ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినవారికి చాక్లెట్లు!
క్రిస్‌మస్ పండగ కోసం షాపింగ్‌లు, ఆర్డర్లు అంటూ ఎవరి పనుల్లో వాళ్లున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ప్రజలను చైతన్యవంతం చేయడానికి అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. గోవాలోని ట్రాఫిక్ పోలీసులు వినూత్న పద్ధతితో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం చేపట్టి వార్తల్లో నిలిచారు. ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు సాంటాక్లాజ్‌లా వేషం ధరించి రోడ్లపైకి వచ్చారు. జనాల నోరు తీపి చేస్తూ ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలియజేశారు. జీవితం విలువైనదని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కష్టాలను కొనితెచ్చుకోవద్దని వాహనదారులకు సూచించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి