మ్యాచ్‌లో మ్యారేజ్‌ ప్రపోజల్‌..వైరల్!

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తి  మోకాళ్లపై కూర్చొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు మ్యారేజ్‌ ప్రపోజల్‌ చేశాడు. ఈ చర్యతో కాసింత సిగ్గుపడిన ఆ యువతి తర్వాత అతని ప్రపోజల్‌ను అంగీకరించింది. అతడు ఇచ్చిన రింగ్‌ను స్వీకరించింది. దీంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు టీవీలో కూడా ప్రసారం అయ్యాయి. కామెంటేటర్స్‌ కూడా దీనిపై తమదైన శైలిలో స్పందించారు. ఆ సమయంలో బౌలింగ్‌ చేస్తున్న భారత బౌలర్‌ చాహల్‌ కూడా క్లాప్స్‌ కొడుతు వారికి శుభాకాంక్షలు తెలిపాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top