నిరుపేదలకు వరం ‘కస్తూర్బా’ | kasturba girls school is boon for students | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు వరం ‘కస్తూర్బా’

Feb 3 2018 7:29 PM | Updated on Aug 17 2018 2:56 PM

kasturba girls school is boon for students - Sakshi

నేరడిగొండలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం

నేరడిగొండ : చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా కొందరికి కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. మరికొందరికి ఆర్థిక స్థోమత సహకరించదు. ఎలాగోలా బడికి వెళ్తున్నా మధ్యలోనే మానేయాల్సిన దుర్భర పరిస్థితి మరికొందరిది. ఇలాంటి వారెందరినో అక్కున చేర్చుకొని అన్నివసతులు సమకూర్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు. కుటుంబ పరిస్థితులు అనుకూలించక, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికలకు కేజీబీవీల వ్యవస్థ వరంలా మారింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో గ్రామాల్లో బాలికలను చదివించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఇలా మధ్యలో చదువు మానేసిన బాలికలు, తల్లిదండ్రులు లేని చిన్నారులను కస్తూర్భాలు అక్కున చేర్చుకొని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి.

నేరడిగొండ కేజీబీవీలో
మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని 2010లో ప్రారంభించారు. అప్పటినుంచి ఎనిమిదేళ్లుగా ఎంతోమంది ఈ విద్యాలయంలో విద్యను అభ్యసించి ప్రయోజకులు అయ్యారు. ప్రస్తుతం ఈ విద్యాలయంలో చదువుతున్న 182 మంది బాలికలది ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. పేదరికంతో బడి మానేసిన వారు ఒకరైతే, తల్లిదండ్రులను కోల్పోయి స్కూల్‌కు దూరమైన వారు మరొకరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువుకోవాలన్నదే వారి ఆశ. చదవాలన్న వారి ఆసక్తికి అనుగుణంగా బాలికల బంగారు భవిష్యత్తుకు ఇక్కడి కస్తూర్భా విద్యాలయం బాటలు వేస్తోంది.

భరోసా కలిగింది
పాఠశాలల్లో వసతులు, విద్యబోధన బాగుంది. ఉపాధ్యాయులు కూడా ఇంటి వద్ద అమ్మానాన్నలు ఎలా చూసుకుంటారో అలాగే మాపట్ల శ్రద్ధ పెడుతున్నారు. చదువుకోవడానికి ఇంతకన్నా ఏంకావాలి. మంచిగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.
– గాయత్రి, 9వతరగతి విద్యార్థిని

బాగా చదివి స్థిరపడతా
మాది లక్ష్మణచాంద మండలం మునిపెల్లి గ్రామం. బాగా చది వి భవిష్యత్తులో స్థిరపడాల న్నదే నా లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తా. పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం యోగా కూడా నేర్పుతున్నారు.  
– శ్రీజ, పదోతరగతి విద్యార్థిని

మంచి అవకాశం
ఆర్థిక ఇబ్బందులు, ఇతర కార ణాలతో మధ్యలో చదువు మానేసిన బాలికలకు కస్తూర్భాలు ఎం తో దోహద పడుతున్నాయి. బా లికలు ఉన్నతవిద్య వైపు అడుగు లు వేస్తున్నారు. మంచి విద్య, క్రమశిక్షణతో పాటు ఆహారం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
– జయశ్రీ, ఎస్‌వో

1
1/1

కేజీబీవీలోని విద్యార్థినులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement