
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్ కెప్టెన్’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.
ఆర్మీ చీఫ్ ఎక్కడ..?
ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.
పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..
మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.
మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?
పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్ మాజీ సైనాకాధికారి ముషారఫ్.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.
ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు.