
హోసూరు: ఆలయ సిబ్బంది, ప్రసాదం నిర్వాహకుల నిర్లక్ష్యం భక్తులను కలవరపరచింది. హొసూరు కార్పొరేషన్ పరిధిలో వెలసిన ప్రసిద్ధ మరగతాంబ సమేత శ్రీ చంద్రచూడేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంలో పాము పిల్ల వచ్చింది. వివరాలు.. కొండమీద ఉన్న ఆలయానికి నిత్యం వందలాది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుని ప్రసాదాలు కొంటారు.
ఆలయ ప్రాంగణంలో దేవదాయశాఖ ప్రసాదాల దుకాణం ఉంది. మంగళవారం ఓ భక్తుడు పులిహోర ప్రసాదం డబ్బా కొనుగోలు చేశాడు. తెరవగానే అందులో చచ్చిన పాము పిల్ల కనిపించగానే దిగ్భ్రాంతి చెందాడు. భక్తులు కలిసి దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వంట సిబ్బంది వండేటప్పుడు పాము పిల్ల పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.