ఏపీ నూతన డీజీపీగా మాలకొండయ్య | Malakondaiah appointed as AP New DGP | Sakshi
Sakshi News home page

ఏపీ నూతన డీజీపీగా మాలకొండయ్య

Dec 30 2017 7:19 PM | Updated on Aug 18 2018 6:24 PM

Malakondaiah appointed as AP New DGP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా మాలకొండయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం మాలకొండయ్య ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న (ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మాలకొండయ్యను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు డీజీపీ సాంబశివరావుతో కలిసి మాలకొండయ్య ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. కాగా మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement