Munir
-
ఈ ఉద్రిక్తతలు తగ్గే మార్గం
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపైనే కాకుండా, 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ పై, అది కూడాపంజాబ్ నడిబొడ్డున ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు ప్రారంభించడంతో ఇప్పుడు యుద్ధ ఢంకా గట్టిగా మోగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఒక సైనిక విన్యాస క్రమంలో యుద్ధట్యాంక్ పైకి ఎక్కి, తమపై ఏదైనా భారతీయ ‘సైనిక దురదృష్టకర ఘటన’ జరిగితే, ‘తక్షణ స్పందన’తో దాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. కానీ భారత్ ప్రతిదాడి చేశాక పాక్ ఆర్మీ చీఫ్ ప్రతిష్ఠ దెబ్బతింది.అసీమ్ మునీర్ అన్నట్లుగా, భారత ప్రతి దాడి నిజంగా ‘సైనిక దురదృష్టకర ఘటనా’? ఏ రకంగా చూసినా, అది నిజం కాదు. ఇది చాలా కచ్చితమైన ఉగ్రవాద నిరోధక దాడి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, మన ప్రతిదాడి ఉద్రిక్తతలు పెంచేది కాదనీ, పాక్‌లోని ఏ సైనిక లక్ష్యాన్నీ ‘ఆపరేషన్ సిందూర్’ తాకలేదనీ తెలిపారు. సందేశం స్పష్టంగా ఉంది. పౌరులను, భారత సైన్యాన్ని తాకాలా వద్దా అనే విషయాన్ని పాకిస్తాన్ నిర్ణయించు కోవాల్సి ఉండింది. ఎందుకంటే, భారత్‌లో ఉగ్రవాద శిబిరాలు లేవు. అయినా సరే, పాక్ సైన్యం ఏకంగా భారతీయ నగరాలపై, జనావా సాలపై, విమానాశ్రయంపై నేరుగా దాడికి దిగింది. తర్వాత ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం.జనరల్ మునీర్ దూకుడుపాక్ సైనిక దాడులకు ఒక రోజు ముందే భారత హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ కసరత్తులకు ఆదేశించింది. భారతదేశం పూర్తి యుద్ధానికి సిద్ధమ వుతోందని ఇది సూచిస్తుంది. అయితే, ఇది నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) లేదా నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) వంటి స్వచ్ఛంద సంస్థలను మాత్రమే సమీకరించే రక్షణాత్మక చర్య. జాగ్రత్తగా చేపట్టిన ఈ ప్రయత్నాలన్నింటికీ భిన్నంగా, పాకిస్తాన్ చేపట్టిన సైనిక దాడి ఆ దేశానికి ఏ ప్రయోజనమూ కలిగించలేదు. జనరల్ మునీర్ దూకుడు మీద ఎటువంటి సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగా మతతత్వ రంగు పులుముతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడికిముందు ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 18న జరిగిన ఒక కార్యక్రమంలో ‘రెండు దేశాల సిద్ధాంతం’పై ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం భారతదేశాన్ని రెచ్చగొట్టింది. ఉగ్రదాడిపై గట్టి చర్యకు దిగాలనే దృఢ సంకల్పాన్ని భారత్‌కు కలిగించింది.మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 66 శాతం పెరిగి, తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఎంతోమంది అనుచరు లున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను, ఆ పార్టీ నేతలను పాక్ సైనిక వ్యవస్థ జైలులో పెట్టించింది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌నూ, తన సొంత ప్రజలపై కాల్పులు జరప డానికి నిరాకరించిన మరో జనరల్‌తో సహా మరి కొందరు సీనియర్ అధికారులనూ జైల్లో పెట్టింది. మునీర్ తన ప్రతిష్ఠను తానే చెరుపుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు, ఐఎస్ఐ డీజీగా ఉన్న తనను అమర్యాదగా బయటకు నెట్టివేయడం తనకు జరిగిన ఘోరావమానంగా మునీర్ భావించారు. దాంతో సరైన అవకాశం కోసం చాలా కాలం వేచి ఉండి చివరకు కొరడాను ఉపయోగించారు.బాలాకోట్ సర్జికల్ దాడులు జరిగినప్పుడు పాక్ స్పందన సంయమనంతో ఉండింది. అప్పుడు పాక్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ బాజ్వా పూర్తి భిన్నమైన మనిషి. ఆయన ఇండియాతో వాణిజ్యసంబంధాలను కోరుకున్నారు. కానీ ఇప్పుడు భారత్– పాక్ ఘర్షణ భిన్న స్థాయికి చేరుకుంది.పట్టించుకునే స్థితిలో లేని ప్రపంచంవిస్తృత ప్రాంతీయ సంఘర్షణను రెచ్చగొట్టవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారతదేశానికి సలహా ఇచ్చారు. అలా రెచ్చగొట్టిన పక్షంలో చైనా జోక్యం చేసుకోవచ్చనే హెచ్చరిక దీంట్లో ఉండవచ్చు లేదా ఈ ప్రకటనకు పెద్దగా అర్థం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, అగ్రశ్రేణి దేశాల నాయకత్వంలో ఉన్న గందరగోళం కనివిని ఎరుగనిది. తూర్పున, మాస్కో మరింత దారుణమైన ఇబ్బందుల్లో ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు మద్దతు ఇచ్చిన తర్వాత, తన వైఖరిని కాస్త సవరించి మధ్యవర్తిత్వం అందించడానికి ప్రయత్నించారు. ఇది ఢిల్లీకి ఏమాత్రం నచ్చదని క్రెమ్లిన్ కు తెలుసు. కానీ క్షిపణుల భారీ సమూహాన్ని మనకు రష్యా పంపడం ప్రోత్సాహకరంగా ఉంది. అయితే రష్యన్ సైనిక భుజం ఇప్పుడుఅందుబాటులో లేదు. ఆర్థిక మాంద్యం, తీవ్రమైన అంతర్గతఇబ్బందులతో పోరాడుతున్న యూరోపియన్ యూనియన్ సంయ మనం వహించాలని ప్రకటించింది. ఇజ్రాయెల్, భారతదేశం పట్ల క్రియాశీలంగా, బలంగా సానుభూతి చూపుతున్నప్పటికీ, గాజాలో గందరగోళాన్ని చూస్తే ఇజ్రాయెల్ ఇక్కడ నిర్వహించే పాత్రచాలా తక్కువేనని చెప్పాలి. మొత్తం మీద, ప్రపంచం ఈ యుద్ధాన్ని పట్టించుకునే స్థితిలో లేదు.ఇప్పుడు ఇరు దేశాల సైనిక ఘర్షణను తగ్గించడానికి చైనా ప్రభుత్వం గనక పూనుకుంటే అదొక పరిహాసం అవుతుంది. పాకిస్తాన్లో చైనా ప్రాబల్యం నిస్సందేహంగా ఉందనేది జగమెరిగిన సత్యం. మరోవైపున చైనానే పాకిస్తాన్ యుద్ధానికి నిధులుసమకూర్చే అవకాశం ఉంది. దేశాలు చాలా అరుదుగా హేతుబద్ధంగా వ్యవహరిస్తాయి. అలా సమకూర్చిన నిధులు వేరే విధంగా మళ్లే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరమని ఢిల్లీకి పూర్తిగా తెలుసు. ఇరు దేశాలు ఏం చేయొచ్చు?అయితే, ఇప్పుడు కూడా ఆశ ఉంది. అంగీకరించని నిజం ఏమిటంటే– భారతదేశం, పాకిస్తాన్ తమ సైనిక చర్యల విషయంలో అనేక పాశ్చాత్య దేశాల కంటే గతంలో చాలా పరిణతితో వ్యవహరించాయి. గత మూడు యుద్ధాలలోనూ ఏవీ పౌర లక్ష్యాలపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయలేదు. భారతదేశ క్షిపణి పాకిస్తాన్ ను తాకినప్పుడు, సైన్యం ప్రతిస్పందన సాపేక్షంగా తేలికగా ఉంది. ప్రస్తుతానికి, రెండు వైపులా సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మాట్లాడుతున్నారు. అది ఒక ఆశాజనకమైన సంకేతం. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీమ్ మాలిక్‌ను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియ మించడం కూడా అంతే. రెండు దేశాల నిఘా సంస్థల అధిపతులు మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంటే, అది పెద్ద విషయమే.ఉపఖండం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి రెండు దేశాలు ఉమ్మడి చొరవను ప్రకటించవచ్చు. పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద ప్రేరేపక దేశం అనే ఆరోపణనుపదే పదే ఎదుర్కొంటున్నందున ఇదేమీ అంత అసాధ్యమైనది కాదు. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో సాగేలా లేవు. కాబట్టి, పాత్రధారులు, సూత్రధారులతో సహా ఉగ్ర వాదానికి సంబంధించిన ప్రతిదానినీ దెబ్బతీయడమే ఏకైక ఎంపిక. ఇది ప్రమాదకరం. మొత్తంగా చివరి పాఠం మాత్రం ఇదీ: మీ సొంత యుద్ధాలను మీరే చేసుకోవాలి. ‘ఆపరేషన్ సిందూర్’ ఇప్పుడే దాన్నే తెలియజెప్పింది.-వ్యాసకర్త డైరెక్టర్ (రిసెర్చ్), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ ‘ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-తారా కార్థా -
పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్ కెప్టెన్’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్ మాజీ సైనాకాధికారి ముషారఫ్.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు. -
పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎవరైనా కిడ్నాప్ చేస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. మరి పోలీసులే కిడ్నాప్ చేస్తే. ఎవరిని ఆశ్రయించాలి. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ తీరును, ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేసే ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. భూవివాదాన్ని కోర్టులతో పనిలేకుండా సెటిల్ చేసుకోవాలంటూ ఓ ఉపాధ్యాయుడిని కర్నూలు పోలీసులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి వరకూ బెదిరించి మరీ అతడిని ఇంటికి పంపారు. కిడ్నాపైన ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, అతని భార్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునీర్ అహ్మద్ కర్నూలు వాసి. వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మునీర్ శనివారం స్కూల్లో పాఠాలు చెబుతుండగా.. ఇద్దరు పోలీసులు మఫ్టీలో వచ్చి సీఐ రమ్మంటున్నారని చెప్పారు. హెడ్మాస్టర్కు చెప్పి వస్తానన్నా వినకుండా సెల్‌ఫోన్ లాగేసుకుని అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే.. వెల్దుర్తి స్టేషన్ అని ఒకసారి, డీఐజీ ఆఫీసుకు అని ఇంకోసారి చెప్పి చివరకు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ‘ఏంటి గన్‌తో కాల్చి చంపేస్తారా’ అని గట్టిగా కేకలు వేయగా పోలీసులు అతడి నోరుమూసేశారు. అక్కడ ఓ గదిలో అప్పటికే కొంతమంది వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అప్పటికే అతని సోదరుడు మక్బూల్‌ను కూడా అక్కడికి తీసుకొచ్చారు. అక్కడే మునీర్‌ను ఉంచారు. పక్కన ఉన్న వారిని కొడుతున్న దెబ్బలకు మునీర్ బెదిరిపోయాడు. రాత్రి 11 గంటల తర్వాత సీఐ శేషయ్య వచ్చి భూవివాదం గురించి మాట్లాడి పంపించేశారు. కిడ్నాప్ నేపథ్యంలో మునీర్‌ను ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడి తీసుకెళ్లారో అర్థంకాక అతడి సతీమణి రెహానాబేగం, పాఠశాల హెడ్మాస్టర్ మల్లయ్య వెల్దుర్తి, కర్నూలు త్రీటౌన్ పోలీసుల చుట్టూ తిరిగారు. ఎవరూ స్పందించలేదు. తన భర్త కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు తీసుకోలేదు.అసలు కారణం ఇదీమునీర్ అహ్మద్ కుటుంబానికి కర్నూలు కేంద్రీయ విద్యాలయం సమీపంలో భూమి ఉంది. అన్నదమ్ములు భాగపరిష్కారాలు చేసుకున్న తర్వాత సర్వే నంబర్ 649/2ఏలో 1.17 ఎకరాలు మునీర్ అధీనంలో ఉంది. 1910 నుంచి రికార్డులు ఆ కుటుంబం పేరిటే ఉన్నాయి. 2016లో ధనుంజయ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోనే 6 ఎకరాలు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన సర్వే నంబర్లలోనే మునీర్ అహ్మద్ 1.17 ఎకరాలు కూడా ఉన్నాయని ధనుంజయ్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మునీర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో ధనుంజయ్ అప్పీల్ చేశాడు. ఈ క్రమంలో కోడుమూరు టీడీపీ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మనీశ్ అనే వ్యక్తి కలిసి వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ మునీర్‌ను బెదిరించారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మునీర్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. సెప్టెంబర్‌లో ధనుంజయ్, అతడి తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డిని పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పారు. ఆపై సీఐ మురళీధర్‌రెడ్డి అక్టోబర్ 30న పిలిపించి డీఐజీ, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సెటిల్ చేసుకోవాలని మునీర్‌కు, అతని సోదరుడు మక్బూల్‌కు చెప్పారు. ఆ తర్వాత సీఐ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో మునీర్, మక్బూల్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. ‘భూ వివాదం తెంచుకోవాలి. ఇక్కడ లా ముఖ్యం కాదు. ఇప్పటికే 9 ఏళ్లయింది. మరో పదేళ్లయినా కోర్టులో తెగదు. ఆలోచించుకోండి. ఒక రేటు మాట్లాడుకుని వదిలేయండి. మా సీఐ మీ వాళ్లతో మాట్లాడతారు’ అని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగి వచ్చేశారు. శనివారం పోలీసులు వెళ్లి మునీర్‌ను కిడ్నాప్ చేసి, అర్ధరాత్రి తిరిగి పంపించారు.నన్ను చంపేస్తారునన్ను తీసుకెళ్లిన పోలీసులు గన్‌తో కాల్చి చంపేస్తారని భయపడ్డా. భూ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకూ ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్ రేటు కంటే 30 శాతం తక్కువ ఇచ్చినా వదిలేస్తా. కానీ.. వారు ఇచ్చిందే తీసుకోవాలనేలా మాట్లాడుతున్నారు. మా భూమి మేమెందుకు వదిలేయాలి. నాకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. పోలీసుల తీరు, ధనుంజయ్ తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డి బెదిరింపులు చూస్తే కచ్చితంగా నా కుటుంబాన్ని చంపేస్తారనే భయం కలుగుతోంది. నన్ను చంపినా ఫర్వాలేదు. నా భార్య, బిడ్డలైనా బతికితే చాలు. నేను ముస్లిం కాబట్టే బెదిరిస్తున్నారా అనిపిస్తోంది. – మునీర్ అహ్మద్ -
దృష్టిలోపం ఉన్న వారికోసం అధునాతన ఏఐ కళ్లద్దాలు
లఖీంపూర్‌ఖేరీ(ఉత్తరప్రదేశ్): అజ్ఞానాంధకా రంలో మగ్గిపోతున్న వారికి అక్షరజ్ఞానం పంచితే వారి జీవితం వెలుగులమయం అవుతుందని పెద్దలంటారు. అంధత్వం లేకపోయినా తీవ్రస్థాయిలో దృష్టిలోపంతో బాధపడే వాళ్ల ప్రపంచం ఒక రకంగా చీకటిమయం. వారి ప్రపంచాన్ని వెలుగుమయం చేసేందుకు ఓ యువకుడు బయల్దేరాడు. వినూత్న ఆవిష్క రణలు చేస్తూ తీవ్ర దృష్టిలోప బాధితులకు అండగా నిలబడ్డారు. అధునాతన కృత్రిమ మేధతో పనిచేసే స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించారు. స్మార్ట్ నీళ్లసీసా, నేలసారాన్ని కొలిచే స్మార్ట్ పరికరం తయారుచేసి ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 28 ఏళ్ల మునీర్ ఖాన్ తాజాగా ‘ఏఐ విజన్ ప్రో’ పేరిట కొత్తరకం కళ్లజోడును సృష్టించాడు.ఈనెల 17న ఐఐటీ ముంబైలో జరిగిన టెక్‌ఫెస్ట్‌లో దీనిని ఆవిష్కరించారు. ‘‘ తీవ్ర దృష్టిలోపం ఉన్న వాళ్లు కృత్రిమ మేధతో పనిచేసే ఈ కళ్లద్దాలు ధరిస్తే తమ రోజువారీ పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసు కోవచ్చు. సెన్సార్లు, కెమెరాలు, ఎన్విడి యా జెట్సాన్ ప్రాసెసర్లు, లీడార్ సాంకేతికత, ఏఐ మోడల్ కంప్యూటేషన్లతో ఇది పనిచేస్తుంది. కళ్లద్దాల ముందున్న అంశాలను రియల్‌టైమ్‌లో సంగ్రహించి, ధరించిన వారికి దిశానిర్దేశం చేస్తుంది. ఇది ధరిస్తే ఎదుటి వారి ముఖాలను గుర్తు పట్టొచ్చు. అనారోగ్యం వేళ వేసుకోవాల్సిన మందులు, ఆహారం మధ్య తేడాలను చెప్తుంది. నడిచేటప్పుడు దారిలో అడ్డుగా ఏవైనా ఉంటే హెచ్చరిస్తుంది. చుట్టుపక్కల సమీపంలో ఏమేం ఉన్నాయో చెబుతుంది. ముద్రించిన వాటిని చదివేందుకు సాయపడుతుంది’’ అని మునీర్ చెప్పారు. మట్టిలో మాణిక్యంఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్‌ఖేరీలో గౌరి యా గ్రామం మునీర్ సొంతూరు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మునీర్‌ను పేద రికం వెక్కిరించింది. తను ఏడాది వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. చదువు ల్లో మేటి అయిన మునీర్‌ను ఎలాగైనా చదివించాలని ఆయన తల్లి, నలుగురు అన్నయ్యలు ఎంతో కష్టపడ్డారు. సొంతూరిలో పదో తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలో చదివిన మునీర్ తర్వాత ఇంటర్ మాత్రం ప్రైవేట్‌లో పూర్తిచేశాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని భీమ్టాల్లో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో అడ్మిషన్ సాధించాడు.రెండో ఏడాదిలోనే ఫ్రాన్స్, రష్యాల నుంచి పరిశోధనా ఇంటర్న్‌షిప్‌లను సాధించి ఔరా అనిపించాడు. కృత్రిమ మేధ, సెన్సార్ టె క్నాలజీలపై ఆసక్తితో వాటిలో పరిశోధనలు చేశాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తిచేశాక అమెరికా, భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించేలా క్యాడర్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించాడు. కొలంబియాలో చదువుకునే రోజుల్లోనే హైడ్రోహోమీ పేరిట స్మార్ట్ వాటర్ బాటిల్‌ను తయారుచేశాడు.భారత్‌లో రైతన్నలకు సాయపడేలా మరో అద్భుత ఆవిష్కరణ చేశాడు. నేలసారం ఏ స్థాయిలో ఉందో తెల్సుకునేందుకు పరిశోధనశాలకు మట్టి నమూనాలను పంపాల్సిన పనిలేకుండా చిన్న పరికరంపై మట్టిని ఉంచితే కొద్దిసేపట్లోనే ఆ నేలలోని ధాతువులు, మూలకాల పరిమాణాన్ని, నేలతీరును ఇట్టే చెప్పేస్తుంది. ‘స్మార్ట్ సాయిల్ టెస్టింగ్ డివైజ్’గా అందుబాటులోకి వచ్చిన ఈ పరికరంతో మునీర్ ఈ ఏడాది యువ శాస్త్రవేత్త అవార్డ్‌ను సైతం జూలైలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకున్నారు. -
పాక్ సైన్యానికి కొత్త బాస్
పాకిస్తాన్లో సైనిక దళాల ప్రధానాధికారి పదవి చుట్టూ కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చివరకు ఆ పదవి లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్‌కే దక్కింది. ఈ నెల 29న లాంఛనంగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ పుట్టుపూర్వోత్తరాలూ, తీరు తెన్నులూ గమనించే వారికి దేశాధ్యక్ష, ప్రధాని పదవులకన్నా సైనిక దళాల ప్రధానాధికారి పదవికి అక్కడుండే ప్రాధాన్యత అసాధారణమైనదని ఇట్టే తెలుస్తుంది. రాజ్యాంగంలో రాసుకున్న దానికి భిన్నంగా అత్యంత శక్తిమంతమైన పదవిగా అదెందుకు మారిందో చెప్పటం అంత సులభం కాదు. కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పినట్టు నడుచుకోవటానికి భిన్నంగా దాన్నే శాసించే స్థాయికి సైన్యం రావ టంలో అవినీతి రాజకీయ నేతల బాధ్యతే అధికం. ఆ సంగతలా ఉంచి మూడు దశాబ్దాలుగా సైనిక దళాల ప్రధానాధికారి పదవి ఎంపిక ప్రక్రియ చిన్న చిన్న ఇబ్బందులు మినహా సజావుగానే సాగుతోంది. కానీ ఈసారి మాత్రం పెను వివాదాలు చుట్టుముట్టాయి. లెఫ్టినెంట్ జనరల్ మునీర్‌కు ఆర్మీ చీఫ్ పదవి రాదని కొందరూ, వస్తుందని కొందరూ విశ్లేషణలు చేశారు. ఆయనకు ఆ పదవి దక్కనీయనని ఈమధ్యే మాజీ ప్రధానిగా మారిన ఇమ్రాన్ ఖాన్ ప్రతిజ్ఞలు చేశారు. తమ పార్టీనుంచి ఎన్నికైన దేశాధ్యక్షుడి ద్వారా ఆయన ఎంపికను నిలువరిస్తానన్నారు. కానీ వీటన్నిటినీ దాటుకుని కోటలో పాగా వేయటం లెఫ్టినెంట్ మునీర్‌కి సాధ్యపడిందంటే ఆయనెంత అఖండుడో అర్థం అవుతుంది. పదవీ విరమణ చేయబోతున్న జనరల్ జావేద్ బజ్వా తర్వాత సైన్యంలో అత్యంత సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ మునీరే. ఆ రకంగా ఆ పదవి మునీర్ కే దక్కాలి. కానీ బజ్వా కన్నా రెండు రోజుల ముందు... అంటే ఈ నెల 27తో ఆయన పదవీకాలం ముగియాలి. కానీ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆర్మీ చట్టం కింద ‘దేశ భద్రత’ను కారణంగా చూపుతూ మునీర్‌ను సర్వీసులో కొనసాగించాలని నిర్ణయించింది. ఒకసారి ఆర్మీ చీఫ్ అయ్యాక ఆయన పదవీకాలం మూడేళ్లు పెరుగుతుంది. అప్పటికున్న ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగితే బజ్వా మాదిరే రెండోసారి పొడిగింపు తెచ్చుకుని మరో మూడేళ్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగవచ్చు. ఇలా జరిగే అవకాశం ఉండబట్టే ఇమ్రాన్ మునీర్‌కు మోకాలడ్డారు. సైన్యం కనుసన్నల్లో నడిచే గూఢచార సంస్థ ఐఎస్ఐకి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన కాలంలో మునీర్ తన కుటుంబ ఆస్తుల కూపీ లాగటానికి ప్రయత్నించటమే ఇమ్రాన్ ఆగ్రహానికి కారణం. అప్పట్లో బజ్వాతో తన సంబంధాలు బాగుండటంతో మునీర్‌ను ఐఎస్ఐ నుంచి తప్పించగలిగారు. అలాంటి అధికారి ఆర్మీ చీఫ్ కావటం ఇమ్రాన్‌కు కోపం తెప్పించటంలో వింతేమీ లేదు. సాధారణంగా అయితే పొరుగు దేశం ఆంతరంగిక విషయాలు మనల్ని పెద్దగా ప్రభావితం చేయవు. కానీ పాకిస్తాన్ తీరు వేరు. సైన్యంలో ఉండే లుకలుకలూ, సైన్యానికి పౌర ప్రభుత్వంతో ఉండే విభేదాలూ తరచు భారత్‌కు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఎన్నికైన ప్రభుత్వం మన దేశంతో మంచి సంబంధాలు కలిగివుండాలని వాంఛిం చిన మరుక్షణం ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయటానికి అక్కడి సైన్యం ఎత్తులు వేస్తుంది. ఎల్ఓసీలో అకారణంగా కాల్పులకు దిగుతుంది. దేశంలో భారత్ వ్యతిరేకత ప్రబలేలా చూడటమే ఈ ఎత్తుగడ వెనకున్న లక్ష్యం. దీనికితోడు ఇమ్రాన్‌పై బజ్వా కయ్యానికి కాలుదువ్విన పర్యవసానంగా అక్కడి సైన్యంలో ఇమ్రాన్ వ్యతిరేక, ఇమ్రాన్ అనుకూల వర్గాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ను చిక్కుల్లో పడేసి, ఇమ్రాన్‌కు అధికారం దక్కటానికి సైన్యం తెరవెనక ఎటువంటి పాత్ర పోషించిందో బహిరంగ రహస్యం. బజ్వా తన వ్యక్తిగత విభేదాలతో ఇమ్రాన్‌ను తొలగించటం వల్ల నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహ్‌బాజ్‌ను నెత్తికెక్కించుకోవాల్సి వచ్చిందని సైన్యంలో ఒక వర్గం మండిపడుతోంది. లండన్‌లో మకాం వేసిన నవాజ్ అక్కడినుంచే సలహాలిస్తూ సర్కారును నడిపిస్తున్నారు. బజ్వా మొదటినుంచీ భారత్ వ్యతిరేకి. నవాజ్ మనతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవా లని భావించినప్పుడు దాన్ని వమ్ము చేసిన ఘనుడు బజ్వాయే. ఆ పని కూడా ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాబోతున్న మునీర్‌తోనే చేయించారు. పుల్వామాలో మన జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి మునీర్ ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నప్పుడే చోటుచేసుకుంది. దానికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశం దాడి చేసినప్పుడు మిగ్ యుద్ధ విమానం కూలి పైలెట్ అభినందన్ వర్ధమాన్ అక్కడి సైన్యానికి పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆయనకు హాని జరక్కుండా చూడాలని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ డోవల్ మాట్లాడింది కూడా మునీర్‌తోనే. అయితే ఆయన రావటంవల్ల మన దేశానికి మరిన్ని సమస్యలొస్తాయని చెప్పలేం. మొదట్లో భారత్ వ్యతిరేకిగా ఉన్న బజ్వా చివరికొచ్చే సరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడారు. అందుకు కారణం ఉగ్రవాదులకు సాయం అంది స్తున్న కారణంగా పాక్‌కు రావాల్సిన ఆర్థిక సాయం నిలిచిపోవటం. అది సరిచేసుకుని, అమెరికా మెప్పు పొంది ఎఫ్–16 యుద్ధ విమానాలు రాబట్టడంలో బజ్వా విజయం సాధించారు. అయితే పొరుగున అఫ్గాన్‌లో తాలిబన్ల హవా వచ్చాక తమ ప్రభ వెలిగిపోతుందనుకున్న పాక్ సైన్యం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంతో అయోమయంలో పడింది. తాలిబన్లతో సరిహద్దు వివాదం తప్పటం లేదు. ఈ స్థితిలో మునీర్ రాకవల్ల మనకు కొత్తగా సమస్యలు రాకపోవచ్చు. ఏదేమైనా తగిన జాగ్రత్తలో ఉండటం తప్పనిసరి. -
అమ్మాయి పాటలు రాయడమేమిటని ఆశ్చర్యపోయేవారు!
‘బాలీవుడ్లో పదిమంది పాటల రచయితల పేర్లు చెప్పండి?’ అని అడిగితే ‘పదేం ఖర్మ పాతిక పేర్లు చెబుతాం’ అంటాం. ‘ఫిమేల్ లిరిసిస్ట్‌ల పేర్లు చెప్పండి?’ అంటే మాత్రం నీళ్లు నములుతాం. ఇలాంటి సమయంలో కౌసర్ మునీర్ లాంటి లిరిసిస్ట్‌లను ఒకసారి పరిచయం చేసుకుంటే కొత్తదారి కనిపించే స్ఫూర్తి కచ్చితంగా దొరుకుతుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది కౌసర్ మునీర్. నానమ్మ సల్మా సిద్దికీ ఉర్దూ రచయిత్రి. భాషలోని సొగసు ఏమిటో ఆమె ద్వారా తెలుసుకుంది. నాన్న ఒక ఫిల్మ్స్టూడియోలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్. ఆయన నుంచి మంచి మంచి సినిమాల గురించి తెలుసుకుంది. సినిమాలు చూడడం కంటే అందులో పాటలు వినడం ఆమెకు ఇష్టం. జావెద్సాబ్ పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో! వినగా వినగా పదాల గురించి లోతైన పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి తాను కూడా పాట రాయాలనే తపన మొదలైంది. సినిమాలలో ఎన్నో సందర్భాలను ఊహించుకొని వాటికి తగ్గట్టు పాటలు రాసుకొని మురిసిపోయేది. కాని ఎన్నాళ్లు ఇలా తనకు తాను మురిసిపోవడం! ‘సినిమాలో ఫీల్డ్‌కు వెళ్లి పాటలు రాయాలని ఉంది’ అని తన మనసులో మాటను సన్నిహితుల దగ్గర చెప్పినప్పుడు నవ్వనివారు తక్కువ. ‘డైరెక్టర్ కావాలనుకుంటారు లేదా కొరియోగ్రాఫర్ కావాలనుకుంటారు. పాటలు రాయడం ఏమిటీ!’ అని ఆశ్చర్యపోయేవారు. ఒక టీవీ సీరియల్‌కు అసిస్టెంట్ రైటర్‌గా పనిచేసిన కౌసర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. మరిన్ని సీరియల్స్‌కు అసిస్టెంట్‌గా అవకాశాలు వచ్చినా వాటిని నిరాకరించింది. దీనికి కారణం తన మనసులో కోరిక... పాటలు రాయాలని. డైరెక్టర్ విజయ్‌కృష్ణ ఆచార్యను కలిసి తన మనసులో మాట చెప్పింది. ఇంతకుముందే రచయిత్రిగా తనను తాను నిరూపించుకోవడం వల్ల ఆచార్యను నమ్మించడం పెద్ద కష్టం కాలేదు. అలా ‘తషాన్’ సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది. ‘ఫలక్తక్ ఛల్ సాత్ మేరే ఫలక్తక్ ఛల్ సాత్ ఛల్ యే బాదల్ కీ చాదర్ యే తారోం కీ ఆంచల్’... అనే ఆ పాట అందరినీ ఆకట్టుకుంది. అవార్డ్లు తెచ్చిపెట్టింది. ఇక వెనక్కి తిరిగిచూసుకోనక్కర్లేదు, అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి అనుకుంది. కానీ అదేమీ జరగలేదు. మళ్లీ సినిమా ఆఫీస్ మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. అలా యశ్‌రాజ్ ఫిల్మ్స్ ‘ఇష్క్‌జాదే’లో పాట రాసే అవకాశం వచ్చింది. ‘ఆడియో ఇండస్ట్రీలో స్త్రీలను చిన్నచూపు చూస్తారనేది అపోహ కాదు. వాస్తవం. అలా అని వెనక్కితగ్గితే వారికి బలాన్ని ఇచ్చినట్లవుతుంది’ అంటున్న కౌసర్ మునీర్ బజ్రంగీ భాయిజాన్, డియర్ జిందగీ, సీక్రెట్ సూపర్‌స్టార్, గుంజనా సక్సేనా: ది కార్గిల్ గర్ల్... మొదలైన సినిమాలలో పాటలు రాసి తన బలమేమిటో నిరూపించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి పాటలు రాయాలనుకునే మహిళలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తోంది. -
ఐఎస్ఐ చీఫ్‌గా ఫైజ్ హమీద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను నియమిస్తున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. మునీర్‌ను గుజ్రన్‌వాలా కోర్ కమాండర్‌గా నియమించినట్లు పేర్కొంది. ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లో పనిచేసినట్లు సమాచారం. లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్ రిటైర్ కావడంతో మునీర్‌ను గతేడాది అక్టోబర్‌లో ఐఎస్ఐ చీఫ్‌గా నియమించారు. మామూలుగా ఈ పదవిలో మూడేళ్లు కొనసాగే వీలుంది. కానీ మునీర్ ఎందుకు ముందుగానే తప్పించారనేది వెల్లడికాలేదు. ఇంకా పలువురు ఉన్నతాధికారులకు స్థాన చలనం కల్పించినట్టు పాక్ ఆర్మీ ప్రకటించిదని స్థానిక మీడియా తెలిపింది. -
చీరాల సమోసా చిరుతీపి
ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. సుమారు మూడు దశాబ్దాలుగా చీరాల పేరు మిఠాయికి కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మునీర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది స్వీట్ సమోసా. సమోసా అంటే త్రికోణాకారంలో ఉండేది అనుకుంటే పొరపాటు. పై భాగాన్ని మైదా పిండితోనే తయారుచేస్తారు. ఫిల్లింగ్ మాత్రం ప్రత్యేకంగా జీడిపప్పులు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్లతో తయారుచేస్తున్నారు మునీర్. సమోసాలను ఏరోజుకారోజు తాజాగా తయారుచేస్తారు మునీర్. దోరగా వేయించిన సమోసాలను బెల్లం పాకంలో వేసి చాలాసేపు ఊరిన తరవాత తింటారు. అందువల్ల ఇవి బాగా జ్యూసీగా, తియ్యగా ఉంటాయి.చీరాల సమోసాను మునీర్ స్వయంగా రూపొందించారు. డెబ్భయ్యో పడిలో పడిన మునీర్ తాను యువకుడుగా ఉన్నప్పుడు ఒంగోలులో అరటిపండ్ల వ్యాపారం చేసేవారు. వాటితో పాటు ఆయా ఋతువులలో వచ్చే అన్నిరకాల పండ్లను సుమారు పది సంవత్సరాల పాటు అమ్మారు. ఈ వ్యాపారాలేవీ తన ఆర్థిక ఇబ్బందులను తీర్చకపోవడంతో, చీరాల వెళ్లి, సమోసా వ్యాపారం ప్రారంభించారు.సాధారణంగా తయారుచేసే ఉల్లిపాయ, బంగాళదుంప బదులు, జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ తో స్టఫింగ్ చేసి సమోసా రూపొందించారు మునీర్. ‘‘30 సంవత్సరాల క్రితం చీరాల వచ్చేసి సమోసా వ్యాపారం ప్రారంభించాను. ఆ రోజుల్లో చీరాలలో సమోసాలు తయారుచేసేవారు లేకపోవడంతో నా వ్యాపారం బాగా సాగింది. కొద్ది రోజులకే పోటీ ఎదురైంది. ఆ పోటీ తట్టుకోవడానికి కొత్తగా ఏదైనా కనిపెట్టాలనుకున్నాను. చేతికి దొరకిన వాటితో రకరకాలుగా ప్రయత్నించాను. చిట్టచివరకుఈ ఆలోచన వచ్చింది. సమోసాలో ఇదొక కొత్త ప్రయోగం కావడంతోను, ఇందులో ఉపయోగించేవన్నీ విలక్షణమైనవి కావడంతోను స్వీట్ సమోసా ప్రారంభించిన వెంటనే మంచి ఆదరణ వచ్చింది’ అంటారు మునీర్.భార్య సహాయంతో ఇంటి దగ్గరే తయారుచేసి, వాటిని తోపుడు బండి మీద పెట్టుకుని, సాయంత్రం అవుతుండగా దర్బార్ రోడ్డులోని ఎస్బిఐ ఏటిఎం దగ్గరకు వస్తారు. అమ్మకాలు ప్రారంభించిన రెండు మూడు గంటల లోపే సమోసాలన్నీ అమ్ముడైపోతాయి. స్వీట్ సమోసాకి అంత డిమాండ్ ఉంది. ఇందులో ఉపయోగించే వస్తువుల వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల, ఇప్పటికీ స్వీట్ సమోసా విషయంలో పోటీ లేదు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ సమోసాలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. అందువల్లే ఇవి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మంచి క్వాలిటీతో తయారుచేస్తుండటం వల్ల ఈ సమోసా ధర 7 రూపాయలతో ప్రారంభమై ఇప్పుడు 25 రూపాయలకు పెరిగింది. వీటి గిరాకీ కూడా అలాగే పెరిగింది. ఆర్డర్ల మీద కూడా మునీర్ సమోసాలు సప్లయి చేస్తుంటారు. ఇదంతా ఒంటి చేతిమీదే జరుగుతుంది. తయారుచేసుకున్న సమోసాలను నూనెలో వేయించి తీసాక, సిద్ధం చేసి ఉంచుకున్న బెల్లం పాకంలో వేసి రెండు మూడు నిమిషాలు ఉంచి బయటకు తీస్తాడు. -
సంతానం కోసం శాడిస్టు భర్త నిర్వాకం
-
శాడిస్టు భర్త
►సంతానం కోసం తన తండ్రి, చిన్నాన్నలతో గడపాలని భార్యపై భర్త ఒత్తిడి ►పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు..నిందితుడిపై కేసు నమోదు హైదరబాద్: సంతానం కలగాలంటే తన నాన్న, చిన్నాన్నలతో గడపాలని భార్యను ఒత్తిడి చేసిన యువకుడిపై సంతోష్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..సంతోష్‌నగర్ మోయిన్‌బాగ్‌కు చెందిన మహిళకు(23)కు ఈదిబజార్‌కు చెందిన ముజమిల్ మునీర్(26)తో గతేడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. మునీర్ తల్లిదండ్రులు సౌదీ అరేబియాలో ఉంటుండగా, అతని చిన్నాన్న ముబీనోద్దీన్(45) చంచల్‌గూడలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఈదిబజార్‌కు వచ్చే ముబీనోద్దీన్ వరుసకు కుమారుడైన మునీర్ భార్యపై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు ఈ విషయాన్ని భర్త మునీర్, అత్త, మామలకు దృష్టికి తీసుకెళ్లింది. అయితే వారు అతడిని మందలించకపోగా ఇలాంటి విషయాలు బయట చెప్పుకుంటే పరువు పోతుందని....సంతానం కోసం అతను చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు. బాధితురాలికి ఆమె భర్త మునీర్ అండగా నిలవకపోగా..‘నీకు సంతానం కలగాలంటే తన తండ్రి..లేదా పినతండ్రితో గడపాలని భార్యపై ఒత్తిడి చేయసాగాడు. దీనిని అలుసుగా తీసుకున్న ముబీనోద్దీన్ మరింత రెచ్చిపోయాడు. ఆమె ఫోన్‌కు అసభ్యకర సందేశాలను పంపడమేగాక ఈ నెల 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తప్పించుకుని పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో బాధితురాలు మంగళవారం రాత్రి దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కేసు నమోదు చేసి విచారణ జరపాలని డీసీపీ ఆదేశించడంతో పోలీసులు మునీర్, ముబీనోద్దీన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది భార్య భర్తల గొడవేనని....రాజీ కుదురుతుందంటూ ఇన్స్పెక్టర్ శంకర్ పేర్కొనడం గమనార్హం.