పాముల పంతం చేపకు మేలు చేసింది | Watch: Catfish Head And Tail Stuck In Two Snakes Mouth | Sakshi
Sakshi News home page

పాముల పంతం చేపకు మేలు చేసింది

Sep 11 2020 12:47 PM | Updated on Mar 21 2024 7:59 PM

భోపాల్‌ :  పాముల పంతం ఓ చేపకు మేలు చేసింది. నోటి కందిన కూడును దక్కించుకోవటానికి అవి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, చేపకు పునర్జన్మ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ కన్షా నేషనల్‌ పార్కులో కొద్దిరోజుల క్రితం ఆకలితో ఉన్న ఓ పాము బాగా వెతికి నీటిలో ఉన్న ఓ చేప తలను పట్టుకుంది. దాన్ని నీటిలోంచి బయటకు తీసింది. కొద్దిసేపటి తర్వాత నీటిలోంచి మరో పాము చేప తోకను పట్టుకుంది. ఇక రెండు పాములు తమ ఆహారాన్ని వదిలేయటం ఇష్టపడక అలానే ఉండిపోయాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement