దేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం | Snake On The Idol Of God In The Temple In Khammam District | Sakshi
Sakshi News home page

దేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం

Jul 4 2021 9:25 PM | Updated on Jul 5 2021 10:33 AM

Snake On The Idol Of God In The Temple In Khammam District - Sakshi

కొణిజర్ల మండలం సాలెబంజర పంచాయతీ పరిధిలోని జంపాలనగర్‌ తండాలోని గిరిజన దేవత మంగ్తూసాథ్‌ దేవాలయంలోనికి శనివారం ఉదయం ఓ పాము వచ్చి దేవత విగ్రహం పై అమర్చిన ఇత్తడి తొడుగుల పైకి చేరింది.

కొణిజర్ల: కొణిజర్ల మండలం సాలెబంజర పంచాయతీ పరిధిలోని జంపాలనగర్‌ తండాలోని గిరిజన దేవత మంగ్తూసాథ్‌ దేవాలయంలోనికి శనివారం ఉదయం ఓ పాము వచ్చి దేవత విగ్రహం పై అమర్చిన ఇత్తడి తొడుగుల పైకి చేరింది. అక్కడ పూజలు చేసేందుకు వచ్చిన స్థానికులను చూసి పడగ విప్పి ఆడింది. పూజారి సుమారు గంట పాటుపూజలు చేసి హారతి ఇచ్చినా పాము అక్కడి నుంచి కదలలేదు. దీంతో దేవునిపాము అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుడికి చేరుకుని పసుపు కుంకుమ వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement