Events
-
సమ్మర్ జోష్..
వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపూ నగరంలోని వినోద వేదికలు, గేమింగ్ జోన్స్ తదితర ఎంటర్టైన్మెంట్ సెంటర్ల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు వేసవి సెలవులు ఉండటంతో కుటుంబ సమేతంగా వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు వినోద వేదికలు, అడ్వెంచర్ గేమ్ సెంటర్లు వినూత్న రీతిలో ఫన్ యాక్టివిటీస్ రూపకల్పన చేయడంతో పాటు అందంగా ఆధునీకరిస్తున్నారు. గేమ్స్, వినోద–విజ్ఞాన కార్యక్రమాలు, సాహస క్రీడలు, ముఖ్యంగా వేసవిలో ఇష్టపడే వాటర్ గేమ్స్ తదితర వేదికలు సమ్మర్ హంగామాకు సంసిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా నగరంతో పాటు నగర శివార్లలోని ఈ కోవకు చెందిన వివిధ హాట్ స్పాట్స్ గురించి తెలసుకుందాం. నగరవాసులను అలరించడానికి ఎన్ని ఎంటర్టైన్మెంట్ వేదికలొచ్చినా.. ఆల్ టైం ఫేవరెట్ మాత్రం ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని సందర్శనీయ ప్రాంతాలను తిలకించడానికి కుటుంబ సభ్యులతో పాటు యువత, చిన్నారులకు ప్రత్యేక గమ్యస్థానాలున్నాయి. అలా హుస్సేన్ సాగర్‌లో బోటింగ్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న థ్రిల్ సిటీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, బిర్లామందిర్, ప్రసాద్ ఐమాక్స్‌లు ఆకర్షిస్తుంటాయి. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వేసవి ఎండలను చల్లబరచడానికి సిద్ధంగా ఉంటుంది. విద్యార్థులకు, యువతకు, పరిశోధకులకు విజ్ఞానాన్ని అందించే ప్రతిష్టాత్మక బిర్లా ప్లానిటోరియం వెరీ స్పెషల్. వీటితో పాటు ఈ మధ్య నిర్మించిన సెక్రటేరియట్, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా, అమరవీరుల స్థూపం, సైక్లింగ్ స్పాట్లు ప్రత్యేకం.ఆనందాన్ని పంచే.. మంచు.. సమ్మర్లో మండే ఎండలకు కాసింత చల్లని వాతావరణం ఉంటే చాలు అనుకుంటాం. అలాంటిది ఏకంగా మంచు ఎడారే నగరంలో పలకరిస్తే ఎలా ఉంటుంది. ఈ అనుభూతిని అందంచడానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్నో సెంటర్లు ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్రాటు చేసిన పెద్ద హాల్స్‌లో మంచు దిబ్బలు, ఐస్ స్కేటింగ్ వంటి వినూత్న కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇలాంటి సెంటర్లు నగరంలోని శరత్ సిటీమాల్, ట్యాంక్‌బండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వీనుల విందు.. విడిది కేంద్రాలు.. నగరంలో ప్రస్తుతం ప్రధాన ఎంటర్టైన్మెంట్ జోన్స్ అంటే రిసార్టులే.. విందు, విడిది, వినోదం, కాలక్షేపం, నైట్ స్టే, వాటర్ గేమ్స్ వంటి సేవలతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ రిసార్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో.. నగరానికి నలుదిక్కులా.. ఇటు శామీర్ పేట్ నుంచి అటు శంషాబాద్ వరకూ.. కొండాపూర్–గచ్చి»ౌలి నుంచి ఎల్బీనగర్ శివారు వరకూ వందల సంఖ్యలో రిసార్టులు ఉన్నాయి. ఈ తరంలో అత్యధికంగా ఔటింగ్ అంటే రిసార్టులేనని నగరవాసులు చెబుతున్నారు.సాహస క్రీడలు, వాటర్ గేమ్స్.. అనుభవాలతో పాటు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ వేదికలైన అమ్యూజ్మెంట్ పార్కులు సైతం నగరంలో ఈ సారి వేసవికి సరికొత్త హంగులతో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఇంటర్స్టెల్లార్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు వర్చువల్ త్రీడీ స్క్రీనింగ్ హాల్స్ అలరించనున్నాయి. ఈ మధ్యనే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అధునాతన సాంకేతికతతో పనిచేసే రైడ్లను ఆవిష్కరించింది. దీంతో పాటు థ్రిల్ సిటీ వంటి సెంటర్లు సైతం అడ్వెంచర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.అరుదైన మొక్కలకు వేదికగా.. ప్రపంచంలోని అరుదైన మొక్కలు, ఇతర వింతలు, విశేషాలతో ఈ మధ్యనే నగరంలో ఆవిష్కృతమైన ఎక్స్పీరియం ఎకో పార్క్ ఈ వేసవికి విద్యార్థులకు మంచి సందర్శనీయ వేదికగా నిలువనుంది. వివిధ రకాల మొక్కలు, అరుదైన వృక్షాలు, పర్యావరణ సంరక్షణతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.గేమింగ్ జోన్స్..నగర మాల్స్.. ప్రస్తుత తరుణంలో నగరం ఎక్కడ చూసినా మాల్స్‌తో నిండిపోయింది. ఒకప్పుడు బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పెద్ద పెద్ద మాల్స్ ప్రస్తుతం అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. మాల్స్ అంటే షాపింగ్ మాత్రమే కాదు.. పిల్లలను పెద్దలను అలరించే ఎన్నో ఫన్ యాక్టివిటీస్, గేమింగ్ జోన్స్ ఇతర కాలక్షేప కేంద్రాలకు నిలయాలుగా మారాయి. ఈ వేసవికి నగరంలోని మాల్స్ సైతం హాట్ స్పాట్లుగా మారనున్నాయి. ఎంటర్టైన్మెంట్ కింగ్.. ట్రెక్కింగ్ వేసవి సెలవులను ఆస్వాదించడానికి ప్రకృతితోపాటు సాహసం తోడైతే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి చక్కని వేదిక ్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ ఎంజాయ్ చేయడానికి నగరవాసులు అనంతగిరి హిల్స్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. పలువురు ట్రెక్కింగ్ నిర్వాహకులు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ ట్రాక్‌తో పాటు పలు సాహస క్రీడలతో మధుర జ్ఞాపకాలను అందిస్తున్నారు. -
మా బీటే సపరేటు..
‘హాయ్ తెలుగు ట్రాక్ ప్లీజ్..’ కొన్నేళ్ల క్రితం ఈవెంట్స్, కేఫ్స్‌లో లైవ్ బ్యాండ్‌ని ఇలా అభ్యరి్థంచిన వ్యక్తిని.. మిగిలిన వాళ్లంతా ఎవరీ ఎర్రబస్సు అన్నట్టు చూసేవాళ్లు, బ్యాండ్ సభ్యులు నోటితో నవ్వేసి నొసటితో వెక్కిరించేవాళ్లు.. ఇదంతా గతం ఇప్పుడు క్లబ్‌లలో అత్యంత క్రేజీగా ఉండేనైట్స్ అంటే టాలీవుడ్ నైట్స్. బ్యాండ్ ఏదైనా సరే, ప్లేస్ ఏదైనా సరే ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, డీఎస్పీ.. మ్యూజిక్‌ని వినిపించాల్సిందే.. తెలుగు ట్రాక్స్‌కి పేరొందిన కొన్ని నగర సంగీత బృందాల విశేషాలివి.. గరంలో తెలుగు లైవ్ మ్యూజిక్కు క్లాప్ కొట్టింది కాప్రిíÙయో. పేరొందిన ట్రాక్‌ల మాషప్లతో వీరు తెలుగు శ్రోతల మనసులు గెలుచుకున్నారు. నేటికీ సిటీ లైవ్ మ్యూజిక్‌ని ఈ బ్యాండ్ శాసిస్తోందని చెప్పొచ్చు. తరచూ తెలుగు సినీ ప్రముఖుల ప్రైవేట్ పారీ్టస్లో వీరు కనిపిస్తారు. దేశ విదేశాల్లోనూ ప్రదర్శనలిచి్చన ఈ బ్యాండ్ ఉరుములు నీ నవ్వులై, యమహానగరి కలకత్తా పురి, మధుర మీనాక్షి.. తదితర తెలుగు పాటలతో పాటు సొంత ట్యూన్స్‌తో ఎనిమిదేళ్లుగా నగర సంగీతాభిమానులను ఉర్రూతలూగిస్తోంది.మా థ్రియరీయే వేరు.. తొమ్మిది మంది సభ్యుల బ్యాండ్ థ్రియరీ, సితార్, తబలా వయోలిన్లతో రాక్ సంగీతానికి భారతీయ హంగులను జోడించడం ద్వారా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. వీరి నుంచి రోజా, బొంబాయి వంటి సినిమాల్లో ప్రసిద్ధ వయోలిన్ ట్రాక్‌లను వినొచ్చు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్యాండ్ తొలుత హిందీ, ఆంగ్ల సంగీతానికి పెద్ద పీట వేసినా.. ఇటీవలే తెలుగు, తమిళ సంగీతాన్ని కూడా అందిస్తోంది. ఫ్యూజన్ సంగీతాన్ని ఇష్టపడేవారికి థియరీ లైవ్ మ్యూజిక్ మంచి ఎంపిక. ఐఎన్సీఏ నుంచి బెస్ట్ లైవ్ యాక్ట్ బ్యాండ్ అవార్డును గెలుచుకోవడంతో పాటు 2018లో నగరంలో జరిగిన బ్రయాన్ ఆడమ్స్ ఈవెంట్లో వేదిక పంచుకోవడం, ఆ్రస్టేలియాలో సంగీత పర్యటన.. వంటివెన్నో వీరిని టాప్ బ్యాండ్స్‌లో ఒకటిగా మార్చాయి.పల్లె మసాలా.. రామ్ మిరియాల.. తెలుగు సినీ గీతాభిమానులకు చిరపరిచితమైన పేరు రామ్ మిరియాల. ఆయన తొలుత బ్యాండ్ చౌరస్తాలో ప్రధాన గాయకుడిగా పేరొందారు. సూపర్ హిట్ ప్రైవేట్ సాంగ్స్ అందించారు. అనంతరం సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సొంత బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ప్రతి వారం నగరంలో ఎక్కడో ఒక చోట ఆయన బృందం ప్రదర్శన ఉంటుంది. డీజే టిల్లూ పేరు.. వీని స్టైలే వేరు.. దండకడియాల్.. వంటి ఆయన ట్రాక్‌లతో పాటు పల్లెదనానికి పట్టం గట్టే అనేక సొంత పాటలను కూడా వినిపిస్తారు. జానపదమిస్తా.. చౌరాస్తా.. గ్రామీణ, తెలుగు జానపదాలతో చౌరాస్తా ధ్వని చాలా ప్రత్యేకమైనది. వీరి సంగీత శైలి హృదయాన్ని తాకుతుంది. రెగె, జానపద, రెట్రో బ్లూస్ రాగాలను వీరి ద్వారా వినొచ్చు. మాయ, ఊరెళ్లిపోతా మామా, లక్ష్మమ్మో తదితర హిట్ సాంగ్స్ వీరి సొంతం. తమ రెగె స్టైల్ ట్రాక్‌లలో గోరేటి వెంకన్న పాటలు సహా ఉత్తేజపరిచే సంగీతానికి జీవం పోస్తారు. ముఖ్యంగా 80ల జానపద సంగీతాన్ని ఇష్టపడే వారికి నప్పే, నచ్చే బ్యాండ్ ఇది పార్టీస్‌కి డెక్కన్.. ‘హైదరాబాద్స్ పార్టీ బ్యాండ్’ అని పేరు తెచ్చుకుంది. డెక్కన్ ప్రాజెక్ట్ ఫంక్, బ్లూస్, రాక్, స్వింగ్ ప్రభావాలను మిక్స్ చేస్తుంది. ఈ బ్యాండ్ సభ్యులు కళాశాల చదువుల నుంచి స్నేహితుల బృందంగా కొనసాగుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే తమ సంగీత కలలను సాకారం చేసుకుంటున్నారు. పెత్తరప్, కుర్రలు, హమ్మా హమ్మా.. ఇంకా ఎన్నో పాటలు వీరు అందిస్తారు. ఏడేళ్ల వయసున్న ఈ బ్యాండ్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం విశేషం. అలాగే రామ్‌చరణ్ ఆస్కార్ పారీ్టలోనూ వీరు మ్యూజిక్ అందించారు. -
డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్టపెట్టెలు
సాక్షి, సిద్దిపేట: తరతరాల నుంచి సంక్రాంతి నోములు నోచుకునే కుటుంబాలూ ఉన్నాయి. సిద్దిపేట, హైదరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పండుగ వేళ.. లలితాదేవి పుస్తకం, శ్రీచక్రం, మంగళగౌరి, పీటమీద పిల్లెన్లు, అరుగు మీద అద్దాలు, లాలి గౌరవమ్మ, డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్ట పెట్టెలు, పల్లకి, బతుకమ్మ, కుంకుమ భరణి, క్యారంబోర్డు, గాలిపటాలు, చరఖాలు ఇలా వందల రకాల వస్తువుల్లో ఏదో ఒకదానితో నోముకుంటారు. గౌరమ్మను పెట్టి పసుపు, కుంకుమ వేసి, ఏవైనా ఒకే రకమైన 13 వస్తువులను పెట్టి బంధువులు, స్నేహితుల ఇంటికెళ్లి వాయనం ఇచ్చి వస్తారు. బాలింతలు, చిన్న పిల్లలు ఉన్నవారు ఉగ్గు గిన్నె, నూనె పావు నోములు నోస్తారు. ఆరునెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాంపండుగకు ఆరు నెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాం. స్టీల్ అయితే మచిలీపట్నం, ఇత్తడి సామాను చెన్నై, ప్లాస్టిక్ వస్తువు లను ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. మా షాప్‌నకు వివిధ జిల్లాలవారు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కొందరు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు. – నార్ల నాగరాజు, నోముల సామగ్రి షాప్ యజమాని, సిద్దిపేట -
బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు
కృష్ణుడు నవ్వడు. తెగ నవ్విస్తాడు. కృష్ణుడు అమాయకంగా కనిపిస్తాడు. కానీ అల్లరల్లరి చేస్తాడు. ‘అయ్ బాబోయ్... మా రాజోలులో ఇలా కాదండీ’ అనేది ‘వినాయకుడు’ సినిమాలో కృష్ణుడి మార్క్ డైలాగ్. కృష్ణుడు నటుడు మాత్రమే కాదు ్రపొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా. ఈ ‘కూడా’కు మరో ‘కూడా’ కలిపితే వంటలు చేయడంలో దిట్ట కూడా! కృష్ణుడు కోనసీమ బిడ్డ. ఉమ్మడి కుటుంబాల విలువ తెలిసిన కృష్ణుడు ఈస్ట్, వెస్ట్ స్పెషల్ పాకుండల గురించి నోరూరించేలా చెబుతాడు. అంతేనా! ‘అయ్ బాబాయ్. మా రాజోలులో అలా కాదండి. ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు ఎలా చేయాలో కూడా చెబుతామండీ’... మరి ఆయన మాటల్లోనే... పాకుండలు, పెద్ద చెగోడీలతో పాటు... తన స్వీట్ ఫ్యామిలీ కబుర్లు...కనుల పండగ చేసే రంగవల్లులే కాదు... సంక్రాంతి అంటే కమ్మని కర కరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ్రపాంతానికి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. పెద్ద పండగ రోజు ఆ కరకరల స్వరాలు వినాల్సిందే. తన సహజ నటనతో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న గీతాభాస్కర్ చేసే సకినాల రుచి ఇంతా అంతా కాదు. కృష్ణుడు అంటే అల్లరి. వెండితెర కృష్ణుడు అంటే నవ్వుల సందడి. కోనసీమ బిడ్డ కృష్ణుడు పాకుండల గురించి చెబితే తీయగా నోరూరాల్సిందే. తమకు ఇష్టమైన వంటకాల గురించి చెప్పడమే కాదు... ఎలా చేయాలో కూడా చెబుతున్నారు గీతాభాస్కర్, కృష్ణుడు. ఆ కబుర్ల కరకరలు... కృష్ణుడు: ట్రెడిషనల్ పిండి వంటలు చేయడం అనేది నాకు చిన్నప్పుడు అలవాటు. మా అమ్మ చేసేవారు. అలాగే మా ఇంట్లో సుబ్బయ్య అని కుక్ ఉండేవారు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. బియ్యం నానబెట్టి, తర్వాత ఆరబెట్టి, దంచేవాళ్లు. నా చిన్నప్పుడు బాగా గుర్తున్నది అంటే ఇదే. ఇప్పుడంటే మిషన్‌లో పిండి ఆడిస్తున్నారు కానీ అప్పట్లో దంచడమే. మన చిన్నప్పుడు మనం తిన్నంత టేస్టీగా ఇప్పుడు ఉండటంలేదు. చిన్నప్పుడు టేస్ట్ చూశాం కాబట్టి మనకు ఆ తేడా తెలుస్తుంది. ఇప్పటి జనరేషన్‌కి ఆ తేడా తెలియదు. అప్పట్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి రోజుకొక ఇంటికి అన్నట్లు వండేవారు. అది చాలా బాగుండేది.మాకు పాకుండలు ఫేమస్మేం ఈ సంక్రాంతికి పాకుండలు చేశాం. మాకు అదే ప్రత్యేకత. ఈస్ట్, వెస్ట్‌లో సంక్రాంతికి పాకుండలు ఫేమస్. విడిగా పెద్దగా చేయరు. ఈ పండగకే చేస్తుంటారు. అరిసెల పిండి ఫార్మాట్లోనే పాకుండల పిండి కూడా ఉంటుంది. బియ్యాన్ని ఓ రోజంతా కానీ 30 గంటలు కానీ నానబెట్టి, పిండి పట్టించుకోవాలి. బెల్లం పాకం పట్టి చేసుకోవాలి. పాకం సరిగ్గా కుదరడానికి కొలతలు ముఖ్యం. నాలుగు గ్లాసుల బియ్యం పిండికి రెండు గ్లాసుల బెల్లం వాడాలి. ఒక అరగ్లాసు నీళ్లు పోసి, పాకం పట్టాలి. పాకుండలలో కొబ్బరి ముక్కలు వేస్తారు. అది టేస్టీగా ఉంటుంది. సంక్రాంతికి అరిసెలు ఉంటాయి కానీ కోనసీమ జిల్లాల్లో పాకుండలనే ప్రిఫర్ చేస్తారు.ఆ మంచు... అదో అందంచిన్నప్పుడు సంక్రాంతి అంటే భోగి మంటలు, హరిదాసులు, ఇరుగుపొరుగు కలిసి పిండి వంటలు వండుకోవడం... ఊర్లో ఇలాంటి సందడి ఉండేది. ఇప్పటికీ ఊళ్లో ఉన్నాయి. కానీ సిటీలో అంత సందడి కనిపించదు. చిన్నప్పుడు ఆ మంచులో భోగి మంటలు వేయడం, హరిదాసులు రావడం, పెద్ద పెద్ద ముగ్గులు చూడటం... అంతా ఓ అందంగా ఉండేది. అదో మంచి అనుభూతి. సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో భోగి మంటలు అవి వేస్తారు కానీ ఊళ్లో ఉన్నంత సందడి ఇక్కడ కనిపించదు. అందుకే చాలామంది పండగలకి ఊరు వెళ్లిపోతుంటారు. నేను కూడా వీలున్నప్పుడల్లా వెళుతుంటాను. మా పాపకి ఆ కల్చర్ తెలియాలని తనని కూడా తీసుకెళుతుంటాను. ఉద్యోగాలు, వ్యాపారాలంటూ సిటీల్లో స్థిరపడుతున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది పండగకి ఊరికి వెళుతుంటారు. అందుకే సంక్రాంతి అంటే అందర్నీ కలిపే పండగ. బయటి ఫుడ్ తినదుమాది లవ్ మ్యారేజ్. మా ఆవిడ (లలితా గాయత్రి) వాళ్లది నిజామాబాద్. ఆ వంటల స్టయిల్ వేరు. ఏ ్రపాంతం రుచి ఆ ్రపాంతానిది. నేను బేసిక్‌గా ఫుడ్ లవర్ని. బాగా వండిన ప్రతిదీ నాకు ఇష్టం. ఇక మా ఆవిడకి కూడా పాకుండలు చేడయం వచ్చు. నిజానికి పెళ్లయ్యాక నేను వంట చేయడం మానేశాను. అయితే అప్పుడప్పుడూ చేస్తుంటాను. ఈ పండగకి నేనే చేశాను... తను పక్కనే ఉండి, కాస్త హెల్ప్ చేసింది. మా పాపకు నచ్చిన పిజ్జా, గార్లిక్ బ్రెడ్ అవన్నీ కూడా చేస్తుంటాను. మా పాప బయటి ఫుడ్ దాదాపు తినదు. ఇంట్లోనే చేసి పెడతాం.పండగకి పెద్ద చెగోడీలూ చేస్తాంసంక్రాంతికి మేం పాకుండలతో పాటు పెద్ద చెగోడీలు చేస్తుంటాం. మా రాజోలులో ఈ చెగోడీలు ఫేమస్. కారపొ్పడితో చేస్తాం. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. ఊరెళ్లినప్పుడుల్లా తింటాను. ఇప్పుడు పాకుండలతోపాటు అవి కూడా వండాను. చెగోడీలకు కూడా బియ్యం పిండినే వాడతాం. ఒక గ్లాసుడు పిండికి ఒక గ్లాసు నీళ్ల రేషియోతో చేయాలి. పచ్చి మిరపకాయలు, అల్లం, జీలకర్ర... మూడూ నూరి, వేడి నీళ్లలో కలిపి, ఉప్పు వేసి, అందులో బియ్యం పిండి వేసి, కలపాలి. ఆ తర్వాత చెగోడీలను లావుగా వత్తి, పెసరపప్పు అద్ది, నూనెలో వేసి వేయించుకోవాలి. -
సాంస్కృతిక సోయగం.. శిల్పారామం..
గచ్చిబౌలి: పల్లె వాతావరణమైన శిల్పారామంలో హరినామస్మరణ, గంగి రెద్దుల విన్యాసాలు, నృత్యకారుల గవ్వల సవ్వడి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాయి. వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులతో సంక్రాంతి శోభ సంతరించుకుంది. జానపద కళాకారులు.. రాజమండ్రికి చెందిన విభూతి బ్రదర్స్ బృందం హరిదాసులు, బుడబుక్కలు, జంగమ దేవర, సోది చేప్పే వేషధారణలతో ఆకట్టుకున్నారు. దాదాపు పది మంది కళాకారులు వివిధ అలంకరణలో సందర్శకులను ఆకట్టుకున్నారు. అంకిరెడ్డి పాలెం, వలిగొండకు చెందిన కళాకారులు గంగిరెద్దుల విన్యాలతో అబ్బురపరిచారు. సాయంత్రం ఆంపిథియోటర్లో కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. మంగళవారం సురభి కారులు ‘మాయ బజార్’ నాటకాన్ని ప్రదర్శిస్తారు. శేరిలింగంపల్లి సురభి కాలనీకి చెందిన దయానంద్ బృంధం, మరికొందరు కళాకారులు కూచిపూడి, భరత నాట్యాన్ని ప్రదర్శిస్తారు. -
తెలుగు ప్రజల జీవనశైలి..
తెలుగు ప్రజల జీవన శైలిలో ప్రత్యేక స్థానం పొందిన పండుగ సంక్రాంతి. ఇది ప్రకృతితో, పంటలతో, కుటుంబ బంధాలతో ముడిపడి ఉంది. సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక. అలాంటి పండుగను ఒక వేడుకలా ప్రతి యేటా హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరపడం ఆనవాయితీ. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సంక్రాంతి వేడుకలను నాగరత్నం నాయుడు ఇక్కడ జరుపుతున్నారు. ప్రకృతికి హానిచేయొద్దు.. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి.. అన్నారు. అందుకే వందల మైళ్లు ప్రయాణం చేసి సొంత ఊర్లకు వెళ్లి అక్కడి సంస్కృతిని పాడుచేయొద్దు. మన ఇంటిని కాపాడుకున్నట్లే.. మన సంస్కృతిని, వ్యవసాయాన్ని, చేతి వృత్తులను, పాడి పంటలను కాపాడుకోవాలి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి సంబరాన్ని చేసుకోవాలి. ఈ క్రమంలో ప్రకృతికి హానిచేయొద్దు. ఇటీవల కాలంలో జూదాలపై ఆసక్తి పెరుగుతోంది. వాటితో జీవితానుల పాడుచేసుకోవద్దు. ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతే మనల్ని పది కాలాల పాటు జీవించేలా చేస్తుంది. – గొట్టిపాటి సత్యవాణిసంప్రదాయాలు మర్చిపోకుండా.. మూడేళ్ల నుంచి మా ఫామ్ హౌస్‌లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. అందుకే ఫామ్‌లో అన్ని రకాల పంటలూ పండిస్తాం. దీంతో పాటు యేటా నిర్వహించే సంక్రాంతి వేడుకలకు సాధారణ ఎంట్రీ ఫీజునే వసూలు చేస్తున్నాం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం.. కాబట్టి.. ఆ ఖర్చులను పార్టిసిపెంట్స్ భరిస్తుంటారు. నేను కేవలం బియ్యం, కూరగాయలు అందిస్తుంటాను. మిగతా ఖర్చంతా ఔత్సాహికులైన యువకులు పెట్టుకుంటారు. ముగ్గుల పోటీలు, ఎడ్లబండ్ల పోటీలు, టగ్ ఆఫ్ వార్ లాంటి పోటీలు నిర్వహించి మన సంస్కృతి పట్ల ఇప్పటి యువతకు అవగాహన కల్పిండమే నా సంకల్పం. ఆ ప్రయత్నంలో నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందుతున్నా.. అందరికీ సంక్రాంతి ఒక ఎమోషన్ అవ్వాలనేదే నా ఆకాంక్ష. – నాగరత్నం నాయుడు,ప్రోగ్రెసివ్ ఆర్గానిక్ ఫార్మర్ఏడాది కష్టాన్ని దూరం చేసే వేడుక.. మాది మణికొండలోని కళాకృతి డాన్స్ ఇన్స్టిట్యూట్. మా పిల్లలు డీ షో వంటి పెద్ద షోస్‌లో పాల్గొన్నారు. నేను డాన్స్ కోరియో గ్రాఫర్ని. బంగారి బాలరాజు, ఉత్తర, అసలేం జరిగిందంటే వంటి చిత్రాల్లో, రాములమ్మ సీరియల్ల్ హీరోయిన్గా నటించాను. తమిళ్ చిత్రాల్లోనూ నటించా. మనది వ్యవసాయ కుటుంబం. ఏడాది పాటు సాగులో పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిన సందర్భంగా ఈ పండుగ చేసుకుంటాం.. మన సంస్కృతిని మర్చిపోకూడదు. అందుకే ఇలాంటి వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. – కరొన్య కాథరిన్, సినిమా నటిఈ ఫామ్‌తో మంచి అనుబంధం ఉంది.. నేను రిటైర్డ్ పోలీస్ అధికారిని. మాకు పెద్దపల్లిలో ఫార్మ్ ఉంది. ముప్పై ఎకరాల్లో హార్టీ కల్చర్ చేస్తున్నాను. ఈ ఫామ్‌ని మూడు నాలుగు సార్లు విజిట్ చేశాను. ఇక్కడ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇక్కడకి చాలా మంది రైతులు వస్తుంటారు. ఈ ఫార్మ్ దాదాపు 25 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో మేము భాగా ఎంజాయ్ చేశాం. ఇక్కడికి నేనొక్కడినే వచ్చాను. నాకు ఈ ఫామ్‌తో మంచి అనుబంధం ఉంది. – చిట్టిబాబు, రిటైర్డ్ పోలీసు అధికారి -
ఫెస్ట్@ ఫామ్..
సంక్రాంతి తెలుగుదనానికి, స్వచ్ఛమైన పల్లె వాతావరణానికీ ప్రతీక. అందమైన రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. భోగిమంటలు.. స్వచ్ఛమైన పిండివంటలు.. హరిదాసు పాటలు.. గంగిరెద్దుల విన్యాసాలతో వెల్లివిరిసే ఆనందోత్సాహాలతో సందడిగా జరుపుకుంటాం.. ఇలాంటి అందమైన వేడుకకు పల్లెను మించిన వేదిక మరొకటి ఉండదు. అందుకే నగరవాసులు ప్రతి పండుగకూ పల్లెకు పయనమవుతారు. సంవత్సరం పొడవునా చేసుకొనే రొటీన్ వేడుకలకు ఇది భిన్నం.. అయితే ఇటీవలి కాలంలో.. పల్లెకు వెళ్లలేని వారు ఫామ్‌హౌస్‌లలో సంక్రాంతి సంబరాలకు కుటుంబ సమేతంగా తరలివెళ్తున్నారు. దీంతో నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు సంక్రాంతి సందడికి వేదికవుతున్నాయి. బంధువులు, స్నేహితులతో కలిసి సంక్రాంతి విడిది కేంద్రాల్లో సరదాగా సేదదీరుతున్నారు. దీంతో నగర శివారులోని సిద్ధిపేట్, గండిపేట్, చేవెళ్ల, వికారాబాద్, కడ్తాల్ వంటి ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లలో సంక్రాంతి సందడి నెలకొంది..ఆ విశేషాలు.. సంక్రాంతి అంటే సరదగా సాగే వేడుక.. బంధువులు.. పిండి వంటలు.. ఆటలు.. పాటలు.. ముచ్చట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి.. ఓ రకంగా సంక్రాంతి సంబరాలు అంటే అంబరాన్ని తాకేలా ఉంటాయి.. దీంతో ఒత్తి జీవనానికి అలవాటుపడిన నగరవాసులు కనీసం రెండు మూడు రోజులు నగరానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.. అందుకే ‘భోగి రోజు కంటే ముందే ఫామ్‌హౌస్‌కు చేరేవిధంగా ప్లాన్ చేసుకున్నాం’.. అని ఉప్పల్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు. తెల్లవారు జామున నిద్రలేచి భోగిమంటలు వేసుకొని, అందమైన ముగ్గుల నడుమ వేడుకలు చేసుకోవడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ తరహా వేడుకలు జరుపుకునే వారికోసం నగర శివారులోని ఫామ్ హౌస్‌లు వేదికలుగా మారుతున్నాయి.సకల సదుపాయాలు.. రోజుకు కనిష్టంగా రూ.3000 నుంచి గరిష్టంగా రూ.10,000 వరకూ అద్దెకు ఫామ్‌హౌస్‌లు లభిస్తున్నాయి. ఇందులో స్విమ్మింగ్ పూల్స్, క్రీడా ప్రాంగణాలు, కేర్‌టేకర్ వంటి హై సెక్యూరిటీతో సకల సదుపాయాలూ కలి్పస్తున్నారు. దీంతో ఇటీవల పల్లె వాతావరణాన్ని ఇష్టపడే వారు ఈ ఫామ్ హౌస్‌ల కేంద్రంగా వేడకలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగి యజమానులు అద్దెలు పెంచడం గమనార్హం.పతంగుల పండుగ.. సంక్రాంతి పండుగ రైతులకు ఎంత ముఖ్యమైనదో.. పిల్లలకూ అంతే ప్రధానమైనది. కాంక్రీట్ అరణ్యంలా మారిన నగరంలో పతంగులు ఎగరేయడం ఓ సవాల్. దీంతో విశాలమైన మైదానాలు, భవనాలపై నుంచి పతంగులు ఎగరేస్తారు. ఇది పూర్తి స్థాయి ఆనందాన్ని కలిగించదు.. అందుకే ఫామ్ హౌస్‌లలో పతంగుల పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విశాలమైన పొలాలు, పచి్చక బయళ్లలో పిల్లలు గంటలతరబడి పతంగులతో కాలం గుడుపుతారు.. ‘పిల్లలకు ప్రకృతి, వ్యవసాయం, ఆహార ఉత్పత్తి గురించి తెలియజెప్పాలి. అందుకే ఫామ్ హౌస్‌లను ఎంపిక చేసుకున్నాం’ అని ఈసీఐఎల్‌కు చెందిన చంద్రశేఖర్ చెబుతున్నారు. ‘రియల్’ సంస్థల ప్రత్యేక ఏర్పాట్లు.. నగవాసుల ఆసక్తి, అభిరుచిని గుర్తించిన ‘రియల్’ సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వెంచర్లో కొంత స్థలాన్ని పండుగ వాతావరణం ఉట్టిపడేవిధంగా డిజైన్ చేసి అద్దెకు ఇస్తున్నారు. ఇటు వెంచర్లకు ప్రచారం.. అటు ఆదాయం రెండూ సమకూరుతున్నాయి. తద్వారా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్మెంట్లలో ఉండే నగరవాసులు ఫామ్‌హౌస్ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. -
రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్
సాక్షి, సిటీబ్యూరో: పర్యాటక నిలయంగా ప్రసిద్ధి చెందిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు నూతన సంవత్సర కానుకగా జనవరి 2 నుంచి 13 వరకూ ఉద్యాన్ ఉత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన ఈ కార్యక్రమం వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన పుష్పాలు, ఇతర ప్రదర్శనలకు వేదిక కానుందని, ఉద్యానవన స్పృహను పెంపొందించేందుకు రాష్ట్రపతి నిలయం పరిపాలనాధికారి రజనిప్రియా శనివారం వెల్లడించారు. మొదటి సారి నిర్వహించే ఈ ఉద్యాన్ ఉత్సవ్ పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని, ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతుందని చెప్పారు. సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్, గార్డెనింగ్ టూల్స్, గార్డెన్ డెకర్, హారీ్టకల్చర్ డోమైన్లు ఉంటాయని, ఇందులో 50 స్టాళ్ళతో గ్రాండ్ ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద, గిరిజన ప్రదర్శనలు, వంటకాలు, ఇంటరాక్షన్ సెషన్లు ఉంటాయని తెలిపారు. పలువురు ఎగ్జిబిటర్లు, ప్రభుత్వ, కమ్యూనిటీ సంస్థలు, ఎన్జీవోలు, ప్రైవేటు కంపనీలు భాగాస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఒడిశ్సా శంఖ్ వదన్ నృత్యం, మధ్యప్రదేశ్ యుద్ధ కళ నృత్యం వంటి ప్రదర్శనలు ఉన్నాయని, సందర్శకులకు ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు. -
లీలా వినోదం..
ఎప్పటిలానే మన గ్లామర్ సిటీ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు వేదికలు రెడీ అయ్యాయి. ఇందులో లైవ్ మ్యూజిక్ సెటప్‌లు, సెలిబ్రిటీ గెస్టులు వంటి ఇతర వినోద కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి. నగర యువత ఈ వేడుకలను ఎక్కడెక్కడ చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లాన్లు చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే పలువురు బుక్ మై షోలో పాస్‌లు రిజిష్టర్ చేసేసుకున్నారు. వీరి ఆసక్తి, ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నిర్వాహకులు సైతం తమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విశేషాలు.. ఇప్పటికే నగరంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు యువత సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని థీమ్స్‌ను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు. ముఖ్యంగా సినీ తారలు, ప్రముఖ సింగర్స్, డ్యాన్సర్స్.. ఎవరు ఎక్కడ హాజరవుతున్నారనే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న డీజే స్పెషలిస్టులు, లైవ్ మ్యూజిక్ స్పెషలిస్టులు వారి ప్రోమోలను వదులుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో లైవ్ బ్యాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్లకు బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు కొన్నింటికి ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టడం విశేషం. స్టార్ గ్లామర్ ఈవెంట్స్.. వేడుకలు ఏవైనా సరే... అందులో గ్లామర్ ఉంటేనే వినోదమైనా, ఉల్లాసమైనా. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ వేడుకల నిర్వహణలో సెలిబ్రిటీలను భాగం చేస్తున్నారు నిర్వాహకులు. సాధారణంగా ఇటువంటి ఈవెంట్స్‌లో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే నగరంలో పలు వేదికల్లో గ్రాండ్‌గా నిర్వహించే లైవ్‌మ్యూజిక్ కాన్సర్ట్‌లు, పబ్, రిసార్ట్, ఓపెన్ ఏరియా ఈవెంట్లలో పలువురు సినీతారలు, సింగర్లు తళుక్కున మెరవనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ నటి శ్రీలీల, గాయకులు సునీత, రాకింగ్ సింగర్ రామ్ మిరియాల, తదితర టాలీవుడ్, బాలీవుడ్ సింగర్స్ నగరంలో ప్రేక్షకులకు తమ గాత్రంతో అలరించనున్నారు. డీజేల సందడి.. నూతన సంవత్సర వేడుకలకు సినిమా గ్లామర్ తోడైతే ఆ కిక్కేవేరబ్బా అంటోంది నగర యువత. తమకు నచి్చన భాష, హీరోల సినిమా పాటలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. తెలుగు లైవ్ కాన్సర్ట్స్‌కు ఎక్కువ మంది మొగ్గుచూపుతుండగా, ఉత్తర భారతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారు మాత్రం హిందీ, ఇంగ్లి‹Ùకార్యక్రమాలను కోరుకుంటున్నారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు సైతం అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిపుణులైన డీజే ఆర్టిస్టులకు డిమాండ్ నెలకొంది. సాయంత్రం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.‘నై’ వేడుకల్లో శ్రీలీల... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు అప్పుడే గ్లామర్ వచ్చేసింది. ఆల్వేస్ ఈవెంట్స్, ఎస్వీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నగరంలోని నోవోటెల్ వేదికగా నిర్వహించనున్న నై (ఎన్‌వైఈ) 2025 వేడుకల్లో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ శ్రీలీల తన స్టెప్పులతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌ను శుక్రవారం నోవాటెల్ వేదికగా ఆవిష్కరించారు. ఇందులో ప్రముఖ యాంకర్ రవి, నటి సౌమ్య జాను పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు సుమంత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లైవ్ మ్యూజిక్, కలర్‌ఫుల్ వేదికతో పాటు టాప్ మోడల్స్‌తో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోతో నై (ఎన్‌వైఈ) 2025 వేదిక కానుందన్నారు. నిరావల్ లైవ్ బ్యాండ్ నగరానికి ప్రత్యేకంగా రానుందని, వేడుకల్లో ప్రముఖ సినీతార శ్రీలీల పాల్గొని అలరించనున్నారని తెలిపారు. ప్రత్యేకమైన ఎస్ఎఫ్ఎక్స్ ప్రదర్శనలతో, న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌తో పాటు విభిన్న రుచుల ఆహారం, ప్రీమియం డ్రింక్స్, టాటూ, ఫొటో బూత్‌లు అందుబాటులో ఉంటాయని సహ నిర్వాహకులు వినోద్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు సెలిబ్రిటీలు ఇందులో భాగం కానున్నారని అన్నారు. నగరంలో పలు కార్యక్రమాలు..⇒ హెచ్ఐసీసీ నోవోటెల్లో నూతన సంవత్సర వేడుకలకు ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరుకానున్నారు. లైవ్ బ్యాండ్, డ్యాన్స్, బాలీవుడ్ డీజే, మ్యాజిక్‌షో, కిడ్స్ జోన్, ఫ్యాషన్ షో, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఈవ్’ పేరిట రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాటలు ఉంటాయి. ⇒ ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్‌లో రామ్ మిరియాల బ్యాండ్ అమృతం ‘ది ప్రిజమ్ సర్కస్ 4.0’ కార్యక్రమన్ని ఏర్పాటు చేస్తున్నారు. ⇒ ఎల్బి నగర్ ఇండోర్ స్టేడియంలో యూబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాండ్ కాప్రిసియోని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. సంగీతం, ఎనర్జీ, ఉత్సాహంతో కూడిన విద్యుత్ వెలుగుల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చార్ట్–టాపింగ్ హిట్లు, హై–ఎనర్జీ పెర్ఫార్మెన్స్ల మిక్సింగ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ⇒ బోల్డర్ హిల్స్‌లోని ప్రిజమ్ ఔట్ డోర్స్‌లో ప్రముఖ సింగర్స్ కార్తీక్, సునీత హాజరవుతున్నారు. ⇒ హైటెక్స్ ఎరీనాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 (ఓపెన్ ఎయిర్) కార్యక్రమానికి నేహ ఆర్ గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. -
రాష్ట్రపతి నిలయం చూసొద్దాం రండి
దేశ ప్రథమ పౌరుడు/పౌరురాలి దక్షిణాది అధికారిక నివాసం.. నగరంలో బ్రిటిష్ పాలనకు కేంద్రంగా కొనసాగిన రెసిడెన్సీ భవనం.. వీఐపీలు మినహా సామాన్యులకు ఎలా ఉంటుందో తెలిసేది కాదు. ప్రతి సంవత్సరం కేవలం వారం రోజులు మాత్రమే సామాన్యులకు సందర్శనకు అవకాశం ఉండేది.. కానీ ప్రస్తుత రాష్ట్రపతి ఆదేశాలతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సామాన్యులకు అందుబాటులోకి వచి్చంది. రాష్ట్రపతికి దక్కే రాజ¿ోగాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతోటలు, వందల ఏళ్ల నాటి మర్రి చెట్లు, ఎండ ఆనవాళ్లు కూడా కానరాని పండ్ల తోటలు, మయూరాల కిలకిలారావాలు.. అలనాటి వ్యవసాయానికి కేంద్ర బిందువులైన మోట, మెట్ల బావులు.. గత రాష్ట్రపతులు వాడిన గుర్రపు బగ్గీ, వింటేజ్ బెంజీ కారు.. ఇలా చెప్పకుంటూ పోతే రాష్ట్రపతి నిలయం విశేషాలు ఎన్నెన్నో.. రాష్ట్రపతి విడిది చేసే ప్రత్యేక గదులు, మీటింగ్ హాల్స్, ప్రత్యేకంగా వంటచేసే కిచెన్, కిచెన్ నుంచి రాష్ట్రపతి ప్రధాన విడిది భవనానికి ఆహారాన్ని తీసుకెళ్లే సొరంగ మార్గం.. వాటితో పాటు ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం వేళలో సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు విహార అనుభూతి కల్గుతుంది. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం సామాన్యుల సందర్శనకు తాత్కాలిక బ్రేక్ పడగా, మళ్లీ అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంపై ప్రత్యేక కథనం.. మూడో అధికారిక నివాసం.. భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు మరో రెండు అధికారిక నివాసాల్లో ఒకటి షిమ్లాలోని ‘ది రిట్రీట్ బిల్డింగ్’ కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ‘రాష్ట్రపతి నిలయం’ మూడోది. ఈ భవనం నిజాం నజీర్ ఉద్–దౌలా హయాంలో 1860లో నిర్మితమైంది. బొల్లారంలోని 97 ఎకరాల సువిశాల స్థలంలో 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన భవనం ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలోని చీఫ్ మిలటరీ ఆఫీసర్ నివాస స్థలంగా వినియోగించే ఈ భవనాన్ని రెసిడెన్సీ హౌజ్‌గా వ్యవహరించేవారు. 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం రాష్ట్రపతి దక్షిణాది తాత్కాలిక నివాసంగా మారింది. ఏడాది పొడవునా అనుమతి గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం రెండు లేదా మూడు వారాల పాటు మాత్రమే సాధారణ పౌరులకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఉండేది. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హయాంలో నిత్యం ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వారాంతాల్లో రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. విద్యార్థుల సందర్శనకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నెల 29 నుంచి రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ పేరిట పక్షం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 20 గదులు, సొరంగ మార్గం.. రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనం ప్రెసిడెంట్స్ వింగ్, ఫ్యామిలీ వింగ్‌తో పాటు ఏడీసీ వింగ్ పేరిట మూడు విభాగాలుగా ఉంటుంది. ఇందులో డైనింగ్ హాలు, దర్బార్ హాలు, మార్నింగ్ రూమ్, సినిమాల్ సహా మొత్తం 11 గదులుంటాయి. ప్రధాన భవనానికి కొంత దూరంలో ఉండే కిచెన్ ద్వారా ఆహారాన్ని డైనింగ్ హాలుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సొరంగ మార్గం ఉంది. రాష్ట్రపతి ప్రధాన నివాస భవనంతో పాటు మరో 150 మంది వరకు సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక వసతి సముదాయం ఉంది. రకరకాల పూలమొక్కలతో పాటు పండ్ల తోటలు ఉన్నాయి. 116 రకాల సుగంధ, ఔషధ మొక్కలతో కూడిన ప్రత్యేక హెర్బల్ గార్డెన్ ఈ ఆవరణలో ఉంది. మూడు మంచినీటి బావులు కూడా ఉన్నాయి. -
కొత్త ఉత్సాహం..!
కొత్త సంవత్సరం రాబోతోంది.. దీంతో నగర యువత కొత్త ఉత్సాహంతో పార్టీ ఎందుకుండదు పుష్పా.. ఉంటుంది అంటున్నారు. పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు.. ఎక్కడైతేనేం న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు యువత, ఐటీ ఉద్యోగులు సిద్ధమైపోయారు. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలిబ్రిటీలతో ఈవెంట్లు, విందులు.. వినోదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..ఈసారి డిసెంబర్ 31న ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఐదారుగురు బృందంగా ఏర్పడి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పారీ్టల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకొని పార్టీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు అసలే ఉండవనేది వారి వాదన. దీంతో పాటు పార్టీ జోష్‌ను మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎంజాయ్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం.ఈ వెంట్స్‌కి ఫుల్ డిమాండ్.. షామీర్పేట, శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్, కీసర వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్, రిసార్టులు ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో మిగిలిన వ్యక్తిగత గృహాలకు సైతం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని, ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ కనీసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉండొచ్చని అంచనా. సాధారణ రోజుల్లో ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో రోజుకు ఒక్క గది అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. న్యూ ఇయర్‌కు మాత్రం రూ.50 వేలపైనే చెబుతున్నారు.అద్దెకు విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువలో నిర్మితమైన విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. గతేడాతితో పోలిస్తే 20–30 శాతం అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ చెబుతున్నాడు. భారీగా అద్దెలు రావడంతో విల్లాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలూ భారీగానే ఏర్పాటయ్యాయని, అయినా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పోలీసు నిబంధనలివే.. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేయకూడదు. వేడుకలకు హాజరయ్యే వారి గుర్తింపు కార్డులు, వివరాలను నమోదు చేయాలి. సీటింగ్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదు. కపుల్స్ కోసం నిర్వహించే పార్టీల్లో మైనర్లను అనుమతించకూడదు. డీజేలు కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధన ప్రకారం 45 డిసెబుల్స్ కంటే తక్కువ సౌండ్స్ ఉన్న పరికరాలును మాత్రమే వినియోగించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాలతో పాటు ప్రాంగణం ముందు ఉన్న రహదారిలో 50 అడుగుల దూరాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అసభ్యకరమైన దుస్తులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించకూడదు. పురుషులతో పాటు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అనుమతులు తప్పనిసరి.. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. లిక్కర్ సరఫరా చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆబ్కారీ శాఖ అనుమతులు కూడా ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే ఈవెంటర్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఆర్ట్ ఫుల్.. ఫెస్టివల్..
క్రిస్మస్ అంటే దయా, కరుణల జన్మదినం. ఇచ్చి పుచ్చుకోవడంలోని ఆనందం. అంతేనా.. క్రిస్మస్ అంటే కళాత్మకత కూడా అని నిరూపిస్తున్నారు సిటిజనులు. క్రీస్తు జన్మదినానికి కొన్ని రోజుల ముందుగానే నగరంలో మొదలయ్యే వేడుకలు ఆద్యంతం కళాత్మకతకు అద్దం పడతాయి. పండుగ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఇటు వైవిధ్యానికీ అటు సృజనాత్మకతకు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ చెట్టు, ఇతర అలంకరణలకు సంబంధించిన సందడి నెల రోజుల ముందునుంచే మొదలవుతుంది.. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు.. క్రిస్మస్ ముందు రాత్రి సమయంలో వచి్చ, అనుకోని విధంగా మంచి పిల్లలకు మాత్రమే బహుమతులు పంచే శాంటాక్లాజ్ పాత్రకు నేపథ్యం చర్చిఫాదర్ సెయింట్ నికోలస్ అని చరిత్ర చెబుతోంది. క్రిస్మస్ వేడుకల కోసం శాంటాక్లాజ్లను తయారు చేయడంలో నగరంలో వివిధ రకాల కొత్త పద్ధతులు, గెటప్స్ పుట్టుకొస్తూన్నాయి. ఎరుపు రంగు దుస్తుల్లో పొడవైన తెల్లని గెడ్డం, క్యాప్... ఈ మూడూ ప్రధానంగా తీసుకుని, మిగిలిన గెటప్స్కూ సృజనాత్మకతను జోడిస్తూ వెరైటీ ‘శాంటా’లను సృష్టిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నారు. పండుగ బీట్.. డిజైనర్ ‘ట్రీ’ట్.. దాదాపు 15వ శతాబ్దపు ప్రాంతంలో క్రిస్మస్ రోజున కుటుంబ సభ్యులు తామే చెట్లు తయారు చేసి దాని చుట్టూ పరస్పరం ఇచ్చి పుచ్చుకునే బహుమతులను ఉంచేవారట. చిన్నా పెద్దా దాని చుట్టూ ఆడిపాడేవారట. వీటిని యులె ట్రీ అని కూడా పిలిచేవారట. అలా ఇది ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సాధారణంగా ఈ చెట్టును పీవీసీతో లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. నగరంలో క్రిస్మస్ ట్రీ రూపకల్పనకు ఆకాశమే హద్దు అన్నట్టు డిజైనర్ ట్రీలు వచ్చేస్తున్నాయ్ ‘రెండు వారాల కిందటే కాలనీలో క్రిస్మస్ ట్రీని తయారు చేశాం. రోజుకో అలంకరణ జత చేస్తున్నాం. పండుగ రోజున దీన్ని అనూహ్యమైన రీతిలో అలంకరించి అందరినీ థ్రిల్ చేయనున్నాం’ అని కూకట్పల్లి నివాసి జెఫ్రీ చెప్పారు. ఎత్తు విషయంలోనూ ఇంతింతై అన్నట్టుగా.. క్రిస్మస్ ట్రీలు 3 నుంచి 30 అడుగుల వరకూ చేరుకున్నాయి. ‘సగటున మేం రోజుకు 20 క్రిస్మస్ చెట్లు అమ్ముతున్నాం. రూ.1000 నుంచి రూ.3000 వరకూ ధర ఉండేవి బాగా అమ్ముడవుతున్నాయి’ అని సికింద్రాబాద్‌లోని ఓ షాపు యజమాని చెప్పారు.స్టార్.. సూపర్.. అవతారపురుషుని రాకకు చిహ్నంగా ముందుగా ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉద్భవించింది. అందుకే ఈ వేడుకల్లో స్టార్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రమార్గం అంటే దేవుని మార్గం. దేవుని వైపు దారి చూపించేదిగా దీన్ని భావిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నగరంలో రకరకాల లైట్ల వెలుతురులో మెరిసిపోయే స్టార్స్ క్రిస్మస్ సందడిని రెట్టింపు చేస్తున్నాయి.ప్రేమ సందేశమే ప్రధానం.. ఈ పండుగ వేడుకల్లో ప్రధానమైన శాంతాక్లజ్, ట్రీ, క్రిబ్.. వంటివన్నీ పండుగ విశిష్టతకు, సేవాభావపు ఔన్నత్యానికి అద్దం పట్టేవే. వీటిని నగరంలో ఎవరికి నచ్చినట్టు వారు అందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచిదే అయినా ఆయా విశేషాలు అందించే ప్రేమ సందేశాలను కూడా తెలుసుకోవడం, తెలియజెప్పడం అవసరం అంటున్నారు సికింద్రాబాద్‌లోని అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ ఉడుముల బాలÔౌరి.విశేషాల క్రిబ్.. వెరైటీలకు కేరాఫ్ ఏసు జని్మంచిన స్థలానికి సంబంధించిన విశేషాలను తెలియపరిచే క్రిబ్.. 1223లో తొలిసారి సెయింట్‌ఫ్రాన్సిస్ అనే వ్యక్తి రూపకల్పన చేశాడంటారు. దీనినే నేటివిటీ సీన్ లేదా మ్యాంగర్ సీన్ వంటి పేర్లతోనూ పిలుస్తారు. పశువులపాకలో ఏసు పుట్టాడనేదానికి సూచికగా దీనిని అందంగా ఏర్పాటు చేస్తుంటారు. పలు జంతువులతో పాటు పేదలు, రాజులు ఇలా అందరూ ఉండే చోట కొలువుదీరేలా దీన్ని నెలకొల్పే విధానం ఆకట్టుకుంటుంది. గడ్డిని తెచ్చి పాకను వేసి చిన్నారి క్రీస్తును కొలువుతీర్చి.. ఇలా చక్కగా డిజైన్ చేసే క్రిబ్ నగర క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. క్రిస్మస్ రోజుల్లో దాదాపు ఒకటి రెండు రోజుల పాటు సమూహాలుగా ఈ క్రిబ్ తయారీలో పాల్గొనడం కూడా చాలా మందికి నచ్చే విషయం. -
వింటర్ చిల్స్..
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్‌కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి.. నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని.. ట్విన్నింగ్.. స్టన్నింగ్.. తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్.. భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్‌కు క్రాప్ టాప్స్‌ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్‌కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి. రాయల్టీ.. పార్టీ.. ఇండియన్ రాయల్టీ థీమ్‌తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్‌్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్‌తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్.. స్టైల్.. నగరం టాలీవుడ్‌కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్‌పై బాలీవుడ్ హిట్స్‌కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి. పూల్.. పారీ్టస్.. నగరంలోని స్టార్ హోటల్స్‌లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్‌కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్‌గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్‌తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్.. ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు. డెస్టినేషన్..ప్యాషన్.. ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు. -
వెల్కమ్ వేడుక.. వార్ ఆఫ్ డీజేస్..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నూతన సంవత్సర వేడుకల సందడికి కంట్రీ క్లబ్ శ్రీకారం చుట్టింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ నెల 31న వార్ ఆఫ్ డీజేస్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తోంది. క్లబ్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్, ఎండీ రాజీవ్‌రెడ్డి ఈ వివరాలను తెలిపారు. నగరంలోని పోలీస్ హాకీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ వేడకలో భాగంగా టాప్ డీజేల మ్యూజిక్, విందు వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదేవిధంగా సినీనటి దక్షా నాగర్కర్ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా పేర్కొన్నారు. సమావేశంలో నటి దక్షా పాల్గొని మాట్లాడిన అనంతరం నృత్యకార్యక్రమం జరిగింది. -
ఏ ఈవెంట్.. ఎక్కడ..?
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడూ బిజీ బిజీ లైఫ్‌తో తీరిక లేకుండా ఉండే నగరవాసులు ఒక్కసారిగా హైదరాబాద్‌లో ఏం జరుగుతుందోనని తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. ప్రొఫెషనల్, పర్సనల్ పనులు సైతం కాస్త పక్కపెట్టి మరీ ఈ డిసెంబర్‌పై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగానే వాట్సాప్ హైదరాబాద్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సిటీ అంటూ గూగులింగ్ చేస్తున్నారు. ఇయర్ ఎండ్ నేపథ్యంలో డిసెంబర్ నెలలో వేడుకలు, ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించి ముందే ప్లానింగ్ చేస్తున్నారు సిటీజనులు. ఇప్పటి నుంచే నగరంలో జరగనున్న ఈవెంట్లు, లైవ్ కన్సర్ట్లు, కేక్ మిక్సింగ్‌లు, 31 నైట్ సెలబ్రేషన్స్‌పై ముందస్తు బుకింగ్స్‌కు ఆసక్తి చూపుతున్నారు. లైవ్ కన్సర్ట్లు.. మెమరబుల్ ఈవెంట్స్.. పాత సంవత్సరానికి బైబై చెబుతూ.. నూతన ఏడాదికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పడం నగరం ఆనవాయితీ. ప్రతీ ఏడాది ఈ వేడుకల కోసం నగరం అందంగా ముస్తాబై విభిన్న ఆహ్లాదకర వేడుకలతో అలరిస్తూనే ఉంది. అయితే.. ఈ ఈవెంట్స్‌కు సంబంధించి ముందుగానే ప్లాన్ చేకుంటే పాసులు, ఎంట్రీ దొకరడం చాలా కష్టమని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలలో నగరంలో జరగనున్న ఈవెంట్ల గురించి ముందుగానే ఆరా తీస్తున్నారు. చివరి రెండు వారాల్లో జరగనున్న లైవ్ కన్సర్ట్లు, ఫైవ్ స్టార్ ఈవెంట్లు, ఇతర వినోద కార్యక్రమాకు సంబంధించి గూగుల్‌లో, ఈవెంట్స్ వెబ్సైట్లలో వెతుకుతున్నారు. ఇలాంటి వేడుకలకు నగరవాసుల నుంచి పెరుగుతున్న ఆదరణ, అంతేగా కుండా ఆయా రోజుల్లో ముందస్తుగానే సెలవులు పెట్టుకోవాల్సిన దృష్ట్యా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అంటూ సెర్చ్ చేస్తున్నారు. గ్రాండ్‌గా.. ఈవెంట్స్.. డిసెంబర్ నెలకు సంబంధించి నిర్వహించనున్న ఈవెంట్లకు సంబంధించి ఇప్పటికు ప్రణాళికలు మొదలైనప్పటికీ అనుమతులు, ఆంక్షల నేపథ్యంలో తేదీల వివరాలను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. కొన్ని ప్రత్యేక ఈవెంట్ల వివరాలు మాత్రం ఇప్పటికే వెల్లడించి బుక్ మై షోలో టిక్కెట్లు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే మాదాపూర్, గచి్చబౌలి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ వంటి ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. వీటి కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి సైతం ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్, ఈవెంట్స్ ఆర్గనైజర్స్ నగరానికి చేరుకోనున్నారు. -
షిర్డీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు ఈసారి షిర్డీలో జరగనున్నాయి. షిర్డీలోని శాంతికమల్ హోటల్లో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో సర్వసభ్య సమావేశాలతోపాటు వివిధ సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు, మహారాష్ట్రతోపాటు ఇరత రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తెలుగు శిక్షణా కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యయాదవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథులుగా, మండలి బుద్ద ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ నటుడు సాయికుమార్ గౌరవఅతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 350 మంది సభ్యులు, 100 మంది కళాకారులు, రచయితలతోపాటు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమి సభ్యులు కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక తెలుగు సంఘాలతోపాటు షిర్డీ తెలుగు సంఘం అధ్యక్షుడు మాండవరాజా ఎంతగానో సహకరిస్తున్నారని వెల్లడించారు. ఊరేగింపుతో ప్రారంభం... రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యక్రమాలను రెండు కిలోమీటర్ల ఊరేగింపుతో ప్రారంభించనున్నారు. నవంబరు 30వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ సాయినివాస్ హోటల్ మెగా రెసిడెన్సీ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర తెలుగు ఫ్లకార్డులతో ఊరేగింపు జరగనుంది. వివిధ సాహిత్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పాటైంది. ఈ సమాఖ్య వివిధ రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 18 జాతీయ సదస్సులు, వివిధ నగరాలలో స్థానిక సంస్థల సహకారంతో ప్రతి ఏటా అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాషకు దూరమవుతున్న పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు కూడా కృషిచేస్తోంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ఆయా రాష్ట్రాలతోపాటు వారి స్వరాష్ట్రాలలో గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం, తెలుగు రాష్ట్రాల్లో అందించే పురస్కారాలు వీరికి కూడా అందించేందుకు కృషి చేయడం, రాష్ట్రేతర ప్రాంతాలలో మాతృభాష పరిరక్షణ, తెలుగేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు తెలుగువారికోసం స్థలాలు కేటాయించేలా కృషిచేయడం వంటి ఆశయాలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో షిర్డీతోపాటు మహారాష్ట్రలోని తెలుగు సంఘాల ప్రతినిధులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆర్ సందుర్ రావు, ప్రధాన కార్యదర్శి పివిపిసి ప్రసాద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. -
హ్యాపీ వెడ్డింగ్.. నగరంలో పెళ్లి సందడి మొదలు
గ్రేటర్లో పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని కన్వెన్షన్ సెంటర్లు, బాంకెట్ హాళ్లు, కమ్యూనిటీ సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు వధూవరులు పెళ్లి షాపింగ్‌లతో నగరంలోని జ్యువెలరీ షోరూమ్‌లు, షాపింగ్ మాళ్లలో రద్దీ మొదలైంది.. అంగరంగ వైభవంగా వివాహ వేడుకలను తీర్చిదిద్దేందుకు వెడ్డింగ్ ప్లానర్లు, అలంకరణ డిజైనర్లు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ముహూర్తాలు ఇవే.. దీపావళి తర్వాతి నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి వరకూ వివాహాలకు శుభ ముహూర్తాలని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 22, 23, 25, 26, 28, 29 తేదీల్లో వివాహాలకు శుభ ముహూర్తాలుగా ఉన్నాయి. అలాగే డిసెంబర్ 3, 4, 5, 9, 10, 11, 14, 15 తేదీలు కూడా శుభప్రదమే. దీంతో నగరంలో పెళ్లి హడావుడి మొదలైంది.హాళ్లు.. హౌస్‌ఫుల్.. ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు నూతన సంవత్సర వేడుకలు కూడా రానుండటంతో చాలా మంది వివాహ కుటుంబాలు ఒకటి రెండు నెలల ముందే రిసార్ట్స్, హోటళ్లలోని ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకున్నారు. కన్వెన్షన్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లలో బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కొంపల్లి, శామీర్‌పేట, తుర్కపల్లి, తిమ్మాపూర్, షాద్‌నగర్, మొయినాబాద్, చేవెళ్ల, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోని కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్‌లతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్‌రాంగూడ, గచి్చ»ౌలి వంటి ప్రధాన నగరంలోని స్టార్ హోటళ్లలోని బాంకెట్, పార్టీ హాల్స్ అన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. కూరగాయల ధరలు పెరగడంతో.. కూరగాయల ధరలు పెరుగుదల కూడా పెళ్లింట భారంగా మారింది. టమోట, బెండకాయ, ఉల్లిగడ్డ, మిర్చిలతో పాటు వంట నూనె, పన్నీర్ వంటి ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఫుడ్ క్యాటరర్స్ ప్లేట్‌కు రూ.350 నుంచి రూ.1,500 వరకూ చార్జ్ చేస్తున్నారు. ఇక మాంసాహార భోజనమైతే అంతకుమించి అన్నట్లు ఉంది. థీమ్స్, కాన్సెప్ట్‌లతో బిజీ.. ఉన్నత వర్గాల కుటుంబాలు, ఉద్యోగస్తులైన వధూవరులు ప్రత్యేకమైన థీమ్‌లు, కాన్సెప్‌్టలతో మండపాల అలంకరణ కోరుతున్నారు. ప్రీ–వెడ్డింగ్ ఫొటో షూట్లకూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయా పెళ్లి వేడుకలు, ఫొటో షూట్లు వైభవంగా, సజావుగా జరగడానికి ఈవెంట్, వెడ్డింగ్ ప్లానర్లు, ఫొటో గ్రాఫర్లు బిజీ బిజీలో గడుపుతున్నారు. మరోవైపు కళ్యాణ మండపాల నిర్వాహకులు సుమారు 300 నుంచి 700 మంది అతిథులు హాజరయ్యేలా వేడుకలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బాంకెట్ హాల్, పార్టీ లాన్స్, కన్వెన్షన్ సెంటర్ల అద్దె రోజుకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి.ప్రీ వెడ్డింగ్ షూట్స్ షురూ.. వివాహ వేదికలు లగ్జరీగా ఉండాలని వధూవరులు భావిస్తున్నారు. ఖర్చుకు వెనకాడట్లేదు. వారి అభిరుచులకు తగ్గట్టుగా, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మండపాలు, వేదికలు ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. లావెండర్, వింటేజ్ వంటి థీమ్‌లతో ప్రాంగణాలను అద్భుతంగా అలంకరిస్తున్నారు. ఇక ప్రీ–వెడ్డింగ్ షూట్స్‌తో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో చారి్మనార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్ సిటీ, చౌమోహల్లా ప్యాలెస్, తారమతి బారాదరి, బొటానికల్ గార్డెన్, కుతుబ్షాయి టూంబ్స్ వంటి ప్రాంతాల్లో ప్రీ–వెడ్డింగ్ షూట్స్‌తో సందడి నెలకొంది. దీంతో పాటు ఫుడ్ క్యాటరర్స్, మెహందీ ఆరి్టస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు, బాజా భజంత్రీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.శానిటైజేషన్, భద్రతకే అధిక ప్రాధాన్యం..పెళ్లి సీజన్‌తో పాటు న్యూ ఇయర్ కూడా రానుండటంతో రిసార్ట్‌లోని వెడ్డింగ్ జోన్స్, హోటళ్లలోని బాంకెట్, పార్టీ లాన్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అతిథులకు వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులూ కాకుండా శానిటైజేషన్, భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ తరహా ఈవెంట్ సెంటర్లు ఇప్పటికే చాలా వరకూ బుక్ అయ్యాయి. – డాక్టర్ కిరణ్, సీఈఓ, సుచిరిండియా గ్రూప్ -
పర్యావరణహితం యువతరం సంతకం
కామిక్ స్ట్రిప్స్, వీడియోలు, ఫొటోగ్రాఫ్‌లు, రీల్స్... ఒక్కటనేమిటి... సమస్త సాధనాలు, వేదికల ద్వారా పర్యావరణహిత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు యంగ్–ఎకో వారియర్స్.‘కళలో సామాజిక సందేశం కూడా ఇమిడి ఉంది’ అనే నిజాన్ని రుజువు చేస్తున్నారు.వాతావరణానికి హాని కలిగించే ఉత్పత్తులు, వాటికి ప్రత్యామ్నాయాలు, షాపింగ్ మార్గాలు... మొదలైన వాటి గురించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ ఎడ్యుకేటర్ అండ్ ఎకో–యూట్యూబర్ నయన ప్రేమ్‌నాథ్.సస్టెయినబుల్ లివింగ్పై కంటెంట్ రూపోందిస్తోంది. క్లైమెట్–డామేజ్ ప్రాడక్ట్స్‌కు ప్రత్యామ్నాయాలు ఏమిటో చెబుతోంది. ఉదా: సస్టెయినబుల్ షాపింగ్, సస్టెయినబుల్ ఫ్యాషన్... మొదలైనవి.‘పర్యావరణ హిత వీడియోలు చేస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషమే శక్తిగా నన్ను ముందుకు నడిపిస్తోంది’ అంటుంది ప్రేమ్‌నాథ్.ప్రయాణ ప్రేమికుడిగా ఆశాశ్ మన దేశంలోని ఎన్నో; ప్రాంతాలకు వెళ్లాడు. తాను వెళ్లిన ప్రాంతాలలో రోడ్డు పక్కన ΄్లాస్టిక్ చెత్త కనిపించేది. ‘ఏమిటి ఇది’ అనుకునేవాడు. అయితే లడఖ్ అందాల మధ్య పాస్టిక్ వ్యర్థాలను చూసి ఆకాష్ షాక్ అయ్యాడు. ఆ షాక్ అతడిని కొత్తదారి వైపు తీసుకువెళ్లింది.‘ఆ రోజు నుంచి పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలలో భాగం కావాలనే ఆలోచన అంతకంతకూ పెరుగుతూ వచ్చింది’ అంటాడు ఆకాశ్ రాణిసన్.పర్యావరణానికి సంబంధించిన సంక్లిష్ట విషయాలను సామాన్యులకు అర్థం అయ్యేలా సోషల్ మీడియాలో కంటెంట్ రూపోందించప్రారభించాడు. ‘గ్రీన్ వాషింగ్’ అంటే ఏమిటో వివరించడంతో పోటు వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి చూడాల్సిన డాక్యుమెంటరీల గురించి చెప్పడం వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆకాష్ ‘క్లైమెట్ చేంజ్ ఎక్స్ప్లెయిన్డ్: ఫర్ వన్ అండ్ ఆల్’అనే పుస్తకం రాశాడు.అహ్మదాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన పంక్తీ పాండే లాక్డౌన్ టైమ్‌లో సస్టెయినబుల్ లివింగ్పై కంటెంట్ క్రియేషన్ మొదలు పెట్టింది. జీరో–వేస్ట్పాక్టీషనర్గా పేరు తెచ్చుకుంది పంక్తీ. రోజువారీ జీవితంలో పర్యావరణ స్పృహతో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి ఎంపికలు అవసరం... మొదలైన విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది.‘నాలుగు మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజల్లో మార్పు వస్తుందా... లాంటి నిరాశపూరిత మాటలు వినడం నాకు కష్టంగా అనిపించేది. నేను మాటలకే పరిమితం కాలేదు. జీరో వేస్ట్‌పై నా ఇల్లే ప్రయోగశాలగా ఎన్నో ప్రయోగాలు చేశాను. నేను సాధన చేస్తున్న విషయాలను ఫేస్బుక్లో జీరో అడ్డా పేజీ ద్వారా ఇతరులతో పంచుకుంటున్నాను’ అంటుంది పంక్తీ పాండే.ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రిసెర్చర్ అయిన రస్లీన్ గ్రోవర్ కంటెంట్ క్రియేటర్ కూడా.సోషల్ మీడియాలో వాతావరణ విధానాలకు సంబంధించిన కంటెంట్‌ను ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ విధానంలో రూపోందిస్తోంది రస్లీన్.‘నా కంటెంట్ ద్వారా ప్రజల జీవనశైలిలో ఏ కొంచెం మార్పు వచ్చినా సంతోషం అనుకొని ప్రయాణం ్ర΄ారంభించాను. నా ప్రయత్నం వృథాపోలేదు’ అంటుంది రస్లీన్.చెన్నైకి చెందిన కీర్తి, దిల్లీకి చెందిన కృతి, ముంబైకి చెందిన రష్మీ పెయింటింగ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ ముగ్గురికి ఇష్టమైన సబ్జెక్ట్ పర్యావరణం.వారి చిత్రాలలో పర్యావరణ హిత ఆలోచనల వెలుగు కనిపిస్తుంది.‘వాతావరణ మార్పుల గురించి తెలుసుకుంటున్న యువతరం నిట్టూర్పుకు మాత్రమే పరిమితం కావడం లేదు. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన విషయాలను తమకు తోచిన రీతిలో ప్రచారం చేస్తున్నారు’ అంటుంది క్లైమెట్ యాక్టివిస్ట్, ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైర.పర్యావరణ పాట‘ఆహా’ అనుకునే పాటలు కొన్ని. ‘ఆహా’ అనుకుంటూనే ఆలోచించేలా చేసే పాటలు కొన్ని. అనుష్క మాస్కే ΄ాటలు రెండో కోవకు చెందినవి. సింగర్–సాంగ్ రైటర్ అనుష్క మాస్కే పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచారానికి పాట’ బలమైన మాధ్యమం. సిక్కింకు చెందిన అనుష్క తొలి ఆల్బమ్ ‘థింగ్స్ ఐ సా ఏ డ్రీమ్’లో పర్యావరణ స్పృహ కనిపిస్తుంది.