అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం | The couple committed suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Dec 31 2017 3:41 PM | Updated on Nov 6 2018 8:08 PM

ఆదిలాబాద్‌ : లక్సెట్టిపేట మండలం చంద్రారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబూలాల్‌(35), యమున(30) అనే భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.  చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి భారమవడంతో తీర్చలేక ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా...కాసేపటికే భార్య యమున మృతిచెందింది. బాబూలాల్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరికి రూ.5 లక్షల మేర అప్పు ఉన్నట్లు తెలిసింది. దంపతులకు ఇద్దరు సంతానం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement