వైఎస్సార్‌సీపీ నేత, కౌలు రైతు పసుమర్తి వెంకట కిషోర్‌ను స్థానిక టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. పొలంలో పట్టపగలే రాడ్లు, గొడ్డళ్లతో దాడిచేసి చంపేశారు. హతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు...పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కొత్త అంబర్‌పేటలో కిషోర్ (36) కౌలుకు తీసుకున్న పొలంలో శుక్రవారం మిషన్‌తో కోత కోయిస్తుండగా ఐదుగురు వ్యక్తులు రాడ్లు, గొడ్డళ్లతో వచ్చి తలపై మోదారు. నెత్తురు మడుగులో కొట్టుకుంటుండగా అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. దాడి సమయంలో అక్కడే ఉన్న కిషోర్ పెద్దమ్మ కుమారుడు గూడపాటి సుబ్బారావు చంపవద్దని ప్రాధేయపడినా వదలలేదు.అంబర్‌పేటలో దాసరి బుల్లెమ్మకు 11.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.