సారథి విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, చహల్‌తో పాటు కొందరు ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు ముందు పుట్‌బాల్‌తో సరదాగా వార్మప్ చేశారు. కిందపడకుండా 41 సార్లు బంతిని పుష్ చేస్తూ చాలాసేపు గాల్లోనే ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోనే బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. వీరికంటే ఎక్కువ సార్లు బంతిని గాల్లో ఉంచగలరా అంటూ ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.