
పల్లె వాతావరణంలో కళాకారుల సందడి
గచ్చిబౌలి: పల్లె వాతావరణమైన శిల్పారామంలో హరినామస్మరణ, గంగి రెద్దుల విన్యాసాలు, నృత్యకారుల గవ్వల సవ్వడి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాయి. వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులతో సంక్రాంతి శోభ సంతరించుకుంది.
జానపద కళాకారులు..
రాజమండ్రికి చెందిన విభూతి బ్రదర్స్ బృందం హరిదాసులు, బుడబుక్కలు, జంగమ దేవర, సోది చేప్పే వేషధారణలతో ఆకట్టుకున్నారు. దాదాపు పది మంది కళాకారులు వివిధ అలంకరణలో సందర్శకులను ఆకట్టుకున్నారు.
అంకిరెడ్డి పాలెం, వలిగొండకు చెందిన కళాకారులు గంగిరెద్దుల విన్యాలతో అబ్బురపరిచారు. సాయంత్రం ఆంపిథియోటర్‌లో కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. మంగళవారం సురభి కారులు ‘మాయ బజార్’ నాటకాన్ని ప్రదర్శిస్తారు. శేరిలింగంపల్లి సురభి కాలనీకి చెందిన దయానంద్ బృంధం, మరికొందరు కళాకారులు కూచిపూడి, భరత నాట్యాన్ని ప్రదర్శిస్తారు.