‘పోరాడు...నీ ఆఖరి శ్వాస ఆగిపోయేవరకు పోరాడుతూనే ఉండూ’ అంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. ఆఖరి క్షణం వరకు లక్ష్యం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలని చెబుతారు. క్రికెట్‌లో ఈ సూక్తిని ప్రతి జట్టు పాటించాల్సిందే. కానీ దక్షిణాఫ్రికా అందుకు విరుద్దంగా ప్రవర్తించి గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 4 వికెట్లతేడాతో ఓడి టైటిల్‌వేట నుంచి తప్పుకుంది.