చిందేసిన కోహ్లి

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో చిందేసాడు. సుదీర్ఘ సిరీస్‌కు ముందు టీమిండియా కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి వస్తున్న కోహ్లి సేనకు పంజాబీ స్టైల్‌లో బ్యాండ్‌ కొడుతూ నిర్వాహకులు స్వాగతం పలికారు. అయితే ఈ బ్యాండ్‌ చప్పుడు విన్న కోహ్లికి తనలోని డ్యాన్సర్‌ నిద్ర లేచాడు. ఎవరూ ఊహించిన విధంగా బాంగ్రా స్టెప్పుతో అదరగొట్టాడు. ఇక ఈ కెప్టెన్‌కు జతగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సైతం చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఎస్సెక్స్‌ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top