Top Stories
ప్రధాన వార్తలు

ప్రధాని మోదీ విజయరహస్యం ఇదే..!
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తోంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా. పైకి తనపని తాను చేసుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండటమే మోదీ శైలి. అవతలి వాడికి అవకాశమివ్వడం, అవతలివాడిని మాట్లాడనీయడం మోదీకి తెలిసిన మరో విద్య. అది చెడు కానంతవరకే మోదీ భరిస్తారు.. ఒకవేళ అవతలి వాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో మాత్రం మోదీ వ్యవహరశైలి భిన్నంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానం సందపాదించుకున్న మోదీ యుద్ధ వ్యూహాలను చూసి ప్రపంచ మిలిటరీ వ్యూహకర్తలు, విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.ఎడమవైపు సంజ్ఞ చేస్తారు కుడివైపుకు తిరుగుతారు.. ఇది మనకు మోదీ ప్రసంగంలో తరుచు కనిపిస్తూ ఉంటుంది. మరి మోదీ వ్యూహాలు కూడా ఇలానే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే కాకుండా ఆ దేశ కవ్వింపు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవతమైంది. గత కొన్నేళ్లుగా మోదీ యుద్ధ తంత్రాలను దాయాది దేశం పాకిస్తాన్ పసిగట్టలేకపోతోంది.బాలాకోట్, "ఆపరేషన్ సింధూర్" రెండింటికీ ముందు, ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ బహిరంగ ప్రదర్శనే గాక ఆయన ప్రసంగాలు కూడా ప్రశాంతంగా కనిపించాయి. మోదీ అసలు ఉద్ధేశాన్ని బహిర్గత పరచలేదు. ఈ రెండు సమయాల్లోనూ సూదిమొనంత కచ్చితత్వంతో తాను చేయబోయే అ దాడులను,కాయన అమాయక మొహం వెనక దాచిపెట్టారు.బాలాకోట్ దాడి వ్యూహం తరహాలోనే, ఈసారి కూడా ప్రధాని మోదీ వ్యూహాలు పాకిస్తాన్‌ను నివ్వెరపరచాయ్. దాడికి ముందు ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌తో మాస్టర్‌మైండ్ యుద్ధతంత్రంతో. ఆపరేషన్ సింధూర్ కు ముందు ప్రదర్శించిన వైఖరి.. బాలకోట్‌కు ముందు ఆయన ప్రదర్శించిన వైఖరి పాకిస్తాన్‌ను అయోమయంలో పడేసింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక వైపు చూపించి.. మరో వైపు నుంచి.. మధ్యందిన మార్తాండుని వలే అనన్యసామాన్యమైన శక్తితో శత్రువుపై పిడుగులు కురిపించే కళలో ప్రావీణ్యం సంపాదించినట్లే ఉంటుంది.. 2019లో బాలకోట్ దాడులకు ముందు ఆయన ప్రయాణ ప్రణాళికతో పాటు ఆయన ప్రసంగం, ప్రస్తుత "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా ఆయన వ్యూహాలు.. యుద్ధతంత్రంలో మాస్టర్‌క్లాస్‌లు.. శత్రువును అచేతనం చేసి.. మూగబోయేలా చేశాయి.ఒకసారి చేస్తే యాదృచ్ఛికం కానీ మళ్ళీమళ్ళీ పునరావృతం చేయడమంటే.. ప్రపంచమనే వేదికను నివ్వెరపరచడమే. ఇది మోదీకే సాధ్యమైన యుద్ధతాండవం. అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. రెండు దాడులకు మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే.. అవి కచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా ఉంటాయి. బాలకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రదర్శించిన తంత్రం నుండి ఎలాంటి పాఠం నేర్చుకోనందుకు పాకిస్తాన్ తన చెప్పుతో తననే కొట్టుకుంటుంది.బాలకోట్ కు 48 గంటల ముందు2019 ఫిబ్రవరి 26న.. తెల్లవారుఝామున భారతదేశం బాలకోట్ పై దాడి చేసింది. కానీ, ఆ దాడికి ముందు 48 గంటలు, మోదీ షెడ్యూల్ అంతా యథావిధిగా జరిగింది.ఫిబ్రవరి 25న, ఆయన న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన మాట్లాడినప్పటికీ, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జిహాదిస్ట్ మౌలిక సదుపాయాలపై రాబోయే దాడి గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు.నిన్న(మంగళవారం, మే 6వ తేదీ) రాత్రి 9 గంటలకు, భారత విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారతదేశం యొక్క ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాని సంకల్పం గురించి మోదీ మాట్లాడారు. ఆందోళన సూచించే ఒక్క ముడత కూడా అతని నుదిటిపై కనిపించలేదు. ప్రసంగంలో సందేహాస్పదమైన అంశాలకు ఏమాత్రం చోటివ్వలేదు.తుఫాను ఎదురైనప్పుడు ప్రశాంతత, అగ్ని గుండంలోనూ ధైర్యంగా నిలబడగలగడం గొప్ప నాయకుడి లక్షణాలు అని మనస్తత్వవేత్తలు అంటారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం.. వారు సూచించే నాయకత్వ అంచనాలకు సరిపోవడం చూసి.. వారు నాయకత్వానికి ఇచ్చిన భాష్యం సరైందేనని భావిస్తారు.మోదీ వ్యూహాలు అర్థం కాలేదు,..చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, అవే తప్పులను పునరావృతం చేస్తారు. బాలాకోట్‌కు ముందు ప్రధాని మోదీ తీరును పాకిస్తాన్ విశ్లేషించి ఉంటే.. మే 6వ తేదీ రాత్రి నియంత్రణ రేఖ వెంబడి తొమ్మిది లక్ష్యాలపై భారత్ దాడి చేసినప్పుడు ఆ దేశం ఎంతో కొంత ప్రతిఘటించే ఉండేది, కానీ మోదీ వ్యూహాలు అర్ధం కాకపోవడంతో పాకిస్తాన్ చూస్తూ ఉండిపోయింది.బాలకోట్‌కు ముందు ప్రధాని మోదీ వైఖరికి సంబంధించి కచ్చితత్వానికి ప్రతిరూపంగానే నిలుస్తుంది. దాడులకు కొన్ని గంటల ముందు, ఆయన ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొని 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా గొప్ప దేశంగా ఎదగాలనే ఆకాంక్షల గురించి మాట్లాడారు.30 నిమిషాల పాటు జరిగిన ఆనాటి తన ప్రసంగంలో.. ఏమాత్రం ఆందోళన కానీ ఒత్తిడి లేని వ్యక్తిలా ప్రశాంతంగా ఆయన మాట్లాడారు, జోకులు వేస్తూ, భారతదేశంలో ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చినందుకు పొరుగువారిని విమర్శించడం వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా కనిపించినప్పటికీ, పాకిస్తాన్ అనే పదాన్ని మాత్రం ఒక్కసారి కూడా పలకలేదు. ఆ సందర్బంగా మోదీ బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలిస్తే ఎలాంటి అంచనాకు రాలేం.భారతదేశం అంతటా యుద్ధ విన్యాసాలు ప్రకటించడం అతిపెద్ద తంత్రం.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికీ తన దేశాన్ని సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని సూచిస్తుంది. కానీ, ఇది పాకిస్తాన్‌కు విలాసవంతమైన సమయం ఉందనే భ్రమను కలిగించడానికి ఒక వ్యూహం మాత్రమే అని ఉదయాన్నే తేలింది.యుద్ధ కళలో నిష్ణాతులు ఏమంటారంటే.. మీకు మీ శత్రువు గురించి పూర్తిగా తెలిస్తే, యుద్ధంలో ఓటమికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెబుతారు. పాకిస్తాన్‌ను మోదీ పూర్తిగా చదివేశారు... కానీ ఆయన్ను అంచనా వేయడంలో పాక్ మళ్లీ ఫెయిల్ అయ్యింది. అందుకే గెలుపు ప్రతీసారి మోదీనే వరిస్తుంది.

క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
టీమిండియా అభిమానులకు గుండె పగిలే వార్త. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హిట్‌మ్యాన్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటనలో ఇలా రాసుకొచ్చాడు. "అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా ఉంది. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్లో కొనసాగుతాను"38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్ట్‌లు ఆడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్ కోహ్లి నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్.. 24 టెస్ట్‌ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. రోహిత్ తర్వాత టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. రోహిత్ గతేడాది పొట్టి ప్రపంచకప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో రోహిత్ భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. గత 10 టెస్ట్ మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ స్వతాహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ రెండు సిరీస్‌ల్లో రోహిత్ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్‌లను భారత్ కోల్పోయింది.

పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్ కెప్టెన్’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్ మాజీ సైనాకాధికారి ముషారఫ్.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు.

‘అమాయకుల ప్రాణాలు తీసిన వారిని మట్టుబెట్టాం’
న్యూఢిల్లీ: అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఆపరేషన్ సిందూర్‌తో మట్టుబెట్టామని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో శత్రువుకు తగిన విధంగా బుద్ధి చెప్పామన్నారు. ఈ రోజు(బుధవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. ‘రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. భారత సైనం తన సత్తాను చాటింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. పహల్గామ్ లో అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెప్పాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదు.. ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీశాం. ఆపరేషన్ సిందూర్‌తో రికార్డు సృష్టించాం. పాక్ పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది..

అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులు హతమయ్యారు.

పాక్‌కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు!
లండన్: చదువు, ఉద్యోగం కోసం వెళ్లి శరణార్థి పేరిట అక్కడే శాశ్వతంగా తిష్ట వేస్తున్న పాకిస్తాన్ పౌరులకు యూకే షాకిచ్చింది. ఆసైలం (శాశ్వత నివాసం) దరఖాస్తుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాకిస్తానీ పౌరులకు యూకే వీసా నిబంధనలను కఠినం చేయనుంది. వీసా ఓవర్‌స్టేలు, ఆసైలం దరఖాస్తులపై కఠిన చర్యల్లో భాగంగా, యూకే ప్రభుత్వం పాకిస్తానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుండి వచ్చే వారికి స్టడీ, వర్క్ వీసాలపై కఠినమైన పరిమితులను విధించనుందని టైమ్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది.యూకే శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుండి దరఖాస్తులు ఇటీల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో పాకిస్తానీ పౌరులు అగ్రస్థానంలో ఉన్నారు. హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం.. 2024లో మొత్తం 108,000 మంది ఆసైలం కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అత్యధికంగా 10,542 మంది పాకిస్తానీ పౌరులే ఉన్నారు.వీరిలో 16,000 మంది స్టూడెంట్ వీసాలపై యూకేకి వచ్చారు. పాకిస్తానీ, నైజీరియన్, శ్రీలంక దేశీయులు వర్క్, స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై వచ్చి ఆ తర్వాత ఆసైలం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిని అధికారులు "సిస్టమ్ దుర్వినియోగం"గా వర్ణించారు. ఈ నేపథ్యంలో వీసాలిచ్చే సమసయంలోనే కఠినంగా వ్యవహరించాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.కొత్త నిబంధనల్లో భాగంగా వీసా దరఖాస్తుదారులను వారి ఆసైలం దరఖాస్తు రిస్క్‌ను అంచనా వేయడానికి ప్రొఫైలింగ్ చేస్తారు. అధిక రిస్క్‌గా భావించిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. అంతేకాదు..వీసా హోల్డర్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు నిరూపించుకోకపోతే, వారికి పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే వసతి సౌకర్యాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూకే ప్రభుత్వం 2024లోనూ కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు డిపెండెంట్లను తీసుకురాకుండా కఠిన నిబంధనల విధించించింది. దీంతో అప్పటి నుంచి 2025 మార్చి నాటికి వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గి 7,72,200కి తగ్గాయి.అయితే, ఈ ప్రతిపాదనలు వివాదాన్ని రేకెత్తించాయి. జాతీయత ఆధారంగా ప్రొఫైలింగ్ చేయడం వివక్ష దావాలకు దారితీయవచ్చని ఇమ్మిగ్రేషన్ లాయర్ అహ్మద్ ఖాన్, హెచ్చరించారు. "ఈ విధానాలు మూల కారణాలను పరిష్కరించకుండా మొత్తం సమాజాలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం, శ్రామిక లోటుతో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు కూడా ఆర్థిక ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి.

Operation Sindoor: ముంబై ఇండియన్స్‌పై ఎఫెక్ట్
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్‌పై పడింది. తమ తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఇవాళ (మే 7) సాయంత్రం ముంబై నుంచి చండీఘడ్ మీదుగా ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ధర్మశాల ప్రయాణం వాయిదా పడింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు చండీఘడ్ సహా దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేశారు. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ప్రయాణించాల్సిన విమాన సర్వీస్ కూడా ఉంది. బీసీసీఐ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలోనే ఉండనుంది.ఈ నెల 11న ముంబై ఇండియన్స్ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసమే వారు ధర్మశాల ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ లోపే విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ధర్మశాలలో రేపు (మే 8) ఓ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ధర్మశాలకు చేరుకున్నాయి.కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం పలు విమానాశ్రయాలను మూసి వేయాలని సూచించింది. అయితే దీని ప్రభావం ఐపీఎల్ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం సాగాలంటే ఆయా జట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు విమానాల ద్వారా ప్రయాణించాల్సి ఉంది. దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేసిన నేపథ్యంలో జట్ల ప్రయాణానికి ఆటంకం కలుగవచ్చు. దీని ప్రభావం ఐపీఎల్ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉంది.స్పందించిన బీసీసీఐషెడ్యూల్ మార్పు అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.మ్యాచ్ ముగిసిన కొద్ది సేపటికే ఆపరేషన్ సిందూర్ మొదలైందిముంబై ఇండియన్స్ -గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 6) జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెల 22వ తేదీన పాక్ ఉగ్రమూకలు దాడులకు తెగబడి 26 మంది అమాయకుల ఫ్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

ఉగ్రవాద స్థావరాలు,శిబిరాలపై దాడి అనివార్య చర్య: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ ముఖ్య నేతలతో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ..ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.

ఆమిర్‌ని కలిసిన అల్లు అర్జున్.. భారీ ప్రాజెక్ట్ కోసమేనా?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భేటీ అయ్యారు. ముంబైలోని ఆమిర్ నివాసానికి వెళ్లిన బన్నీ..ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇలా ఉన్నపళంగా ఆమిర్‌తో బన్నీ బేటీ కావడంపై రకరకాల పుకార్లు వెల్లువడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుందని, దాని కోసమే ఆమిర్‌ని కలిశాడని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమిర్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భారీ బడ్జెట్‌తో ‘మహా భారతం’ తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తారని ఇటీవల ఆయన ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి కలవడంతో..‘మహా భారతం’కోసమే ఈ భేటీ జరిగిందనే ప్రచారం మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటనలు ఏవీ రాకపోయినా, అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఇప్పుడు బన్నీ-ఆమిర్ భేటీనే హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బీజీగా ఉన్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే బన్నీ షూటింగ్లో పాల్గొంటారు. ఇందులో హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండబోతున్నాయట. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో కథానాయికగా ‘లైగర్’ ఫేమ్ అనన్యా పాండేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారని సమాచారం.

నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత మే 7 బుధవారం తెల్లవారుజామున భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి బదులిచ్చింది. నాడు ఆ విషాదకర ఘటనలో మోదీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కడతేర్చారు. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళ 'సిందూరం' పేరుతోనే ఆపరేషన్ చేపట్టి ఉలిక్కిపడేలా సమాధానమిచ్చింది భారత్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లు మిగిల్చితే..ఈ ఆపరేషన్ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పడం విశేషం. అంతేగాదు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది మీడియా ముందు వెల్లడించారు కూడా. మరీ ఆ ఆదిపరాశక్తులు ఎవరు? ఏవిధంగా ఈ ఆపరేషన్ని విజయవంతంగా ముగించారు తదితర విశేషాలు చూద్దామా..!వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ సిందూర్ ఆపరేషన్ వారి నేతృత్వంలోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. ఈ సిందూర్ ఆపరేషన్‌కి సంబంధించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించింది వీరిద్దరే. సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్‌గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్యంసం సృష్టించగా, వ్యోమికా సింగ్ ఆకాశం నుంచి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ ఇరువురి మహళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై మెరుపులు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలతో సహా పాక్‌లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లు, ట్రైనింగ్ సెంటర్లను కూడా మట్టుబెట్టింది. అంతేగాదు విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే గాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలెట్ చేసింది. సాహసాలకు కేరాఫ్ అడ్రస్ ఇరువురు..ఇక్కడ సోఫియా కుటుంబం మొత్తం సైనిక సేవలతో ముడిపడి ఉంది. అంతేగాదు సోఫియా ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.సోఫియా యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆరు సంవత్సరాలు సేవలందించారు.ఐక్యరాజ్యసమితి మిషన్‌లో (2006) గణనీయమైన సేవలు అందించారువ్యోమిక తన పేరుకు తగ్గట్టే పైలట్ కావాలనే రంగాన్ని ఎంచుకుని సైన్యంలో చేరారామె. అంతేగాదు తన కుటుంబంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తిగా వ్యోమిక పేరుగడించింది. డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. భారత్‌లో అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో చేతక్, చిరుత వంటి విమానాలను నడిపారామెఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు.2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలకమైన రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించింది2021లో త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారుహర్షం వ్యక్తం చేసిన పహల్గాం బాధితులు..ఆ ఆపరేషన్ గురించి వినగానే కళ్లల్లో నీళ్లు వచ్చేశాయన్నారు పహల్గామ్ బాధితులు. మా కుంకుమను నేలరాల్చిన వారికి అదే పేరుతో ఆపరేషన్ చేపట్టి మట్టికరిపించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని గద్గద స్వరంతో అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం అని ధీమాగా చెప్పారు.(చదవండి: Operation Sindoor: మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాం బాధితుల రియాక్షన్)
సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2'
పెద్దారెడ్డికి భద్రత కల్పించలేం: ఎస్పీ
ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే
‘కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోండి’
ఎగిసిన స్టాక్ ఎక్స్ఛేంజీల లాభాలు
'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత
క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
'లోపలికి రా చెప్తా' టైటిల్ ఎందుకు పెట్టానంటే: దర్శకుడు
ఢిల్లీలో కరెంట్ కట్.. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే..?
KKR VS CSK Live Updates: 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 124/4
కొడుకు బాధను అర్థం చేసుకునేది తల్లిదండ్రులేగా!
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది!
మనమేమో పుష్కలంగా టెర్రరిస్టులను దిగుమతి చేసుకున్నాం. ఇక మన వస్తువులను ఎవరు దిగుమతి చేసుకుంటారు!
సారీ సార్! యుద్ధమొస్తే నేనూ వెళ్లిపోతా...
ముద్దు సీన్ కోసం అదనంగా కోటి చెల్లించిన హీరో
స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ
కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
క్రెడిట్ కార్డు బిల్లు కట్టమన్నందుకు..
విమాన టికెట్‌కు డబ్బుల్లేక.. వ్యభిచార కూపంలోకి..
'అందరూ ఫేక్.. కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్
ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. సంఘంలో గౌరవమర్యాదలు
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్
విశాఖ బీచ్ లో సమంత ‘శుభం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2'
పెద్దారెడ్డికి భద్రత కల్పించలేం: ఎస్పీ
ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే
‘కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోండి’
ఎగిసిన స్టాక్ ఎక్స్ఛేంజీల లాభాలు
'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత
క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
'లోపలికి రా చెప్తా' టైటిల్ ఎందుకు పెట్టానంటే: దర్శకుడు
ఢిల్లీలో కరెంట్ కట్.. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే..?
KKR VS CSK Live Updates: 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 124/4
సినిమా

మొన్ననే విడాకులు .. ఇప్పుడు ఐటమ్ సాంగ్
టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న యజువేంద్ర చాహల్.. కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 2020లో యూట్యూబర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. అయితే వీళ్ల బంధం చాలావరకు బాగానే ఉండేది. మరి ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసేసుకున్నారు.అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ.. సినిమాల్లో బిజీ అయిపోతోంది. మొన్నీమధ్యే తెలుగులో 'ఆకాశం దాటివస్తావా' మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడీ ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా వెల్లడించింది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' చిత్రం మే 09న థియేటర్లలోకి రానుంది. ఇందులోని ప్రత్యేక గీతంలో ధనశ్రీ నర్తించింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాల్లో నటించే విషయమై చాహల్-ధనశ్రీ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తోంది.ఎందుకంటే విడాకులు తీసుకున్న కొన్నిరోజుల తర్వాత తెలుగు, హిందీలో తాను చేస్తున్న సినిమాల గురించి ధనశ్రీ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలు సక్సెస్ అయితే గనక ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్ గా మారిపోతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9)

హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. తన భార్య గర్భంతో ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈమెకు గ్రాండ్ గా సీమంతం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ భార్య రహస్య తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!)కడపకు చెందిన కిరణ్ అబ్బవరం.. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రేక్షకుల్ని అలరించాడు. తర్వాత చాలా సినిమాలు చేశాడు గానీ అవన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. కానీ గతేడాది 'క' మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.్యక్తిగత జీవితానికొస్తే.. తన తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ నే కిరణ్ అబ్బవరం ప్రేమించాడు. కొన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న వీళ్లిద్దరూ గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఈ జనవరిలో ప్రెగ్నెన్సీ ప్రకటించారు. ఇప్పుడు సీమంతం జరిగింది. మరో ఒకటి రెండు నెలల్లో కిరణ్-రహస్యకు బేబీ పుట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran)

'కాంతార' షూటింగ్ లో మరో అపశృతి
'కాంతార' పేరు చెప్పగానే సదరు సినిమాలోని క్లైమాక్సే మీకు గుర్తొస్తుంది కదా? ఎందుకంటే 2022లో రిలీజైన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్లుగా షూటింగ్ చేస్తున్నారు. ఇదివరకే ప్రమాదాలు చోటుచేసుకోగా ఇప్పుడు మరో అపశృతి జరిగింది.కన్నడ హీరో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కాంతార చాప్టర్ 1'. ఇదివరకే వచ్చింది రెండో పార్ట్ కాగా.. చిత్రీకరణ జరుపుకొంటున్నది తొలి పార్ట్. ఏ క్షణాన షూటింగ్ మొదలైందో గానీ ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఒకటి రెండు కాదు చాలానే ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!)తాజాగా జరిగిన సంఘటన గురించి చెప్పుకొంటే.. ఉడుపి జిల్లా కొల్లూరులో దగ్గర షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ జూనియర్ ఆర్టిస్ట్ గా కేరళకు చెందిన కపిల్ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం చిత్రీకరణ పూర్తవడంతో దగ్గరలోని సౌపర్ణిక నదిలో ఈతకు దిగాడు. లోతు ఎక్కువుండేసరికి నీట ముగిని చనిపోయాడు. దీంతో విషాదం నెలకొంది.అంతకు ముందు కూడా 'కాంతార' టీమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిరోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓసారి పెద్ద గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ ధ్వంసమైంది. అలానే కొన్నిరోజుల క్రితం పంజుర్లీ దేవర హీరో,డైరెక్టర్ రిషభ్ శెట్టిని హెచ్చరించింది. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్, నీ చుట్టుపక్క వాళ్ల దగ్గరనుంచి నుంచే ఇది పొంచి ఉందని చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూస్తుంటే అసలేం జరుగుతుందా అని సందేహాలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)

ఒకేసారి ఓటీటీ, టీవీలో ‘రాబిన్ హుడ్’.. ఎప్పుడంటే?
నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్(Robinhood).. ఈ ఏడాది మార్చిలో విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. శ్రీలీల గ్లామర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో, కేతికా శర్మ ఐటమ్ సాంగ్..ఏవి సినిమాను రక్షించలేకపోయాయి. ఛలో, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రంలో అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఓటీటీలో అయినా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్రబృందంలో బలంగా ఉంది. అయితే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసిన జీ5(ZEE5) సంస్థ.. మే 10న ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్ చేయనుంది. ఆ తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములా అప్లై‘సంక్రాంతి వస్తున్నాం’సినిమాను అటు ఛానల్లో, ఇటు ఓటీటీలోకి ఓకేసారి తీసుకోచ్చింది జీ5 సంస్థ. ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ విషయంలోనూ అదే ఫాలో అవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ.. మే 10వ తేదినే ఓటీటీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఒకేసారి టీవీలోనూ, ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల.. జీ చానల్‌కి మంచి టీఆర్పీ వచ్చింది. అందుకే రాబిన్ హుడ్ చిత్రానికి కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఈ రాబిన్‌హుడ్ కనీసం బుల్లితెర మనసులను అయినా దోచుకుంటాడో లేదో చూడాలి.రాబిన్ హుడ్ కథేంటంటే..?రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Full of laughs, packed with thrills, and loaded with chills – Robinhood ! Don't miss 🌟🎬Robinhood World Television Premiere On May 10th, Saturday at 6 PM On #ZeeTelugu#ZeeTeluguPromo #WorldTelevisionPremiereRobinhood #RobinhoodOnZeeTelugu pic.twitter.com/SjA5ShGdPX— ZEE TELUGU (@ZeeTVTelugu) May 6, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!
క్రీడలు

Operation Sindoor: ముంబై ఇండియన్స్‌పై ఎఫెక్ట్
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్‌పై పడింది. తమ తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఇవాళ (మే 7) సాయంత్రం ముంబై నుంచి చండీఘడ్ మీదుగా ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ధర్మశాల ప్రయాణం వాయిదా పడింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు చండీఘడ్ సహా దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేశారు. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ప్రయాణించాల్సిన విమాన సర్వీస్ కూడా ఉంది. బీసీసీఐ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలోనే ఉండనుంది.ఈ నెల 11న ముంబై ఇండియన్స్ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసమే వారు ధర్మశాల ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ లోపే విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ధర్మశాలలో రేపు (మే 8) ఓ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ధర్మశాలకు చేరుకున్నాయి.కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం పలు విమానాశ్రయాలను మూసి వేయాలని సూచించింది. అయితే దీని ప్రభావం ఐపీఎల్ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం సాగాలంటే ఆయా జట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు విమానాల ద్వారా ప్రయాణించాల్సి ఉంది. దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేసిన నేపథ్యంలో జట్ల ప్రయాణానికి ఆటంకం కలుగవచ్చు. దీని ప్రభావం ఐపీఎల్ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉంది.స్పందించిన బీసీసీఐషెడ్యూల్ మార్పు అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.మ్యాచ్ ముగిసిన కొద్ది సేపటికే ఆపరేషన్ సిందూర్ మొదలైందిముంబై ఇండియన్స్ -గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 6) జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెల 22వ తేదీన పాక్ ఉగ్రమూకలు దాడులకు తెగబడి 26 మంది అమాయకుల ఫ్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

టాప్‌లో కొనసాగుతున్న జడేజా.. అగ్రస్థానం దిశగా దూసుకొచ్చిన బంగ్లా ఆల్‌రౌండర్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ర్యాంక్‌లను పదిలంగా కాపాడుకున్నారు. బౌలర్ల విభాగంలో బుమ్రా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో జో రూట్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (4), రిషబ్ పంత్ (10), టాప్-10లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.ఆటగాళ్లంతా ఐపీఎల్లో బిజీగా ఉండటం చేత ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఈ మధ్యలో బంగ్లాదేశ్, జింబాబ్వే మాత్రమే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో బంగ్లా ఆల్‌రౌండర్ మెహిది హసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి టెస్ట్‌లో 2 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 10 వికెట్ల ఘనత.. రెండో టెస్ట్‌లో సెంచరీ సహా ఓ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా మిరాజ్ ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకింగ్ సాధించి అగ్రపీఠం దిశగా దూసుకొచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ మిరాజ్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాడు. బౌలింగ్‌లో రెండు స్థానాలు ఎగబాకి 24వ స్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో 8 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరాడు.టాప్-10 టెస్ట్ బ్యాటర్లు1. జో రూట్2. హ్యారీ బ్రూక్3. కేన్ విలియమ్సన్4. యశస్వి జైస్వాల్5. స్టీవ్ స్మిత్6. టెంబా బవుమా7. కమిందు మెండిస్8. ట్రవిస్ హెడ్9. ఉస్మాన్ ఖ్వాజా10. రిషబ్ పంత్టాప్-10 టెస్ట్ బౌలర్లు1. జస్ప్రీత్ బుమ్రా2. కగిసో రబాడ3. పాట్ కమిన్స్4. జోష్ హాజిల్‌వుడ్5. నాథన్ లియోన్6. నౌమాన్ అలీ7. మార్కో జన్సెన్8. మ్యాట్ హెన్రీ9. ప్రభాత్ జయసూర్య10. రవీంద్ర జడేజాటాప్-5 టెస్ట్ ఆల్‌రౌండర్లు1. రవీంద్ర జడేజా2. మెహిది హసన్ మిరాజ్3. మార్కో జన్సెన్4. పాట్ కమిన్స్5. షకీబ్ అల్ హసన్

IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన హార్దిక్ పాండ్యా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును సమం చేశాడు. నిన్న (మే 6) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ ఓవర్లో 11 బంతులు వేసిన ఐదో బౌలర్‌గా హార్దిక్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. హార్దిక్‌కు ముందు సిరాజ్ (2023లో ఆర్సీబీకి ఆడుతూ ముంబై ఇండియన్స్‌పై), తుషార్ దేశ్‌పాండే (2023లో సీఎస్కేకు ఆడుతూ లక్నోపై), శార్దూల్ ఠాకూర్ (2025లో లక్నోకు ఆడుతూ కేకేఆర్‌పై), సందీప్ శర్మ (2025లో రాజస్థాన్‌కు ఆడుతూ ఢిల్లీపై) ఈ చెత్త ప్రదర్శన చేశారు. శార్దూల్, సందీప్ శర్మ, హార్దిక్ ఇదే సీజన్లో ఈ చెత్త ప్రదర్శన చేయడం విశేషం.కాగా, తీవ్ర ఉత్కంఠ నడుమ నిన్న మధ్య రాత్రి వరకు సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగుల స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) ఓ మోస్తరుగా రాణించడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.గుజరాత్ బౌలర్లు, ఫీల్డర్లు తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ముంబైని కట్టడి చేశారు. సాయి కిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ తీశారు. పవర్ ప్లేలో గుజరాత్ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయగా.. గిల్ ఒక్కడే మూడు క్యాచ్‌లు పట్టాడు.అనంతరం గుజరాత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులు డిసైడ్ చేశారు. ఛేదనలో తొలుత సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన గుజరాత్.. మధ్యలో ముంబై బౌలర్లు అనూహ్య రీతిలో పుంజుకోవడంతో తడబాటుకు లోనైంది. ఓ దశలో మ్యాచ్ గుజరాత్ చేతుల్లో నుంచి జారిపోయేలా కనిపించింది. చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. తెవాతియా, కొయెట్జీ బౌండరీ, సిక్సర్ బాది గెలిపించారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ముంబై నాలుగో స్థానానికి దిగజారింది.

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ!
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)నేపథ్యంలో ఐపీఎల్-2025లో షెడ్యూల్లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్ రిచ్ లీగ్ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి.ఐపీఎల్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని.. లీగ్ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మొదలు కాగా.. మే 6 నాటికి 56 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో రెండు మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యాయి.టాప్‌లో గుజరాత్ఈ క్రమంలో పదకొండింట ఎనిమిది విజయాలతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకి కొనసాగుతుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లు ఉన్నా రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు), ముంబై ఇండియన్స్ (14 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (13 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (11 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (10 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇక ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (7 పాయింట్లు), రాజస్తాన్ రాయల్స్ (6 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (4 పాయింట్లు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు కాగా ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ వర్షం వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి.. వాటిని ధ్వంసం చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా వేస్తారేమోనని సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యలో బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.దేశ ప్రయోజనాలే ముఖ్యంఇక ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయాలను బీసీసీఐ శిరసా వహిస్తుందని స్పష్టం చేశారు. సమయానికి తగినట్లు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామని పేర్కొన్నారు.‘‘ఐపీఎల్ పాలక మండలి ఈ పరిస్థితులను గమనిస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదీ మన చేతుల్లో లేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ అందుకు కట్టుబడి ఉంటుంది. మద్దతుగా ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.సురక్షితం, భద్రంఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘భారత్‌లో ప్రతి ఒక్కరు సురక్షితంగా, భద్రంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. మన దేశ సైన్యంపై అందరికీ అమితమైన విశ్వాసం ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా తాము భద్రంగా ఉన్నామని, ఉంటామని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి లీగ్‌లో మార్పులు ఉండవనే అనుకుంటున్నా’’ అని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్
బిజినెస్

యాపిల్ మొబైల్స్ అన్నీ భారత్‌లోనే తయారీ
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఉత్పత్తి చేయడం ప్రతి కంపెనీకి ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. తాము అమెరికాలో విక్రయించబోయే అధిక శాతం ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయంటూ టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించడం ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.‘రాబోయే రోజుల్లో తమ మొబైల్ ఫోన్లు అన్నింటినీ భారత్‌లోనే తయారు చేయాలని, సోర్సింగ్ చేయాలని యాపిల్ నిర్ణయించుకుంది. కాబట్టి భారత్‌లో ఇన్వెస్ట్ చేశారంటే విశ్వసనీయతను, సహజత్వాన్ని, అఫోర్డబిలిటీని (తక్కువ వ్యయాల ప్రయోజనాలు) ఎంచుకున్నట్లే’ అని భారత్ టెలికం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం దన్నుతో దేశీయంగా టెలికం పరికరాల మార్కెట్ అనెక రెట్లు వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. రూ.4,000 కోట్ల పెట్టుబడులనేవి రూ.80,000 కోట్ల విక్రయాలకు, రూ.16,000 కోట్లు విలువ చేసే ఎగుమతులతో పాటు 25,000 ఉద్యోగాల కల్పనకు దోహదపడినట్లు సింధియా చెప్పారు.ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇదివరకే ప్రకటించారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు.

అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,750 (22 క్యారెట్స్), రూ.99,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.500, రూ.540 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.500 పెరిగి రూ.90,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.540 పెరిగి రూ.99,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)లు కూడా భారీగానే పెరిగాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాయాది దేశంపై పంజా విసిరింది. పాకిస్థాన్‌లోని సాధారణ ప్రజలపై కాకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. దీనిపై సానుభూతి కోసం పాక్ ఇతర దేశాల సాయం కోరకుండా భారత్ చాకచక్యంగా వ్యవహరించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.మార్కెట్ రియాక్షన్మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి నిఫ్టీ 50 24,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయింది. గిఫ్ట్ సిటీలోని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ సుమారు 1.19% క్షీణించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతుంది.పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎఫ్ఐఐలు కీలకం24-48 గంటల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తే మార్కెట్లు ముందుకు సాగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం కొంతకాలం మార్కెట్లో దిద్దుబాటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొనుగోలుదారులుగా ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కొంత కాలం అనిశ్చితులు కొనసాగవచ్చు.ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలుగతంలో ఇలా..ఇండో-పాక్ ఘర్షణల నేపథ్యంలో మార్కెట్లు గతంలోనూ కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తరువాత సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ సెషన్ ప్రారంభంలో పడిపోయినప్పటికీ మరుసటి రోజు తిరిగి పుంజుకున్నాయి. పహల్గాం దాడి తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలు, చైనా లిక్విడిటీ చర్యలు వంటి అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మార్కెట్లో కొంత సానుకూల సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది.

సేవల రంగం .. స్వల్పంగా మెరుగు
కొత్త ఆర్డర్ల రాకతో దేశీ సర్వీసుల రంగం ఏప్రిల్‌లో స్వల్పంగా మెరుగుపడింది. దీంతో సేవల రంగం పనితీరుకు ప్రామాణికంగా పరిగణించే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ గత నెలలో 58.7కి చేరింది. మార్చిలో ఇది 58.5గా నమోదైంది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పరిభాషలో సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.తాజా గణాంకాలు, దీర్ఘకాలిక సగటు అయిన 54.2 స్థాయికన్నా అధికంగానే ఉన్నట్లు హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు. మార్చిలో కాస్త నెమ్మదించిన ఎగుమతి ఆర్డర్లు ఏప్రిల్‌లో తిరిగి పుంజుకున్నట్లు వివరించారు. ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, అమెరికావ్యాప్తంగా భారతీయ కంపెనీల సేవలకు డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: జీడీపీ వృద్ధి 6.3 శాతమే! కారణం..సగటు విక్రయ ధరలను పెంచడం ద్వారా సర్వీసుల కంపెనీలు తమ అధిక వ్యయాల భారాన్ని క్లయింట్లకు బదలాయించినట్లు పీఎంఐ సర్వేలో వెల్లడైంది. వ్యయాలపరంగా ఒత్తిళ్లు తగ్గి, రేట్లను పెంచడంతో మార్జిన్లు మెరుగుపడ్డాయి. కార్యకలాపాలు పుంజుకోవడంపై సర్వీస్ ప్రొవైడర్లు ఆశావహంగా ఉన్నప్పటికీ అంచనాలు మాత్రం తగ్గాయి.
ఫ్యామిలీ

Met Gala 2025: స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..
ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్లో బాలీవుడ్ తారలంతా తమదైన ఫ్యాషన్ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్ అటెన్షన్ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్‌గాలా ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్ వేర్లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్ ఫ్యాషన్‌తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్ గాలా ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్లో భారతీయ ఫ్యాషన్ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్. స్టైలిష్ డ్రెస్‌లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఇషా డిజైనర్ వేర్ని రూపొందించారు. టాప్ గోల్డ్ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్ కలర్ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్ తెల్లటి క్యాప్ లుక్‌లో అత్యంత స్టైలిష్ లుక్‌లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్ వేర్లా డిజైన్ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్ వేర్కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్‌పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్‌గాలాకి సంబంధించిన ఫ్యాషన్ వేర్ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్‌వేర్‌లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్ థీమ్ "సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)

కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..!
ప్రపంచంలో మామిడిపండ్లకు చిరునామాగా సగర్వంగా నిలిచిన భారతదేశం, అనేకరకాల ప్రాదేశిక మామిడి పండ్లను కలిగి ఉంది. వీటిలో ప్రతీ మామిడి రకం తనదైన ప్రత్యేకమైన రుచి, సువాసన, సాంస్కృతిక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. కానీ మార్కెట్ ఆధారిత వ్యవస్థ వల్ల వాణిజ్యపరంగా మొలకెత్తిన హైబ్రిడ్ రకాల ప్రభావంతో, ఈ విలువైన దేశీ మామిడి రకాలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా లభించడం తగ్గిపోయిన ఈ మామిడి రకాలను ఈ వేసవి టూర్ల సందర్భంగా ఎక్కడైనా దొరికితే ఆస్వాదించడం మరచిపోవద్దు. 1. కరుప్పట్టి కాయ – తమిళనాడుతమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో పుట్టిన ఈ కరుప్పట్టి కాయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కెర పాకం (పామ్ జాగరీ)ను తలపించే రుచిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పచ్చిగా తినడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.2. కన్నిమాంగా – కేరళకేరళలో కన్నిమాంగా అనే చిన్న మామిడికాయలు పచ్చడికి ప్రసిద్ధి. ‘కన్నిమాంగా‘ అంటే ‘కన్య మామిడి‘, అంటే పూర్తి పక్వతకు ముందు కోయబడే కాయలు. ఈ రకాన్ని పచ్చడి రూపంలో వాడితే, కేరళ వంటకాల మసాలా రుచులకు ఇది సరిపోతుంది. అధిక దిగుబడి కలిగిన వాణిజ్య రకాల సాగు పెరిగిన నేపథ్యంలో, ఈ మామిడి మొక్కలు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అయితే స్థానిక రైతులు గిరిజన సంఘాలు దీన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.3. కల్భావి మావు – కర్ణాటకకర్ణాటక తీరప్రాంతాలలో పుట్టిన కల్భావి మావు మామిడి, గులాబీ వాసన తీపి రుచితో కొత్తగా ఉంటుందనే పేరు సంపాదించింది. ఇది గోల్డెన్ యెల్లో రంగులో మధ్య పరిమాణంలో ఉంటుంది. అదనపు తీపి కలిగి ఉండడంతో నేరుగా తినడానికి మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా వాడేవారు. ఇటీవలి వరకూ మార్కెట్లలో విరివిగా లభించిన ఈ రకం, క్రమంగా తగ్గిపోతోంది. 4. బటాషా – పశ్చిమ బెంగాల్బెంగాల్కు చెందిన బటాషా మామిడి, బాగా తీయగా ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉండి, రసం నిండిన గుజ్జుతో ఉంటుంది అయితే దీని మృదువైన తొక్క ఎక్కువ దూరాలకు తరలించలేనంత సున్నితంగా ఉండటంతో, ఈ మామిడి వాణిజ్యం పెద్దగా పుంజుకోలేదు. దాంతో దీని సాగు కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది.5. అమ్మ చెట్టు – ఆంధ్రప్రదేశ్ఈ మామిడి రకాన్ని అందించే చెట్టుకు తెలుగులో ‘‘అమ్మ చెట్టు’’ అనే పేరు, మామిడికి కూడా అదే పేరు. పెద్దదైన పరిమాణం, ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఉన్న ఈ మామిడి చెట్లు గ్రామీణ జీవన విధానంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ చెట్ల నిర్వహణ కష్టం కావడంతో, ఈ రకం సాగు తగ్గిపోయింది. ఇక ఇది కేవలం కథల్లో, జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోనుంది. అధిక దిగుబడి, హైబ్రిడ్ రకాలపై దృష్టి పెరగడంతో దేశీ రకాల మామిడి ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే టెంక లేని పండ్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారుల అభిరుచి వల్ల, స్వాభావికంగా పెరిగే దేశీ రకాల విస్త్రుతికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు నగరీకరణ విస్తరణ వల్ల తోటలపై భౌగోళిక ఒత్తిడి పెరిగింది. యువతలో దేశీరకాల గురించి అవగాహన లేకపోవడం కూడా సాగును దెబ్బతీసింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... కారణాలేవైనా మనదైన మామిడి వెరైటీలను మనం కోల్పోతుండడం దురదృష్టకర పరిణామమేనని చెప్పాలి.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!)

మంచి పుచ్చకాయను గుర్తించండి ఇలా!
వేసవిలో లభించే పుచ్చకాయలు అందరికీ ఇష్టం, అంతకంటే చల్లని నేస్తాల వంటివి అనొచ్చు. వాటి సహజమైన తీపి, అధిక నీటి శాతం వాటి రిఫ్రెషింగ్ రుచితో పాటు కలర్‌ఫుల్ రూపం కూడా సమ్మర్లో వాటిని తిరుగులేనివి పండుగా నిలబెట్టాయి. ఈ పుచ్చకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ అనేకం...పుచ్చకాయ కేవలం అలసిపోయినప్పుడు రిఫ్రెష్ చేసే పండు మాత్రమే కాదు, అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. దాదాపు 9092% నీటితో కూడిన పుచ్చకాయ, వేసవి వేడి సమయంలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఒక 100 గ్రాముల పుచ్చకాయ ద్వారా దాదాపు 16 కేలరీలు లభిస్తాయి తక్కువ కేలరీల పండుగా, బరువును నియంత్రించుకునే వారికి పుచ్చకాయ అనుకూలంగా ఉంటుంది. దీనిలో సి, ఎ, బి6 విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన ఈ పండు అధిక రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రయోజనకరం. దీని విటమిన్ సి కంటెంట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేసి వివిధ వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. పుచ్చకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది, దానిలోని ఇనుము శాతం కారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. పండులోని ఎరుపు భాగాన్ని తరచుగా అత్యంత రుచికరంగా పరిగణిస్తారు, అయితే చర్మం దగ్గర ఉన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండే భాగం సైతం ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా పుచ్చకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. వేసవి నెలల్లో, రోడ్డు పక్కన ఎర్రగా, కోసిన పుచ్చకాయ రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో చాలా కల్తీ పుచ్చకాయలు ఉన్నాయి, మరి తాజా, ఆరోగ్యకరమైన పుచ్చకాయను కొనుగోలు చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? నాణ్యత లేని పండ్ల ద్వారా మోసపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా? ఇప్పుడు చూద్దాం..కల్తీ పుచ్చకాయ అంటే హానికరమైన రసాయనాలు, రంగులు లేదా ఆర్టిషియల్ రిపైనింగ్ ఏజెంట్లను ఉపయోగించి దాని రూపాన్ని లేదా బరువును పెంచడానికి తారుమారు చేసిన పండు. సాధారణ కల్తీ పద్ధతుల్లో దాని గుజ్జును ఎర్రగా కనిపించేలా చేయడానికి ఆర్టిషియల్ కలర్‌ను ఇంజెక్ట్ చేయడం, బరువు పెంచడానికి నీటిని జోడించడం లేదా తాజాదనాన్ని కాపాడటానికి రసాయనాలను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరం, కాబట్టి విశ్వసనీయ విక్రేతల నుంచి మాత్రమే పుచ్చకాయలను కొనుగోలు చేయడం సహజ పక్వత సంకేతాలను తనిఖీ చేయడం ముఖ్యంమంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి? పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, రంగు ముఖ్యం. నిస్తేజమైన చర్మం ఉన్న దాని కంటే శక్తివంతమైన, తగిన రంగు కలిగిన పుచ్చకాయ మంచి ఎంపిక. పక్వానికి ముఖ్య సూచిక దానిని తట్టినప్పుడు వచ్చే శబ్దం బోలుగా ఉండే, తేలికపాటి శబ్దం పండు నీటితో నిండి ఉందని మంచిదని సూచిస్తుంది. అదనంగా, ఏవైనా మచ్చలు లేదా గాయాలు ఉన్నాయా అని పుచ్చకాయను తనిఖీ చేయాలి, ఎందుకంటే ఇవి నష్టం లేదా చెడిపోవడాన్ని సూచిస్తాయి. పుచ్చకాయ అడుగున పసుపు మచ్చల కోసం ఉండాలి. అలా మచ్చలు ఉంటే ఈ పుచ్చకాయను సరైన సమయంలో సహజంగా పండించారని అర్ధం. అయితే, లేత లేదా తెల్లటి మచ్చలు ఉంటే పండు పూర్తిగా పక్వానికి రాకముందే కోసినట్లు అర్ధం View this post on Instagram A post shared by Adithya Nataraj 🇮🇳 (@learnwithadithya) (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!)

జపాన్‌లో శాకాహారమా..? సలాడ్లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..
అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్‌వెజ్ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్‌లు స్టోర్స్‌లో దొరికే సలాడ్లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్‌లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్ నటి బర్ఖాసింగ్. ఇంతకీ జపాన్‌లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..జపాన్‌లో ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్. చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్ మెత్తటి చీజ్‌కేక్, కస్టర్డ్ నిండిన పాన్కేక్లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాలీవుడ్ నటి, మోడల్ బర్ఖాసింగ్ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్. View this post on Instagram A post shared by Barkha Singh (@barkhasingh0308) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)
ఫొటోలు


భార్యకు సీమంతం చేసిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)


Miss World 2025: సుందరీమణులకు స్వాగతం


తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)


భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)


మిస్ వరల్డ్ పోటీల విలేకరుల సమావేశంలో నందినీ గుప్తా, సోనూసూద్ (ఫొటోలు)


ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)


మెట్‌గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)


'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)


భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?


గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)
అంతర్జాతీయం

యూఎన్వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు
యూఎన్వో సమావేశంలో పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఉగ్రదాడిని యూఎన్వో తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. లష్కరే తోయిబా ప్రమేయంపై పాక్‌ను యూఎన్వో ఆరాతీసింది. ప్రత్యేకంగా ఒక మతం వారినే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ క్షిపణి పరీక్షలపై యూఎన్వో ఆందోళన వ్యక్తం చేసిందిపహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండా భారత్ చర్యలపైనే ఫోకస్ పెట్టిన పాక్.. సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని భద్రతా మండలిలో ప్రస్తావించింది. భారత్, పాకిస్థాన్ సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. భద్రతామండలిలో భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన పాకిస్తాన్.. భారత్ చర్యలను తప్పు బట్టే ప్రయత్నం చేసింది. ఎలాంటి తీర్మానం లేకుండానే భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది.భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు.సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్‌లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.

స్వచ్ఛందంగా వెళ్లిపోతే వెయ్యి డాలర్లు
వాషింగ్టన్: అమెరికాలో పెద్ద సంఖ్యలో తిష్టవేసిన అక్రమ వలసదారులను బయటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. సొంత దేశాలకు స్వచ్ఛందంగా వెళ్లిపోయే వలసదారులకు వెయ్యి డాలర్ల చొప్పున అందజేస్తామని సోమవారం హోం ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగం ప్రకటించింది. నిర్బంధానికి గురి కావడం, బలవంతంగా వెళ్లగొట్టడం కంటే స్వచ్చందంగా సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ‘సీబీపీ హోమ్’ యాప్ ద్వారా అంగీకారం తెలిపిన వారికి ప్రయాణ ఖర్చులను సైతం చెల్లిస్తామని డీహెచ్ఎస్ తెలిపింది. అమెరికాను వీడే అక్రమ వలసదారులకు ఇదే అత్యుత్తమ, సురక్షిత మార్గమని డీహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోమ్ తెలిపారు.

ఈసారి ‘జెడి’ ట్రంప్!
వాషింగ్టన్: ‘స్టార్‌వార్స్ డే’ సందర్భంగా కృత్రిమ మేధతో రూపొందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఫొటోను అధ్యక్ష భవనం ఆదివారం విడుదల చేసింది. ఈసారి, హాలీవుడ్ సినిమా ‘స్టార్ వార్స్ యూనివర్స్’లోని కండలు తిరిగిన ‘జెడి’ అవతారంలో ట్రంప్ దర్శనమిచ్చారు. రెండు రోజుల క్రితమే దివంగత పోప్ ఫ్రాన్సిస్ ఫొటోతో కనిపించిన ట్రంప్‌పై ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవడం తెల్సిందే. తాజాగా, జెడి ఫొటోను సైతం జనం వదల్లేదు. చౌకబారు రాజకీయ ప్రచారంగా ఎత్తిపొడిచారు. ఆ సినిమాలో శత్రువుల దగ్గర మాత్రమే ఉండే ఎర్ర లైట్ సాబెర్‌ను ట్రంప్ పట్టుకోవడాన్ని తప్పుబట్టారు. గద్దలు, అమెరికా జెండాలు వెనుక కనిపిస్తుండగా జెడి వేషధారణతో కండలు తిరిగిన దేహంతో ట్రంప్ కనిస్తున్న ఫొటోను వైట్‌హౌస్ సోషల్ మీడియా వేదికపై షేర్ చేసింది.

గాజా ఆక్రమణకు పన్నాగం!
టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ సంస్థను సమూలంగా నాశనం చేసి, గాజా స్ట్రిప్‌ను పూర్తిగా హస్తగతం చేసుకొనే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. మొత్తం గాజా భూభాగాన్ని నిరవధికంగా ఆక్రమించే ప్రణాళికకు ఇజ్రాయెల్ మంత్రివర్గం సోమవారం ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం ఓటింగ్ నిర్వహించారు. గాజా ఆక్రమణకు కేబినెట్ సంపూర్ణ అంగీకారం తెలిపింది. ఇద్దరు సీనియర్ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అక్కడి నుంచి ఎప్పుడు ఖాళీ చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే గాజా స్ట్రిప్ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉండిపోయే అవకాశాలు లేకపోలేదు. హమాస్‌ను ఓడించి, బందీలను విడిపించడమే లక్ష్యంగా రంగంలోకి దిగాలని వేలాది మంది రిజర్వ్ సైనికులకు ఇజ్రాయెల్ సైన్యం పిలుపునిచ్చింది. పాలస్తీనా భూభాగంలో అతిత్వరలోనే భీకర స్థాయిలో సైనిక ఆపరేషన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌ను ఖతం చేయాలన్న పట్టుదలతో ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. గాజాను ఆక్రమించడం అంత సులభం కాదంటున్నారు.అమల్లోకి ట్రంప్ ప్లాన్! 40కిలోమీటర్లకుపైగా పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు ఉండే గాజాను ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాలోని పాలస్తీనా పౌరులను ఇతర దేశాలకు తరలించి, గాజాను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. దీనిపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ మిత్రదేశాలు సైతం తప్పుపట్టాయి. ట్రంప్ ప్లాన్‌లో భాగంగానే గాజాను పూర్తిగా హస్తగతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50 శాతం గాజా భూభాగం ఇజ్రాయెల్ అధీనంలోకి వచ్చింది. మిగిలిన ప్రాంతాన్ని సైతం త్వరలో ఆక్రమించబోతోంది. అయితే, గాజా ప్రజలను ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. వారందరినీ దక్షిణ గాజాకు తరలించనున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ కేబినెట్ తాజా నిర్ణయం పట్ల బందీల తీవ్రస్థాయిలో కుటుంబ సభ్యులు మండిపడ్డారు. హమాస్ మిలిటెంట్ల జోలికి వెళితే బందీలెవరూ ప్రాణాలతో మిగలరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాను ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలని కోరుతున్నారు. హమాస్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగా గాజాకు అంతర్జాతీయ మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించడం లేదు.
జాతీయం

ఎస్పీ చొరవతో గ్రామాలకు వలస కార్మికులు
రాయగడ: జిల్లాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ చొరవతో స్వగ్రామాలకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నియమగిరి పర్వత ప్రాంతాల్లోని డండమతి, కన్సూర్, పతలంబ గ్రామాలకు చెందిన అజిత్ సికక, లక్ష్మీ కడ్రక, బినతి సికక అనే ముగ్గురు యవతీ, యువకులు కుటుంబ పోషణ కోసం తమిళనాడులోని కోయంబత్తూరుకు పదిహేను రోజుల క్రితం వెళ్లారు. అక్కడ ఒక వ్రస్తాల దుకాణంలో పనికి చేరారు. అయితే కొద్ది రోజుల తర్వాత వారికి అక్కడ పనులు నచ్చకపోవడంతో పాటు రోజువారీ కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తాము ఇక ఈ కంపెనీలో పనిచేసేది లేదని, తమకు రావాల్సిన కూలి డబ్బులు ఇస్తే స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోతామని యజమానికి చెప్పారు. అయితే అందుకు ససేమిరా యజమాని అంగీకరించకపోవడంతో పాటు వారు పనులు చేయాల్సిందేనని చెప్పేవాడు. రోజురోజుకూ పడుతున్న నరకయాతనను భరించలేని అజిత్ సికక రాయగడలోని ప్రముఖ జర్నలిస్టు బాదల్ కుమార్ థాకు ఫోన్‌చేసి తమ ఇబ్బందులను తెలియజేశాడు. దీంతో స్పందించిన బాదల్ థా జిల్లా ఎస్పీ, కలెక్టర్, జిల్లా కార్మిక శాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ కొయంబత్తూరులోని కార్మిక శాఖ అధికారులతో చర్చించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వలస కార్మికులు సోమవారం తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారంతా జిల్లా యంత్రాంగానికి, ప్రత్యేకంగా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

హ్యాపీ దివాళీ, హ్యాపీ మిడ్ నైట్ సన్‌రైజ్.. పాకిస్తాన్‌పై ఫన్నీ కామెంట్స్
పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 80 మంది చనిపోయినట్టు సమాచారం. ఇక, భారత దళాల దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లో అర్ధరాత్రి కూడా సూర్యోదయంలా కనిపించింది. భారత మెరుపు దాడుల కారణంగా వెలుగులు బయటకు వచ్చాయి.భారత్ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. పహల్గాంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు కూడా కేంద్రం నిర్ణయం, ఈ ఆపరేషన్ పట్ల ధన్యవాదాలు చెబుతున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు మరిన్ని దాడులు చేయాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. Sunrise in Pakistaan at 2am.Credits to INDIAN ARMED FORCES🇮🇳.#OperationSindhoor pic.twitter.com/CecgCPHNrD— BJP Karnataka (@BJP4Karnataka) May 7, 2025ఇదిలా ఉండగా.. భారత దాడుల సందర్భంగా పాకిస్తాన్లో పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అర్థరాత్రి రెండు గంటలకే పాకిస్తాన్లో సూర్యోదయం వచ్చిందని కర్ణాటక బీజేపీ ట్విట్టర్లో ఫన్నీ పోస్టును పెట్టింది. ఇక, పలువురు నెటిజన్లు వీడియోలు ఫోస్టు చేస్తూ దివాళి ముందే వచ్చేసిందనే సినిమా డైలాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.📍Bahawalpur, #Pakistan after #IndianAirStrikes #OperationSindoor #Indi pic.twitter.com/slfSIUuNRo— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) May 7, 2025 Sunrise 2Am in pakistan #OperationSindhoor pic.twitter.com/4CX0VAsS11— ashvani_says (@AshtabThe37483) May 7, 2025 🇮🇳 Indian Govt scheduled a mock drill, but #IndianArmy conducted the drill in Pakistan! #OperationSindoor hits terror camps hard! Jai Hind! Jai Bharat Mata! We are not in danger—WE ARE THE DANGER! 💪 #IndiaPakistanWar #IndianAirForce #Airstrike #OperationSindhoor pic.twitter.com/cle936dCsE— United_Hindu (@Laxmi_Tweets_9) May 7, 2025“So many Nations have Suffered due to terrorism . Terrorism is not a Challenge to a nation , it’s a challenge to humanity” 🇮🇳❤️#OperationSindoor #JaiHind #mockdrills pic.twitter.com/iSLiIQ09de— Tanay (@tanay_chawda1) May 6, 2025Happy Diwali, Pakistan Indian army 🔥Jai Hind 🇮🇳#OperationSindoor pic.twitter.com/grYxrv26WZ— Vishal (@VishalMalvi_) May 6, 2025Is anyone asking for proof of #OperationSindoor?pic.twitter.com/DJi849T4Ah— Vijay Patel (@vijaygajera) May 7, 2025पहलगाम पर भारत का पैग़ाम - छेड़ोगे तो छोड़ेंगे नहीं।प्रधानमंत्री मोदी जी ने कहा भारत की आत्मा पर हमला करने वालो को कड़ी सज़ा मिलेगी।भारत आतंकवाद को उसकी जड़ से उखाड़ फेकने में सक्षम भी है और संकल्प बद्ध भी है।मिटा देंगे आतंकवाद का नासूर - #OperationSindoor pic.twitter.com/JcMHuVBUgY— PANKAJ THAKKAR (Modi Ka Parivar) (@pankajthakkarr) May 7, 2025

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్.. లైవ్
ఢిల్లీ: పాక్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులపై భారత విదేశాంగ, రక్షణ శాఖ బుధవారం ఉదయం సంయుక్తంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందు భారత్‌పై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల తాలూకు వీడియోల్ని విడుదల చేసింది. అనంతరం, ప్రెస్ మీట్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ముందుగా విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందుపై మిస్రీ తర్వాత ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాల్ని వెల్లడించారు. #WATCH | Delhi | #OperationSindoor| Foreign Secretary Vikram Misri says, " A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a Front for UN proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba...Investigations into the Pahalgam… pic.twitter.com/JqpIbHrttN— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్..👉ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్ సిందూర్ 1.05 నిమిషాలకు ప్రారంభమై 1.30కి ముగిసింది9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్‌లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వసం చేశాం అప్జన్ కసబ్కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు.ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు చేశాం 👉విక్రమ్ మిస్రీఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారులష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ఏ ఈ దాడి చేసింది దాడిని సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. టీఆర్ఎఫ్కు పాకిస్తాన్ అండదండలున్నాయి.జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దాడులు చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందిఉగ్రవాదులను చట్టం ముందు శిక్షించాలిముంబై ఉగ్రదాడి తర్వాత దేశంలో పహల్గాం అతి పెద్ద ఉగ్రదాడిభారత్..పాక్‌కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది.ఉగ్రసంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ జరిగిందిగతేడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారుజమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని ,ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేందుకు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిపాక్లో ఉన్న ఉగ్ర సంస్థల గురించి 2023 లో భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్ళిందిపాకిస్తాన్పై దౌత్య పరమైన ఆంక్షలు విధించాంఅయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపలేదుఉగ్రదాడులు చేసిన వారికి పాక్ షెల్టర్ ఇస్తోందిసీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 22, 2025న, పాకిస్తాన్,పాకిస్తాన్ శిక్షణ పొందిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో భారతీయ పర్యాటకులపై దారుణమైన దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది మరణించారు, వీరిలో ఒక నేపాల్ జాతీయుడు కూడా ఉన్నారు. 2008 నవంబర్ 26 ముంబై దాడుల తర్వాత ఇది అత్యధిక పౌర మరణాలతో కూడిన ఉగ్రదాడి. దాడి అత్యంత క్రూరంగా జరిగింది, బాధితులను సమీప నుండి తలపై కాల్చి చంపారు, వారి కుటుంబాల ముందే ఈ హత్యలు జరిగాయి. కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టేలా హత్యలు జరిగాయి, సందేశాన్ని తీసుకెళ్లమని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్లో తిరిగి వస్తున్న సాధారణ స్థితిని అడ్డుకోవడం ఈ దాడి లక్ష్యం. గత సంవత్సరం 23 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించిన ఈ ప్రాంతంలో పర్యాటక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం దీని ఉద్దేశం. ఈ దాడి యూనియన్ టెరిటరీలో వృద్ధిని అడ్డుకుని, పాకిస్తాన్ నుండి సరిహద్దు ఉగ్రవాదానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో జరిగింది. ఈ దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మతపరమైన అసమ్మతిని రెచ్చగొట్టే ఉద్దేశంతో జరిగింది.భారత ప్రభుత్వం,ప్రజలు ఈ కుట్రలను విఫలం చేశారు. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ” (TRF) అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్ అనేది ఐక్యరాష్ట్ర సమితి నిషేధిత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాకు ముసుగు. మే, నవంబర్ 2024లో ఐక్యరాష్ట్ర సమితి 1267 శిక్షణ కమిటీకి భారత్ TRF గురించి సమాచారం అందించింది, ఇది పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు కవర్‌గా పనిచేస్తుందని తెలిపింది. డిసెంబర్ 2023లో లష్కర్, జైష్-ఎ-మహమ్మద్ టీఆర్ఎఫ్ టి చిన్న ఉగ్రవాద సంస్థల ద్వారా పనిచేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఏప్రిల్ 25, 2025 ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి పత్రికా ప్రకటనలో TRF ప్రస్తావనను తొలగించాలని పాకిస్తాన్ ఒత్తిడి చేసింది పహల్గాం దాడి దర్యాప్తులో ఉగ్రవాదులు పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. TRF చేసిన బాధ్యత ప్రకటనలు, లష్కర్-ఎ-తోయిబా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాటిని రీపోస్ట్ చేయడం దీనికి నిదర్శనం. సాక్షుల గుర్తింపు, చట్ట అమలు సంస్థలకు అందిన సమాచారం ఆధారంగా దాడి చేసినవారిని గుర్తించారు. ఈ దాడి ప్రణాళికకర్తలు, మద్దతుదారుల గురించి భారత ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన సమాచారం సేకరించింది. భారత్‌లో సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్ చరిత్ర బాగా డాక్యుమెంట్ చేయబడింది. పాకిస్తాన్ అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరుగాంచింది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తుంది. సజిద్ మీర్ కేసు దీనికి ఉదాహరణ: ఈ ఉగ్రవాదిని మృతుడిగా ప్రకటించి, అంతర్జాతీయ ఒత్తిడి తర్వాత అతను బతికే ఉన్నాడని, అరెస్టు చేశామని తెలిపారు.పహల్గాం దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఏప్రిల్ 23న పాకిస్తాన్‌తో సంబంధాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రాథమిక చర్యలను ప్రకటించింది. దాడి జరిగిన రెండు వారాలు గడిచినప్పటికీ, పాకిస్తాన్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేవలం ఆరోపణలు, తిరస్కరణలతో సరిపెట్టింది. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గుండ్లు మరిన్ని దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ గుర్తించింది.ఆపరేషన్ సిందూర్: ఈ ఉదయం భారత్ తన హక్కును వినియోగించుకుని, సరిహద్దు దాడులను నిరోధించడానికి, నివారించడానికి చర్యలు తీసుకుంది. ఈ చర్యలు నియంత్రిత, అనవసర ఉద్రిక్తత లేని, సమతూకమైన, బాధ్యతాయుతమైనవి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, భారత్‌కు పంపబడే ఉగ్రవాదులను అడ్డుకోవడంపై దృష్టి సారించారు. ఏప్రిల్ 25, 2025న ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి జారీ చేసిన పత్రికా ప్రకటనలో “ఈ దుర్మార్గపు ఉగ్రవాద చర్యకు కారకులు, నిర్వాహకులు, ఆర్థిక సహాయకులు, ప్రోత్సాహకులను జవాబుదారీగా చేసి న్యాయస్థానం ముందు తీసుకురావాలి’ అని నొక్కి చెప్పింది. కల్నల్ సోఫియా ఖురేషీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషీవింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ #WATCH | #OperationSindoor | Terror site Markaz Subhan Allah, Bahawalpur, Pakistan, the headquarters of Jaish-e-Mohammed, targeted by Indian Armed Forces." pic.twitter.com/iM4s91ktb8— ANI (@ANI) May 7, 2025👉ఆపరేషన్ సిందూర్‌లో ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన పాక్ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఇవే ఎల్ఈటీ-లష్కరే తోయిబా,జేఈఎం-జైషే మహమ్మద్, హెచ్ఎం-హిజ్బుల్ ముజాహిదీన్ 1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - ఎల్ఈటీ3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - హెచ్ఎం5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - ఎల్ఈటీ6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - హెచ్ఎం8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - ఎల్ఈటీ9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎం #WATCH | Video shows multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJKCol. Sofiya Qureshi says, "No military installation was targeted, and till now there are no reports of civilian casualties in Pakistan." pic.twitter.com/zoESwND7XD— ANI (@ANI) May 7, 2025

భారత్ విమానాలు కూల్చివేత అంటూ పాక్ ప్రచారం.. నిజమెంత?
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ పేరుతో దాయాది దేశం పాకిస్తాన్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేసింది. ఇక, ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ విజయవంతమైనట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. దాడులపై పాకిస్తాన్ స్పందిస్తూ.. భారత్‌కు చెందిన యుద్ద విమానాలను కూల్చివేసినట్టు దాయాది పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియా పేర్కొంది.ది హిందూ కథనం మేరకు.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా రెండు రాఫెల్ జెట్లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ విజయవంతంగా భారతీయ జెట్లను కూల్చివేసిందని తెలిపింది. అయితే, ఈ వాదనలను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో IAF విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. పాంపోర్, అఖ్నూర్ మీదుగా యుద్ధ విమానాలు డ్రాప్ ట్యాంకులను విసిరాయని భారత రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదంతా ఫేక్ ప్రచారమని తెలిపింది.JUST IN | At least three Indian jets have crashed in Jammu and Kashmir’s Akhnoor, Ramban, and Pampore areas, a government official told The Hindu, @vijaita reports.📸 @Imrannissar2 pic.twitter.com/7St8Fhtl65— The Hindu (@the_hindu) May 7, 2025మరోవైపు.. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత సైన్యానికి చెందిన రెండు స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘ఫ్యాక్ట్ చెక్’ చేసి పాక్ నీచ బుద్ధిని బయటపెట్టింది. ‘పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీదే. ఆ వీడియోలన్నీ పాతవి. భారత్‌కు చెందినవి కూడా కాదు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో 2024లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను, ఐర్లాండ్‌లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను వారు షేర్ చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండండి’ అని కేంద్రం భారత పౌరులకు సూచించింది. Social media posts falsely claims that Pakistan destroyed Indian Brigade Headquarters.#PIBFactCheck ❌ This claim is #FAKE✅ Please avoid sharing unverified information and rely only on official sources from the Government of India for accurate information. pic.twitter.com/9W5YLjBubp— PIB Fact Check (@PIBFactCheck) May 7, 2025
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

కూతురి హత్యకు ప్రతీకారం
మండ్య(కర్ణాటక): గతేడాది జనవరిలో.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ యువతి.. ఆకస్మికంగా హత్యకు గురైంది. అప్పటినుంచి కేసు నడుస్తోంది. ఇంతలో ఆ కేసులో నిందితుని తండ్రి ప్రతీకార హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పౌరుషాల గడ్డ అయిన మండ్య జిల్లా పాండవపుర తాలూకా మాణిక్యనహళ్లిలో మంగళవారం జరిగింది. ఏం జరిగింది? వివరాలు.. నరసింహే గౌడ (55) అనే రైతు కత్తిపోట్లతో చనిపోయాడు. వెంటనే వెంకటేశ్, మంజునాథ్ అనే ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ కూతురు దీపికతో నరసింహేగౌడ కొడుకు నితీష్ కుమార్ చనువుగా ఉండేవాడు. దీపిక కు అదివరకే పెళ్లయి కొడుకు ఉన్నాడు. ఇద్దరూ రీల్స్ కూడా చేసేవారు. గతేడాది జనవరిలో మేలుకోటె కొండ అంచున దీపిక హత్యకు గురైంది. నితీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసు నడుస్తోంది. అప్పటినుంచి ఇరుకుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది. నరసింహేగౌడ తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓ టీ హోటల్ వద్ద అతన్ని కత్తితో పొడిచి చంపారు. తన కూతురి హత్యకు ప్రతీకారంగా వెంకటేష్ ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.

మటన్ పులుసులో కప్ప
అన్నానగర్(తమిళనాడు): పూందమల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలో నావలడి అనే ప్రైవేట్ హోటల్ నడుస్తోంది. ఆదివారం రాత్రి ఈ రెస్టారెంట్‌కి ఓ కుటుంబం భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ బిర్యానీ, మటన్ గ్రేవీ ఆర్డర్ చేసి తింటున్నారు. సిబ్బంది తీసుకొచ్చిన మటన్ పులుసును వారు తినేందుకు ప్రయత్నించగా అందులో పెద్ద కప్ప చనిపోయిందని తెలుస్తుంది. దీంతో షాక్ తిన్న వారు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు ఆహారంలో కప్ప మొత్తం పడి ఉన్న వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సష్టించింది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందింది. ఆ తర్వాత తిరువళ్లూరు జిల్లా ఆహార భద్రత విభాగం అధికారి వేలవన్ నేతృత్వంలో అధికారులు ఘటన జరిగిన హోటల్‌కు వెళ్లి కిచెన్‌లో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత హోటల్‌కు సీల్ వేసి చర్యలు తీసుకున్నారు.

ఓయో రూమ్‌కు తీసుకువెళ్లి.. రహస్య వీడియోలు
సాక్షి,హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధిస్తున్న యువకుడికి నగర షీ–టీమ్స్ బృందాలు చెక్ చెప్పాయి. ఇతడితో పాటు మరికొందరు పోకిరీలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్న యువతిని పట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ యువకుడు (30) ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళతో కొన్నాళ్లు స్నేహం చేశాడు. ఆపై ఇరువురూ కలిసి ఓయో రూమ్‌కు వెళ్లగా... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను రహస్య కెమెరాతో రికార్డు చేశాడు. ఆపై వాటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ మూడు ఆప్షన్లు ఇచ్చాడు. తాను కోరినప్పుడల్లా రావాలని, తనతో సన్నిహితంగా ఉండటానికి మరికొందరు మహిళలను ఏర్పాటు చేయాలని, రూ.లక్ష ఇవ్వాలని చెప్పిన యువకుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ఎట్టకేలకు «ధైర్యం చేసిన ఆ మహిళ షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తూ తనకు ఉన్న నాలుగో ఆప్షన్ చూపింది. నిందితుడిని పట్టుకున్న బృందాలు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి అతగాడికి మూడు రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తన సహోద్యోగులతో కలిసి ఓ వేడుక చేసుకున్నారు. దీన్ని వారికి తెలియకుండా పక్క ఇంట్లో ఉండే ప్లంబర్ (34) రికార్డు చేశాడు. మర్నాడు ఆ వీడియోలు చూపిస్తూ మహిళలను బెదిరించడం మొదలెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని లేదంటే ఆ వీడియోలు ఆన్లైన్లో పెడతానని వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడిని నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే యువతి ఇటీవల ప్రజావాణిలో ఓ ఫిర్యాదు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై లైంగికదాడి చేశారని అందులో పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి ఈ ఫిర్యాదు షీ–టీమ్స్‌కు రాగా.. అధికారులు బాధితురాలిని సంప్రదించి గోపాలపురం ఠాణాకు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న దందా వెలుగులోకి వచి్చంది. పోలీసులనే టార్గెట్‌గా చేసుకుంటున్న ఈ యువతి వివిధ కారణాలు చెప్తూ వారి ఫోన్లు తీసుకుంటుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాలను తన నెంబర్‌కు ఫార్వర్డ్ చేసుకుంటుంది. వీటిని చూపిస్తూ ఆ పోలీసులనే బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే జీహెచ్ఎంసీ వాహనం డ్రైవర్ ఓ మహిళను వేధించారు. చెత్త వెయ్యడానికి వచ్చే ఆమెను చూస్తూ అభ్యంతరకర, అశ్లీల పనులు చేసేవాడు. దీనిపై బాధితురాలు షీ–టీమ్స్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డెకాయ్ ఆపరేషన్ చేసిన అధికారులు సదరు డ్రైవర్‌ను పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ∙ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్న ముగ్గురిని పట్టుకున్న షీ–టీమ్స్ వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయించాయి. ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేటలకు చెందిన యువకులు బాలికల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నారు. ఆపై డబ్బు కోసమో, తనతో సన్నిహితంగా ఉండాలనో బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న షీ–టీమ్స్ నిందితులపై సంబంధిత ఠాణాల్లో పోక్సో కేసులు నమోదు చేయించాయి. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల్ని వేధిస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.

కన్నీటి నిశ్చితార్థం
నిశ్చితార్థం చేసుకుని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి మార్చురీలో శాశ్వత విశ్రాంతి తీసుకుంటోంది. కుమార్తె పెళ్లి గురించి కోటి కలలు కన్న తల్లిదండ్రులదీ అదే దుస్థితి. నిశ్చితార్థం గోరింటాకు ఇంకా ఆరలేదు, అప్పుడే మృత్యువు పంజా విసిరింది. సాగరలో వేడుకను పూర్తి చేసుకుని బాగల్‌కోట జిల్లాలో తమ ఇంటికి వెళ్తుండగా, దారిలోనే ప్రయాణం ముగిసింది. కారు లారీని ఢీకొనడంతో కుటుంబం కడతేరిపోయింది.హుబ్లీ/ శివమొగ్గ(కర్ణాటక): వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కూతురికి నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విధి చిన్నచూపు చూసింది. లారీ– కారు ఢీకొన్న ఘటనలో కాబోయే పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, బంధువుల అమ్మాయి దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి క్రాస్‌లో జాతీయ రహదారిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు... ఈ ప్రమాదంలో విఠల శెట్టి (55), భార్య శశికళ (40), కుమార్తె శ్వేతా శెట్టి (29), కుమారుడు సందీప్ (26), అన్న కుమార్తె అయిన అంజలి (26) దుర్మరణం చెందారు. వీరి స్వస్థలం శివమొగ్గ జిల్లా సాగర వద్ద మూరుకై అనే గ్రామం. బాగల్‌కోటెలోని కులగేరి క్రాస్‌లో హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. సోమవారం శివమొగ్గ జిల్లా సాగరలో శ్వేతకు కుందాపుర యువకునితో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి పెట్టుకుందామని తీర్మానించుకున్నారు. అలాగే సాగరలోనే కొత్తగా కట్టిన ఇంటిలో గృహ ప్రవేశం చేశారు. 8:30 సమయంలో.. రెండు వేడుకలను ముగించుకుని మంగళవారం తెల్లవారుజాము 4 గంటలప్పుడు సంతోషంగా సాగర నుంచి కారులో బయలు దేరారు. సుమారు 8:30 సమయంలో ఘటనాస్థలిలో కారు, అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్తున్న లోడ్ లారీ–వేగంగా ఢీకొన్నాయి. సందీప్ కారును నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ధాటికి కారులోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలి రక్తసిక్తమైంది. ప్రజలు హుబ్లీ గ్రామీణ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. లారీలో చిక్కుకున్న కారు కారు లారీ లోపలికి దూసుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యమైంది. కారు మొత్తం తుక్కయింది. కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని ఎస్పీ బ్యాకోడ పరిశీలించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ కారు అతివేగంగా వచ్చి తన లారీని ఢీకొట్టిందని చెప్పాడు.
వీడియోలు


9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం: ఆర్మీ


YSRCPలో చేరిన APNGO అసోసియేషన్ లీడర్స్


పహల్గాం దాడి అనంతరం ఉగ్ర పాకిస్థాన్ కు ప్రధాని మోదీ వార్నింగ్


Rajnath Singh: ప్రధాని మోదీ నేతృత్వంలో శత్రువులకు సరైన సమాధానం చెప్పాం


Operation Sindoor: భారత్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఉగ్రశిబిర శిథిలాలు


యుద్ధానికి సిద్ధం.. విశాఖలో మాక్ డ్రిల్


ఉగ్ర గుట్టు విప్పారు ఎవరీ సోఫియా, వ్యోమికా?


YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ


YS Jagan: ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య


హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్