
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మే 3వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ–సీఎస్‌కే జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా, ఇటు ప్రేక్షకులు కూడా రగడకు దిగినట్లు తెలిసింది. ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారుల కుటుంబాలు కొట్టుకున్నట్టు సమాచారం. ఒక ఐపీఎస్ అధికారి, ఐటీ శాఖ కమిషనర్ తమ కుటుంబ సభ్యులతో మ్యాచ్‌ను చూడడానికి స్టేడియానికి వచ్చారు. అధికారుల పిల్లలు సీటు విషయంలో గొడవపడ్డారు. దీంతో అధికారులు, వారి భార్యలు దూషణలకు దిగి కలబడినట్లు తెలిసింది. కబ్బన్ పార్క్ పోలీస్‌స్టషన్‌లో కేసులు పెట్టుకున్నారు.