52 days of Chandrababu Naidu jail life is like this - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో 52 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నా­రు. అనారోగ్య కారణాలతో ఆయనకు మంగళవారం తాత్కాలిక బెయిల్‌ మంజూరైంది. చంద్ర­­బాబు 52 రోజులపాటు జైలులో ఉన్నప్పటికీ ఆయన కోరిక మేరకు ఏసీతో సహా అన్ని సదుపాయాలు కల్పించారు.

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 24 గంటలపాటు ప్రత్యేక వైద్య బృం­దాన్ని కేటాయించారు. రోజూ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు కూడా ఇచ్చారు. ఇలా 52 రోజుల పాటు చంద్రబాబు జైలు జీవితం సాగింది. 53వ రోజు ఆయన జైలు నుంచి విడుదల­య్యారు. అరెస్టు నుంచి విడుదల వరకు ముఖ్య పరిణామాలు ఇలా..   

♦ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబును సెపె్టంబర్‌ 9న అరెస్టు చేశారు. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది.    
♦రిమాండ్‌ ఖైదీగా సెప్టెంబర్‌ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు రాజమహేంద్రవరం సెం­ట్రల్‌ జైలుకు తరలించారు.  
♦ జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్‌ కేటా­యించారు. ఏ గదిలో ఉంచారో భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు.  
♦ కోర్టు ఆదేశాలతో రోజూ ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయ­­న ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు.
♦మొదట సెపె్టంబరు 22 వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు.  
♦ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లోనే రెండురోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. అన్నింటికీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే తీరులో చంద్రబాబు సమాధానం చెప్పారు.  
♦ సెప్టెంబర్‌ 24న మరోసారి బాబుకు రిమా­ండ్‌. దీన్ని అక్టోబర్‌ 5 వరకు కొనసాగించారు.  
♦ జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగింది.   
♦ చంద్రబాబుకు ముందు నుంచే ఉన్న చర్మ సమస్య జైల్లో ఇంకా పెరిగిపోయిందని ఎల్లో మీడియా కథనాలు అల్లింది. ఆయనకు వైద్యులతో ప్రత్యేక వైద్య బందం ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో టవర్‌ ఏసీ వసతి కచ్చిచారు. 
♦ నిత్యం మూడుసార్లు వైద్య పరీక్షలతోపాటు ఒకసారి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్ర­త్యే­­క వైద్య బృందంతో పరీక్షలు. 
♦ చంద్రబాబు రిమాండ్‌ మరోసారి పొడిగింపు. అక్టోబర్‌ 5 నుంచి 19 వరకు ఏసీబీ కోర్టు జ్యుడిíÙయల్‌ రిమాండ్‌ పొడిగించింది. 
♦ వారానికి రెండుసార్లు బాబుతో ములాఖత్‌ అయిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి. 
♦ బాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా 5 కిలో­లు బరువు తగ్గారంటూ విష ప్ర­చా­­రం.  
♦ చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలు­కు వచ్చినప్పుడు 66 కిలోలు ఉండేవారని, ఇప్పుడు 67 కిలోలు ఉన్నారని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విడుదల సమయా­నికి అర కిలో పెరిగి 67.5 కిలో­లకు చేరుకు­న్నారు. 
♦ అక్టోబర్‌ 19 నుంచి నవంబర్‌ 1 వరకు చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు. 
♦ తన కుడి కంటికి కాటరాక్ట్‌ సర్జరీ అవసరమని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు. ఆయనకు జీజీహెచ్‌ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు.
♦ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement