పండుగపూట విషాదం | Jeep Hit Bike One Died At adilabad | Sakshi
Sakshi News home page

పండుగపూట విషాదం

Jan 17 2018 7:55 AM | Updated on Aug 30 2018 4:17 PM

Jeep Hit Bike One Died At adilabad - Sakshi

కోటపల్లి(చెన్నూర్‌): కనుమ పండుగ పూట ఆ గ్రామంలో విషాదం నిండింది. సంక్రాంతి వేడుకలు బంధువుల ఇంటికి వెళ్లొస్తుండగా ఒకరిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రావుల ఆనంద్‌(42) సోమవారం ఉదయం మహారాష్ట్రలోని సిరొంచ నడికుడే గ్రామం నుంచి రొయ్యలపల్లికి వస్తుండగా వెనుక నుంచి వస్తున్న జీపు ఒక్కసారిగా ఆనంద్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్‌ అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆనంద్‌ మంచిర్యాలలోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. ఆనంద్, రాజ్‌కుమార్, నవీన్‌ సోమవారం ఉదయం సిరోంచలోని తన చిన్నమ్మ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గ మధ్యలో తూమ్‌నూర్‌ వద్ద జీప్‌ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట జరిగిన ప్రమాదంతో రొయ్యలపల్లిలో విషాదంలో నెలకొంది. ఆనంద్‌ మృతదేహన్ని సిరొంచ ప్రభుత్వాస్పత్రిలో పోస్టమార్టమ్‌ నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement