
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం వంతంగా ముగి;సింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మంగళవారం అర్ధ రాత్రి భారత భద్రతా దళాలు ఆర్మీ,నేవీలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి.
ఆపరేషన్‌లో భాగంగా లక్షిత దాడుల్ని అరగంటలోపు నేలమట్టం చేసింది. 9స్థావరాల్లో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్‌కు సారధ్యం వహించిన భారత సశస్త్ర దళాల్లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోల్ని బహిర్ఘతం చేశారు. దీంతో ప్రపంచ మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారులు గురించి చర్చ మొదలైంది.
ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi)
ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలలైన ఆర్మీలోని సిగ్నల్‌కోర్‌కి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ. అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించారు.
ఫోర్స్ 18కు నాయకత్వం
2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళజాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పుణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాల్లో, లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్‌గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం.
పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌లోనూ
ఆమె నేతృత్వంలోని 40-సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు, సంఘర్షణ లేదా సంఘర్షణానంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ (PKOs). ఈ పీకేవో ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. హ్యూమానిటేరియన్ మైన్ యాక్షన్ (HMA) వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలోంచి ఆమెను ఎంపిక చేశారు.
యుఎన్ శాంతి పరిరక్షణలో విశిష్ట అనుభవం
2006లో, యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ (కాంగో) లో మిలిటరీ అబ్జర్వర్‌గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేవోలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు.
సైనిక సేవ ఆమెకు వారసత్వంగా
ఆమె తాత సైన్యంలో సేవలందించగా, ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడింది
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh)
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి.
వ్యోమికా సింగ్ విషయానికొస్తే.. వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్ధం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్‌సీసీలో చేరి, తరువాత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.

చల్లని గాలుల మధ్య నుండి మసక చీకట్ల వరకూ అన్నీ సాహసాలే
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీటాహ్ వంటి హెలికాప్టర్లను నడిపుతూ, జమ్మూ కాశ్మీర్ లోని ఎత్తయిన ప్రాంతాలు నుండి, ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకూ సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరంగ్ (21,650 అడుగుల ఎత్తు) పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత
పహల్గాంలో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో, దేశానికి సమాచారం ఇవ్వడమే కాక, భారత సైన్యం ఇప్పుడు ఎవరిచేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు.